31, జనవరి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 608 (కొక్కొరోకొ యనెను)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
కొక్కొరోకొ యనెను  కుక్క పిల్ల.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

  1. ఒక్క పటములోన నున్నవి బొమ్మలు
    వాని మీట నొక్క పలుకుచుండు
    తంత్రి నొకడు కలిపె తప్పుగా నందుచే
    కొక్కొరోకొ యనెను కుక్క పిల్ల

    రిప్లయితొలగించండి
  2. పిల్లవాడు ధ్వనిని పెద్దగా చేయుచు
    కొక్కొరోకొ యనెను, కుక్క పిల్ల
    ననుకరించనెంచి యనెను భౌ భౌయని
    కోకిలమ్మవలెను గొంతు మార్చె.

    రిప్లయితొలగించండి
  3. ప్రక్క ఇంటివారు పారవేసిన చికెన్
    ముక్క తిన్న దొక్క కుక్క పిల్ల !
    చికెను ముక్క తిన్న చిత్రమేమో గాని -
    కొక్కొరోకొ యనెను కుక్క పిల్ల!

    రిప్లయితొలగించండి
  4. తండ్రి వెనుక దాగి తగుదునమ్మా యని
    కోట్లు కూడ బెట్టె కుర్ర కుంక
    లేని పౌరుషమును లేకిగా నటియిం చె
    కొక్కొరోకొ యనెను కుక్క పిల్ల

    రిప్లయితొలగించండి
  5. జిత్తులాడి నక్క యెత్తుకొనెను నొక్క
    కోడిపుంజు రైతు చూడకుండ
    వార్త నందజేయ నార్తి సంధిల్లగా
    కొక్కొరోకొ యనెను కుక్క పిల్ల !

    రిప్లయితొలగించండి
  6. శ్రీ రాజారావు గారి పద్యము 2వ పాదములో యతి లేదనుకొంటాను. సవరించాలేమో?

    రిప్లయితొలగించండి
  7. తమ్ముడు డా. నరసింహమూర్తి పూరణ విశిష్ట భావముతో నలరారుచున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఏమిటో! గురువు గారు, శిష్యబృందము దొరికిందని మా చేత అన్ని అఱపులు అఱిపిస్తున్నారు !!

    రిప్లయితొలగించండి
  9. తెలుగు దనము లేని తెలుగు పద్యము విని
    చొక్కి కోడి కొక్కొ రొక్కొ యనెను
    కుక్క పిల్ల మురిసి కుయ్యి కుయ్యి మనెను
    పట్ట రాని ముదము పుట్టె నేమొ !

    రిప్లయితొలగించండి
  10. గురువు గారికి ధన్యవాధములు
    సరదగా పూరించినది ( ఈ రోజుల్లో ఆడు వారు, మగవారు నిత్యము వినోధము కావాలి యని పెడదారులు పట్టుచున్నారు) వారి ప్రవర్తనను జూచిన కుక్క పిల్ల ఈ విధముగా
    -----
    రోజుకొక్క రంగు రూపసి మార్చగ,
    పూటకొక్క పడుచు పోందు గోరు
    భర్త యొక్క సరస నర్తనములు జూచి,
    కొక్కొరో కొయనెను కుక్కపిల్ల|

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఈ మధ్య పత్రికలలో యెన్నో విపరీత వార్తలు
    అందులో ఇదొహటి :

    01)
    ____________________________

    కుక్కుటమును శునక - మొక్కటై మెలగంగ
    కూత నేర్చె కుక్క ! - కోడి మొఱగె !
    కలుగు వింత లెన్నొ - కలికాల మహిమయా
    కొక్కొరోకొ యనెను - కుక్క పిల్ల !
    ____________________________

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యా !
    delete button కనుపించుట లేదు ! కారణ మేమో ?
    లేక నాకే కనుపించుటలేదా ?
    అందరకూ కనిపిస్తోందా ?

    రిప్లయితొలగించండి
  13. కాల మహిమ వలన వేల మార్పులొచ్చె
    మనము మాత్ర మేల మార వలదు
    వాటి భాష యందు పాటవమ్మని యెంచి
    కొక్కొ రోకొ యనెను కుక్క పిల్ల

    రిప్లయితొలగించండి
  14. సముద్రతరణమునము సిద్ధమౌతున్న తరుణంలో:
    హనుమ పాద తాడనాద్భుత శక్తికిన్
    ఖేచర వనచరులు ఖిన్నులైరి
    జంతుజాలమంత వింతగా విలపించె
    కొక్కొరోకొ యనెనుకుక్క పిల్ల
    సింహవ్యాఘ్ర చయముచీమలఁబోలెను
    సర్పరాజములు విషముము గ్రక్కె

    రిప్లయితొలగించండి
  15. మిత్రులంతా యేమై పోయారు ?
    ఉదయం నుండీ యెవరూ యేమీ ప్రకటించడం లేదు !
    బ్లాగులో ఇంత నిశ్శబ్దం యెప్పుడూ లేదు !
    delete button యేమైందో యెవరూ చెప్పట్లేదు !
    యేదైనా (technical) సాంకేతిస సమస్యా ?
    ఎవరో ఒకరు
    ఏదో ఒకటి చెప్పండి బాబులూ !

    రిప్లయితొలగించండి
  16. నమస్కారములు
    కిషోర్ గారూ ! మీరు మళ్ళీ వ్రాసి పోస్ట్ చేస్తే " రెం డింటికీ , [ అంటే ముందు వ్రాసిన దానికీ , ఇప్పుడు వ్రాసిన దానికీ ] డిలీట్ బటన్ " కను పిస్తుంది అప్పుడు వద్దను కున్నది డిలీట్ చేయ వచ్చును . ప్రయత్నం చేయండి. ఇది నా అనుభవము. అందుకని

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి అక్కయ్య గారు,
    "మళ్ళీ వ్రాసి పోస్ట్ చేస్తే" మాత్రమే కాదు, ఊరికే సైన్ ఇన్ అయితే కూడా ఎవరి వ్యాఖ్యలకు వాళ్ళకు తొలగించు బటన్ కనిపిస్తుంది.
    కానీ ఈ రోజు కనిపించుట లేదు.
    ఇంకో ముఖ్యమైన ఈ రోజుటి సమస్య ఏంటంటే బ్లాగ్ స్పాట్ బ్లాగ్ లన్నీ blogspot.com nunchi blogspot.in గా మారాయి.
    దీనివల్ల నా బ్లాగుల్లోనే రెండు బ్లాగుల్లో కొన్ని విడ్జెట్స్ పని చేయుట లేదు. రెండు బ్లాగుల్లో యథావిధిగా ఉన్నాయి. సెట్టింగ్స్ లో అన్నిబ్లాగుల్లోనూ ఒకేరకంగా సెట్ చేసిఉన్నప్పటికీ ఈ సమస్య...
    వసంతకిశోర్ గారు,
    ఒక వారం క్రిందట వ్యాఖ్యల పెట్టె విధానం మారి కొంత యిబ్బంది పెట్టింది కదా, ఇప్పుడు ఇది. బ్లాగ్ సమస్యలు అన్నీ ఇన్నీ కాదండి.

    రిప్లయితొలగించండి
  18. వసంత్ కిశోర్ గారు,
    వ్యాఖ్యల ఫారం = ఇంకో పేజీకి వెళ్తుంది కదా అక్కడ కనిపిస్తుందండి డిలీట్ బటన్, సైన్ ఇన్ అవ్వగానే.ఎప్పుడెప్పుడు గురువు గారు , మిగిలిన పండితులెవరైనాను తప్పొప్పులు చెప్తారా అని అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాము. కానీ ఈ రోజు చూడలేదండి మీ సందేహము.

    రిప్లయితొలగించండి
  19. మరెలా ? మందాకిని గారూ ! ఎక్కడో వైరేస్ ఉండి ఉంటుంది.ఉదయం నుంచీ నాకు మెయిల్ " జిగ్ జాగ్ " వస్తోంది. [ నా సిస్టమే సరిగా లేదేమో అనుకున్నాను. ]

    రిప్లయితొలగించండి
  20. సాధారణంగా వ్యాఖ్య క్రింద ఒక మినియేచర్ చెత్తబుట్ట కనిపించేది. అదెలా మాయమైందో అర్థం కావడం లేదు. సెట్టింగులలోకి వెళ్ళినా ఫలితం లేదు.

    రిప్లయితొలగించండి
  21. ఈరోజు పూరణలు పంపిన
    పండిత నేమాని వారికి,
    మందాకిని గారికి,
    డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
    మిస్సన్న గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    లక్కాకుల వెంకట రాజారావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    వసంత కిశోర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    చంద్రశేఖర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    సమయాభావం వల్ల అందరి పూరణలను సమీక్షించలేక పోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  22. హమ్మయ్య ! నాకే నేమో అనుకున్నాను !
    అందరీగదా ఈ సమస్య ! సంతోషం !
    అక్కయ్యకూ మందాకినిగారికీ ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  23. కిశోర్ జీ నాకు కనిపిస్తున్నదే చెత్త బుట్ట.బాట పైన పారేస్తామంటే యిక్కడ ఒప్పుకోరు !

    రిప్లయితొలగించండి
  24. చచ్చినంత నేగి స్వర్గముచెంతకు
    నాపఁబోవగ భటు"లధములార
    గురువునమరపతికిఁ,గూతనేర్పితి"నంచు,
    కొక్కొరోకొ యనెను కుక్క పిల్ల.


    అంచు, అనెను - పునరుక్తి అయ్యిందా గురువుగారు?

    రిప్లయితొలగించండి
  25. శ్రీ రాజారావు గారి పూరణలో "కొక్కొరోకొ" యని ఇవ్వబడిన సమస్య "కొక్కొరొక్కొ" - అయ్యిందండి

    రిప్లయితొలగించండి
  26. రాజేశ్వరమ్మగారూ,
    వేలమార్పులువచ్చె అనాలేమోనండీ, ఒకటవ పాదం చివర జగణం వచ్చింది. రాకూడదేమోనండీ.

    రిప్లయితొలగించండి
  27. వసంత కిశోర్ గారూ..,
    వ్యాఖ్యను పోస్ట్ చేయండి మీద నొక్కిన తరువాత వచ్చే పుట లో చెత్తబుట్ట(డిలీట్ బటన్) కనిపిస్తున్నదండీ.

    రిప్లయితొలగించండి
  28. మూర్తీజీ ! ధన్యవాదములు !
    ఇక్కడ నాదొక్కటే కాదు చాలా మంది చెత్తబుట్టలు మాయమయినై !
    గురువుగారితో సహా !

    మరి మీకు కనిపిస్తోందీ అంటే ...............
    మీ ఊళ్ళో problem లేదన్న మాట !
    ఇక్కడే ఏదో జరుగుతోంది !

    అయ్యా ఊదంగారూ ! ధన్యవాదములు !
    మీరు చెప్పిన పని చెయ్యకుండా నేను నా వ్యాఖ్యలను ప్రకటించలేను గదా !
    అక్కడ కూడా కనిపించుట లేదు !

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందరికీ ధన్యవాదములు !
    ఇప్పుడు నా చెత్తబుట్ట వ్యాఖ్యల పేజీలో నాకు దొరికిందోచ్ !
    వ్యాఖ్యను దిగ్విజయంగా తీసి వేయ గలిగాను !
    సహకరించిన మిత్రులందరికీ మళ్ళీ ధన్యవాదములు !

    ఇంతకీ యిది తెర వెనక్కెందు కెళ్ళి నట్టు?
    ముందు పేజీలో ఎవరికైనా కనబడుతోందా ?

    రిప్లయితొలగించండి
  30. పిల్ల క్యారుక్యారు పిల్లేమొ మ్యావ్ మ్యావు
    కోకిలమ్మ కూకు కోడి కూత
    కొక్కొరోకొ యనెను కుక్క పిల్లను బట్టి
    బుడుగు ముచ్చటించె బుజ్జి పలుకు.

    రిప్లయితొలగించండి