1, మార్చి 2015, ఆదివారం

దత్తపది - 69 (కసి-పసి-మసి-రసి)

కవిమిత్రులారా!
కసి - పసి - మసి - రసి
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. యనుజు "పసి"డిపల్కులనైన వినక కూలె
    కై"కసి" సుతుండు జానకికై రణమున
    తా"రసి"ల్లి భ్ర"మసి"కొని తనకుతాను
    శక్తిశాలిగ, యారామచంద్రుతోడ
    (తారసిల్లు= తలబడు)

    రిప్లయితొలగించండి
  2. పసిడి రంగును గలయాకై కసిసు తుండు
    తార సిలగ నారావణా సురుడు నపుడు
    మరణ మికగతి యనుచు భ్ర మసి భ యమున
    మూర్ఛ వోయెను రణమున మూర్తి ! తెలియు

    రిప్లయితొలగించండి
  3. రూపసి యగుసీతను గని
    పాపపు మసిమనసు తోడ బాధించె సతిన్
    శాపము గాదని రసికత
    కోపము వలదంచు కసిరి కూరిమి నుండన్

    సతిని = పతివ్రతను

    రిప్లయితొలగించండి

  4. పసిడి రంగు లేడి పరుగెత్తు చుండగ
    నరసి సీత కోరె నద్ది వలయు
    ననుచు రామచంద్రు నయ్యొ భ్రమసి
    కైకసి సుతు బుద్ధి కనగ లేక.

    రిప్లయితొలగించండి
  5. రక్కసి క్రతువును చెఱుప రక్త ధార
    నరసి తాపసి కౌశికు డడిగె ఱేని
    కొదుమసింహము వలెనున్న కొడుకు నంపి
    కాచు మయ్య నా జన్నము కలుగు జయము

    రిప్లయితొలగించండి
  6. పసిడి మోమున జలతారు పరద మెరియ
    భామ సిగలోన సుమములై భములు విరియ
    కైకసి తనయుండాదులు గత్తరిల్ల
    సరసిజాక్షుడు రాముని సహచరయ్యె
    పరమ పావని భూజాత పడతి సీత !!!

    రిప్లయితొలగించండి
  7. శివ ధనుర్భంగ సమయములో........


    రాక సింగంపు ఠీవిచే రహి వహించె
    లేమ సితతామరముఖమ్ము ప్రేమ గొలిపె
    నౌర సిద్ధించె నా తపంబనుచు సీత
    తాపసికి మ్రొక్కె తాను సద్భక్తిమీర

    రిప్లయితొలగించండి
  8. అ'రసి' యడవుల కేగెను యాజ్ఞ మీద,
    'పసి'డి మోమున్న రామన్న పడతి గూడి
    అచట రా"కసి" బృందంబు నణచి వేసి
    "మసి"లె మునులకు మనమున మాధవుండు.


    అరసి = వివరము తెలిసికొనుట.

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    మొదటి పాదంలో గణదోషం. రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సహచరి+అయ్యె’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘సతిగ నయ్యె’ అనండి.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కైకసి పుత్రుడీ జగతి కంటకుడై చెలరేగుచుండి ము
    ల్లోకములందు దారసిలు రూపసిలౌ తరుణీ లలామలన్
    భీకర రూపుడై చెరను బెట్టుచు నారసి రంభ నొక్క నా
    డా కలకంఠినిన్ భ్రమసి యందరి కాంతల వోలె డాయగన్
    దాకిన చత్తువంచు ప్రమదామణి శాపము నిచ్చె క్రోధయై.

    రిప్లయితొలగించండి
  11. తా"మసి" యగుచు సీతను ధర్మము విడి
    రూ"పసి" యగునామె బలిమి రోదసి గొన
    నా"రసి" జటాయువడ్డంగ,నతని గొట్టె,
    నా"కసి" నటు వే పక్షంబు లవియ విరుగ.

    త"పసి" కౌశికు యాగంబు దాశరధియె
    గావ,తా"మసి"తాటకి ఘనము గొట్ట
    నా"కసి"ని నామె కూలెను,నామె సుతుడు
    నా"రసి"యె రాము ఘనతను నంబుధి బడె.

    రిప్లయితొలగించండి
  12. తారసిలసూర్పనక"తనదగ్గరున్న

    కత్తిచేతముకుచెవులుకత్తరించ|
    లక్ష్మణుండు|రూపసికసిలంకజేర?సమసిపోనట్టివైరమ్ము
    సాగుటాయె|

    రిప్లయితొలగించండి
  13. పసిడికాంతిచేసీతమ్మపరవశమ్ము
    తాక? సిరిమల్లెపువ్వులుమూకవైన
    గంధబంధాలునరసిగ్గుగలుగజేయ?
    ప్రేమసిద్దించెరాముడేపెళ్లియాడ

    రిప్లయితొలగించండి
  14. కసిరినదా సతీమణి, సుకంఠి, దయామయి, తల్లి తానుగా
    పసితనమందు నున్న సుతు భావనతోడను; వైరిగా సదా
    మసిలిన వైనమెల్ల విడి మంకిలమౌ యఘనాశకారిగా
    రసితముఁ గాగ నిశ్చయము రావణు ముక్తునిఁ జేయు చున్నదై.

    మంకిలము= దావాగ్ని

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పసిడి రంగును మించు కై కసిసు తుండు
    తార సిల్లిన రావణు బారి వలన
    మరణ మికగతి యనుచు భ్ర మసి భ యమున
    మూర్ఛ వోయెను రణమున మూర్తి ! తెలియు

    రిప్లయితొలగించండి
  17. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పసిడి మేను మెరయు మేలు పసితనయుడు
    మసినెరుగని శిశువుని కోమలి వరమున
    రసి కరుణ వీడె బంపె అరణ్యమునకు
    కసిరిరి జనులెల్ల నృపుని కడువిధముల

    రిప్లయితొలగించండి
  19. వ.రా.స. గారూ (మీ పూర్తి పేరు?),
    మీ పూరణ బాగున్నది.
    ‘శిశువును’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారికి నమస్కారములు. నా పేరు సత్యనారాయణ. చాలా కాలం నుండి మీ బ్లాగును చదువుతున్నాను. పద్య రచనకు కావలసిన భాషా ప్రవేశం, ఛందస్సు జ్ఞానం లేకపోవడం వల్ల ఆ ప్రయత్నం చెయ్యలేదు. మీ బ్లాగు పుణ్యామా అని కొంత అవగాహన ఏర్పడింది. దానికి మీకు సదా రుణపడి ఉంటాను.

    మీ సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి