17, జనవరి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 594 (దారము రక్షించు సాధుతతిన్)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

  1. శ్రీరమణీ హృత్తాప ని
    వారకళాధారుఁడు, హరి, వరరాక్షస సం
    హారుండు, భక్తజన మం
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  2. దారము మణులకు వలె నా
    ధారము శివుడఖిల భూత తతులకు భద్రా
    కారమును మోక్ష ఫల కే
    దారము రక్షించు సాధు తతి నండ్రు బుధుల్

    రిప్లయితొలగించండి
  3. శ్రీ రామ నామ మహిమము
    నే రీతిగ చెప్పగ నగు నెఱిగిన దానిన్.
    కోరిక లీడేర్చెడి మం
    దారము. రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  4. దారము తో రుద్రాక్షలు
    హారముగా మెడను దాల్చి హరు నర్చింపన్
    చేరవు బాధలది మహో
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ! (ఆలస్యంగా)
    సూర్యుని చుట్టూ తిరుగుతుందీ భూగోళం
    వైద్యుల చుట్టూ తిరుగుతాడీ మాలోకం (అంటే నేనే)
    అయ్యా అదీ సంగతి !
    కొత్తేమీ కాదుగదా ! మామూలే !అందుకే ఆలస్యం !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    దుష్ట శిక్షణాయ శిష్ట రక్షణాయ
    సంభవామి యుగే యుగే !

    01)
    ___________________________________

    ధారుణి జన్మించును గా
    ధారణు పితరుడు తనంత - దానవ కోటిన్
    దారుణముగ జంపి , ఘన వి
    దారము ! రక్షించు సాధు - తతి నండ్రు బుధుల్ !
    ___________________________________
    ధారణుడు = బ్రహ్మ
    విదారము = యుద్ధము

    రిప్లయితొలగించండి
  6. పారావారము దయకది
    శ్రీ రమణీ మణికి నెన్న క్రీడా స్థలమున్
    నారాయణ! నీ హృత్కే-
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! వ్యాఖ్యలగడి యేమైనది ?
    ఎక్కడికో వెళ్ళవలసి వస్తోంది !
    చాలా యిబ్బంది కలుగు చున్నది !

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారూ,
    స్వాగతం!
    వ్యాఖ్యల గడిని వ్యాఖ్యల క్రింద వచ్చేట్లు చేస్తే వ్యాఖ్యల అక్షరాలు మరీ చిన్నవిగా ఉంటున్నాయి. తేదీ, సమయం తప్పుగా పడుతున్నాయి. ప్రతివ్యాఖ్య క్రింద సమాధానం అని వస్తున్నది. కొందరి పూరణలు అంతకు ముందు ఇతర మిత్రుల పూరణలకు సమాధానాలుగా కనిపిస్తున్నాయి. అంతా గందరగోళం ... ఇదే బాగుంది. ‘ఎక్కడికో వెళ్ళి రావడానికి’ రెండు క్లిక్కుల శ్రమ! ఇదే బాగుందని పిస్తున్నది.
    మీ తృప్తికోసం దానిని సెలెక్ట్ చేస్తున్నాను. ఏది బాగుందో మీరే చెప్పండి!

    రిప్లయితొలగించండి
  9. భారము నీదే నందును
    కోరితి నయ్యా విముక్తి గోపీలోలా!
    చేరగ నీదు చరణ మం
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జనవరి 17, 2012 8:24:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    భారత సంసృతి జగతికి
    ప్రేరణ కలిగించునెపుడు ప్రేమామృతమై
    భారతి కరుణామృతమం
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్

    రిప్లయితొలగించండి
  11. కోరిన రక్షించితి వే
    సారిన సారంగమునెడ చల్లని కరుణన్
    నారాయణుడను నా మం
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  12. ధీరుడు మారుతి తిరముగ
    శ్రీరాముని నమ్మి పొందె స్థిరమగు కృపయున్
    కోరిన సులభుడె రామును
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్

    రిప్లయితొలగించండి
  13. శారద! కావవె నన్నిక
    నీరజ నయనా! భజింతు నీ నామంబే!
    భారతి చరణమనెడి మం
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా ! పూర్వమంతా
    బాగానే ఉండేది గదా !
    ఈ వారంలో చాలా మార్పు లొచ్చాయే !

    రిప్లయితొలగించండి
  15. కిశోర్ జీ స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు శ్రీరామ రక్ష !
    గురువుగారూ నమస్సులు రామున్ +ఉదారము రామునుదారము అని సంధి చేసాను.
    తప్పయితే దయ చేసి దిద్ది పెడతారుగా ! పని ఉంది,రేపు కూడా హడావుడే.

    రిప్లయితొలగించండి
  16. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, జనవరి 17, 2012 9:45:00 AM

    ఘోరము 'సాధువు'ల విథము
    నేర ప్రపంచముల నేలు నేర్పరు లగుటన్
    'శ్రీరమణా! పృథ్వీ కే
    దారము రక్షింపుము సాధుతతి' నండ్రు బుధుల్

    (సాధు సమూహముల నుండి పృథ్వీ కేదారమును రక్షింపుమని బుధులు శ్రీరమణుని వేడుకొనుట)

    రిప్లయితొలగించండి
  17. ఘోరాతిఘోరమగు సం
    సారపు బంధంబులన్ విచారచయంబున్,
    వారించెడు తాపస మం
    దారము రక్షించు సాధు తతి నండ్రు బుధుల్.

