7, మార్చి 2015, శనివారం

పద్యరచన - 841

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. చూడగ చక్కగ నున్నవి
    జాడీలట పచ్చడు లను సంచిత పరుచన్
    వేడిమి గలయన్న మందున
    వాడిగ మాగాయ రుచులు వేడుక తినగన్

    రిప్లయితొలగించండి
  2. రంగారెడూరగాయల
    పొంగారగ రుచుల దాచి భోజనమునకై
    సింగారపు పచ్చడినిడు
    పింగాణీ జాడి నీకు పెక్కగు నెనరుల్.

    రిప్లయితొలగించండి
  3. ఊర గాయల జాడీ ల సౌరు జూడ
    నంద మొలికించు చుండును నంద ఱకును
    భద్ర పఱతురు పచ్చళ్ళు భామిను లిల
    నిల్వ యుండుట కొరకునై నీ ర జాక్షి !

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘వేడిమి గల యన్నములో’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. చేడియ లందరు కూడుచు
    వేడుకగా చేయుచుంద్రు ప్రియమగు చట్నీ
    జాడీలలోన నుంతురు
    పాడగునని యావకాయ పల్లెలలోనన్

    రిప్లయితొలగించండి
  6. ఇమ్ముగ జాడీ లందున
    కమ్మగ పచ్చడులు బెట్టి ఘనముగ నిండ్లన్
    చెమ్మను దగలక దాచగ
    ఘుమ్ముగ చెడిపోక నుండు కోరి తినంగా!!!

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. జాడీలనూరగాయల
    నేడాదికిసరిపడంగ నిల్వన్ జేయన్
    పాడవకనుండు జక్కగ
    వాడుకొనగవచ్చు మనయవసరముకొలదిన్

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ఉప్పును కారము సోకిన
    వప్పల నూరంగ నూట పచ్చడి! లోనన్
    గొప్పగ జాడీ నిండెనొ?
    కుప్పెకు పై నూరినట్లు గోచర మాయెన్!

    రిప్లయితొలగించండి