10, జనవరి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 587 (పాతకాలపు టలవాట్లు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
పాతకాలపు  టలవాట్లు  పాడు  చేయు
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. నీతి భార్యలు కలుగుట నేతలకిల
    ప్రాత కాలమునందున. ప్రస్తుతమది
    నీతి బాహ్యము. కావున జాతి కట్టి
    పాతకాలపు టలవాట్లు పాడు చేయు

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జనవరి 10, 2012 7:22:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    కాలమేదైన నేమిలే గాంచినంత
    మంచిచెడ్డలు సహజము మానవులకు
    కీడు కలిగించి పరులను గేలి చేయు
    పాతకాలపు టలవాట్లు పాడు చేయు

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జనవరి 10, 2012 7:25:00 AM

    గురువర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారికి నమస్సులు.

    రిప్లయితొలగించండి
  4. పాతకాలపు టలవాట్లు, పాడు చేయు
    బద్ధకమ్మును, నతి నిద్ర వదలి పెట్టి
    పట్టుదలతోడ నెప్పుడు పనిని చేయి.
    మంచి వారల సంగము మానవద్దు.

    రిప్లయితొలగించండి
  5. మార్పు సహజమ్ము కాలముల్ మారునెపుడు
    మారు దశలును ధర్మమ్ము మారుచుండు
    మంచి జేయని, తగురీతి మార లేని
    పాతకాలపు టలవాట్లు పాడు చేయు!!!

    రిప్లయితొలగించండి
  6. పాతకాలపు టలవాట్లు పాడు చేయు
    నేటి కాలపు టలవాట్లు మేటి యనుచు
    తలచు టెన్నడు నరునికి తగదు తగదు
    క్రొత్త పాతల మంచి చేకొనగ వలయు.

    రిప్లయితొలగించండి
  7. మిత్రుల పూరణ లన్నీ బాగున్నాయి.

    మితము తిండి వ్యాయామము మేలు చేయు
    పాత కాలపు టలవాట్లు ;పాడు చేయు
    ధూమపానము మితి మీరు దొడ్డ తిండి
    ఆధునికమని నేర్వరు సాధు జనులు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి శ్రీ మంద పీతాంబరుల వారికి అభివందనములు.

    రిప్లయితొలగించండి
  9. బాగు పరచును మనుజుని బాగు గాను
    పాత కాలపు టల వాట్లు , పాడు జేయు
    కొత్త వేషంబు ధారణ కుర్ర కారు
    ని నిది నిజమని , దెలియును నిలకడ గను.

    రిప్లయితొలగించండి
  10. మంచి గతకాల మందును కొంచె మేను
    క్రొత్త పధ్ధతులను మేలు కొరత లేదు
    తాత లాచరించిన వయ్యు తప్పులైన
    పాతకాలపు టలవాట్లు పాడు చేయు

    రిప్లయితొలగించండి
  11. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, జనవరి 10, 2012 10:53:00 AM

    అంటరాని తనమ్ము వేశ్యాగమనము
    బల ప్రయోగము సేత దుర్బలుల మీద
    పూని మృగయా వినోదమ్ము మొదలు గాగ
    పాత కాలపు టలవాట్లు పాడు చేయు

    రిప్లయితొలగించండి
  12. వృత్తాల్లో ప్రవాహగుణముంది. అంటే పద్యపాదంలో చివరి పదం అక్కడే అంతంకాక తరువాతి పాదంలోకూడా కొనసాగుతుంది. దేశి ఛందంలో అంటే ముఖ్యంగా గీతాల్లో (అంటే ఆటవెలది, తేటగీతులు వగైరా) ఇలా ప్రవాహ గుణం అంతశోభ నివ్వదు. లక్షణవిరుధ్ధంగాకపోయినా పద్యం చదవటానికి యెబ్బెట్టుగా ఉండే ప్రమాదం ఉంది.

    పాదాంతంలో సమాసం ఉంటే సమాసంలో కొన్ని పదాలు ఒక పాదం చివరనూ మిగిలినవి తరువాతి పాదం మొదటా ఉండటం వరకు ఫరవాలేదేమో కాని యేక పదాన్ని పద్యపాదాలమధ్య విరవటం బాగుండదు. అంటే కొడవలి అన్న మాటలో కొడవ అని ఒక పాదం చివర ఉంచి లి అనే అక్షరం తరువాతి పదం మొదట ఉంచంటం లాంటివి అన్నమాట. ఇది నా అభిప్రాయం మాత్రమే.

    రిప్లయితొలగించండి
  13. తా మొక్కిన దైవం గురువును ప్రసాదింప
    ఆ గురువు దీక్ష నివ్వ దానిని వీడి మనుజుడు
    తిరిగి మొదటి అంధకారమ్మును నాడే
    పాతకాలపు టలవాట్లు పాడు చేయు

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  14. పాతకాలపుటలవాట్లు పాడుచేయు
    ననుట చోద్యంబుగాదోచె వినిన నాకు,
    వైద్య, విజ్ఞాన శాస్త్రముల్ వైభవముగ
    మేళవించిరి, సర్వదా మేలు కలుగ.

