20, జనవరి 2012, శుక్రవారం

చమత్కార పద్యాలు - 178

ప్రహేళిక

ఉచ్ఛిష్టం శివనిర్మాల్యం
వమనం శవకర్పటమ్ |
కాకవిష్ఠాసముత్పన్నః
పంచైతేऽతిపవిత్రకాః ||

భావం
ఎంగిలి, శివుని నిర్మాల్యం, వాంతి, పీనుగుమీది బట్ట, కాకిరెట్టలో పుట్టినట్టిది - 
ఈ ఐదూ అత్యంత ప్రవిత్రమైనవి. 
 
ఇందలి విశేషార్థాన్ని చెప్పగలరా?

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

4 కామెంట్‌లు:

 1. కాకి రెట్టలో మఱ్ఱి విత్తనం లేదా రావి చెట్టు ఉంటుండని అంటారు . అనగా మఱ్ఱి చెట్టు. లేక [ రావి చెట్టు } పవిత్ర మనది కదా !

  రిప్లయితొలగించు
 2. కొంతవరకూ ప్రయత్నిస్తాను.

  జలం, మారేడు దళం, తేనె, పట్టు దారం, రావి చెట్టు

  (చేపల ఎంగిలి, శివ నిర్మాల్యం, తేనెటీగల వమనం, పట్టు పురుగుల గూళ్ళు, రావి చెట్టు)

  రిప్లయితొలగించు
 3. మిస్సన్న గారూ !ఏం చెప్పారండి ....కొంత వరకు ఏమిటి ..అంతా అంతే ననుకుంటాను... ఇంకేముంటుంది.మాస్టారు గారూ !అంతేనంటారా?

  రిప్లయితొలగించు
 4. రాజేశ్వరి అక్కయ్యా,
  మీరు ఊహించింది సరియైనదే. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ‘తేనె, రావిచెట్టు’ ఈ రెండూ కరెక్ట్! అభినందనలు.
  *
  సమాధానం .....
  ఉచ్ఛిష్టమ్ = లేగ ఎంగిలి కలిగిన పాలు,
  శివనిర్మాల్యమ్ = శివుని జడలనుండి ప్రవహించిన గంగ,
  వమనమ్ = తేనెటీగల వాంతి రూపమైన తేనె,
  శవకర్పటమ్ = ఒకరకమైన పురుగులనుండి సిద్ధమైన పట్టుబట్ట,
  కాక విష్ఠాసముత్పన్నమ్ = కాకి రెట్టవలన పుట్టిన రావిచెట్టు
  అత్యంతం పవిత్రమైనవి.

  రిప్లయితొలగించు