గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ మన నేతల తొందరపాటు నిర్ణయములతో, బహుళజాతి కంపెనీల నిర్వాకములతో నేడు మనదేశము అభివృద్ధి జెందినట్లు కనిపించెనా అది శూన్యమే| ------------ మిడిమిడి జ్ఞానపు నేతలు వడివడిగా నిర్ణయముల వడ్డనతోడన్ నడచొచ్చిన పరదేశపు చెడుగులతో దేశమెల్ల శ్రీకరమయ్యెన్|
పై పద్యం చూచి అతిశయోక్తి అనుకోకండి. నేను కళాశాలలో ఉపన్యాసకునిగా పని చేస్తున్న రోజులలో చెడుగుల మనసు మార్చి మంచి ప్రవర్తన కలవారిగా చేయ గలిగాను. అది గుర్తుకు వచ్చి పై పద్యం వ్రాసాను.
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * మందాకిని గారూ, ప్రశస్తంగా ఉంది మీ మొదటి పూరణ. చక్కని విరుపుతో మీ రెండవ పూరణ బాగుంది. మీ మూడవ పూరణ కూడా చక్కగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ పూరణ నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నది. బాగుంది. అభినందనలు. ‘నడిచొచ్చిన’ ప్రయోగమే గ్రాంధికం కాదు. అక్కడ ‘నడతెంచిన’ అందాం. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మంచి విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు. * చింతా రామకృష్ణారావు గారూ, స్వానుభవంతో చెప్పిన పూరణ. చాలా బాగుంది. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘నొక్కే’ను ‘నొక్కెడి’ అందాం. ఇంతకీ ‘భడవ’ గ్రాంధికమేనా? * రాజేశ్వరి అక్కయ్యా, చక్కని భావంతో పూరణ చెప్పారు. అభినందనలు. మొదటి పాదంలో ‘తొ’ ప్రయోగం, రెండవ పాదంలో గణదోశం. నా సవరణ ... ‘పిడికెడు భక్తిని మనమున కడు మోదముతోడ భవుని గొలిచిన తోడన్ !’ మీ రెండవ పూరణ కూడా బాగుంది. రెండవ పాదంలో గణదోషం. ‘కడివెడు కలలందు మునిగి కాంతలు కులుకన్’ అందాం. * వసంత కిశోర్ గారూ, ఈసారి మీరు ‘మిస్’ కాలేదు :-) వృత్యనుప్రాసతో అలరిస్తున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, మంచి చెడుగు పడుగుపేకల్లా ఉన్నా మనదేశం ముందుకు సాగుతున్నది. చక్కని పూరణ. అభినందనలు.
నిరంజన్ కుమార్ గారూ, పోతన గారి ‘అడిగెదనని కడువడిఁ జను’ పద్యాన్ని గుర్తుకు తెచ్చారు. చంద్రశేఖర్ గారి పద్యమే అనుకుంటే దానిని మించిన అనుప్రాసను ప్రయోగించి మెప్పించారు. అద్భుతమైన పద్యం. అభినందనలు.
వడిగా భారత సంస్కృతి
రిప్లయితొలగించండిసడిబడెనిక బహుళజాతి సంస్థల నీడై
మిడిమిడి జ్ఞానపు ధనముల
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్
వడివడిగా శ్రీరాముడు
రిప్లయితొలగించండిసుడిగాలి వలె చెలరేగి సురవైరులనే
యడిచినతోడుత తొలగిన
చెడుగులతో దేశమెల్ల శ్రీకరమయ్యెన్.
సురవైరులు తొలగి, లంకాద్వీపమనే దేశము విభీషణుడు రాజై శ్రీకరమయ్యింది.
తోడుత =వెను వెంటనె
కడు ఘోరముగా నిండెను
రిప్లయితొలగించండిచెడుగులతో దేశమెల్ల; శ్రీకర మయ్యెన్
బుడి బుడి నడకల బాలల
యెడ తల్లి యొడియె యొకింత నిలలో నిపుడున్.
సడలెను నీతులు బుద్ధుల
రిప్లయితొలగించండిచెడుగులతో; దేశమెల్ల శ్రీకర మయ్యెన్
కడిగిన ముత్యము వలెనే
చెడు బుద్ధుల నడచినంత శీఘ్రముగానే.
గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ
రిప్లయితొలగించండిమన నేతల తొందరపాటు నిర్ణయములతో, బహుళజాతి కంపెనీల నిర్వాకములతో
నేడు మనదేశము అభివృద్ధి జెందినట్లు కనిపించెనా అది శూన్యమే|
------------
మిడిమిడి జ్ఞానపు నేతలు
వడివడిగా నిర్ణయముల వడ్డనతోడన్
నడచొచ్చిన పరదేశపు
చెడుగులతో దేశమెల్ల శ్రీకరమయ్యెన్|
నడవడికను సరి నేర్చిన
రిప్లయితొలగించండిబుడుగుల తో దేశమెల్ల బుద్ధిని వొందన్
దడ దడ మూలము ద్రుంచిన
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండికడకున్ చెఱలవి నిండెను
చెడుగులతో, దేశమెల్ల శ్రీకర మయ్యెన్
కడగండ్లు తీరె ప్రజలకు
మడిచేనులు పంటసిరులు మనకిక కలుగున్
చెడుగుల నడవడి మార్చితి
రిప్లయితొలగించండిచెడుగులె దుర్జనుల బ్రతుకు చెల్లగ చేసెన్.
చెడుగులె సజ్జన వరులయె.
