27, జనవరి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 604 (దైవ మనెడి పదము)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
దైవ మనెడి పదము తద్భవమ్ము.

34 కామెంట్‌లు:

  1. దైవమనెడి పదము తద్భవమ్మని జెప్పె
    నొక్క గురువు తప్పొ ఒప్పొ గాని
    ఆత్మ తత్తు గాన నాత్మభవమ్ముగా
    అలరు గాదె దైవ మార్యులార!

    రిప్లయితొలగించండి
  2. సంస్కృతమ్ముయిచ్చె చక్కగ తెనుగుకు
    దైవమనెడి పదము, తద్భవమ్ము
    మరియు తత్సమముల; మనభాష ముద్దుల
    తనయ , దైవభాష తల్లి తనకు.

    రిప్లయితొలగించండి
  3. దైవ మనెడి వాని దైన్యము దీరగ
    పదము లంటి కొల్తు భక్తి తోడ
    దైవ మనెడి పదము తద్భవమ్మో మరి
    తత్సమమ్ము యనెడి తలపు లేల?.

    రిప్లయితొలగించండి
  4. ఆంధ్రభాషయందు నరయ తత్సమమైన
    దైవ మనెడి పదము తద్భవమ్ముఁ
    జెప్ప దయ్య మయ్యె; చిత్రమే! దైవమ్ము
    దయ్య మనిన లోక మియ్యకొనదు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జనవరి 27, 2012 8:51:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    దివిన నుండువారు దేవతా మూర్తులు
    అమృత రసము గ్రోలి యమరులైరి
    దివ్యశక్తియుతులు తేజోధనులు వారు
    దైవ మనెడి పదము తద్భవమ్ము

    రిప్లయితొలగించండి
  6. ఆస్తికులకుమదినయలరారుచుండునీ
    దైవమనెడు పదము, తద్భవమ్ము
    లైన స్త్రోత్ర పఠన గానాదులను జేసి
    ముక్తినొందగోరు భక్తుడెపుడు.

    రిప్లయితొలగించండి
  7. ఆ పరాత్పరు పరమాత్మ తత్వపు సూచి
    దైవ మనెడి పదము,తద్భవమ్ము
    గాదు దయ్యము,భయ కల్పితమ్మయి పుట్టి
    మనిషి తలను దూరి మతిని జెరచు

    రిప్లయితొలగించండి
  8. హరిగ వేచియుండె నన్నింట దైవమున్
    పిలువ నుద్భవింప వెంటనేను
    స్థంభమున గన పడె దానవుం డడుగ కాన్
    దైవ మనెడి పదము తద్భవమ్ము

    ఇది వితండవాద మయితే క్షమించండి !

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యుల పూరణ స్పూర్తి తో....

    ప్రకృతి దైవ మగును వికృతియె దయ్యమ్ము
    ప్రకృతి జూడ పరమ భక్తి గలుగు
    వికృతి యనిన మెదలు వికృతమ్మగు రూపు
    దైవ మనెడి పదము తద్భవమ్ము.

    రిప్లయితొలగించండి
  10. తత్సమమ్మునకును తద్భవమ్మునకును
    భేద మెరుగ లేని వెర్రినాయె
    దైవ మనెడి పదము తద్భ వమ్మో కాదొ
    తెలియు టెటులొ నాకు తెలుపరయ్య.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము 3వ పాదములో వికృత అంటే ఇంద్రగణము కాదు. ఒక మారు చూచి సరిజేసుకొనండి.

    తమ్ముడు డా. నరసింహమూర్తి పద్యములో భావము బాగున్నది కాని పద్యము అంతగా బాగులేదు. మరో ప్రయత్నము చెయ్యాలి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీమతి మందాకిని గారి పద్యము తొలి పాదము బాగుగ రాలేదు. యిచ్చె యని యడాగమ సంధి రాదు, అలాగే తెనుగుకు అనకూడదు, తెనుగునకు అనాలి. అందుచేత ఈ విధముగ మార్చితే బాగుంటుంది:
    "దేవ భాష యిచ్చె తెనుగున కిమ్ముగా"

    రిప్లయితొలగించండి
  13. డి.నిరంజన్ కుమార్శుక్రవారం, జనవరి 27, 2012 10:54:00 AM

    తద్భవంబె కాని తత్సమంబెకాని
    తర్కమేలమనకు. తరచి చూడ
    దైవమవతరించు దయ్యమై మనముందు
    దైవమనెడి పదము తత్భవంబు

    రిప్లయితొలగించండి
  14. మంచి సవరణ యిచ్చిన పండితులవారికి ధన్యవాదాలు.
    మీ సవరణతో నాపద్యము.

    దేవ భాష యిచ్చె తెనుగున కిమ్ముగా
    దైవమనెడి పదము, తద్భవమ్ము
    మరియు తత్సమముల; మనభాష ముద్దుల
    తనయ , దైవభాష తల్లి తనకు.

