6, జనవరి 2012, శుక్రవారం

చమత్కార పద్యాలు - 168

ప్రహేళిక


న పక్షీ విహగశ్చైవ
ద్రుతగామీ న మారుతః |
న ఘనో ఘనవాహీ చ
న ముఖీ ముఖర స్స కః ||


ఆకసమునఁ దిరుగు, నది పక్షియా? కాదు;
గతియొ తీవ్రతరము, గాలి కాదు;
మేఘ మదియు గాదు మేఘవాహుఁడు గాడు
నోరు లేదు చేయు ఘోరరవము.


సమాధానం - విమానం.

5 కామెంట్‌లు:

  1. శంకరార్యా !
    ప్రహేళికతో పాటూ
    సమాధానం కూడా మీరే యిచ్చేస్తే
    ఆనందించడం తప్ప - ఆలోచించే పనేముంది !

    రిప్లయితొలగించండి
  2. కిశోర్ జీ గురువు గారు మనకు సాయము చేస్తున్నారు. తప్పా ?

    నా సమధానము ; విమానము.

    రిప్లయితొలగించండి
  3. అవునూ కదా ! నాకు మాత్రం వేరే సమాధానం ఏముంటుంది ?

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    ఈ ప్రహేళిక మరీ సులభంగా ఉంది. అందరూ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పగలరు. గతంలో కూడా ఒకటి రెండు సులభమైన ప్రహేళికలను సమాధానాలతో ప్రకటించాను.
    మిత్రులను ఆలోచింప జేసేవీ, కఠినమైనవీ అయిన ప్రహేళికల సమాధానాలు అడుగుతున్నాను.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ............ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి