10, మార్చి 2015, మంగళవారం

పద్యరచన - 844

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. వారంక్రితం ఫేస్బుక్ లో ఇదే చిత్రానికి నేనువ్రాసిన పద్యం
    పెట్టుడు వాకిలిలోనన్
    పిట్టలకొరకింత నీరు వేసవిలోనన్
    లొట్టలు వేయుచు పిట్టలు
    మట్టిపిడతలోనిజలము మరిమరి త్రావున్

    రిప్లయితొలగించండి
  2. పోయినసంవత్సరం క్రొత్తగా పద్యాలువ్రాయడం మొదలుపెట్టినపుడు ఇదే చిత్రానికి వ్రాసిన పద్యం
    పిట్టకోసమింత పిడతలో నీరుంచి
    యారుబయట పెట్టియాదుకొనుడు
    సాటి జీవములకు సాయపడుట కంటే
    నేటి జీవనమునకు నేమి కలదు

    రిప్లయితొలగించండి
  3. అన్నెము పున్నెము నెరుగని
    వన్నెల సొగసైన పక్షి పానము జేయన్
    చిన్నవి మృణ్మయ పాత్రల
    చన్నీటిని తనివిదీర సాంత్వన మొందన్

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి గారు మీ పద్యం లో మూడవపాదం లో చివరి ఇంద్ర గణం మరియు 4 వ పాదం లో చివరి రెండు ఇంద్ర గణాలు భంగంయ్యాయి చూడండి.

    రిప్లయితొలగించండి
  5. నీరు కంటబడక నీరు కంటనురాక
    నీరు దొరక నపుడు నీరు గారు
    ఊరి పక్షులకును చేరువగా నీవు
    పాత్ర నీరు బెట్టి పలుకరించు.

    రిప్లయితొలగించండి
  6. పక్షుల కొఱకుగ నచ్చట
    నిక్షిప్తము జేయు కతన నీటిని పాత్రన్
    పక్షులు ద్రాగుచు నున్నవి
    యక్షయ మగు పున్నె మబ్బు నందుల కార్యా !

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. వేసవిసమయమేతెంచె పిట్టలకట
    నీరుదొరకక తపనతో నీల్గుచుండె
    ప్రకృతి సమతుల్యమును కాచ ప్రతిన బూని
    పక్షి జాతి కాపాడుడు వారినిచ్చి

    రిప్లయితొలగించండి
  9. మట్టి పాత్ర లందు మంచినీటిని బట్టి
    పెట్టు చున్న మనము పెరటిలోన
    పిట్టలన్ని వచ్చి గుట్టుగా త్రాగును
    గట్టి మేలు గాదె ఖచ్చితముగ !!!

    రిప్లయితొలగించండి
  10. లోకమ్ము సమస్తము నే
    శోకము లేకను వసించ స్త్రోత్రము లేలన్?
    మూకటిఁ బెట్టుచు నీరిడు
    సౌకర్యముఁ గూర్చ పక్షి జాతులు బ్రతుకున్!

    రిప్లయితొలగించండి
  11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    నేను ఈ చిత్రాన్ని అక్కడినుండే కాపీ చేసి పెట్టాను.
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం చివరి పాదాన్ని ‘నేటి జీవనమున నేమి కలదు’ అనండి. గణదోషం తొలగిపోతుంది.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గుళ్ళు వద్దు గొప్ప గోపురమ్ములు వద్దు
    దాన ధర్మ ములను దలుప వద్దు
    యెండ లోన గొంతు లెండి పోయెడి జీవ
    జాలమునకు నిమ్ము చాలు నీరు.

    రిప్లయితొలగించండి
  13. వేసవికాలమోచ్చినదివేడియుదాడికినిల్వబూనగా
    ఈసమయానపక్షులకునేర్పడుదప్పికమాన్పనెంచియే
    వేసవితాపమున్దరుగవెంటనెనీటిని-త్రాగురీతిగా
    ఆసర|మట్టిపాత్రలిడు,అందుననీటినినుంచపుణ్యమౌ|

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఒచ్చినది’ గ్రామ్యం. ‘వచ్చినది’ సరైన రూపం. ‘వేసవి వచ్చె దుర్భరము వేడియు...’ అందామా?

    రిప్లయితొలగించండి