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్
పై పద్యం చూచి అతిశయోక్తి అనుకోకండి. నేను కళాశాలలో ఉపన్యాసకునిగా పని చేస్తున్న రోజులలో చెడుగుల మనసు మార్చి మంచి ప్రవర్తన కలవారిగా చేయ గలిగాను. అది గుర్తుకు వచ్చి పై పద్యం వ్రాసాను.
రిప్లయితొలగించండిచెడుపై సమరమునకు దిగి
రిప్లయితొలగించండికడుకొని కవి శంఖమూది కవితల నల్లన్
కడు చైతన్యము నొందిన
చెడుగుల తో దేశమెల్ల శ్రీకర మయ్యెన్
నామూడవపూరణ చివరిపాదమునందు
రిప్లయితొలగించండిచెడుబుద్ధులను+అడచినంత .
బడుగుల నిడుముల బాపెడు
రిప్లయితొలగించండినుడువులు నుడువుచు ముడుపుల నొక్కే బడవల్
వెడలగ చెఱసాలకు కడు
చెడుగులతో,దేశమెల్ల శ్రీకర మయ్యెన్!!!
పిడికెడు భక్తితొ మనమున
రిప్లయితొలగించండికడు మోదము భవుని గొలిచిన తోడన్ !
విడివడి మైకము మలిగిన
చెడుగులతో దేశ మెల్ల శ్రీకర మయ్యెన్ !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఒక సిద్ధుని బోధనా ఫలితం :
01)
___________________________________
చెడుగును విడుడని నుడివిన
చెడుగును విడి చెడుగులంత - చిడిముడి పడకన్
చడకములై చెడు చెండిన
చెడుగులతో దేశమెల్ల - శ్రీకర మయ్యెన్ !
___________________________________
చెడుగు = క్రూరత్వము , దుష్టత్వము
చెడుగు = దుష్టురాలు
చిడిముడి = తడబాటు
చడకము = పిడుగు
చెండు = ఖండించు
(ఇదొక పగటి కల మాత్రమే!నిజమైనా అవ్వొచ్చు
నారీలోకం రణభేరి మ్రోగించాలే గాని !)
అడుగడుగున డాలరులని
రిప్లయితొలగించండికడివెడు కలలందు కాంతలు కులుకన్ !
కడకడ బ్రమలె తొలగిన
చెడుగులతో దేశ మెల్ల శ్రీకర మయ్యెన్ !
ఎడ మింత లేక దురితము
రిప్లయితొలగించండిలుడుగకఁ జేయంగ హితమితోక్తుల నీతుల్
నుడివిరి పెద్దలు; మారిన
చెడుగులతో దేశ మెల్ల శ్రీకర మయ్యెన్.
సడలని సత్యాహింసల
రిప్లయితొలగించండిగడియించెను స్వేచ్ఛ మనకు గాంధీ, సుజనుల్
తడయక నెంచెడి మంచియు
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్.
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
ప్రశస్తంగా ఉంది మీ మొదటి పూరణ.
చక్కని విరుపుతో మీ రెండవ పూరణ బాగుంది.
మీ మూడవ పూరణ కూడా చక్కగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నది. బాగుంది. అభినందనలు.
‘నడిచొచ్చిన’ ప్రయోగమే గ్రాంధికం కాదు. అక్కడ ‘నడతెంచిన’ అందాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మంచి విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
స్వానుభవంతో చెప్పిన పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘నొక్కే’ను ‘నొక్కెడి’ అందాం. ఇంతకీ ‘భడవ’ గ్రాంధికమేనా?
*
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
మొదటి పాదంలో ‘తొ’ ప్రయోగం, రెండవ పాదంలో గణదోశం. నా సవరణ ...
‘పిడికెడు భక్తిని మనమున
కడు మోదముతోడ భవుని గొలిచిన తోడన్ !’
మీ రెండవ పూరణ కూడా బాగుంది.
రెండవ పాదంలో గణదోషం.
‘కడివెడు కలలందు మునిగి కాంతలు కులుకన్’ అందాం.
*
వసంత కిశోర్ గారూ,
ఈసారి మీరు ‘మిస్’ కాలేదు :-)
వృత్యనుప్రాసతో అలరిస్తున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మంచి చెడుగు పడుగుపేకల్లా ఉన్నా మనదేశం ముందుకు సాగుతున్నది. చక్కని పూరణ. అభినందనలు.
అడుగడుగున యిడుములనిడి
రిప్లయితొలగించండివెడు కడుదుడుకులు బడివిడి బిడియములుడుగన్
నడవడిచెడి గడబిడ నిడు
చెడుగులతో దేశమెల్ల శ్రీకరమయ్యెన్
నిరంజన్ కుమార్ గారూ,
రిప్లయితొలగించండిపోతన గారి ‘అడిగెదనని కడువడిఁ జను’ పద్యాన్ని గుర్తుకు తెచ్చారు. చంద్రశేఖర్ గారి పద్యమే అనుకుంటే దానిని మించిన అనుప్రాసను ప్రయోగించి మెప్పించారు. అద్భుతమైన పద్యం. అభినందనలు.
"బడవ" శుద్ధ వ్యవహారికం కేవలం అనుప్రాస కొరకు వాడాను . "నొక్కుచు నధముల్" అంటే సరిపోతుందను కొంటాను
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండివడిగా నోటులు రద్దై
రిప్లయితొలగించండిపడిగాపులు కాసి బేంకు బారులు దీరన్
సడలించగ నల్ల ధనము
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్
* పడిగాపై బేంకు వద్ద బారులు దీరన్
తొలగించండిపొడుముల బీల్చుట ఘనముగ
రిప్లయితొలగించండిపొడుగగు బీడీల వోలు పోకడ లెల్లన్
వడిగా తొలగింపబడిన
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్