ప్రహేళిక సమాధానం
కృష్ణముఖీ న మార్జారీ
ద్విజిహ్వా న సర్పిణీ |
పంచభర్త్రీ న పాంచాలీ
యో జానాతి స పండితః ||
నల్ల నగును ముఖము, పిల్లి కానేకాదు;
నాల్క లుండు రెండు, నాగు కాదు;
పంచభర్తృక యగుఁ బాంచాలి కాఁబోదు;
దీని నెఱుఁగువాఁడె ధీయుతుండు.
కృష్ణముఖీ న మార్జారీ
ద్విజిహ్వా న సర్పిణీ |
పంచభర్త్రీ న పాంచాలీ
యో జానాతి స పండితః ||
నల్ల నగును ముఖము, పిల్లి కానేకాదు;
నాల్క లుండు రెండు, నాగు కాదు;
పంచభర్తృక యగుఁ బాంచాలి కాఁబోదు;
దీని నెఱుఁగువాఁడె ధీయుతుండు.
సమాధానం - కలము (పెన్ను)
సమాధానం చెప్పే ప్రయత్నం చేసిన రాజేశ్వరి అక్కయ్యకు, సుబ్బారావు గారికి అభినందనలు.సనత్ శ్రీపతి గారికి, అజ్ఞాత గారికి ధన్యవాదాలు.
పెన్ను పంచ భర్త్రుక ఎలా అయిందో నా చిన్ని బుర్రకు అర్థం కావడం లేదుగురువుగారూ.
రిప్లయితొలగించండిఅయిదు వేళ్ళతో పట్టుకుంటాం కదా!
రిప్లయితొలగించండిఇప్పటి పెన్నులు సన్నగా, నాజూగ్గా ఉంటున్నాయి కాని వెనుకటి ‘ఫౌంటెన్’ పెన్నులు చాలా లావుగా అయిదు వేళ్ళతో పట్టుకునేట్లు ఉండేవి. నా చిన్నప్పుడు అలాంటి పెన్ను వాడిన అనుభవం ఉంది.
ఆ అనుభవం నాకూ ఉంది. ధన్యవాదాలు గురువుగారూ.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు,
రిప్లయితొలగించండిపెన్ను అనగా తమిళం లో అమ్మాయి అని. ద్రౌపది పెన్నే కదా! పంచ భర్తృక!
కలం తేగలిగిన మార్పు కత్తి చేయలేదు. అలాగే 'పెన్ను' సమాజం లో తీసుకు రాగలిగే మార్పు 'పెన్నిధి' చేయలేడు !
చీర్స్
జిలేబి.
జలేబి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
అయినా జిలేబి గారూ,
రిప్లయితొలగించండితమిళంలో అమ్మాయిని ‘పొన్ను’ అంటారేమో? అది పెన్ను కాదేమో?
మరోచరిత్రలో కమలహాసన్ మంచి అమ్మాయి అనే అర్థంలో ‘నల్లపొన్ను(ణ్ణు)’ అన్నట్టు గుర్తు.
మాంచి మాట గుర్తు చేసారు.
రిప్లయితొలగించండిపెన్, సరిఐనది నాకు తెలిసినంత వరకు.. ఈ ణకారం టైపు లో సరిగా రావటం లేదు. పొన్ను కూడా కరెక్టే ! ఎన్న పొన్నూ నల్లా ఇరుక్కియా ? అనడం కద్దు.
మరో చరిత్ర లా చెప్పాలంటే, ఈ నల్లా నల్లా ఏమి అనాలి !
జిలేబి.
పెణ్ అంటే స్త్రీ, పెణ్ గళ్ అంటే స్త్రీలు, ఆడవారు అని అర్థం.
రిప్లయితొలగించండిపొణ్ అని సాధారణం గా వ్యావహారికంలో పొణ్ణు అని అమ్మాయి, పాప అనే అర్థంలో వాడతారు. ఇది రాయటంలో ఉండదనుకుంటాను.
పొంబళె అని (స్త్రీ) కి వ్యావహారికంలో పదము.
ప్రహేళిక బాగున్నది.
sir! very nice
రిప్లయితొలగించండిమందాకినీ గారు,
రిప్లయితొలగించండిపెణ్ 'గళం' 'వెంగలం' ! భేషో!
చీర్స్
జిలేబి.
మందాకిన గారూ,
రిప్లయితొలగించండిమంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.
జిలేబిగారూ ధన్యవాదాలు. మందాకినిగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి