2, మార్చి 2015, సోమవారం

పద్యరచన - 836

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. సగము క్రాపుదువ్వి సగము జడను వేసి
    సగము చీర, ఫ్యాంటు సగము తొడిగి
    యాధునికయుగమున యర్ధనారీశ్వరు
    డిలను వెలసె బాపు వలన గాదె

    రిప్లయితొలగించండి
  2. వినుడు కైలాస ముననున్న వేల్పు దల్చ
    అర్థ నారీశ్వరుండిక నార్తి బాపు
    కనుడిటవిలాసముగ గీసె ఘనపు గీత
    అర్థ నరనారి చిత్రమ్ము నదివొ బాపు.

    రిప్లయితొలగించండి
  3. అర్ధ నారీశ్వరుండయ్యె యతివ-మగడు
    సంపద వాహన సామాగ్రి సగము సగము
    పెరుగు ఖర్చుల ధాటికి బేల పడక
    సమము సమమని బల్కుటె సవ్య మయ్య!

    రిప్లయితొలగించండి
  4. ఇంటిలోని పనుల నింపుగా చేయును
    కొలువు లందు గూడ వెలుగు సతము
    చీరకట్టు లోన శృంగార మొలికించు
    ఖాకి డ్రస్సు లోన కరుకు చూపు

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. బాపుబొమ్మగబుట్టినపడతిగాన
    నాటి,నేటినిసమకూర్చిచాటినట్లు
    తెలుగుభాషకు నాంగ్లమ్ముగలసినట్లు
    సుందరమ్మగుపడతినిచూపుటాయె|

    రిప్లయితొలగించండి
  7. సగము భాగము పురుషుడు సగము వనిత
    గాను రూపుది ద్దబడెను గనుము బాల !
    అర్ధ భాగము పార్వతి యర్ధము మృ డు
    నివలె చిత్రము గలదట నిజము గాను

    రిప్లయితొలగించండి
  8. నిన్నటి పద్య రచన :
    చరణపు టంగులి కుండెడు
    నరపుత్తేజము సమర్థ నాతిగ మార్చన్
    వరమై యింటిని దీర్చగఁ
    దరుణికి మెట్టల మగండు తనరఁగఁ దొడుగున్!

    నేటి పద్యరచన :

    ఇంట వంట వార్చ నింతులుండగ నాడు
    బయటి పనులఁ జూడ పతియె నుండె
    నింట బయట తానె యినుమడించగ నేడు
    పురుషుడర్ధ మాయె పుణ్య స్త్రీకి!

    రిప్లయితొలగించండి
  9. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. బారుగ కేశపు సౌరును
    జోరుగ మగవాని లాగు సోకును జేయ
    న్నేరీతి చూదమన్నను
    నారీనరులిటు కలసిన నవ్యపు తీరౌ!

    రిప్లయితొలగించండి
  11. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి