కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
మిత్రులారా!
రిప్లయితొలగించండిదుగాగమ సంధి గురించి అవగాహన కొరకు బాల వ్యాకరణములోని సూత్రమును వ్యాఖ్యతో సహా నిన్నటి సమస్యా పూరణ విభాగములో ప్రచురించేను. దానిని అందరూ చూడగలరని నమ్ముచున్నాను. స్వస్తి.
గీత యందున జెప్పెను కృష్ణ మూర్తి
రిప్లయితొలగించండిఅన్నమయ్యయు సమదృష్టి యనుచు జెప్పె
ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు
కుక్క యైనను కనుపించు నొక్క రీతి.
హనుమచ్చాస్త్రి గారూ రమ్యమైన పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిధర్మ మెవరికి హితమగు ధరణిపైన?
రిప్లయితొలగించండిఈ జగంబున శ్రీరాముఁడెట్టివాఁడు?
రజకుడేలనిందించెను రామ సతిని?
ధర్మవిదులకుఁ, బూజ్యుఁడు, త్రాగుఁబోతు.
జ్ఞాన వైభవానంద రసమ్ము, మరియు
రిప్లయితొలగించండిదైవ కరుణామృతమ్మును త్రావు నతడు
ధర్మ విదులకు బూజ్యుండు, త్రాగుబోతు
గా నతని జెప్ప దగునే? మహానుభావ!
అయ్యా! రామకృష్ణా రావు గారూ!
రిప్లయితొలగించండిమీరు పూరించేరు సమస్యను - తొందరగానే - అందుచేత మా అభినందనలు. కానీ మీ వంటి వాళ్ళు క్రమాలంకారముతో సరిపెట్టుకొనుటా? మరి ఏ దారి లేకపోతేనే క్రమాలంకార మార్గము కదా! స్వస్తి.
అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! అభినందనలు. ఉదయాన్నే గీతా వాక్యమును మననము చేయించేరు. ఆ పుణ్యమంతా మీదే. స్వస్తి.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఇది సరదా పద్యమే !
రిప్లయితొలగించండిచంద్ర భాసుర మొక్కింత చవి గొనంగ
దేవ లోకము విహరించు దేవదాసు
తారతమ్యము లెరుగని తాత్వికుండు
ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుబోతు !
హనుమఛ్ఛాస్త్రి గారి పూరణ అద్భుతము. అన్నయ్య గారి పూరణలు అమృత ధారల నొలికిస్తాయి. ఈనాటి పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండినిగమ శర్మతో సోదరి నెమ్మి బలికె
రిప్లయితొలగించండితమ్ముడా నేరవే నీదు తండ్రి ఘనత
ధర్మ విదులకు బూజ్యుండు, త్రాగుబోతు
జూదరుల మైత్రి విడనాడు మోదమగును.
హాయిగా కోరి భక్తి రసాయనమ్ము
రిప్లయితొలగించండిధర్మ విధులకు బూజ్యడు త్రాగుబో , తు
లయె సదమల భక్తికి ? కేవలమ్ము భక్తి
యొక్కటే మానవుల దీర్చి యుధ్ధరించు
రాజా రావుగారూ అనూహ్యమైన విరుపుతో అలరించారు. అభినందనలు.
రిప్లయితొలగించండిధర్మసంస్థాపనార్థము ధరణి వెలసి
రిప్లయితొలగించండిశిష్ఠ రక్షణ జేసెడి స్థిరతరుండు
ధర్మవిదులకు పూజ్యుడు, త్రాగుబోతు
ధర్మవర్తన తెలియక తాను చెడును.
శాస్త్రనిర్దిష్టసత్పధాచారపరులు
రిప్లయితొలగించండిధర్మవిదులకుఁ త్యాజ్యుఁడు త్రాగుఁబోతు
సర్వసమదృష్టి గల్గిన సత్పురుషులు
ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు
సర్వులకుపూజనీయుడు సత్యవ్రతుడు
రిప్లయితొలగించండిమంచి వారల కార్యకు డెంచి చూడ
నజ్ఞులకసురుల కధముల కటులనృజు, ల
ధర్మవిదులకుఁ బూజ్యుఁడు త్రాగుఁబోతు!
మనవి: మూడవ పాదం కొంచెం ప్రయోగాత్మకము.
సాధు గుణముల సొంపారు సాత్వికుండు
రిప్లయితొలగించండిధర్మవిదులకుఁ బూజ్యుండు, త్రాగుబోతు
సరస సంగీత సాహిత్య జ్ఞాని యయ్యు
సభల నపహాస్యమును నొందు రభస జేసి
శ్యామలీయం గారు,
రిప్లయితొలగించండివృత్తాల్లో ప్రవాహగుణముంది.......... అన్న మీ మాట చూసి ఇది వ్రాస్తున్నాను.
వృత్తాల్లో ఉండే ప్రవాహగుణం చాలా ఆకర్షణీయమైనది. పద్యానికి , చెప్పదలచుకున్న భావానికి ఎంతో అందాన్నిస్తుంది. నేను వృత్తాల్ని ఇష్టపడతాను. ఆ గుణం కందంలో కూడా కనిపిస్తుంది. ఒక పెద్ద వాక్యాన్ని, లేదా సమాసాన్ని ప్రయోగించటం బాగుంటుంది.
కానీ ఆటవెలది, తేటగీతుల్లో ఈ గుణం లేదు. చెప్పినా ముక్కలుగా విడగొట్టినట్టు ఉంటుంది.ఎంతసేపున్నా ఇవి ముగింపు వాక్యాలుగా, చివర జై హింద్ చెప్పినట్టుగా పనికి వస్తాయి. సీస పద్యంలో ఎక్కువ వర్ణన తర్వాత ముగింపుగా వీటిని పెద్దలు చక్కగా ఏర్పరిచారు.
కానీ వీటిలో ఒక అభిప్రాయాన్ని కానీ , ఒక పూర్తి స్టేట్మెంట్ ని కానీ ప్రకటించబోతే....అది అసంపూర్తిగానే ఉన్నట్టు ఉంటుంది. అని నాకనిపిస్తున్నది.
చివరగా గురువు గారికి ఒక విన్నపం .
వారాంతాల్లో మీరు ఇచ్చే వృత్తాలను వేరే గా కాకుండా రోజూసమస్యతో పాటే ఒకే పేజి లోనే పెట్టగలరు. అది విడిగా ఉండటం వలన అందరిపూరణలనూ చూడాలంటే ప్రత్యేకంగా వెళ్ళవలసి వస్తున్నది.
శాస్త్ర విధులను దెల్పెడి సర్వ విదుడు
ధర్మవిదులకుఁ బూజ్యుండు, త్రాగు బోతు
లనగ మద్యప్రియులనెడు యర్థమగును.
సభల యందున వారి ప్రసక్తు లేల?
మందాకినిగారు,
రిప్లయితొలగించండిప్రవాహగుణం ఆకర్షణియమైనదే. కాని నేను ముందే మనవి చేసి నట్లు దానికి కొన్ని పరిమితులున్నాయని నా అభిప్రాయం.ఈ పరిమితులు లాక్షణికతకు గాక పఠనీయతకు సంబంధించినవి. కాబట్టి ఐఛ్ఛికం. సమాసంలో కొన్ని పదాలు పాదాంతాని కటునిటులైతే ఫరవాలేదుగాని యేకపదభంజనం అంతశోభ నివ్వ దనుకుంటున్నాను - వృత్తాలైనా దేశిఛందమైనా సరే. నిన్న నే నుదహరించిన పానుగంటివారి పద్యం చిత్తగించండి - అంతా గణాల కిట్టింపు వ్వవహారమే కాని పఠనీయత యేది? మీ రన్నట్లు కందంలో కూడా ప్రవాహగుణం కనిపిస్తుంది నన్నయ కాలం నుండీ. కాని దీర్ఘపాదాంతాల వద్ద విశ్రామం చేస్తే మరింత బాగుంటాయి కందాలు. అలాగని యీ విరామాలను ఒక నియమంలాగా పాటించ గలగటం నిజంగా అసిధారావ్రతమే!
ధర్మ రక్షణ గావించ ధరణి వెలసి
రిప్లయితొలగించండివిష్ణు తేజంబు నొందిన కృష్ణు డవని
ధర్మ విదులకు బూజ్యుడు , త్రాగు బోతు
త్రాగి తందనా లాడుచు దాను చెడును .
శ్యామలరావు గారు,
రిప్లయితొలగించండినిన్నటి మీ అభిప్రాయంతో విభేదించలేదు. ఏకీభవిస్తున్నాను.
ఆ చర్చ నేను కొనసాగించటం లేదు.
వృత్తాలు ఎందుకు బాగుంటాయనే విషయం విశ్లేషించానంతే. (నా పరిధిలో)
మిత్రులారా! పూజ్యము అనే పదమునకు "శూన్యము" అనే అర్థము కూడా ఉంది. కాబట్టి పూజ్యుడు అంటే అక్షర జ్ఞానము లేని వాడు అనుట కూడా వ్యవహారములో నున్నది. అందుచేత పూజ్యుడు అనుటను మాని, పూజనీయుడు అని కొందరు వాడుచున్నారు. ఈ విషయమును ఇచ్చోట ప్రస్తావించుట మంచిదని చెప్తున్నాను. స్వస్తి.
