26, జనవరి 2012, గురువారం

సమస్యాపూరణం - 603 (గణతంత్ర మ్మనెడు మాట)

కవిమిత్రులారా,

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

24 కామెంట్‌లు:

  1. రణమున దెచ్చిన స్వేచ్చయె
    గణ నాయకులకు మిగులగ కలుముల నిచ్చెన్
    గుణవంతులు తిన శూన్యము
    గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

    రిప్లయితొలగించండి
  2. రణ తంత్రమ్ములు పెరిగెను -
    గణనీయముగ నవినీతి, ’స్కాము’లు పెరిగెన్ -
    ఋణ తంత్రమ్ములె మిగిలెను -
    గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్!

    రిప్లయితొలగించండి
  3. తృణభుక్కులు, స్వార్ధపరులు,
    గుణహీనులు నేతలగుట గుండియలోనే
    వ్రణమయ్యె భరతమాతకు
    గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  4. గణ నాయకు లంత కలసి
    రణ రంగమ్ము లనడుమ రగులుచు నుండన్ !
    గణ నీయముగ మ్రింగుచు
    గణ తం త్రమ్మనెడి మాట కల్లగ మిగిలెన్ !

    రిప్లయితొలగించండి
  5. ప్రణతి ప్రణతి శ్రీ భారత
    గణ తంత్రమ! నీకు నేడు కరములు మోడ్తున్
    ఘనమెరుగని యల్పులకీ
    గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  6. గణనీయుల త్యాగములన్
    గుణహీనులు ప్రభువు లయ్యి కొల్లగొనంగన్
    సణుగులె దక్కెను జనులకు
    గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  7. మణిపూసలయిన భారతి
    గుణపూర్ణులగు కొమరుండ్రు గొప్పగ నాడా
    రణమున గెల్చియును నదే
    గణతంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

    కొమరుడు కు బహువచనము కొమరుండ్రు అవుతుందని అనుకుంటున్నాను.
    తప్పైతే తెలుపగలరు.
    మూర్తిగారు, మీ రెండవ పూరణ రెండవపాదము కొంచెము పరిశీలించగలరు.

    రిప్లయితొలగించండి
  8. రణములు సేసిరి పెద్దలు
    గణ తంత్రము దెచ్చు కొఱకు గణ నీ యముగా
    గుణ హీన నేత లుండుట
    గణ తంత్రమ్మ నెడు మాట కల్లగ నిలిచెన్ .

    రిప్లయితొలగించండి
  9. మందాకిని గారూ ధన్యవాదములు. మీ పూరణ చాలా బాగుంది. పద్యము వ్రాసి మార్పు చేయడములో యతి దెబ్బ తింది పాపం. సవరించాను

    గుణ కర్మ విభాగమ్ముల
    గణించెదరు కులము మతము గడుసరు లిపుడున్
    పణముల నిడి కొన పదవులు !
    గణ తంత్రమ్మనెడు మాట కల్లగ మిగిలెన్ !!

    రిప్లయితొలగించండి
  10. డి.నిరంజన్ కుమార్గురువారం, జనవరి 26, 2012 10:50:00 AM

    గుణహీనుల నేతృత్వం
    బణగార్చగ దేశప్రజల ఆశలసౌధం
    బణువణువున దోపిడియై
    గణతంత్రమ్మనెడి మాట కల్లగ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  11. ఫణముగజేసిరి ప్రాణము
    లణగారినధైర్యసాహసావేశంబుల్
    ఝణఝణమని పొంగగ "ని
    ర్గణతంత్ర"మ్మనెడుమాట కల్లగ మిగిలెన్.

    రిప్లయితొలగించండి
  12. అణగారు ప్రజలు వోట్లను
    గుణహీనుల కమ్ముదు రిట కూటికి బరువై
    గణపతు లయ్యిరి ఖలులే
    గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

    రిప్లయితొలగించండి
  13. డి.నిరంజన్ కుమార్గురువారం, జనవరి 26, 2012 3:15:00 PM

    గణతంత్ర శుభాకాంక్షలు
    వ్రణముననిడు కారమువలె బాధను బెంచెన్
    గుణహీన నేతల వలన
    గణతంత్రమ్మనుమాట కల్లగ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిగురువారం, జనవరి 26, 2012 3:31:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    గుణవంతుల పోరాటము
    గణతంత్రపు ఫలము కూర్చి గౌరవమొసగెన్
    గుణహీనుల యవినీతితొ
    గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మగురువారం, జనవరి 26, 2012 4:07:00 PM

    గణముల నేతగ గజముఖు
    ప్రణవాకారుండు గిరిజ ప్రకటింపంగన్
    సణుగుతు షణ్ముఖుడనుకొనె
    గణతంత్రం బనెడుమాట కల్లగ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    మీ పద్యములో 2వ పాదములో ర్గుణ కి కృత తో యతి వేసారు. ఇది మైత్రి కుదురదు. సవరించండి.

    రిప్లయితొలగించండి
  17. నేమాని పండితార్యా సూచనకు ధన్యవాదాలు.
    ఋ, రు లకు యతి వేయవచ్చుననుకొని పొరబడ్డాను.
    ఇలా సవరించాను.

    రణ తంత్రము కౌరవ దు-
    ర్గుణయంత్రము దుష్ట కర్ణ కుటిలాంగమ్ము-
    న్నణచును కౌంతేయుల కురు-
    గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

    రిప్లయితొలగించండి
  18. సరసమైన పూరణ లిచ్చిన
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు (‘నడుమను, గణనీయమ్ముగ’ అంటే గణదోషం తొలగుతుంది).
    లక్కాకుల వెంకట రాజారావు గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    మందాకిని గారికి,
    సుబ్బారావు గారికి,
    డి. నిరంజన్ కుమార్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    హరి గారికి (బహుకాల దర్శనం!),
    శ్రీపతి శాస్త్రి గారికి,
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
    మిస్సన్న గారికి,
    అభినందనలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఎముకల కాశ పడి , శునకాల నెన్నుకుంటే జరిగేదదే గదా !

    01)
    ____________________________

    కనకపు సింహాసనమున
    శునకము నెక్కించ దగునె ? - శుభములు గలుగున్ ?
    తన తప్పు గాదు , గావున
    గణతంత్ర మ్మనెడు మాట - కల్లగ మిగిలెన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  20. వసంత కిశోర్ గారూ,
    పేరడీ వంటి చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గుణహీనులు నాయకులై
    గణనమె లక్ష్యముగ దేశ కళ్యాణమ్మున్
    బణముగ బెట్టిరి ,అకటా!
    గణతంత్రమ్మనెడిమాట కల్లగ మిగిలెన్ .
    ------------

    రిప్లయితొలగించండి