1, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 577 (ఆంగ్లవత్సరమ భయమ్ము)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది 
ఆంగ్లవత్సరమ భయమ్ము నొసఁగు.
ఈ సమస్యను సూచించిన
శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. ఈతి బాధ లెల్ల నేటిలో కలియును
    క్రొత్త చివురు తొడుగు చిత్తమునను
    ఆశ లతిక పూయు నానంద కుసుమమ్ము
    ఆంగ్లవత్సరమ భయమ్ము నొసఁగు.

    రిప్లయితొలగించండి
  2. అక్ర మార్జ నన్న నవినీతి యన్నను
    హింస యన్న పరుల హేళనన్న
    మోహ లోభ కామ ములనెడ నో క్రొత్త
    ఆంగ్లవత్సరమ భయమ్ము నొసఁగు

    రిప్లయితొలగించండి
  3. ఆంగ్ల భాష తోడ నాంగ్ల సంస్కృతి వచ్చె
    తెలుగు వార లంత తెల్ల బోవ
    అయ్య వార్లు పడిరె యాంగ్లమ్ము మోజులో
    ఆంగ్ల వత్సరమ భయమ్ము నొసగు

    రిప్లయితొలగించండి
  4. న్యూయార్కులో యిప్పుడే కొత్త సంవత్సర సూచనగా బంతి పడింది !

    బంతి భ్రంశ మయ్యె బాజా భజంత్రీల
    హోరు పెరిగె యేదొ పోరు వల్లె
    పరుగు లెత్తు కొనుచు పన్నెండు దిగి రాగ
    నాంగ్ల వత్సరమ భయమ్ము నొసగు

    రిప్లయితొలగించండి
  5. మితము లేక చెప్పు మిస్సన్న పద్యాలు
    హితము గూర్చు చెవుల కింపు గాను
    క్రితము కంటె నితడు కెరలించి పాడంగ
    నాంగ్ల వత్సరమ భయమ్ము నొందు

    రిప్లయితొలగించండి
  6. గన్నవరపు వారు హన్నన్న తక్కువే?
    ఆముదమ్మె? కాదు, ఔను ముదమె
    అమెరికాను తెనుగు నవధులు దాటింప
    నాంగ్ల వత్సరమ భయమ్ము నొందు.

    రిప్లయితొలగించండి
  7. మిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా అబ్బాయి పెళ్ళి సంబంధం గురించి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరడంతో నిన్నటి పూరణలపై వ్యాఖ్యానించడం కుదరలేదు.
    ఈ రోజు ఉదయంనుండి కరెంటు లేదు. తొమ్మిది గం.కు వచ్చిన కరెంటు కొద్దిసేపే ఉండి మళ్ళీ పోయింది. ఈలోగా కేవలం సమస్యను, శుభాకాంక్షలు పోస్ట్ చేయగలిగాను.
    ఇప్పుడు అత్యవసరంగా ఊరికి వెళ్తున్నాను. మళ్ళీ ఏ రాత్రికో తిరిగివస్తాను. దయచేసి మిత్రులు పరస్పరం గుణదోష విచారణ చేయవలసిందిగా మనవి.
    అసౌకర్యానికి క్షంతవ్యుణ్ణి!

    రిప్లయితొలగించండి
  8. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, జనవరి 01, 2012 11:34:00 AM

    తగిన వానలు పడి తనర పంటలు పండి
    తిండి కలిగి ప్రజలు తిరుగు చుండ
    తల్లి ప్రకృతి మాత చల్లని చూపు తో
    నాంగ్ల వత్సర మభయమ్ము నొసగు

    రిప్లయితొలగించండి
  9. కంది శంకరులకు కడగండ్లు దూరమై
    కొడుకు పెండ్లి జరిగి కుదుట బడగ
    భద్రమిచ్చు గాత పండ్రెండు రాశులు
    నాంగ్ల వత్సరమ భయమ్ము నొసగు.

