17, మార్చి 2015, మంగళవారం

పద్యరచన - 851

కవిమిత్రులారా,
అవధాని రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి మృతికి 
శంకరాభరణం బ్లాగు ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నది.

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. రాళ్ళబండిని పిలచె దేవుళ్ళు పైన
    ఘనయుగాదికి ఘనమగు కవిత జదువ
    చేదు మాకిచ్చి వెడలగ ఖేదమంది
    తీపి గురుతుల తలతుము తెలుగు తల్లి !

    రిప్లయితొలగించండి


  2. మాస్టరుగారూ ! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను..తగిన విశ్రాంతి తీసుకోండి....

    రిప్లయితొలగించండి
  3. శ్రీ రాళ్ళబండి కవితాప్రసాదు గారికి నేనర్పించిన నివాళి గురువుగారు చూచారు. తప్పొప్పులుని యిప్పుడు చెప్పమని అర్ధిస్తూ ;

    జిహ్వాగ్రమున జేరి జేగీయమానమై
    వాగ్దేవి విహరింపఁ బలికెఁ గవిత
    సంస్కృతాంధ్రమ్ములు సమదృష్టితో నేర్చి
    సాహితీ రంగమ్ము సాకె సమత
    అవధాన విద్యలో నంబ రాగ్రముఁ దాకి
    దిక్కు లన్నిటఁ బంచె దీపి కైత
    శమదమమ్ములు గూడ సాధుస్వభావుడై
    సరస సభలఁ జేరి చదివెఁ గయిత
    ఆంధ్రు లెల్లరు మెచ్చగా నరుదు నైన
    అష్ట రీతుల నవధాన గోష్టి సలిపి
    రాచ మర్యాద లొందెను రాళ్ళబండి !
    భ్రాజి తమ్మయెఁ దన కీర్తి వసుధ నెల్ల ! !
    జిహ్వాగ్రము = నాలుక చివర ; జేగీయమానము = కొనియాడబడిన ; వాగ్దేవి = సరస్వతీ దేవి;
    అంబర +అగ్రము = ఆకాశపు కొస ; తాకు = స్పృశించు ; శమము = శాంతి ;
    దమము = ఇంద్రియనిగ్రహము ; సాకు = పోషించు ; భ్రాజితము = ప్రకాశవంతము

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  5. లేవు లేవాయె యిక మాకు లేవు నీ వు

    ఎచట కేగితి వ వధాని ! యిచట నుండి

    వత్తు వెప్పుడు మము జూ డ ,వత్తు విపుడ !

    యెదురు చూతుము నీ కొఱ కి చ్ఛ తోడ .

    కాన రానట్టి దూ రంబు గడచి నావు
    కాను పించుమ యొక సారి ,కాంచి నిన్ను
    సేద దేరుదు మో సామి ! చింత నుండి
    రమ్ము వేవేగ మఱి నీవు రాళ్ల బండి !

    సకల శుభములు గలిగించు శంక రుండు
    మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
    పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
    యొసగు శాంతిని నాత్మకు నొప్పు గాను

    మీ రు లేనట్టి లోటును మేము దీ ర్చ
    లేము , భార మంతయు నిక నా మురహరి
    చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
    అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము

    రిప్లయితొలగించండి
  6. రాళ్ళబండి కవిత రతనాలు కురిపించు
    ధారలోన మరియు ధారణమున
    నతనికతనె చాటి యవనీతలమ్మున
    నాత్మ శాంతితోడ నలరుగాత

    రిప్లయితొలగించండి
  7. చెరుగని చిరునవ్వు చెప్పక చెప్పును
    ...............మనసు నైర్మల్యమున్ మనిషి జూడ
    వాగ్ధార వాక్శుద్ధి పరికించ దెలియును
    ...............వాగ్దేవి సుతుడని వరుస జూడ
    అపర బృహస్పతి యని వెల్లడి యగును
    ...............ధారణా శక్తిని తరచి చూడg
    కైతలం జెప్పుచో కవికుల గురువును
    ...............తలపింప జేయును పలుకు జూడ

    అగ్ర విద్యార్హతలు గల్గి యాదరమున
    నొజ్జ గా, నుండ నెంచిన సజ్జనుండు
    రాళ్ళబండిని సురరాజు రమ్మనంగ
    దివికి నరుదెంచె నక్కటా భువిని వీడి.

    రిప్లయితొలగించండి
  8. Usha & Sarma
    పెట్టిన పద్యాన్ని దయ చేసి మిస్సన్నది గా దలచ మనవి.

    రిప్లయితొలగించండి
  9. తెలుగు సాహిత్య రంగమునకు, అవధాన విద్యకు విసేష సేవలనందించిన శ్రీమాన్ రాళ్ళబండి కవితాప్రసద్ గారి నిధనము ఒక తీరని లోటు.
    ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలుగవలెనని ప్రార్థిస్తున్నాను.

    గతుకు బాటన నడిపించె కైత బండి
    రాటు దేలిన సత్కవి రాళ్ళబండి
    యమరుడై నిల్చె నవధాన యబ్రమందు
    సమిద తానౌచు సాహితీ జన్నమందు

    తీరని లోటు(బాధ) నిల్పి యిల, దేవునిసన్నిధి జేరిపోతివా
    మీరిక మాకు లేరనిన మిక్కీలి దు:ఖము కల్గె సత్కవీ
    ధారణ విద్య యైన యవధానపు వెల్గులు చిన్నబోయెనే
    తారగ నిల్చినావు కవితా గగనంబున భారతీ కృపన్.

