ప్రహేళిక
మోమారామమమాదంద్వే
హయాగదలనంభషః |
యస్యైతాని న విద్యంతే
స యాతి పరమాంగతిమ్ ||
భావం
ఎవనికి ‘మోమారామమమాదంద్వే, హయాగదలనంభష’లు లేవో వాడే పుణ్యలోకాన్ని పొందుతాడు.
ఈ శ్లోకం పూర్వార్ధంలో ‘అక్షరక్రమికత్వం’ ప్రదర్శింపబడింది. పూర్వార్ధమైన రెండుపాదాలలో ఎనిమిదేసి అక్షరాలున్నాయి. ఈ రెండు పాదాల అక్షరాలను అదే క్రమంలో కలిపిచూడాలి. మొదటి పాదంలో మొదటి అక్షరం ‘మో’, రెండవపాదంలో మొదటి అక్షరం ‘హ’. రెంటిని కలిపితే ‘మోహ’ అవుతుంది. అలాగే మిగిలినవి.
1 2 3 4 5 6 7 8
మో మా రా మ మ మా దం ద్వే
హ యా గ ద ల నం భ షః
(1. మోహ, 2. మాయా, 3. రాగ, 4. మద, 5. మల, 6. మానం, 7. దంభ, 8. ద్వేషః)
మోహం, మాయ, రాగం, మదం, మలం, మానం, దంభం, ద్వేషం లేనివాడు పుణ్యలోకాన్ని పొందుతాడని భావం.
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

ఆర్యా! ప్రహేళిక మొదటి పాదం చక్కగా వివరించారు.
రిప్లయితొలగించండిరెండవ పాదం
హ యా గ ద ల నం భ షః
వివరించినట్టుగా లేరు.
రెండవ పాదం కూడా వివరించి ఉంటే పరి పూర్ణంగా అర్థవంతంగా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
‘మొదటి పాదంలో మొదటి అక్షరం ‘మో’, రెండవపాదంలో మొదటి అక్షరం ‘హ’. రెంటిని కలిపితే ‘మోహ’ అవుతుంది. అలాగే మిగిలినవి’ అన్నను కదా! అంటే ఆ రెండు పాదాలలో 1వ అక్షరాలు ‘మాహ’, 2వ అక్షరాలు ‘మాయ’, 3వ అక్షరాలు ‘రాగ’, 4వ అక్షరాలు ‘మద’,5వ అక్షరాలు ‘మల’, 6వ అక్షరాలు ‘మానం’, 7వ అక్షరాలు ‘దంభ’, 8వ అక్షరాలు ‘ద్వేషం’లను తెలియజేస్తాయి.