5, జనవరి 2012, గురువారం

చమత్కార పద్యాలు - 166/A

ప్రహేళిక సమాధానం


వనే వసతి కో వీరః
యోऽస్థిమాంస వివర్జితః |
అసివత్ కురుతే కార్యం
కార్యం కృత్వా వనే గతః ||


ఉండు వనమునందు నుండ వస్థులు మాంస
మొనరఁ గత్తివలెను పనులఁ జేయుఁ
గార్యమైన పిదపఁ గడగి వనముఁ జేరు
నట్టి మేటి యెవరొ యరయఁ గలరె?


సమాధానం 
కుమ్మరివాడు కుండలు కోసే దారం
అది ఎముకలు, మాంసం లేనిది, వనం(నీటి)లో నివసిస్తుంది. కత్తిలాగా కుండను కోస్తుంది. పని పూర్తికాగానే వనం(నీటి)లోనికి చేరుతుంది.

1 కామెంట్‌:

  1. శంకరార్యా ! ధన్యవాదములు !
    అబ్బో ! చాలా కష్టమైన ప్రహేళిక !

    దారంతో కూడా కోస్తారన్న మాట !
    ఆ దిశగా ఆలోచించడ మసాధ్యం !

    రిప్లయితొలగించండి