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా!
    సమస్యలో పాత అనే పదము వాడేరు. శ్రీ చింతా రామకృష్ణారావు గారు ప్రాత కాలము అని వాడేరు. ముందుగా ప్రాతఃకాలమునకు పొరపాటుగా ప్రాతకాలము అని అన్నారేమో అని అనుమానించేను. తరువాత ప్రాతాది సంధి జ్ఞాపకమునకు వచ్చింది. ఎందుకైన మంచిదని శబ్దరత్నాకరము తీసేను. పాత అనే శబ్దము ప్రాత అనే శబ్దమునకు రూపాంతరము అని ఉంది. అయితే శ్రీ చింతా వారు బాగుగనే వాడేరు అని అనుకొన్నాను.
    అయితే శ్రీ చింతా వారి ప్రయోగము నీతి భార్యలో అన్వయము ఏదోలాగ ఉంది గాని సమముగా ఉన్నది అనిపించుట లేదు. సరిజేస్తే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  16. శ్యామ లీయం గారికి నమస్కారములు
    ---
    మీ సూచన ఆమోద యోగ్యము ,అనుసర ణీ యము

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతిగారికీ, నరసింహమూర్తిగారికీ ధన్యవాదాలు.
    ఆర్యా! సన్యాసిరావు గారూ!
    రాజానో బహు వల్లభాః
    అనే న్యాయం అనుసరించి నేతల బహు భార్యత్వం ఆనాటి నీతి.
    దీనినే ఆధారంగా ఈ పూరణము చేసాను.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శ్యామల రావు గారి సలహా బాగుగనే ఉన్నది, కాని అది ఎంతవరకు ఆచరణీయము. చేయి తిరిగిన కవులు కూడా అప్పుడప్పుడు పదము విరిచి మరొక పాదములో వేయ వలసి వస్తుంది. ఇది సమస్యా పూరణలోను మరియు దత్తపది లోను తప్పనిసరి అవుతూ ఉంటుంది కూడా. అందుచేత అట్టి నియమమును పాటించుట మంచిదే కాని, వేరే మార్గము లేని యప్పుడు ఏమీ చెయ్యలేము. అది పద్య గమనమునకు అవరోధమే - కాని లక్షణ విరుద్ధము కాదు. ఈ నియమమును వీలయినంత వరకూ పాటించండి. స్వస్తి

    రిప్లయితొలగించండి
  19. పూర్వము ఇళ్ళల్లో గాని బయటగాని అందరూ ఏవో పాటలు పాడు కొంటూనే అన్ని పనులూ హాయిగా చేసుకొనేవారు. ఆ విధముగా పాడు - చేయు అనే పదాలతో నా ఈ పూరణను తిలకించండి:

    పాత కాలపు టలవాట్లు పాడు చేయు
    మనుట, నవ్విధి పనులెల్ల నగుచునుండె
    గాదే పూర్వము గృహములో గాని బయట
    గాని యెల్లరిచే నదే గాన మహిమ

    రిప్లయితొలగించండి
  20. తాడిగడప శ్యామలరావుమంగళవారం, జనవరి 10, 2012 6:21:00 PM

    నేమాని వారికి నమస్కారాలు. పాదాంతవిశ్రామం బొత్తిగా పాటించకపోతే దేశి ఛందంలో పద్యం యొక్క నడక యెంత ఘోరంగా తయారుకావచ్చునో చెప్పటానికి పానుగంటివారి పద్యం చూడండి.

    తే.గీ. ఒంటెకును సుందరత గేదె కొడలి శుభ్ర
    త ముసిడికి దీపి కపికి జిత్త స్థిరత వె
    లుతురునకు బర్వు కవికి గలుములును గులట
    లకు గృతజ్ఞత యాకాశ కుసుమ మటుల

    వేమన పద్యం ప్రసిధ్ధం గావటానికి ఆయన పాటించినది దేశిఛందం, దేశీయ పదబంధబాహుళ్యం కావటంతో పాటు పాదాంతవిశ్రామం పాటించటం కూడా ఒక ముఖ్యకారణం. శ్రీనాధాదులు పాదాంతవిశ్రామం గీతాల్లో దాదాపుగా నూరుపాళ్ళు పాటించారు.

