ప్రహేళిక
చతుర్థజః పంచమగః
దృష్ట్వా ప్రథమసంభవాన్ |
తృతీయం తత్ర నిక్షిప్య
ద్వితీయ మతరత్ పునః ||
దీని అనువాదమైన తెలుగు చాటు వొకటి ఉంది....
అంచిత చతుర్థజాతుఁడు
పంచమమార్గమున నేఁగి ప్రథమతనూజన్ (ప్రథముని పట్టిన్)
గాంచి తృతీయం బచ్చట
నుంచి ద్వితీయంబు దాఁటి యొప్పుగ వచ్చెన్.
వివరణ -
ఈ ప్రహేళికలో పంచభూతాల సంఖ్యాక్రమంలో సుందరకాండార్థం సూచింపబడింది.
పంచభూతాల సంఖ్యాక్రమం -
1. పృథివి, 2. నీరు, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశం.
అర్థం -
చతుర్థజః (చతుర్థజాతుఁడు) = నాల్గవభూతమైన వాయువు యొక్క కుమారుడైన హనుమంతుడు
పంచమగః (పంచమమార్గమున నేగి) = ఐదవభూతమైన ఆకాశపు మార్గంలో వెళ్ళి
ప్రథమసంభవాన్ దృష్ట్వా (ప్రథమతనూజన్ గాంచి) = మొదటిభూతమైన భూమి కుమార్తె సీతను చూచి
తత్ర (అచ్చట) = ఆ లంకలో
తృతీయం నిక్షిప్య (తృతీయంబు నుంచి) = మూడవభూతమైన అగ్నిని ఉంచి
పునః = మళ్ళీ
ద్వితీయ మతరత్ (ద్వితీయంబు దాటి) = రెండవభూతమైన నీటిని (సముద్రాన్ని) దాటి
ఒప్పుగ వచ్చెన్.
ఇటువంటిదే తెలుగులో మరో పద్యం ఉంది....
ప్రథముని పట్టికై చలము పట్టి, చతుర్థుని పట్టి చెట్టబ
ట్టి, ధృతి దలిర్ప (మించిన) ద్వితీయుని గట్టిగ గట్టిపెట్టి, యా
ప్రథనమునన్ తృతీయు బలుబాసటచే నరి గొట్టినట్టి యా
యధిపుఁడు పంచమున్ గడచు నచ్చపు గీర్తిని మీ కొసంగుతన్.
భావం -
సీతకోసం పట్టుబట్టి వాయుకుమారుని కూడి సముద్రాన్ని బంధించి యుద్ధంలో ఆగ్నేయాస్త్రంతో శత్రువైన రావణుని సంహరించిన రాముడు ఆకాశాన్ని మించే కీర్తిని మీ కిచ్చుగాక!

చిత్త శుధ్ధి గ జేసెద సేవ నీ కు
రిప్లయితొలగించండిముక్తి కోసము నెప్పుడు మ్రొక్క నిన్ను
పారమార్ధికమునకు నే బాటు పడుదు
నా మనంబున నుండుమా రామ భక్త
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
‘కోసము నెప్పుడు’ ... ‘కోసమై యెప్పుడు’ అయితే ...?
శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు .
రిప్లయితొలగించండిసవర ణ బాగున్నది .కృ తజ్ఞు డను
సవరిం చు కొందును .