    నా మరొక పూరణ

    తెనుగునకును తల్లి దేవభాషయగును.
    దైవమనెడి పదము- తద్భవమ్ము
    కాదు తత్సమమది, కమ్మనైన తెనుగు
    కోరిచేర్చుకొనియె, గొప్పదయ్యె.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. దైవ మనెడి పదము తద్భవ మ్ము కాదయ
    నరయ జూడ సంది యంబు వలదు
    ప్రకృతి వికృతి యనియు పర్యా య పదములు
    తత్స మంబు మఱియు తద్భ వంబు

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,
    దైవం ‘తత్’ భవమన్న తత్త్వాన్ని వివరిస్తున్న మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    నేమాని వారి సవరణలను గమనించారు కదా!
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో ‘తత్సమమ్ము + అనెడి’ అన్నప్పుడు యడాగమం వేసారు. దానిని ‘తత్సమ మ్మనియెడి’ అంటే సరి.
    మీ రెండవ పూరణకూడా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘దివిన’ అనేది ‘దివిన’ అనాలనుకుంటా.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. ‘వితండవాదం’ ఏమీ లేదు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీరు మమ్మల్నే వెఱ్ఱివాళ్ళను చేయగల నైపుణ్యం గలవారు. చక్కని పూరణ. అభినందనలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ చమత్కార జనకంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మొదటి పాదం చివర గణదోషం. ‘తద్భవమ్మే కాదు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  18. గురువు గారికి అన్నయ్య గారికి నమస్సులు. గురువు గారూ ధన్యవాదములు, కాని అన్నయ్య గారు మరో ప్రయత్నము చేయ మన్నారు కదా ! జై హనుమా !

    తియ్య నైన మాట దీర్చు వ్యధల నెల్ల
    దైవ మనెడి పదము , తద్భవమ్ము
    దయ్య మనగ భయము దరి దాపునకు రాదు
    ననుగు హనుమఁ దలచ మనము నందు !!

    రిప్లయితొలగించండి
  19. నా మొదటి పూరణకు సవరణ ;

    హరిగ వేచియుండె నన్నింట దైవమున్
    పిలువ నుద్భవింప ; నులుకు పడుచు
    స్థంభ మందు గనియె దానవుం డందుచే
    దైవ మనెడి పదము తద్భవమ్ము !

    హరి = సింహము

    రిప్లయితొలగించండి
  20. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండవ పూరణ చాలా బాగుంది.
    సవరించిన మీ మొదటి పూరణ ఉత్కృష్టంగా ఉంది.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. నన్ను గావు మయ్య నాపాలి దైవమై

    భక్తి మీర గొలువ ముక్తి నియగ

    శరణు వేడు కొనిన కరినేల కరుణించె

    దైవ మనెడి పదము తద్భ వమ్ము !

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా ! నేమాని వారూ ! ధన్యవాదములు.
    మీ మీ సవరణ మరియు సూచనలతో ....

    దైవ మనెడి వాని దైన్యమ్ము దీరగ
    పదము లంటి కొల్తు భక్తి తోడ
    దైవ మనెడి పదము తద్భవమ్మో మరి
    తత్సమమ్మనియెడి తలపు లేల?

    ప్రకృతి దైవ మగును వికృతియె దయ్యమ్ము
    ప్రకృతి జూడ పరమ భక్తి గలుగు
    వికృతి యనిన మెదలు వికృతమ్మగు తలపు
    దైవ మనెడి పదము తద్భవమ్ము.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారూ ధన్యవాదాలు.
    నాకంతకన్న దారేదీ కనుపించ లేదు.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందరూ అద్భుతమైన పూరణ లిచ్చారు.
    అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. గురువు గారూ ధన్యవాదములు. మిస్సన్న గారు చెప్పి నట్లు మిత్రులందఱి పూరణలు అలరారుతున్నాయి.
    ఇంతకీ ఆంగ్లేయుల 'దట్ 'తత్సమమా ? తత్భవమా ? ఆంగ్ల భాష తెలిసిన వారెవరైనా నా సందేహము నివృత్తి చేయ గలరు !

    రిప్లయితొలగించండి
  26. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________

    దైవమన్న నదియె - దయ్యమన్న నదియె !
    దైవ కరుణ బుట్టు - దయ్య మైన !
    దైవ వశము నడచు - ధరణి యందంతయు
    దైవమనెడి పదము - తద్భవమ్ము !
    ____________________________
    దయ్యము = దేవుడు , వేలుపు, విధి , పిశాచము( శబ్దరత్నాకరము )

    రిప్లయితొలగించండి
  27. 02)
    ____________________________

    భూచరంబు గాని - ఖేచరంబులె గాని
    జలచరంబు గాని - జగతి లోన
    జలజ భవుని వలన - జన్మమెత్తును గాన
    దైవమనెడి పదము - తద్భవమ్ము !
    ____________________________

    రిప్లయితొలగించండి
  28. 03)
    ____________________________

    పరమ కరుణ జగతి - పాలించు నాతండె
    పంచ భూతములును - వాడె గాదె !
    పదము లక్షరములు - ఫాలాక్షు సృష్టియే !
    దైవమనెడి పదము - తద్భవమ్ము !
    ____________________________

    రిప్లయితొలగించండి
  29. 04)
    ____________________________

    పదము పదము నందు - సుధల నొలుకు చుండు
    పరమ ప్రీతి జగతి - కరుణ జూపు
    ప్రజల మేలు గోరు - పన్నగ శయనుండు !
    దైవమనెడి పదము - తద్భవమ్ము !
    ____________________________

    రిప్లయితొలగించండి
  30. ధర్మ నిరతి నేలు ధరణీసు పరిక్షిత్తు
    దైవ చింత వీడి దారి తప్పి
    వలయ మందు చిక్కి కలిమాయ చేయగ
    దైవ మనెడి పదము తద్భ వమ్ము !

    రిప్లయితొలగించండి
  31. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పద్యం రెండవ పాదం చివర ‘ముక్తి నియగ’ అన్నదానిని ‘ముక్తి నొసఁగ’ అందాం.
    రెండవ పద్యం మొదటి పాదంలో ‘ధరణీసు పరిక్షిత్తు’ అన్నప్పుడు శబ్ద, గణదోషాలు.
    ‘ధర్మనిరతి భూమిధవుఁడా పరీక్షిత్తు’ అందాం.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ నాలుగు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి