2, జనవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 578 (పండితులను దిట్టువారు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
పండితులను దిట్టువారు  పావనచరితుల్.
ఈ సమస్యను సూచించిన
శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. గండమె సాహిత్యమ్మన
    మండి పడును కవితలన్న మాన్యత లేకన్
    దండించ నెంచు దుష్టుడు
    పండితులను, దిట్టు, వారు పావనచరితుల్.

    రిప్లయితొలగించండి
  2. ముండనము జేయ నర్హులు
    పండితులను దిట్టు వారు ,పావన చరితుల్
    దండిగ పూజలు సేయగ
    దండములుం దప్ప నింక దారియు గలదే !

    రిప్లయితొలగించండి
  3. అమృ త పాన మ్ము మరణంబు నంద జేసె
    -----------
    రాహు కేతుల బ్రతికించె రయము గాను
    అమృత పానమ్ము ,మరణంబు నంద జేసె
    త్రాగు బోతుని నడి రోడ్డు దారి లోన
    మద్య పానం బు నేరికి మంచి గాదు

    రిప్లయితొలగించండి
  4. దండమయా విశ్వంభర
    దండమయా పద్మనాభ దండమ్మనుచున్
    దండమిడి హరికి నాస్తిక
    పండితులను దిట్టువారు పావనచరితుల్.

    రిప్లయితొలగించండి
  5. మెండుగ దండుచు ధనముల,
    దండిగ రచనల సలుపుచు, ధర్మము లన్నన్
    దండుగ యంచును బల్కెడి
    పండితులను దిట్టువారు పావనచరితుల్.

    రిప్లయితొలగించండి
  6. పండితుల గౌరవిన్చుచు
    దండము లిడుచుంద్రు వారు, దర్పము తోడన్
    మండిపడు చుండి వీరలు
    పండితులను దిట్టు, వారు పావనచరితుల్.

    రిప్లయితొలగించండి
  7. గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ పండితనేమానిగారికి, శ్రీ శ్యామలీయంగారికి, శ్రీ లక్కాకుల రాజారావుగారికి మరియు సాటి కవిమిత్రులకు నాయొక్క హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    తలచు శుభకార్యములకెల్ల దారిచూపి
    జీవితాశయములకుసంజీవినగుచు
    సకల సౌభాగ్య కారణ శక్తి యగుచు
    నూత్న సంవత్సరంబు సంతోషమిచ్చు.

    రిప్లయితొలగించండి
  8. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, జనవరి 02, 2012 10:40:00 AM

    మండిత సర్వజ్ఞుల వలె
    దండి భ్రమల నెదుటి వారి తప్పులు వెదికే
    చండాలపు రోగము గల
    పండితులను దిట్టు వారు పావన చరితుల్

    రిప్లయితొలగించండి
  9. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, జనవరి 02, 2012 10:50:00 AM

    శ్రీ సంపత్కుమార శాస్త్రి గారికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  10. పండితులను దిట్టు వారు పావన చరి-
    తులన రాదు వారు తులువ లెన్న
    దండనార్హు లట్టి తామస గుణులను-
    పేక్ష సేయ దగదు శిక్ష సబబు.

    రిప్లయితొలగించండి
  11. మొండివారు, శాస్త్రవాక్యములను గౌరవింపరే
    పండితులను దిట్టువారు; పావనచరితుల్ గదా
    పుండరీకనయను విష్ణువున్ స్తుతించువార లు
    ద్దండ కష్టముక్తులై సదా సుఖింతు రీభువిన్.

    రిప్లయితొలగించండి
  12. ఖండించుచు సత్కృతులను
    దండుగ సిద్ధాంతములను ధర్మము లనుచున్
    దండిగ వాగెడు కుహనా
    పండితులను దిట్టువారు పావనచరితుల్.

    రిప్లయితొలగించండి
  13. ఈనాటి సమస్యకు సంబంధము లేనిదే ఈ నా పద్యము.

    పాండితి భగవద్దత్తము
    పండితులను సత్కరింపవలె నెల్లెడలన్
    పండువె యగు నిత్యము బుధ
    మండలి పరితోషమొంద మహి రంజిల్లున్

    రిప్లయితొలగించండి
  14. పండితులగుటయె వరము
    పండితులను గౌరవించు! భారత వాసీ!
    పండిత వర్యుల దీవన
    పండించును జీవనమ్ము ఫలితము దక్కున్.

    రిప్లయితొలగించండి
  15. పండిత లోకపు నిందగు
    పండితులను దిట్టు వారు పావన చరితుల్
    ఖండించ వలయు నందరు
    పండితులను గౌర వించ పాలకు లేనౌ

    రిప్లయితొలగించండి
  16. పండితులము మేమనుచును
    దండిగ డంబములు పలికి తనరెడు వారిన్ !
    మెండుగ కొండెడి వారగు
    పండితులను దిట్టువారు పావన చరితుల్ !

    రిప్లయితొలగించండి
  17. మొండిగ తెలిసిన యటులవి
    తండపు వాదన లతో కుతర్కము సభలన్
    దండిగ జేసెడి కుహనా
    పండితులను దిట్టు వారు పావన చరితుల్.
    ------------

    రిప్లయితొలగించండి
  18. మిస్సన్న గారూ,
    మీ నాలుగు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    ముఖ్యంగా నాలుగవ పూరణ ... కందపాదాన్ని ఆటవెలదిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.
    *
    సుబ్బారావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘నిందగు, పాలకులేనౌ’ శబ్దాల ప్రయోగం సందేహాస్పదం.
    ‘అమృతపానమ్ము ...’ సమస్య పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ఈ పూరణ చదివి ఉంటే నేను నా పూరణ చేయకుండా ఉండేవాణ్ణి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    ‘సంజీవినగుచు’ను ‘సంజీవని యయి’ అంటే మేలు!
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వెదికే’ అనే వ్యావహారికాన్ని ‘వెదుకన్’ అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    సమస్యకు సంబంధం లేనిదంటూనే సమస్యను విశ్లేషించే పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. ‘కమనీయం’ గారూ,
    మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గురువు గారూ ధన్యవాదాలు.
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  21. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, జనవరి 02, 2012 11:12:00 PM

    మండూక నేస్తములు మా
    పండితులను దిట్టు వారు , పావన చరితుల్
    పండితులు , పూని ప్రజలను
    దండిగ చైతన్య పరచు ధన్యులు పుడమిన్

    పండించు కష్ట జీవుల
    యెండిన డొక్కలను గూర్చిహృదయము పగులన్
    దండిగ నేడ్వని దండుగ
    పండితులను దిట్టు వారు పావన చరితుల్

    రిప్లయితొలగించండి
  22. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, జనవరి 03, 2012 12:02:00 AM

    'వెదికే' వాడుక పదమని
    'వెదుకన్ 'గా మార్చుకొనిరి వేల నమస్సుల్
    పొదుగు గల పాడి యావులు
    పదపడి వాడుకను గల్గు పదములు తెలియన్

    రిప్లయితొలగించండి
  23. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ తాజా పూరణలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    అదె పనిగా దోషమ్ముల
    వెదకుటె యలవాటు నాకు; విజ్ఞుల మనముల్
    పదపడి నొప్పించిన న
    న్నిదె మన్నింపంగ విన్నవించెద నయ్యా!

    రిప్లయితొలగించండి
  24. దండిగ పాండిత్యముతో
    మొండిగ భారత పురాణ ముల మౌధ్యముతో
    ఖండన రచనలు జేసెడి
    పండితులను దిట్టు వారు పావన చరితుల్

    రిప్లయితొలగించండి
  25. కొండొక నాంగ్ల పదమ్మును
    మెండుగ నప్పెడిది నైన
    మ్లేచ్ఛమ్మనుచున్
    దండిగ దూషించు తెలుగు
    పండితులను దిట్టువారు పావనచరితుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. * కొండొక యాంగ్లపదమ్మును
      మెండుగ నప్పెడునదైన మ్లేఛమ్మనుచున్

      తొలగించండి
    2. దండిగ పలుకుచు నీతులు
      గుండున పిలకలను గూర్చి గుట్టుగ గుడిసెన్
      ముండల కడకున్ జేరెడి
      పండితులను దిట్టువారు పావనచరితుల్

      తొలగించండి