12, మార్చి 2015, గురువారం

పద్యరచన - 846

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

వృక్షంబులంతరించిన
తక్షణమే జీవులెల్ల తప్పక చచ్చున్
రక్షించ వేడుకొందు వి
చక్షణ తో చెట్ల ధరణి జనులందరినిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అరచేతను స్వర్గంబట
పొరబా టునగాంచి నంత పూసెడి తరువుల్
సరసము గబెంచ నిపుణులు
మరుగుజ్జగు చెట్ల నెన్నొ మహిమాన్వితమౌ

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చేతనిమడ నరుడు చేయును గద గొప్ప
వస్తు తతిని యధిక ఫలములీయ
అధిక ఫలములిచ్చు నావృక్ష రాజమ్ము
చేతనిమడజేయ చేటు గాద.

subbarao చెప్పారు...

చిత్ర మచ్చట జూడగ జిత్ర మయ్యె
బెరుగ సాగెను వృక్షము పిడికి లందు
చూడ నేపుగ నవనవ లాడుచుండె
నమ్మ బుద్ధిగా లేదది నాకు సామి !

sailaja చెప్పారు...

వృక్షములను బోషించిన
చక్షువులకు హాయిగూర్చి జగతిని గాచున్
రక్షణనొసగెడు వాటిని
తక్షణమే బెంచవలయు ధరనెల్లెడలన్!!!

A.Satyanarayana Reddy చెప్పారు...

మఱ్ఱి వృక్షములను మరిగుజ్జుగా మార్చు
విద్య పెరిగె నేడు విశ్వమందు
ప్రజ్ఞ తోడ నేడు ప్రకృతిని గెలువగ
పయనమౌచునుండ్రి ప్రజలువేగ

మిస్సన్న చెప్పారు...

వృక్షమ్మే ఘన రక్ష ధారుణికి నే వేళైన ప్రాణమ్ములన్
వృక్షమ్మే నిలుపంగ గాలి నిడి ప్రావృట్టున్ జేయగా మానవా!
వృక్షమ్మే గద భావిసంతతులు జీవింపంగ కాపాడవో
వృక్షో రక్షతి రక్షితమ్మను మహా విజ్ఞాన మీ వెన్నవే.

పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదు చెప్పారు...

మిస్సన్న గారు మీ పద్యం బాగుంది కాకపొతే రెండవ పాదం లో చివరి మూడు గణాలు భంగంయ్యాయి .కావలసినవి "త త గ " వున్నవి "మ య వ" దయచేసి సరిచేయగలరు.

మిస్సన్న చెప్పారు...

బోన్సాయ్ మొక్కను జూచిన
మన్సాయెను పెంచ నాకు మామిడి మొక్కా?
పన్సా? మర్రియ? రావియ?
మున్సబు గారిచ్చి నార ముద్దుగ నీకై?

(సరదాగా)


మిస్సన్న చెప్పారు...


వృక్షమ్మే ఘన రక్ష ధారుణికి నే వేళైన ప్రాణమ్ములన్
వృక్షమ్మే నిలుపంగ గాలి నిడి ప్రావృట్ జేయగా మానవా!
వృక్షమ్మే గద భావిసంతతులు జీవింపంగ కాపాడవో
వృక్షో రక్షతి రక్షితమ్మను మహా విజ్ఞాన మీ వెన్నవే.

(పిరాట్ల ప్రసాద్ గారికి ధన్యవాదములతో)



కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చెట్లవెన్నొ’ అంటే అన్వయం కుదురుతుంది.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తతని నధిక...’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పిడికిలి+అందు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘పెరుగసాగెను పిడికిట వృక్ష మదియె’ అనండి.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘ప్రావృట్టున్ దగం జేయఁగా’ అనండి. మీ సవరణను ఇప్పుడే చూశాను. తెలుగులో ‘ప్రావృట్’ అని హలంతంగా ప్రయోగించరాదు కాదా!
‘న్స’ ప్రాసతో మీ రెండవ పద్యం బాగున్నది. కాకుంటే వ్యావహారిక పాదాలున్నాయి.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

కొరగామి నేత లందరు
అర చేతిని స్వర్గ మిదిగొ యని చూపించన్
వరులైన శాస్త్రవేత్తలు
అరచేతిని వృక్ష మిదిగొ యని చూపిరహో

మిస్సన్న చెప్పారు...

Guruvugaaroo dhanyavaadaalu. Doshaanni chakkagaa sarididdinanduku krutajnatalu.

కంది శంకరయ్య చెప్పారు...

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మాస్టరుగారూ ! ధన్యవాదములు...మీ సూచనతో...


చేతనిమడ నరుడు చేయును గద గొప్ప
వస్తు తతిని నధిక ఫలములీయ
అధిక ఫలములిచ్చు నావృక్ష రాజమ్ము
చేతనిమడ జేయ చేటు గాద.