జయ మంగళ శుభ కరునికి
జయతు జయతునిఖిల లోక జగదీశునకున్
జయ పావన శుభ చరితుకు
జయతుజయతు సాయి నాధు చరణ యుగళికిన్
కం.
జయతు జయతునిఖిల లోక జగదీశునకున్
జయ పావన శుభ చరితుకు
జయతుజయతు సాయి నాధు చరణ యుగళికిన్
కం.
జయ బాబా నామునికిన్
జయతు జయతు సాయి రాము సర్వజ్ఞు నికిన్
జయ భక్త జన వరదునికి
జయతు జయతు కరుణామయు చరణ యుగళికిన్
కం.
జయతు జయతు సాయి రాము సర్వజ్ఞు నికిన్
జయ భక్త జన వరదునికి
జయతు జయతు కరుణామయు చరణ యుగళికిన్
కం.
జయ సర్వాంతర్యామికి
జయతు జయతు సర్వ కార్య జయ శీలునకున్
జయ శిరిడీ నిలయునికిన్
జయతు జయతు దేవ దేవు చరణ యుగళికిన్
కం.
జయతు జయతు సర్వ కార్య జయ శీలునకున్
జయ శిరిడీ నిలయునికిన్
జయతు జయతు దేవ దేవు చరణ యుగళికిన్
కం.
జయ యోగీశ్వర వరునికి
జయతు జయతు సాయి కృష్ణ జనార్ధనునికిన్
జయ గీతా చార్యునికిని
జయతు జయతు పరమ గురుని చరణ యుగళికిన్
కం.
జయతు జయతు సాయి కృష్ణ జనార్ధనునికిన్
జయ గీతా చార్యునికిని
జయతు జయతు పరమ గురుని చరణ యుగళికిన్
కం.
జయ జగదా ధారునికిని
జయతు జయతు జంగమ పతి సాయి శివునికిన్
జయ దీన జనావనునికి
జయతు జయతు లోక ప్రభునిచరణ యుగళికిన్
కం.
జయతు జయతు జంగమ పతి సాయి శివునికిన్
జయ దీన జనావనునికి
జయతు జయతు లోక ప్రభునిచరణ యుగళికిన్
కం.
జయ బ్రహ్మార్చిత మూర్తికి
జయతు జయతు దత్త సాయి జ్ఞా నాంభసికిన్
జయ చిన్మయ సందీప్తికి
జయతు జయతు పరమ పురుషు చరణ యుగళికిన్
కం.
జయతు జయతు దత్త సాయి జ్ఞా నాంభసికిన్
జయ చిన్మయ సందీప్తికి
జయతు జయతు పరమ పురుషు చరణ యుగళికిన్
కం.
జయ సర్వ వ్యాపనునికి
జయతు జయతు సాయి విష్ణు జలజేక్షణుకున్
జయ నారాయణ విభునికి
జయతు జయతు వేద వేద్యు చరణ యుగళికిన్
కం.
జయతు జయతు సాయి విష్ణు జలజేక్షణుకున్
జయ నారాయణ విభునికి
జయతు జయతు వేద వేద్యు చరణ యుగళికిన్
కం.
జయ నిత్య పరం జ్యోతికి
జయతి జయతు సర్వ సిధ్ధి సంభావ్యు నకున్
జయ గుణ సాయి ప్రభునికి
జయతు జయతు సద్గురు వర చరణ యుగళికిన్
జయతి జయతు సర్వ సిధ్ధి సంభావ్యు నకున్
జయ గుణ సాయి ప్రభునికి
జయతు జయతు సద్గురు వర చరణ యుగళికిన్
వెంకట రాజా రావు . లక్కాకుల
జయమగు సాయీశునకును
రిప్లయితొలగించండిజయమగు శ్రీ సాయి భక్త సాధు జనులకున్
జయమగు షష్ఠ్యoతములకు
జయమగు లక్కాకు వంశ చంద్ర కళలకున్
శ్రీ సాయీశ్వరు కృపకున్
రిప్లయితొలగించండిమీ సఖ్యత తోడు గాగ మిస్సన గారూ !
శ్రీ 'శంకరాభరణము' స
దా సత్కవి నిలయమై ముదమ్మొనరించున్
శ్రీ మస్సన్న గారికి ధన్యవాదములు.
ఇటువలె మనోజ్ఞ కవిత
రిప్లయితొలగించండిల్ఘటియించిన మిమ్ము మెత్తు లక్కాకుల వెం
కట రాజారావు! దయా
స్ఫుట దృక్కుల సాయి బ్రోచు శుభదాయకుఁడై.
కంది వంశ మందు ఘనులైన శంకరా!
రిప్లయితొలగించండిమంచి మనసు గల్గు మా సఖుండ!
సాయి నాధు కృపలు చల్లని చూపులు
కురిసి మీకు శుభము గూర్చు గాక!
రమ్యమైన రచన - రచియించి నావహో
రిప్లయితొలగించండిరామ రామ సాయి - రామ యనుచు !
రాగ మొలుక, సాయి - రాముడే కృపజూపి
రక్ష సేయు ! రాజ - రావు నిన్ను !
ఏయది వ్రాయ దలంతురొ
రిప్లయితొలగించండితీయని తెలుగందు దాని దీర్చి రచించే
చాయలు గల మిత్రుడ! శ్రీ
సాయి తమకు శుభమొసగు వసంత కిశోరా !