    రిప్లయితొలగించండి
  10. సాహిత్య సమధికోత్సాహమ్ము వెలయించి
    .......... తెలుఁగు జిలుగులనెల్ల వెలుఁగఁ జేసె
    రసరమ్యభూయిష్ట లాలిత్యపదముల
    .......... కవితా విలాసంపు గరిమ జూపె
    నవధానవిజయమ్మునవలీల నొనరించి
    .......... సూరిజనాళిసంస్తుత్యుఁడయ్యె
    తిరుపతి నగరిలో తెలుఁగు మహాసభల్
    .......... వైభవంబుగ జేసె ప్రథితుఁడయ్యె

    తెలుఁగు సాహిత్యలోకంపు దీపమగుచు
    మోముపై మందహాసంపు ముద్రవిడక
    సాగుచుండెడి జ్ఞానవిశారదుండు
    రాలి పోయెను కవితల రాళ్ళ బండి.

    రిప్లయితొలగించండి
  11. తెలుగుపలుకులొండి విలువగునవధాన
    సభనబంచగలుగు-సాత్వికుండు
    ఆంద్రసంస్కృతమ్మునవలీలగాబల్కి
    తెలుగుతేజమందువెలిగివెళ్ళే
    అవధానవిద్యయందున
    అవగాహనకలుగుకొరకు-ఆరంభవికా
    శ,వసతిగరచనజేసిన
    అవధానికినంజలింతునాత్మీయతతో

    రిప్లయితొలగించండి
  12. కెంబాయితిమ్మాజీరావుగారిపూరణం
    ------------
    కవితలల్లువేళ-కవితాప్రసాదు-మ
    రాళవాహినౌచు-రాజిలెయవ
    ధానవిద్యలోప్రవీనుడయి-గ్రాలి
    ఆంద్రవాంగ్మయమున-అమరుడయ్యె|


    రిప్లయితొలగించండి
  13. కే*యస్*గురుమూర్తిగారిపూరణం
    --------------
    రాళ్లబండి-సాహిత్యంబు-ప్రమిదయందు
    వత్తియైకాంతినొసగుచు-ప్రజ్వరిల్లె|
    అకట|మృత్యుఝంఝానిలమార్పివేయ
    అంధతమసాన-మునిగెనీఆంద్రజగతి

    రిప్లయితొలగించండి
  14. సాహిత్య సమధికోత్సాహమ్ము వెలయించి
    .......... తెలుఁగు జిలుగులనెల్ల వెలుఁగఁ జేసె
    రసరమ్యభూయిష్ట లాలిత్యపదముల
    .......... కవితా విలాసంపు గరిమ జూపె
    నవధానవిజయమ్మునవలీల నొనరించి
    .......... సూరిజనాళిసంస్తుత్యుఁడయ్యె
    తిరుపతి నగరిలో తెలుఁగు మహాసభల్
    .......... వైభవంబుగ జేసె ప్రథితుఁడయ్యె

    తెలుఁగు సాహిత్యలోకంపు దీపమగుచు
    మోముపై మందహాసంపు ముద్రవిడక
    సాగుచుండెడి జ్ఞానవిశారదుండు
    రాలి పోయెను కవితల రాళ్ళ బండి
    భారతీ దేవి పదయుగ్మ నీరజముగ.

    రిప్లయితొలగించండి
  15. ప్రముఖ సాహితీవేత్త, అవధాని శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి మరణం తెలుగు సాహితీరంగానికి తీరని లోటు. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చుగాక!
    రాళ్ళబండి వారి విశిష్టతలను తెలిజేస్తూ సంతాపపద్యాలను రచించిన మిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    మిస్సన్న గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. రాళ్ళబండియె దివికేగ రాజసమున,
    దివిజ కవివరు గుండియల్ దిగ్గురనును
    భువిని కవులెల్ల బాధతో భోరుమనగ
    తాను పైనుండి చిరునవ్వు ధారలొసగు

    రిప్లయితొలగించండి
  17. గురువు గారికి త్వరగా ఆరోగ్యం చక్కబడాలని ప్రార్థిస్తూ...

    చూపు లోన పదును, సూటి మాటలతూట
    పద్య ధార కురియ వరద లంట
    వాణి కరుణ తోడ తేనెమాటల తేట
    పలుకు పండె రాళ్ల బండి నోట

    రిప్లయితొలగించండి
  18. ప్రణామములు
    అంతటి అవధాన చక్రవర్తి ,పాండితీ స్రష్ట , అంతటి మహాను భావుని గురించి వ్రాయగల శక్తి నాకు లేదు .ఆటా సభలకు వచ్చినప్పుడు వారి అవధానములో పాల్గొన గలిగిన అదృష్టం ఈ జన్మకి ధన్యము .రాయడానికేముంది ? శ్రద్ధాంజలి ఘటించడం తప్ప ?
    నాదిఒకచిన్న కలం దానికి లేదంతబలం

    రిప్లయితొలగించండి