సరసమైన పూరణ లిచ్చిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, డా. ఆచార్య ఫణీంద్ర గారికి, పండిత నేమాని వారికి, రాజేశ్వరి అక్కయ్యకు (‘నడుమను, గణనీయమ్ముగ’ అంటే గణదోషం తొలగుతుంది). లక్కాకుల వెంకట రాజారావు గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, మందాకిని గారికి, సుబ్బారావు గారికి, డి. నిరంజన్ కుమార్ గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, హరి గారికి (బహుకాల దర్శనం!), శ్రీపతి శాస్త్రి గారికి, శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి, మిస్సన్న గారికి, అభినందనలు. ధన్యవాదాలు.
రణమున దెచ్చిన స్వేచ్చయె
రిప్లయితొలగించండిగణ నాయకులకు మిగులగ కలుముల నిచ్చెన్
గుణవంతులు తిన శూన్యము
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.
రణ తంత్రమ్ములు పెరిగెను -
రిప్లయితొలగించండిగణనీయముగ నవినీతి, ’స్కాము’లు పెరిగెన్ -
ఋణ తంత్రమ్ములె మిగిలెను -
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్!
తృణభుక్కులు, స్వార్ధపరులు,
రిప్లయితొలగించండిగుణహీనులు నేతలగుట గుండియలోనే
వ్రణమయ్యె భరతమాతకు
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్
గణ నాయకు లంత కలసి
రిప్లయితొలగించండిరణ రంగమ్ము లనడుమ రగులుచు నుండన్ !
గణ నీయముగ మ్రింగుచు
గణ తం త్రమ్మనెడి మాట కల్లగ మిగిలెన్ !
ప్రణతి ప్రణతి శ్రీ భారత
రిప్లయితొలగించండిగణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
ఘనమెరుగని యల్పులకీ
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగణనీయుల త్యాగములన్
రిప్లయితొలగించండిగుణహీనులు ప్రభువు లయ్యి కొల్లగొనంగన్
సణుగులె దక్కెను జనులకు
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమణిపూసలయిన భారతి
రిప్లయితొలగించండిగుణపూర్ణులగు కొమరుండ్రు గొప్పగ నాడా
రణమున గెల్చియును నదే
గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్.
కొమరుడు కు బహువచనము కొమరుండ్రు అవుతుందని అనుకుంటున్నాను.
తప్పైతే తెలుపగలరు.
మూర్తిగారు, మీ రెండవ పూరణ రెండవపాదము కొంచెము పరిశీలించగలరు.
రణములు సేసిరి పెద్దలు
రిప్లయితొలగించండిగణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
గుణ హీన నేత లుండుట
గణ తంత్రమ్మ నెడు మాట కల్లగ నిలిచెన్ .
మందాకిని గారూ ధన్యవాదములు. మీ పూరణ చాలా బాగుంది. పద్యము వ్రాసి మార్పు చేయడములో యతి దెబ్బ తింది పాపం. సవరించాను
రిప్లయితొలగించండిగుణ కర్మ విభాగమ్ముల
గణించెదరు కులము మతము గడుసరు లిపుడున్
పణముల నిడి కొన పదవులు !
గణ తంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్ !!
గుణహీనుల నేతృత్వం
రిప్లయితొలగించండిబణగార్చగ దేశప్రజల ఆశలసౌధం
బణువణువున దోపిడియై
గణతంత్రమ్మనెడి మాట కల్లగ మిగిలెన్
ఫణముగజేసిరి ప్రాణము
రిప్లయితొలగించండిలణగారినధైర్యసాహసావేశంబుల్
ఝణఝణమని పొంగగ "ని
ర్గణతంత్ర"మ్మనెడుమాట కల్లగ మిగిలెన్.
అణగారు ప్రజలు వోట్లను
రిప్లయితొలగించండిగుణహీనుల కమ్ముదు రిట కూటికి బరువై
గణపతు లయ్యిరి ఖలులే
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగణతంత్ర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండివ్రణముననిడు కారమువలె బాధను బెంచెన్
గుణహీన నేతల వలన
గణతంత్రమ్మనుమాట కల్లగ మిగిలెన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగుణవంతుల పోరాటము
గణతంత్రపు ఫలము కూర్చి గౌరవమొసగెన్
గుణహీనుల యవినీతితొ
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్
గణముల నేతగ గజముఖు
రిప్లయితొలగించండిప్రణవాకారుండు గిరిజ ప్రకటింపంగన్
సణుగుతు షణ్ముఖుడనుకొనె
గణతంత్రం బనెడుమాట కల్లగ మిగిలెన్
అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యములో 2వ పాదములో ర్గుణ కి కృత తో యతి వేసారు. ఇది మైత్రి కుదురదు. సవరించండి.
నేమాని పండితార్యా సూచనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఋ, రు లకు యతి వేయవచ్చుననుకొని పొరబడ్డాను.
ఇలా సవరించాను.
రణ తంత్రము కౌరవ దు-
ర్గుణయంత్రము దుష్ట కర్ణ కుటిలాంగమ్ము-
న్నణచును కౌంతేయుల కురు-
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.
సరసమైన పూరణ లిచ్చిన
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్యకు (‘నడుమను, గణనీయమ్ముగ’ అంటే గణదోషం తొలగుతుంది).
లక్కాకుల వెంకట రాజారావు గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
మందాకిని గారికి,
సుబ్బారావు గారికి,
డి. నిరంజన్ కుమార్ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
హరి గారికి (బహుకాల దర్శనం!),
శ్రీపతి శాస్త్రి గారికి,
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
మిస్సన్న గారికి,
అభినందనలు. ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఎముకల కాశ పడి , శునకాల నెన్నుకుంటే జరిగేదదే గదా !
01)
____________________________
కనకపు సింహాసనమున
శునకము నెక్కించ దగునె ? - శుభములు గలుగున్ ?
తన తప్పు గాదు , గావున
గణతంత్ర మ్మనెడు మాట - కల్లగ మిగిలెన్ !
____________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిపేరడీ వంటి చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
గుణహీనులు నాయకులై
రిప్లయితొలగించండిగణనమె లక్ష్యముగ దేశ కళ్యాణమ్మున్
బణముగ బెట్టిరి ,అకటా!
గణతంత్రమ్మనెడిమాట కల్లగ మిగిలెన్ .
------------