ప్రహేళిక
రామం వానరవాహినీం పురరిపుం రాహుం రవేస్సారథిం
కుంభీగర్భసముద్భవం మురరిపుం మారస్య మౌర్వీరవమ్ |
తన్వీ నూతనపల్లవై ర్విరచితే శయ్యాతలే శాయినీ
సఖ్యా వీజితతాలవృంతపవనా బాలా ముహు ర్నిందతి ||
భావం
క్రొత్త చిగురుటాకులతో చేసిన శయ్యపై పడుకుని, చెలికత్తెచేత విసనకఱ్ఱచేత వీచబడుతున్న లేబ్రాయపు నాయిక ప్రియుని విరహంతో కృశించి రాముణ్ణి, వానరసైన్యాన్ని, శివుణ్ణి, రాహువును, సూర్యుని సారథిని, అగస్త్యుణ్ణి, విష్ణువును, మన్మథుని వింటి శబ్దాన్ని మాటిమాటికి నిందించింది.
ఎందుకో తెల్పండి ...
క్లూ ...
(చమత్కార పద్యాలు - 176/A చూడండి.)
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"పూత మెఱుంగులుం బసరూపున బెడంగులుఁ జూపునట్టి వా కైతలు? జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మన గమ్మ నన్వలెన్
రిప్లయితొలగించండి...... మనోహర ద్యోతక గోస్తనీఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసాదాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్".
విజ్ఞులు నాకు సందేశం పంపగలరు... adiraju.subbarao38@gmail.com
ఇది సరి అయిన వేదిక కాకపొయినా... పెద్దలు అంతా చూస్తారని రాస్తున్నాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ పద్యానికి అర్ధం తాత్పర్యం చెప్పగలందులకు ప్రార్ధిస్తూ... ఆదిరాజు.
రిప్లయితొలగించండిఆదిరాజు వారూ,
రిప్లయితొలగించండిఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కాకుంటే కొంత కాలం నిరీక్షించవలసి ఉంది.
ధన్యవాదాలు.
ఓసోస్ ఇది అర్థం గాలే?
రిప్లయితొలగించండిఆ పజ్జాన్ని పైనించి కింద దాకా ఓ పాలి సదివి సూడండి.
కైతలు (కవిత/పద్యం)అంటే పూత మెరుంగులున్ బసరు పూప బెడంగులు జూపు నట్టివా??? (అన్వయం - కాదు!)
తెలుగు పజ్యం ఎలాగుండాలంటే, అలా, ఇలా, ఇంకోలా, వేరేలా, జేతి కొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే ల్పూతల చన్ను దోయి వలె ముచ్చట కావలె బట్టి చూచినన్!
ఇంకా ఎట్టాగుండాలంటే...డా తొడ నున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనౌ వాతెర దొండ పండు వలె వాచవి గావలె బంట నూదినన్!
అట్టాగన్నమాట!
ఈవిడెట్టిందిక్కడ సూసుకోండి
రిప్లయితొలగించండిhttp://jyothivalaboju.blogspot.com/2012/01/blog-post_19.html
unknown గారు పేర్కొన్న సుదీర్ఘ సంస్కృ దాంధ్ర పద భూయిష్టమైన ఉత్పలమాలను ""పూత మెఱుంగులుం బసరూపున బెడంగులుఁ జూపునట్టి వా కైతలు? జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మన గమ్మ నన్వలెన్
రిప్లయితొలగించండి...... మనోహర ద్యోతక గోస్తనీఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసాదాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్".
http://www.andhranatakam.com/Audios.html లో పూర్తీ పద్యాన్ని "భువన విజయం అల్లసాని పెద్దన " టైటిల్ లో
విని రసానుభూతిని పొంద వచ్చును దీని CD ని అందులో సూచించిన ప్రకారం Dr మీగడ రామ లింగస్వామి గారి నుండి పొందవచ్చునని తెలిపినారు
మహామహులెందరో పాడిన, అందరు వినదగ్గ పద్య రాత్నాలెన్నో అందులో ఉన్నాయి .
పీతాంబర్ గారు ఈ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా టపాలో జత చేరుస్తున్నాను..
రిప్లయితొలగించండిశంకరయ్యగారు మీరు చెప్పే అర్ధ తాత్పర్యాలకోసం వెయిటింగ్..