‘శ్రీపంచమి’ పర్వదినం సందర్భంగా
బ్లాగు సభ్యులందరికి
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి
శుభాకాంక్షలు.
శారద! శంకరాభరణ సభ్య మహాకవి పండితావళీ
సార హృదంతరాళమున సంతతమున్ వెలుగొందుచున్ సుధీ
సారము నింపునో జనని! సంస్తుతి జేయుదు నీ మహత్త్వమిం
పారెడు శబ్ద భావ రస పర్వముగా నతులాచరించుచున్.
శ్రీ మహా సరస్వత్యై నమ:
రిప్లయితొలగించండిశ్రీ శారదాస్తుతిని పఠియింప జేసిన నేమాని వారికి నమస్సులు.
గంట గంటలు స్తో త్రించి ఘనముగాను
పూజ లందించ లేనమ్మ పుత్రు నేను
పలుక లేనమ్మ నీ గొప్ప పలు విధముల
పలుకు లిమ్మంటి మాయమ్మ పలుకులమ్మ
శ్రీ గోలీ వారికి,
రిప్లయితొలగించండిఅమ్మ జవాబు:
ఇచ్సితి మీకు వసంత పంచమి నాడు వరమ్ము
మీ వాక్కు సత్యవాక్కు అగు గాక ఎల్ల వేళలన్!
ఇక్కడి సరస్వతీ పుత్రికా పుత్రులందరికీ, నమస్సులు.
జిలేబి.
చదువుల తల్లి వేడెదను చల్లని చూపుల నన్ను జూడుమా!
రిప్లయితొలగించండికుదురుగ నీదు పాదముల గొల్వగ బుద్ధులనిచ్చి గావుమా!
ముదమున విద్య నేర్చుకొను మోహము వీడకనుండ జేయుమా!
హృదయము నందు నెక్కడను హీనపు యోచన నుంచ నీకుమా!
చదువుల తల్లికి వందనం . అందించిన గురువులకు పాదాభి వందనం
రిప్లయితొలగించండిఅమ్మా మందాకినీ గారూ!
రిప్లయితొలగించండిమీ సరస్వతీ స్తుతి పద్యము 3వ పాదములో "వీడక నుండ" అని నుగాగమము చేసేరు. వీడక అనే పదము వ్యతిరేక అర్థకము కాబట్టి నుగాగమము చేయరాదు. వీడక యుండ అని యడాగమమును చేయాలి. స్వస్తి.
అమ్మా మందాకినీ గారూ!
రిప్లయితొలగించండిమీ సరస్వతీ స్తుతి పద్యము 3వ పాదములో "వీడక నుండ" అని నుగాగమము చేసేరు. వీడక అనే పదము వ్యతిరేక అర్థకము కాబట్టి నుగాగమము చేయరాదు. వీడక యుండ అని యడాగమమును చేయాలి. స్వస్తి.
పండితులవారు మన్నించాలి.
రిప్లయితొలగించండిచదువుల తల్లి వేడెదను చల్లని చూపుల నన్ను జూడుమా!
కుదురుగ నీదు పాదముల గొల్వగ బుద్ధులనిచ్చి గావుమా!
ముదమున విద్య నేర్చుకొను మోహము వీడక యుండ జేయుమా!
హృదయము నందు నెక్కడను హీనపు యోచన నుంచ నీకుమా!
తెలియక అట్లా వ్రాశాను.
ధన్యవాదములండి.
పల్కుల తల్లి దృష్టి పయిబడ్డ యదృష్టము దక్కి బ్లాగులో
రిప్లయితొలగించండికుల్కుల తెల్గుపద్యములగూర్చుచుతెల్గులలో వినోదముల్
చిల్కుచు శంకరాభరణ చిద్వనమందు చరించు మిత్రులం
బల్కి వసంతపంచమి శుభమ్ములు గోరెద నెమ్మనమ్మునన్
జిలేబి గారూ ! అమ్మ మీచే పంపించిన ' పలుకులను ' తీపి జిలేబి ' పలుకులు' గా పంచారు.మహా ప్రసాదం..ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమందాకినీ గారి, లక్కాకుల వారి పద్యములు బాగున్నవి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిపర్వదినాన సర్వజనానందకరంగా వాగ్దేవీస్తుతి పద్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పద్యం చెప్పరు. ధన్యవాదాలు.
*
జిలేబి గారూ,
ధన్యవాదాలు.
*
మంచి పద్యం. ధన్యవాదాలు.
‘వీడక యుండ’ అని మార్చారు కదా! సంతోషం. ‘యోచన నుంచ నీకుమా’ అనేది ‘యోచన జెంద నీకుమా’ అంటే ?
*
రాజేశ్వరి అక్కయ్యకు ధన్యవాదాలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
అందమైన పద్యంతో ఆనందం కల్గించారు. ధన్యవాదాలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. బాగున్నది. యోచన తోచనీకుమా, చేయనీకుమా లేక ఏది రాద్దాం అనేది తోచలేదు. జెందనీకుమా కుదురుతుందంటే సరే.
సరస్వతీ దేవిని వినుతించి అందఱికీ దీవెన లిచ్చిన అన్నయ్య గారికి, శ్రీ లక్కాకుల వెంకట రాజా రావు గారికి అభివందనములు. శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి మందాకిని గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచదువుల తల్లి వేడెదను చల్లని చూపుల నన్ను జూడుమా!
రిప్లయితొలగించండికుదురుగ నీదు పాదముల గొల్వగ బుద్ధులనిచ్చి గావుమా!
ముదమున విద్య నేర్చుకొను మోహము వీడక యుండ జేయుమా!
హృదయము నందు నెక్కడను హీనపు యోచన జెంద నీకుమా!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_________________________________
స్వాగత పూర్వకమ్ముగను - సమ్మతి వేడుదు ! పద్మలాంచనా !
సాగతమీయవమ్మ ! పద - సానువు లందున సంచరించగన్ !
సాగగ నాదు జన్మ, మన - సారగ,శారద, నీదు పాదముల్
సాగిలి మ్రొక్కుదు న్నుదురు - సాగర మేఖల దాకునట్లుగాన్ !
_________________________________
సాగతము = స్నేహము , వాత్సల్యము
పదసానువులు = అడుగు జాడలు
సాగు = సిద్ధించు , వెల్లివిరియు
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ శారదా స్తుతి సుందరంగా ఉంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి