23, జనవరి 2012, సోమవారం

ప్రహేళిక - 51

నామగోపన పద్యం

తే.గీ.
"కంజదళనేత్ర! మాధవ! కంసభేది!
శంఖచక్రగదాధర! సాధులోక
రక్షకా! చేతు నీదు ప్రార్థనము లయ్య!"
యనిన గుప్తనామం బేదొ యరయుఁ డిపుడు.


పై పద్యంలో దాగిన పేరేదో చెప్పండి.

7 కామెంట్‌లు:

  1. ప్రతి పాదంలోని మొదటి చివరి అక్షరాలను కలిపి చదివితే ఆ గుప్త నామమేమిటో తెలిసి పోతుంది "కందిశంకరయ్య"గారూ!

    రిప్లయితొలగించండి
  2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    అభినందనలు.
    ఇంక మిగిలినవారికి చెప్పడానికి ఏం మిగిలింది?

    రిప్లయితొలగించండి
  3. కవివర చెప్పెద వినుమా
    వివరముగా గుప్త నామ విధమును చూడన్
    కవి కంది శంకరార్యులు
    శివ నాగాభరణ బ్లాగు సృష్టికి కర్తౌ.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ మాధవునిలో శంకరుని చమత్కారముగా దాచారు. దాగుడుమూత లాడినా శ్రీ కోడేహళ్ళి మురళీమోహన్ గారికి దొరికి పోయారె !

    రిప్లయితొలగించండి