    రిప్లయితొలగించండి
  10. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, జనవరి 01, 2012 5:38:00 PM

    గురువు గారికీ, శంకరాభరణం కవి మిత్రులకూ,
    నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  11. అన్ని రంగములను అభివృద్ధి నొందుచు
    పాడి పంట ,భోగ భాగ్యమలర
    భరత జనులు సుపరి పాలన బడయగ
    ఆంగ్ల వత్సరమభయమ్ము నొసగు .
    ---------------

    రిప్లయితొలగించండి
  12. అభినందనలతో
    సోదరులు . చింతా వారు , గన్నవరపు వారు , హనుమత్ శాస్త్రి గారు , టేకుమళ్ళ వారు ,రావు గారు సరే [ వారిదే కదా ] అందరి పూరణలు " సుజనరంజని లొ " చూసాను. చాలా సంతోషం గా ఉంది. ప్రతి నెలా నేను ఒక్క దాన్నే { తెలిసిన వారెవరు లేరే అనుకుంటూ ] పట్టు వదలని విక్ర మార్కుడిలా [ విక్ర మార్కిణి ] వ్రాస్తున్నానని అనుకుంటూ ఉండే దాన్ని .ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఒక మాట చెప్పనా ? రావు గారు " తల్లాప్రగడ " మా అమ్మగారు " తల్లాప్రగడ " " అంటే జగమంతా పుట్టిల్లె " ఎంత అదృష్ట వంతురాలిని ?
    " సోదరు లందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు + అభినందనలు "

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. అయ్యా సుబ్బారావు గారూ!
    మీ పూరణ చూచేను. అది ఏ ఛందస్సులో వ్రాసేరో తెలియుటలేదు. కాస్త సరిగా చూడండి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ నేమాని వారికి నమస్కారములు .

    2012 ఆంగ్ల సంవత్సరము పాడి పంటల నిచ్చి
    అభయము నీయవలసినదని .అను అభి ప్రాయముతో
    ఆటవెలది పద్యము.సవరణ చేయ గోర్తాను .

    రిప్లయితొలగించండి
  16. భయము వలదు భువికి ప్రళయమ్ము రాదని
    రెండు వేలును పది రెండు నందు
    హాయి నొందు డాయు రారోగ్య ములనని
    ఆంగ్ల వత్సరమభయమ్ము నొసగు .

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సుబ్బారావు గారూ!
    ఆటవెలది 1,3 పాదాలు (3సూ 2 ఇం) గణములు మరియు 2,4 పాదాలు (5 సూ)గణములు ఉండాలి. మీరు ఇటునుండి అటు మార్చి గణములు వేసేరు.
    నేను మీ భావముతో వ్రాసిన పద్యమును చూడండి:

    పాడి పంటలు పలు భాగ్య విశేషముల్
    సకల భూజనులకు శాంతి సుఖము
    లిచ్చు వేడ్కతోడ వచ్చుచు నీ నూత
    నాంగ్ల వత్సర మభయమ్మొసంగు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నేమాని వారికి నమస్కారములు .
    నా పద్యము సరి చేసినందులకు కృతజ్ఞు డను.
    మీ రు చెప్పిన ట్లు పాదములు మార్చాను .
    తప్పు తెలుసు కున్నాను .

    రిప్లయితొలగించండి
  19. ఆంగ్ల వత్సర మభ యమ్ము నొసగు గాత !,
    క్రీ .శ .యిరువది పదికి మఱి రెండు
    పాడి పంట సిరులు భాగ్యము గా నిచ్చు
    వత్సరమ్మ ! నీకు వంద నంబు .

    రిప్లయితొలగించండి
  20. ఆంగ్ల వత్సరమ! భయమ్మునొసఁగు రచ్చ
    కెక్కిన బలు రాజ కీయ ఖర్ప
    రులకు వెకిలి ప్రేమ రోగులకవ్వారిఁ
    కాలమెట్టు లోర్తునో లయమున!

    రిప్లయితొలగించండి
  21. పుట్టి నింటి నంత భోగభాగ్యము నిండ
    మెట్టి నింట నామె మేలు స్నుష
    భర్త యెదను దోచు భాగ్యవతిగ వెలయు
    ఆంగ్ల వత్సర మభయమ్ము నొసగు !
    స్నుష = కోడలు
    ---------------------------------------
    ఇంటి నిండ సిరులు నిండుగా ప్రవహించి
    చదువు సంధ్య లందు జయము పొంది
    నాక మనగ నింట నవరస భరితమై
    ఆంగ్ల వత్సరమ భయమ్ము నొసగు

    రిప్లయితొలగించండి