    తాపసమందారము = తాపసులకు కల్పవృక్షమైనవాడు ( పరమేశ్వరుడు / శ్రీమహావిష్ణువు )

    రిప్లయితొలగించండి
  18. రారా యని నిను బిలువగ
    నేరా నివు రాక యుంటి వేమిటి కతమున్
    కోరిక లొన గూర్చ ను మం
    దారము రక్షించు సాధు తతి నండ్రు బుధుల్

    రిప్లయితొలగించండి
  19. శంకరార్యా ! ధన్యవాదములు !
    నిజమే ! అంతా గందరగోళముగా యున్నది !
    సరే ! యిలాగే ఉంచండి !
    మూర్తీజీ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  20. "కౌపీన సంరక్షణార్ధం...:" అన్న సామెతగా హాస్యం జోడిస్తూ:
    బారున యెలకలు కొట్టిన
    తీరున కౌపీనము సరిదిద్దుట కికనే
    దారియు లేదన సూదీ
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్!

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ ఉతమంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘హృత్కేదారము’ ఎంత బాగుంది మీ పూరణ! అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    దేశభక్తితో నిండిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘కోరి రమాధవు నామ / ముదారము ...’ అంటే బాగుంటుందేమో?
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నివు’..? ఆ పాదాన్ని ‘నేరా యిటు రాకయుంటి ...’ అంటే బాగుంటుందేమో? అలాగే ‘కోరికలు తీర్చు జన మం/ దారము...’ అందామా?
    *
    చంద్రశేఖర్ గారూ,
    చ(మత్)కారకుక్షి అనిపించుకున్నారు. సరదా పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    ‘సూదీ దారము’లను ‘సూదియు దారము’లందాం.

    రిప్లయితొలగించండి
  22. పూజ్యులు , గురువులు , సోదరులు , అందరికీ అభినందనలు + శుభా కాంక్షలు . మళ్ళీ వచ్చేసానుగా ? ? ? [ తప్పుల్ ,, తడ్కల్ రాయడానికి ]

    శ్రీ రామ నామ మన్నను
    ఆ రామ స్మరణ జేయ నాశ్రితుడనుచున్ !
    వేరే దైవము యేలన మం
    దారము రక్షించు సాదు తతి నండ్రు బుధుల్ !
    -------------------------------------------------------
    తారా పధమున యలిగిన
    దారను మెప్పించి గెలువ తరమే ధరణిన్ !
    చీరెలు సారెలు నగ మం
    దారము రక్షించు సాధు తతి నండ్రు బుధుల్ !

    ఇక్కడ " నగ " = అంటే " నగలు "

    రిప్లయితొలగించండి
  23. ధన్యవాదాలు మాస్టారూ. చకార కుక్షి కదా అని ఎవరి నాభిలోనైనా వేలు పెట్టమనేరు! అంత శక్తి నాకు లేదు సారూ :-)

    రిప్లయితొలగించండి
  24. గురువు గారూ ధన్యవాదములు. మీ సవరణ బాగుంది. అంతకంటె ముఖ్యము మీ పూరణ చాలా బాగుంది.మిత్రుల పూరణ లన్నీ బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  25. శ్రీరామనామ సారము
    శ్రీరాముని పాదరజము సిరిపరివారం
    శ్రీరఘునందను పదమం
    దారము రక్షించుసాధుతతి నండ్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు .
    మీ సవరణకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  27. చంద్రశేఖర్ మిత్ర వర్యా యిక్కడ దుకాణ సముదాయములలో కౌపీనము లమ్ముతున్నారుగా ! ఓహో ! అవి కంఠ బంధనములా !!

    రిప్లయితొలగించండి
  28. రాజేశ్వరి అక్కయ్యా,
    మొన్న మీరు ‘బై’ అనే సరికి భయపడ్డాను సుమా! ఈ తమ్ముని మీద కోపం వచ్చించేమో అనుకున్నా.
    మీ రెండు పూరణలు బాగున్నాయి. ముఖ్యంగ రెండవది. అభినందనలు.
    మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం.
    ‘వేరేల రాముడను మం ...’ అందామా?
    *
    మంద పీతాంబర్ గారూ,
    రామపదమందారంపై మీ పూరణ మనోహరంగా ఉంది.‘పరివారం’ అని అనుస్వారంతో ముగించారు. అక్కడ ‘పరిజనమున్’ అందామా?

    రిప్లయితొలగించండి
  29. మా మనుమరాలు ఇషాని స్ఫూర్తితో:


    ఘోరమ్మౌ దురదలలో
    వీరావేశమ్మునందు వీపులు గోకన్
    దారము వలసిన, జంద్యపు
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్

    రిప్లయితొలగించండి
  30. తీరుగ తాళము ముడినిడ
    కోరిక తీరగను గోక గొప్పగు వీపున్
    మీరిన నిడుముల జందెపు
    దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్

    రిప్లయితొలగించండి