    రిప్లయితొలగించండి
  21. చింతా రామకృష్ణారావు గారూ,
    బహుభార్యాత్వపు అలవాటు మీద మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చేయుము’ అనే అర్థంలో ‘చేయి’ ప్రయోగించరాదనుకుంటా. అక్కడ ‘చేసి’ అంటే బాగుంటుందేమో?
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి విషయాన్ని ఎన్నుకున్నారు పూరణకు. బాగుంది.
    శ్యామలీయం గారి వ్యాఖ్యను చూసారు కదా! అయినా సమస్యాపూరణలో అటువంటివి తప్పవనుకోండి.
    ‘కుర్రకారుని’ అన్నారు. ‘కుర్రకారును’ అనాలి కదా! నా సవరణ ...
    ‘క్రొత్త వేషధారణములు కుర్రకారు
    నిజ మిది యటంచు దెలియును నిలకడ గను’
    *
    శ్యామల రావు గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    పాదాల విఱుపు గురించిన ఆచరనయోగ్యమైన సూచన లిచ్చారు. ధన్యవాదాలు.
    నేమాని వారన్నట్లు అవధానాలలో అప్పుడప్పుడు తప్పకపోవచ్చు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    పాడు చేసే పాతకాలపు అలవాట్ల లిస్టు ఇచ్చిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    చక్కని విషయాన్ని ఇచ్చారు పూరణకు. అభినందనలు.
    మీ భావానికి నా పద్యరూపం ...
    దైవ మగు గురుదేవుఁడు దయను చూపి
    దీక్ష నివ్వఁగా దానిఁ బొందిన మనుజుఁడు
    గురువు చెప్పిన నియమముల్ మరచిపోయి
    పాతకాలపు టలవాట్లు పాడుచేయు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘పాడు - చేయు’ అని క్రొత్తకోణంలో సమస్యను పూరించి మిత్రులకు మార్గదర్శకులయ్యారు.
    పాదం విఱుపుకు సంబంధించిన విలువైన అభిప్రాయం చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. గురువు గారు,
    నా సందేహాన్ని తీర్చినందుకు ధన్యవాదములు. వదలి కన్నా విడిచి అనాలేమో అనే సందేహం కూడా ఉండింది.

    పాతకాలపు టలవాట్లు, పాడు చేయు
    బద్ధకమ్మును, నిద్దుర పనికి రాదు.
    పట్టుదలతోడ కార్యము ఫలితమిచ్చు
    నంత వరకును విడబోకు నమ్మకమ్ము.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ నరసింహమూర్తిగారికి నమస్కారములు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. విష్ణు జిత్తుని వలెనేడు విరివి గాను
    దాన ధర్మంబు జేసిన తగదు మనకు
    కరువు ప్రబలిన యీనాటి కలియుగంబు
    పాత కాలపు టలవాట్లు పాడు చేయు !

    రిప్లయితొలగించండి
  25. దుగాగమ సంధి:
    మిత్రులారా!
    నీ, నా, తన ల తరువాత యొక్కకు బదులుగా దుగాగమ సంధి సూత్రము ప్రకారము "దు" వచ్చును. ఇది మీ, మా, తమలకు మాత్రము వర్తించదు. అందుకు విరుద్ధముగా కొందరు కవులు మీదు, మాదు, తమదు అని ప్రయోగించుటను చూచుచున్నాము. బాల వ్యాకరణములోని ఈ సూత్రమును వ్యాఖ్యను గమనించండి:

    సమాస పరిచ్చేదము: సూత్రము 11:
    యుష్మ దస్మ దాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
    నీదు కరుణ-నీ కరుణ; నాదునేరిమి-నా నేరిమి; తనదురూపు-తనరూపు.

    వ్యాఖ్య: సంస్కృతమునందలి యుష్మదస్మదాత్మన్ శబ్దములకు తెనుగున పర్యాయ పదములగు "నీ-నా-తన" యను శబ్దములకు సమాసమున వేరొక పదము పరమైనచో "దుక్" ఆగమముగా వచ్చునని సూత్రార్థము. ఈ యుదాహరణములన్నియు షష్ఠి తత్పురుష సమాసములు. సమాసమున విభక్తి ప్రత్యయము లోపించిన పిదప ఉత్తర పద పరత్వముండును గాన పూర్వ పదములగు నీ-నా-తనలకు "దు" వికల్పముగ చేరునని భావము.

    నీయొక్క + కరుణ అని యుండగా సమాస 25వ సూత్రముచే విభక్తి ప్రత్యయము లోపించి నీ + కరుణ యైన పిదప ప్రకృత సూత్రముచే నీ యనుదానికి దుగాగమము వచ్చి "నీదు కరుణ" యైనది. ఈ దుగాగమము వికల్పముగాన రానపుడు నీకరుణ అనియే యుండును. ఇట్లే మిగిలిన రూపముల నూహించునది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. చీరగట్టెను సిగ్గుదా చేర, బొట్టు
    పెట్టెను దృశదోషంబులు మట్టుపెట్ట
    బామ్మబ్రతికెను నూరేళ్ళు పచ్చగాను
    కాలమెంత కఠినముగ కాటు వేసె!
    పాతకాలపు టలవాట్లు పాడుచేయు
    నంచు క్రొత్తపుంతలు త్రొక్కె, యమ్మచెల్ల!
    భారతీయత నడివీధిఁ బట్టగట్ట!
    మనవి: అమ్మచెల్ల => అమ్మకచెల్ల యొక్క రూపాంతరము

    రిప్లయితొలగించండి