రిప్లయితొలగించండిపద్యములలో ప్రవాహగుణము:
రిప్లయితొలగించండిపద్యాలలో ప్రవాహ గుణమును గుర్తించి అలా నడిపిస్తే హర్షణీయమే. మంచి ధారాశుద్ధి కలిగి ఎటువంటి పద్యాన్నైనా నడిపించగల వారు ఈ విషయమును పట్టించుకొన నక్కరలేదు. పద్యమును ఏదోలాగ పూర్తిచెయ్యాలి అని కష్టపడి గణములు, యతులు, ప్రాసలు మొదలగునవి వెతుక్కొంటూ వ్రాసేవారు గమనానికి ఎప్పుడూ సౌలభ్యమును తేలేరు. వృత్తాలలో కూడా అన్ని వృత్తములకీ ప్రవాహ గుణము లేదు. మత్తకోకిల వంటి వృత్తాలు ఏ పాదమునకు ఆ పాదము విరిగితేనే బాగుంటాయి. అందుకే సంస్కృతములో ఏ పాదానికి ఆ పాదమును విరుచుటే ఒప్పుకొంటారు. మరి మన వృత్తాలన్నీ సంస్కృతమునుండి అప్పు తెచ్చుకొన్నవే కదా. అందుచేత ఈ విషయము చెప్పినంత సులభముకాదు పాటింఛుట. ఐఛ్ఛికముగా దీనిని విడుచుటే మేలు. స్వస్తి.
ధర్మ విధులకు బూజ్యుండు త్రాగుబోతు
రిప్లయితొలగించండివదరుబోతు తిరుగుబోతు పచ్చి పొగరు
బోతు గాడుగాబోడు నెపుడు,సుగుణము
దయయు గలిగిన వాడెపో తగిన వాడు !!!
శ్రీ పీతాంబర్ గారి పద్యం నా పద్యానికి భావరీత్యా ప్రతిబింబం (mirror image) లా అనిపించింది. బాగుంది.
రిప్లయితొలగించండినేమానివారూ,
రిప్లయితొలగించండి"సంతోషి యీ మూడు జగముల పూజ్యుండు | సంతోషి కెప్పుడు జరుగు సుఖము"
అని శ్రీ పోతనామాత్యులవారి ప్రయోగమే ఉంది. కాబట్టి యీ పదం విషయంలో ఉన్నది ఒకటే అర్ధం అని నా అభిప్రాయం. మీరన్నట్లు నిఘంటువులు పూజ్యము అన్న పదానికి శూన్యమనే అర్ధాన్నిచ్చినా అది పూజ్యడు అనే మాటకు అర్ధసాధనం చేయటానికి ఉపకరిస్తుందనుకోను.
కుపద మందున దిరిగెడు గుణని ధివలె
రిప్లయితొలగించండిపాప కృత్యము లన్నను భీతి లేక
జూద మాడంగ మదికెంతొ మోద మన న
ధర్మ విధులకు బూజ్యుడు త్రాగు బోతు
పాలకుల దోపిడీకి , పైవారి ముడుపు
రిప్లయితొలగించండిలకును , జీతాలు , పెన్షనులకు , ప్రభుత్వ
పనులకును మద్య మాదాయ వనరు గాన
ధర్మ విదులకు బూజ్యుడు త్రాగు బోతు
నిగమ విధులకు బూజ్యుడు నిష్టపరుడు
రిప్లయితొలగించండిమర్మ విధులకు బూజ్యుడు మంత్రివరుడు
త్రాగి నిక్కము బల్కుచు తన్ను మరచు
ధర్మ విధులకు బూజ్యుడు త్రాగుబోతు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ, మిస్సన్న గారూ, గన్నవరపు వారూ ప్రశంసలు పొందిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఇలా పూరించడం శ్రీ నేమాని వారికి ఇష్టం లేకపోయినా అవధానాలలో ఇదీ ఒక సంప్రదాయంగా వస్తున్నదే.
‘రజకుడేలనిందించెను రామ సతిని?’ కంటే ‘రామసతిని నిందించిన రజకుఁ డెవఁడు?’ అంటే బాగుంటుందేమో?
*
పండిత నేమాని వారూ,
త్రాగుబోతుకు పూజార్హత కల్పించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
సరదాగా చెప్పినా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
తత్త్వాలు బోధించే బైరాగులు త్రాగుబోతులై కూడా పూజింపబడడం చూస్తున్నాం కదా!
మీ రెండవ పూరణ కూడా చక్కగా ఉంది.
*
మిస్సన్న గారూ,
పేరు లేని అక్కకు రామకృష్ణులు ఎంత మంచిపేరు తెచ్చారు? చక్కని పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
అద్భుతంగా ఉంది చక్కని విరుపుతో మీ పూరణ. అభినందనలు.
మీ రెండవ పూరణ కాలానుసారంగా బాగుంది.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
శ్యామల రావు గారూ,
ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ, అందులోను మూడవపాదంలో మీ ప్రయోగం ప్రశంసనీయం. చాలా బాగుంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ సూచన తప్పక పాటిస్తాను. ధన్యవాదాలు.
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
నిరంజన్ కుమార్ గారూ,
బహుకాల దర్శనం. సంతోషం!
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు.
తొలగించండిమీరన్నట్లు నిగమ శర్మ అక్క పేరులేని మన తెలుగింటి ఆడబడుచు.
ఆవిడ తమ్ముడికి చేసిన బోధ ప్రతి అక్కకూ, ప్రతి తమ్ముడికీ ఆదర్శం.
రామకృష్ణ కవి ఆ పాత్రను మలచిన తీరు అనన్య సామాన్యం.