30, మార్చి 2015, సోమవారం

పద్య రచన - 864

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. పిట్టల పట్టుట కొరకై
    పెట్టెను తా చేట జల్లె బియ్యంబచటన్
    కట్టెకు గట్టిన త్రాడును
    గట్టిగ లాగంగ చేటఁ ఖగములు చిక్కున్

    రిప్లయితొలగించండి
  2. చంద్ర మౌళి గారూ ! పిట్టను బలేగా చే (ట) పట్టారు.....పిట్ట ( మీ పద్యం ) కొంచెం కూత ( అర్థం ) ఘనంగా వుంది....శబాష్..

    రిప్లయితొలగించండి
  3. పొట్టను నింపుట కొరకై
    పిట్టల చేపట్టు విధము పిల్లడు జూపెన్
    కొట్టక తిట్టక పట్టగ
    పిట్టలకే మేత, పైన పెట్టెను చేటన్.

    రిప్లయితొలగించండి
  4. పావురంబుల జూడుము పటము నందు
    ఏరు కొనుచును దినుచుండె నిమ్ము గాను
    చేట నున్నట్టి బియ్యము న్జిత్ర ముగను
    దొంగ వోలెను బాలుడు తొంగి జూడ

    రిప్లయితొలగించండి
  5. చేటకు త్రాడును గట్టెను
    పాటవముగ వడ్లు జల్లె పక్షుల కెరగా
    చేటెరు గక దినగ నవియె
    వాటముగా చిక్కు నంచు బాలుడు దలచెన్ !!!

    రిప్లయితొలగించండి
  6. పిట్టను జూచుట యన్నది
    కట్టముగా పరిణమించె కలికాలమిదిన్
    పిట్టలు జూచిన బొట్టెడు
    ఇట్టముగా పట్టదలచి ఎత్తును పన్నెన్

    రిప్లయితొలగించండి
  7. పచ్చని బయలున పిచ్చుక
    ముచ్ఛటగా ఎగురుచుండ ముదమగు మదిలోన్
    ఇచ్చట బోయడు వాటిని
    ఉచ్చున బంధింప మనసు ఉస్సూరనదే

    రిప్లయితొలగించండి
  8. ఎరగా జల్లిన బియ్యము
    దరిఁజేరిన పిట్టలందు దక్షతఁ గలదై
    యురిఁ బోలు త్రాడు నొక్కటి
    కొరుకగ ముఖమింతకాగ క్రూరుడుఁ గూలెన్!

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రవికాంత్ మల్లప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘కలికాల మిదిన్’ అన్నదాన్ని ‘కలికాల మిదే’ అనండి. ‘కట్టము, ఇట్టము’ మాండలికాలే కాని గ్రాంధికాలు కావు.
    రెండవ పద్యంలో ‘మనసు+ఉస్సూరనదే’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘బంధింపగ మన సుస్సూరనదే’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నోటుకు ఓటనుయరలా
    చాటందునగింజలుంచి చాటునజూసే
    వాటపునాయకు డనిపొర
    పాటునుగువ్వలటువెళ్ళభావనమానేన్

    రిప్లయితొలగించండి
  11. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మీ పద్యాలలో టైపు దోషాలుంటున్నాయి. పంపేముందు ఒకసారి సరిచూసుకోండి.

    రిప్లయితొలగించండి
  12. సవరణలకు ధన్యవాదములు శంకరయ్యగారు. కందంలో మాండలీకాలు వాడకూడదా?

    రిప్లయితొలగించండి
  13. సవరణలకు ధన్యవాదములు శంకరయ్యగారు. కందంలో మాండలీకాలు వాడకూడదా?

    రిప్లయితొలగించండి
  14. రవికాంత్ మల్లప్ప గారూ,
    కందంలోనే కాదు, ఛందోబద్ధకవిత్వంలో ఏ పద్యంలో నైనా వ్యాకరణవిరుద్ధములైన గ్రామ్యాలను, వ్యావహారికాలను, మాండలికాలను వాడకూడదు.
    సరదాగో ఎప్పుడో హాస్యానికో, ఎగతాళికో వ్రాసినప్పుడు వ్యావహారికాలను, అన్యదేశ్యాలనూ వాడవచ్చు... కాని అటువంటి సందర్భాలు ‘శంకరాభరణం’ బ్లాగులో అరుదు.

    రిప్లయితొలగించండి