25, జనవరి 2012, బుధవారం

చమత్కార పద్యాలు - 182

ప్రహేళిక

సువర్ణాలంకృతా నారీ
హేమాలంకృతి వర్జితా |
సా నారీ విధవా జాతా
గృహే రోదితి తత్పతిః ||

సువర్ణాలంకృతురాలైన ఒక స్త్రీ బంగారు నగలు లేనిది. 
ఆమె విధవ. కాని ఆమె భర్త ఇంట్లో ఏడుస్తున్నాడు. 

దీని భావం వివరించగలరా?
(‘సువర్ణాలంకృత, విధవాజాతా’ శబ్దాల అర్థవైవిధ్యాన్ని పరిగణించండి)

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
 


3 కామెంట్‌లు:

  1. ప్రహేళిక సమాధానం .....

    హేమాలంకృత వర్జితా = బంగారు ఆభరణాలు లేకున్నా
    సువర్ణాలంకృతా = మంచి రంగుతో తళతళ ప్రకాశించే శరీరం గలది.
    సా నారీ = ఆ స్త్రీ
    విధవా జాతా = అనేక విటులు గలది. (అందువల్ల)
    తత్పతిః = ఆమె భర్త
    గృహే రోదితి = ఇంట్లో ఏడుస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
  2. . నేను " బంగారు రంగు గలిగిన శరీరము కలది " అని కొంచం రాద్దామనుకుని మానేసాను. చాలా బాగుంది. మంచి ప్రహేళిక

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి గారు చెప్పినట్లు నాకూ అంతవరకే అర్థ మైనదండీ ... వి ధవా (అనేక విటులు గలది) మాటలోనే పూర్తి అర్థం దాగుంది.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి