4, మార్చి 2015, బుధవారం

పద్యరచన - 838

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. కార్య దక్షత నొక్కింత కలిగియున్న
    నంగవైకల్యమనునది యడ్డు కాదు
    నోట తూలిక నుంచి సృష్టించె నౌర
    రామ గోపికాకృష్ణ చిత్రమ్మునొకడు

    రిప్లయితొలగించండి
  2. చేతు లేల వాణి సిరులునీ యొడి నున్న
    దారి చూపు నామె చేర దీసి
    ప్రేమ జూపి వీని పెంచిన తల్లికి
    ముందు ప్రణతి లిడుదు మోక రిల్లి

    రిప్లయితొలగించండి
  3. వర్ణ చిత్రమ్ము గీయగా బాగుగాను
    చేయి దిరిగిన వాడెగా చేయగలడు
    ననుచు దలచకు చూడుమా యచ్చెరువున
    చేయి విరిగిన వాడిటన్ గీయుచుండె.

    రిప్లయితొలగించండి
  4. కుమార్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో యతి తప్పింది. ‘కుంచె నోటిలో నుంచి సృష్టించె నౌర’ అనండి.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘చేయగల డ|టంచు దలచకు...’ అనండి. ‘గలడు + అనుచు = గలడనుచు’ అవుతుంది. అక్కడ నుగాగమం రాదు కదా!

    రిప్లయితొలగించండి
  5. మాస్టరుగారూ ! ధన్యవాదములు..మీరు చూపిన సవరణ తో...

    వర్ణ చిత్రమ్ము గీయగా బాగుగాను
    చేయి దిరిగిన వాడెగా చేయగలడ
    టంచు దలచకు చూడుమా యచ్చెరువున
    చేయి విరిగిన వాడిటన్ గీయుచుండె.

    రిప్లయితొలగించండి
  6. అంగ వైకల్య మయ్యును నతని జూడు
    గీయు చుండెను జిత్రము వాయి తోడ
    కార్య దక్షుడు గావున కరము లేమి
    రాధ మఱి యును గృష్ణుని రమ్య ముగను
    కుంచె తోడన జిత్రించె కోమలముగ

    రిప్లయితొలగించండి
  7. మనిషి దలచిన అసాధ్య మయిన దేమి?
    మనసు బెట్టగ ఎందైన మౌని యగును
    రాధ కృష్ణుల యందాలు రమ్య మవగ
    అంగ వైకల్యమేరీతి అడ్డు వచ్చె?

    రిప్లయితొలగించండి
  8. నోటను గుంచెను బట్టుకు
    దీటుగ చిత్రించుచుండె దీక్షగ బొమ్మన్
    వాటంబగు చేయి జెడిన
    పాటవముగ వేయు నతని ప్రజ్ఞకు జేజే!!!

    రిప్లయితొలగించండి
  9. చిత్రకారునియూహ-విచిత్రమేగ
    రాధ-కృష్ణ్డులచిత్రమ్ము-వ్రాయగలిగె
    దైవమిచ్చినవరమని-దలచుకొనుచు
    శక్తినాశక్తిగూర్చ?విశ్వాసుడయ్యె

    రిప్లయితొలగించండి
  10. చేతులవంటిపళ్ళుగనచెంతనజేరిర?రాధ,కృష్ణ్డులే
    వ్రాతలుబ్రహ్మరాతలుగభావితరాలకుజూపనెంచియే
    చేతులులేనినీరచనచెప్పుటకెవ్వరికౌనువింతయే
    నీతులుజెప్పునోరుననునిత్యముచిత్రములన్నివేయగా|

    రిప్లయితొలగించండి
  11. త్రికరణంపు శుద్ధి సకలమ్ము సాదించు
    ననగ వినమె మనము యనవరతము !
    ద్వికరణమ్ము తోడ త్రికరణమ్ముల పనిన్
    చిత్ర మొకడు గీసి చేసె గనుడు !

    రిప్లయితొలగించండి
  12. ఖ్యాతినిపొందవచ్చు వికలాంగులుకూడను - బ్రహ్మచేతియా
    వ్రాతను మార్చవచ్చనుచు పట్టెను కుంచెను పళ్ళమధ్యలో
    నాతడు గీయుచుండె గనుడద్భుత చిత్రపటంబులచ్చటన్
    చేతులు లేవటంచు తను చింతిలకుండ తదేకదీక్షతో

    రిప్లయితొలగించండి
  13. కళకు మనసు చాలు కరముతో బనియేమి
    రాధ కొంగు బట్టు మాధవు గని
    మదిని, రంగు లద్దె మనములు రంజిల్ల
    నోట కుంచె బట్టి నుతు లితనికి.

    రిప్లయితొలగించండి
  14. అంగ వైకల్యము ప్రతిభ నాప గలదె?
    రాధ మరి మాధవుల బొమ్మ రంగులలది
    నోటి తోడను చిత్రించె నీటుగాను
    చూపరులకు నది కరము సొంపుగూర్చె

    రిప్లయితొలగించండి
  15. మాష్టారు గారూ, మీ సూచనకు ధన్య వాదములు. అలాగే చివరి పాదంలో “రమ్య గోపికా కృష్ణ” బదులు “రామ గోపికా కృష్ణ” అను టైపింగ్ పొరపాటు జరిగింది.

    రిప్లయితొలగించండి
  16. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ల వెంకటప్పయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి