12, జనవరి 2012, గురువారం

సమస్యాపూరణం - 589 (సంగీతము విన్నవారు)

 అమర సంగీత విద్వాంసురాలు యం. ఎస్. సుబ్బలక్ష్మి గారి 
పాదపద్మాలకు ప్రణామాలు.

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

54 కామెంట్‌లు:

  1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు నిన్న శ్రీ లక్కాకుల వెంకట రాజా రావు గారిని అభినందిస్తూ "బహు చక్కగనె" అని అన్నారు. ఈ సమాసము కొత్తగా కనిపించుచున్నది. ఒకమారు పరిశీలించండి. ఇద్దరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కిట్టింపు పూరణ

      ఇంగితము లేక పడమటి
      యెంగిలినే మెచ్చునట్టి హీనులు యెమ్మెస్
      సంగతుల మేటి కృతులన్
      సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.

      తొలగించండి
  2. ప్రముఖ గాయినిపైని దుర్వార్తను విని
    ఖిన్నులైరి సంగీతము విన్నవారు
    చచ్చిరి తృటిలో యటనుచు వచ్చినట్టి
    వార్త తప్పని సంతోషపడిరి పిదప

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    భరతమాత ధరించిన కిరీటములో అత్యంత అగ్రభాగమున కోటిసూర్యప్రభలతో ప్రకాశించు అపూర్వమైన, అమూల్యమైన వజ్రము స్వామివివేకానంద.

    నేడు స్వామి వివేకానంద జన్మదినం. భరతమాత కీర్తిని విశ్వవ్యాపితం చేసిన మహనీయుడు.యువతను చైతన్యపరచిన ఉత్తుంగతరంగము వేదాంతసింహఘర్జన గావించిన చైతన్యహర్యక్షము స్వామి వివేకానంద

    భరతమాతకు మకుటపు వజ్రమతడు
    రామకృష్ణుని ప్రియశిష్యరత్నమతడు
    వేదసింహంపు ఘర్జన విశ్వమందు
    మారు మ్రోగంగ జేసిన మాన్యుడతడు

    వేగంగా తన వాక్ప్రవాహ ఝరితో వేదాంతసింహంబుగా
    నూగించెన్ గురు రామకృష్ణ ప్రభతో నుప్పొంగి భూగోళమున్
    ఆగంభీర మహామనీషి తలపే మదిలో నాహ్లాదమందించగా
    శ్రీగంగాజల స్నానపుణ్యఫలమే సిద్ధించు శీఘ్రంబుగాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా! 'చాలా చక్కగా, బహు చక్కగా' అను వాడుక పదమును వాడాను.
      'విన చక్కగ నే చెప్పినారు ' అంటే సరిపొతుందనుకుంటాను.

      తొలగించండి
  4. మాస్టారూ,
    "సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో" అనటం కన్నా "సంగీతము విన్నవారు సమసిరి త్రుటిలో" అంటే మృదువుగా, బాగుంటుందనిపించింది. పరిశీలించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరాభరణం చిత్రం లో శంకర శాస్త్రిని ఎర్యల్ శాస్త్రి అని గేలి చేసినవారు శంకర శాస్త్రి పాడినసంగతులు పలుక లేక బిక్క చచ్చి పోయిన సందర్భం....

      ఎంగిలి పాటల ' సింగరు '
      లింగితమును మాని తిట్టె నేర్యల్ శాస్త్రిన్
      సంగతులు రాక 'శంకర
      సంగీతము' విన్నవారు చచ్చిరి త్రుటిలో.

      తొలగించండి
  5. గురువుగారూ తేది, టైము తప్పుగా పడుచున్నది. జనవరి 12 గా గ్రహింపగలరు

    రిప్లయితొలగించండి
  6. మాస్టారూ, ఫాంటు చాలా చిన్నదిగా కనిపిస్తోంది. చదవటానికి వీలుగా లేదు. అదివరకటి ఫాంటే బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. అది ఏ సంవత్సరమో గుర్తు లేదు. నేను అయ్యప్పమాల వేసి శబరిమల యాత్రకు వెళ్ళాను. పంబానది తీరంలో ఉండగా ఒక కొట్టులో మళయాలం దినపత్రికలో సుబ్బలక్ష్మి గారి ఫోటోతో మొదటి పేజీలో ఏదో వార్త వివరంగా ఇవ్వడం కనిపించింది. కొట్టువాణ్ణి అడిగితే వాడి భాషలో ఏదో చెప్పాడు. ‘అయ్యో, ఎమ్మెస్ మరణించారు కదా!’ అని ఆ రోజంతా బాధపడ్డాను.
    కొట్టాయం వచ్చాక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఇంగ్లీషు పేపరు కొని చదివాక తెలిసింది. సుబ్బలక్ష్మి గారికి పద్మశ్రీ అవార్డ్ వచ్చించని. అయ్యో! మరణించారనుకొన్నానే అని పశ్చాత్తాపపడ్డాను.

    రిప్లయితొలగించండి
  8. వ్యాఖ్యల ఫాంటు సైజు, అవి ప్రకటింపబడే విధానం ఎందుకో మారిపోయింది.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీపతి శాస్త్రి గారూ!
    శ్రీ వివేకానంద స్వామి వారి జన్మ దినము సందర్భముగా మీరు వ్రాసిన పద్యములలో కొన్ని సవరణలు చేయాలి:
    (1) శార్దూల పద్యము: 3 వ పాదములో "మదిలో" అనే అక్షరాలు తొలగించండి - అప్పుడు గణములు సరిపోతాయి.
    (2) 4వ పాదములో శ్రీ గంగానది స్నానమాడి అనుటలో "ది" గురువయి గణభంగము అవుతోంది. శ్రీ గంగన్ దిగి తానమాడి అంటే బాగుంటుందేమో. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. అంగాంగంబులు నిల బహి
    రంగంబొనరించి సుంత లజ్జయులేకన్,
    కృంగించెడు యీ కుహనా
    సంగీతము విన్నవారు చత్తురు తృటిలో.

    నేటి తరమువారి సంగీతము ( పాటలు, డాన్సులు) గురించి.
    చత్తురు = కృశించెదరు అనే అర్థములో....... ( సిగ్గుతో చచ్చినాడు అంటాము కదా.... అలాగని )

    రిప్లయితొలగించండి
  11. తాడిగడప శ్యామలరావుగురువారం, జనవరి 12, 2012 8:54:00 AM

    ఇంగితము లేని రచయిత
    లంగాగప్రదర్శనంబు లనగా గిలకన్
    తింగర గానము తోడై
    సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో

    రిప్లయితొలగించండి
  12. తాడిగడప శ్యామలరావుగురువారం, జనవరి 12, 2012 8:56:00 AM

    'తింగర గానము' అనేది దుష్టసమాసమే గాని సందర్భోచితమేనేమో! పోనీ అభ్యంతరం అనుకుంటే అది తీసివేసి 'వెంగళిగానము' అందాం.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ శ్యామలరావు గారూ!
    తింగర గానము అనేది దుష్ట సమాసము కాదు - తొలి పదము తెలుగు అగుట తప్పు కాదు కదా.

    రిప్లయితొలగించండి
  14. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, జనవరి 12, 2012 9:29:00 AM

    రంగ దభంగ భయంకర
    శృంగ మహోదధులు పొంగి చేలము దాటన్
    చెంగట ప్రళయ సునామీ
    సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో

    రిప్లయితొలగించండి
  15. మరి కొంతమందికి పాటలు రావు. అయినా కృషి చేయక మానరుగా ! మా చిన్నప్పుడు మా వీధిలో ఉండే మంగమ్మ గారు ఓ ఉదాహరణ.

    బెంగాలు బెబ్బులే తను
    సంగరమున నాడు విధము స్వరముల నెత్తిన్
    మంగమ్మ పాట పాడిన
    సంగీతము విన్నవారు చచ్చిరి తృటిలో !

    రిప్లయితొలగించండి
  16. అంగాంగం బులు నూ పిరి
    సంగీతము విన్న వారు , చచ్చిరి త్రుటిలో
    రంగని మరణము వినగనె
    భంగము నే జెంది రచటి భామలు నొయ్యన్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీమతి మంగమ్మ గారి శిష్యరికము వలన నాకు కూడా పాటలు రావు.అయినా పద్యాలు పాడుకొంటాను. వైద్యుడిని దగ్గఱ ఉండడము వలన విన్నవారు బ్రతికి పోయారు !

    రిప్లయితొలగించండి
  18. డి.నిరంజన్ కుమార్గురువారం, జనవరి 12, 2012 10:16:00 AM

    సంగీతముపై మోజుతొ
    మింగుడు పడనట్టిరాగమెంతో శ్రద్ధన్
    రంగండాలాపించగ
    సంగీతము విన్నవారు చచ్చిరి తృటిలో

    రిప్లయితొలగించండి
  19. తాడిగడప శ్యామలరావుగురువారం, జనవరి 12, 2012 11:42:00 AM

    శ్రీ నిరంజన్ కుమార్ గారి పద్యాన్ని ఇంకొంచెం గ్రాంధింకం చెయ్యాలి. 1.'మోజుతొ' బదులు 'మోజున' 2. 'రాగమెంతో' బదులు 'రాగమెంతయు' ఈ రెండూ చిన్న సవరణలే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డి.నిరంజన్ కుమార్గురువారం, జనవరి 12, 2012 12:16:00 PM

      శ్రీ శ్యామలరావు గారు, మీ సవరణలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై గుర్తుంచుకుంటానండీ.

      తొలగించండి
  20. సంగీతపు బరిలో తొలి
    సంగీతము విన్న వారు చచ్చిరి!!! త్రుటిలో
    చెంగున లేచిరి ఎమ్మెస్
    సంగీతము జాలువార సభికులు సభలో !!!

    రిప్లయితొలగించండి
  21. తాడిగడప శ్యామలరావుగురువారం, జనవరి 12, 2012 1:31:00 PM

    పీతాంబరు గారూ, "తొలి సంగీతము విన్న వారు చచ్చిరి" అన్నది సమంజసం గాదండీ. సుబ్బులక్ష్మిగారికన్నా ముందే మహాగాయుకులున్నారు కద సంగీతత్రిమూర్తులతో సహా. కేవలం మన కాలంలో ఆవిడొక ధృవతార అంతే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక చోట జరిగిన పాటల పోటీలో అలా జరిగిందని పీతాంబరధరుని భావం అయ్యున్టున్దండీ

      తొలగించండి
    2. సంగర రంగమొ కడలి త-
      రంగపు భంగమొ యనంగ రాతిరి వేళన్
      ఖంగున మ్రోగగ కటువగు
      సంగీతము విన్న వారు చచ్చిరి త్రుటిలో

      తొలగించండి
  22. శ్రీ శ్యామల రావుగారు నమస్కారం.నా భావము నొకానొక సంగీత కచేరి పోటిలో మొదలు పాడిన గాయకుల సంగీతాన్ని భరించలేక శ్రోతలు చచ్చారు ఎమ్మెస్ పాడిన గానం తో వారు లేచారని. మీరు బ్లాగులో సూచిస్తున్న సూచనలు, సలహాలు ఎంతో అముల్యంగా తోస్తాయి నాకు. నేను శ్రద్దగా గమనిస్తూ ఉంటాను .మీ సునిశిత పరిశీలనా శక్తి ,విషయ పరిజ్ఞానం ప్రశంస నీయము.
    మొదటి పాదాన్ని ఇలా " సంగతులన్నియు తడబడ " సవరిస్తే బాగుం టుoదంటారా !

    మిస్సన్న గారి రెండు పూరణలు ఆణి ముత్యాలు .

    రిప్లయితొలగించండి
  23. శ్రీ రాజారావుగారూ,

    "సునామీ సంగీతము " - అద్భుతమైన ప్రయోగము.

    రిప్లయితొలగించండి
  24. డి.నిరంజన్ కుమార్గురువారం, జనవరి 12, 2012 5:12:00 PM

    రంగస్థలమాయె రణము
    డింభకుడొక్కడు వడివడి ఢీకొన రిపులన్
    అంబర మంటిన రవముల
    సంగీతము విన్నవారు చచ్చిరి తృటిలో

    రిప్లయితొలగించండి
  25. రంగ స్థలి వికృతముగా
    అంగమ్ముల నూపి భీకరారవములతో
    డంగానము చేసెడి 'రాక్'
    సంగీతము విన్నవారు చచ్చిరి తృటిలో.

    రిప్లయితొలగించండి
  26. శ్రీగురుభ్యోనమ:

    ఇంగిత మెంతయు పట్టక
    భంగము కలిగించునట్లు పదుగురిలోనన్
    సింగారించిన సెల్లుల
    సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో

    బస్సులలో,రైళ్ళలో ఈ చైనాసెల్లుల సంగీతం వినలేక చస్తున్నామనుకో అనే వారిని చాలామందిని చూసి ఆ అభిప్రాయంతో వ్రాసినాను.

    రిప్లయితొలగించండి
  27. గురువుగారికి మరియు సాటి కవిమిత్రులకు శ్రీ వివేకానందుని జన్మదిన శుభాకాంక్షలు. ఒకానొక అవధానములో శ్రీ మాడుగుల నాగఫణిశర్మగారు వివేకానందుని గురించి యిలా చెప్పారు.

    ఆహా ఆంతరశోభమాదని వివేకానందుడే చెప్పె ప్ర
    త్యూహాపోహల వేళ నీకు నిజ సద్యోదృష్టి వీక్షింపుమీ
    "సోహం"బన్న నిజాద్వయస్థితిగతిన్ చూపింపగా భారతీ
    స్నేహంబే శరణంబు మీదు గుణరాశింజూచి పెంపొందు మీ
    గోహైన్యస్థితి చీకుచింతలచికాగో పట్టణశ్రేష్ఠమా!

    రిప్లయితొలగించండి
  28. గురువర్యులు శ్రీ పండిత నేమానిగారికి నమస్సులు. ఆర్యా మీ సూచనలకు ధన్యవాదములు. శార్దూల పద్యము 3వ పాదములో "మదిలో" అన్న పదమును బ్రాకెట్లలో చూపించాలనుకొన్నాను. టైపాటుగా మరచితిని. అక్కడ "తలపే" అన్న పదమునుగానీ లేక "మదిలో" అన్నపదమునుగానీ ఒకదానిని మాత్రమే చదువుకొనవలచినదిగా విన్నవించుచున్నాను.
    సవరించిన పద్యము

    వేగంబౌ తన వాక్ప్రవాహ ఝరితో వేదాంతసింహంబుగా
    నూగించెన్ గురు రామకృష్ణ ప్రభతో నుప్పొంగి భూగోళమున్
    ఆగంభీర మహామనీషి (తలపే) మదిలో నాహ్లాదమందించగా
    శ్రీగౌరీశు పదాబ్జ సేవ ఫలమే సిద్ధించు శీఘ్రమ్ముగా

    రిప్లయితొలగించండి
  29. రాజారావుగారూ మీ పూరణ అద్భుతముగా ఉన్నదండి. అభినందనలు.
    సంపత్ కుమార్ శాస్త్రిగారూ శ్రీ శర్మగారి చక్కని పద్యమును వుటంకిచినారు.

    రిప్లయితొలగించండి
  30. అయ్యా శ్రీపతి శాస్త్రి గారూ!
    మీరు శ్రీ రాజారావు గారిని ప్రశంసిస్తూ చివరలో వుటంకించేరు అన్నారు. తెలుగులో వు, వూ, వొ, వో లతో మొదలయ్యే పదములు లేవు. ఉటంకించేరు అనాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. నా ప్రమేయం లేకుండానే వ్యాఖ్యల ఫాంట్ సైజు, ప్రకటన విధానం మారింది. ‘ప్రత్యుత్తరం’ అనేది జత అయింది. తేదీ, సమయం తప్పుగా వస్తున్నవి. సవరించడానికి నేను చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    కంద పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    స్వామి వివేకానందుల గూర్చి మీరు వ్రాసిన పద్యాలు బాగున్నాయి. ధన్యవాదాలు.
    నేమాని వారి సూచనలను, సవరణలను గమనించారు కదా!
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ సూచన బాగుంది. కాని ఇప్పటికే కాలాతీతం అయింది. ఇప్పుడు సవరించడం వీలుకాదు కదా!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘సింగరులు’ అన్నారు. కాబట్టి ‘తిట్టి రేర్యల్ శాస్త్రిన్’ అనవలసింది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘కృంగించెడు యీ కుహనా’ అన్నచోట ‘కృంగగ జేసెడు కుహనా’ అంటే బాగుంటుందనుకుంటాను.
    *
    శ్యామలరావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సునామీ సంగీతాన్ని వినిపించిన మీ పూరణ గంభీరంగా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మంగమ్మ సంగీతపు పూరణ చమతారభరితమై అలరించింది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    హాస్యస్ఫోరకమైన మీ పూరణ బాగుంది.
    మీ రెండవ పూరణ కూడా అలరించింది. అభినందనలు.
    శ్యామల రావు గారి సూచనలను గమనించారు కదా!
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    కడు చక్కని పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. దయచేసి ఎవరైనా ఫాంటు సైజును పెంచే సలహాను ఇస్తారా? ఎవరూ చెప్పలేక పోతే ‘జ్యోతి’ గారిని శరణు కోరుతాను.

    రిప్లయితొలగించండి
  33. హమ్మయ్య! ఎవరి సహాయం లేకుండానే ఏవేవో క్లిక్ చేస్తే వ్యాఖ్యల పూర్వపు ఫాంట్ సైజ్ వచ్చింది.

    రిప్లయితొలగించండి
  34. సంపత్ కుమార్ శాస్త్రి గారికి,శ్రీపతి శాస్త్రి గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  35. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, జనవరి 12, 2012 11:52:00 PM

    ఫాంటు సైజు కొంత మారింది కానీ అదివరకు సైజు రాలేదు. అంతకన్నా ముఖ్యం - మీ హోమ్ పేజి మీద సమస్య నొక్కగానే మొత్తం ఫార్మాట్ మారి పోయింది. ఇప్పుడు ఆంధ్రామృతం ఫార్మాట్ లాగా కనిపిస్తోంది. ఇది మొత్తం సమస్యా పూరణములు ఒక పట్టున చదవటానికి ఏమాత్రం వీలుగా లేదు. మరలా వెనకకి తెచ్చే ప్రయత్నం చేయగలిగితే మంచిది.

    రిప్లయితొలగించండి
  36. బ్లాగరుని కామెంటు బాక్సు
    హుష్ కాకీ అయ్యే సాఫ్ట్వేరు ప్రాబ్లేమున
    అయ్యవార్లు దిగాలు పడిరి త్రుటిలో

    వాయిద్యం కన్ను మిన్ను కానక
    వా అని శబ్దము చేసే కరంటు ప్రాబ్లమున
    ఆ సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో !

    శంకరార్యా,

    మీరు ఏమి మార్చినారో సెలవీయండి. నా బ్లాగు లో కూడా కామెంటులు సమస్య అయి కూర్సున్నవి ! మార్చి చూస్తాను !

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  37. క్షమిం చాలి , నిరంజన్ గారి రెండవ పూరణలో రెండు మూడు పాదాలు ? ? ?

    రిప్లయితొలగించండి
  38. మంగళపు మురళి కృష్ణని
    సంగీత మందు కోవిదు డని సన్మానిం పన్ !
    సింగడు తనరుచు పాడగ
    సంగీతము విన్న వారు చచ్చిరి తృటిలో !
    ----------------------------------------------------
    ఖంగున పాడిన పడతిని
    గంగాఝరి తనదు గళము కవ్వించు మదిన్ !
    సింగారి గళము నపశృతి
    సంగీతము విన్న వారు చచ్చిరి తృటిలో !

    రిప్లయితొలగించండి
  39. ctl,+ ను ఒకేసారి నొక్కుతే అక్షరాల పరిమాణమును పెంచుకోవచ్చును. ఇక్కడ గారడీ విద్య తెలిసిన వారెవరా అని ఆలోచిస్తున్నాను !

    రిప్లయితొలగించండి
  40. ctrl ++, ctrl-- అనేవి (zoom in, zoom out) స్క్రీన్ సైజు పెంచటానికి తగ్గించటానికి వాడతాము. స్క్రీన్ సైజు తో పాటు అక్షరం సైజు పెరుగుతుంది. ఈ టెక్నిక్ ఫాంటు సైజు పెంచదు. టెంపోరరీ గా ఉపయోగపడుతుంది.

    రిప్లయితొలగించండి
  41. ఫాంటు సైజు పెరగాలన్నా , తరగాలన్న , కుడి చేతి వైపు క్రిందుగా టైం కనబడు తుంది కదా ! దానికి కొంచం పైన + లాగ గ్రీన్ గా మెరుస్తుంది .అక్కడ క్లిక్ చేస్తే , ఫాంట్ పెరగడం తరగడం .

    రిప్లయితొలగించండి
  42. తమ్మిచూలి సంతతమ్మును ధ్యానించు
    నమ్మ పాదములు రసాన్వితములు
    అమృతమయములైన ఆ పాదములను నె
    త్తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  43. నింగిని నంటెడు మైకుల
    కంగారు ధ్వనుల రణగొణ గణపతి గుడిలో
    బొంగురు చర్చి మసీదుల
    సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో

    రిప్లయితొలగించండి
  44. చెంగున మలేరియాలును
    డెంగీ ఫైలేరియాలు ఠీవిగ నిడెడిన్
    బంగాలందున దోమల
    సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో

    రిప్లయితొలగించండి


  45. భంగును తాగిరి పూటుగ
    చెంగున నెగిరిరి పకపక సెహభేషనుచున్
    భంగిమల నాట్య మాడుచు
    సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో !

    జిలేబి

    రిప్లయితొలగించండి