21, జనవరి 2012, శనివారం

సమస్యాపూరణం - 598 (కాకులు కొంగలున్ మరియు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.   
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

49 కామెంట్‌లు:

  1. మాస్టారూ, నాకు అర్థమయినంతవరకు ఈ రోజు సమస్య పక్షిజాతిలోని కొన్నిటిని పేర్కొన్నది. అంతకు మించితెలియనిఅర్థం ఏదైనా దాగి యున్నదా?

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారూ,
    విశేషార్థం ఏమీ లేదు. సమస్య అసలే లేదు, పాదపూరణమే అనుకోండి. ఇచ్చిన పాదాన్ని వినియోగించుకొని పద్యం వ్రాయడమే.
    (వాస్తవానికి ఇది గతంలో ఒక అవధానంలో పృచ్ఛకుడు ఇచ్చిన సమస్యే!)

    రిప్లయితొలగించండి
  3. లోకులు ఎన్నుకున్న ఘన లోక్సభ యందున నెంచి చూడగా
    లోకము మేలు గోరి శుభ రీతుల శ్రద్ధను జూపి గట్టిగా
    వాకొని పోరు హంసలవి వచ్చును తక్కువ తక్కినందరున్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    రిప్లయితొలగించండి
  4. భీకర సంగరంబు నను మృత్యు కరాళపు నృత్యమందునన్
    కోకిల గానముల్ వినగ కోరకు మయ్యరొ బుద్ధిహీనతన్.
    నీ కులమంత కూలునిట, నేలను నిండును మాంసఖండముల్,
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    మహాభారత యుద్ధంలో ఒకరి పలుకులు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిశనివారం, జనవరి 21, 2012 8:33:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    భీకరమైన ఘర్జనకు భీతిలుచుండగ జంతుజాలముల్
    ఆకొనినట్టి సింహము రయంబున జంపె మదేభరాజమున్
    చీకటి సంధ్యవేళలకు జేరిరి కాయపు
    చీకటి వేళకున్ గుహను జేరగ, వ్రాలెను పక్షిజాలముల్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్

    రిప్లయితొలగించండి
  6. మాస్టరు గారూ ! నేను క్రొత్తగా శ్రీకారం చుట్టిన
    " కవి'తల' అలలు " అను బ్లాగును ఒక పరి మీరు వీక్షించి మీ అమూల్య మైన అభిప్రాయమును,సూచనలను తెలుప వలసినదిగా కోరు చున్నాను.
    కవి మిత్రులందరకు సుస్వాగతము.నా బ్లాగును వీక్షించి అభిప్రాయములు తెలుపవలసినదిగా మనవి.

    రిప్లయితొలగించండి
  7. హనుమచ్చాస్త్రి గారూ మందాకిని గారూ వేగంగా చాలా మంచి పూరణల నిచ్చారు, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ కరుడైన దేవునెడ చిత్తము నిల్పక స్వార్థ బుద్ధితో
    పీకల గోయుచున్ పరుల పీడన జేతురు నిర్దయాత్ములా-
    హా కపటుల్ మనుష్యులె మహా పశువుల్ మరి మేలు గాదె యా
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    రిప్లయితొలగించండి
  9. ఆహా ..కపటుల గురించి చక్కగా చెప్పారండీ మిస్సన్న గారూ!
    భీకర సంగరంబున కోకిల గానం వినిపించిన మందాకిని గారి పూరణ బాగుంది.
    భీకర సింహ గర్జనము వినిపించిన శ్రీపతి గారి పూరణ చక్కగా నున్నది.

    రిప్లయితొలగించండి
  10. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.

    శోకితులన్న నిర్దయులు, చొక్కపు మాటల బల్కు ధూర్తులున్ ,
    ఏకముగా గుడిన్ మరియు నింకను లింగము మ్రింగు దుష్టులున్,
    పీకలు గోయు సోకులును, పీనుగులన్ కబళించు నీచులున్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    రిప్లయితొలగించండి
  11. మాస్టారూ, మిమ్మల్ని వేసిన ప్రశ్ననే పూరణ రూపంలో:
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్
    వాకొన పక్షిజాతులవి వచ్చిన శంకన చంద్రశేఖరుం
    డీకలు పీకుచున్ వదరె- “యేమది కీలక మిచ్చటేమియున్
    నాకును కానరాదుగద” -నామతి మండక మున్నెకోరెదన్
    శ్రీకర కందిశంకరులఁ శీఘ్రముగా యుతకంబు మాయగన్!

    రిప్లయితొలగించండి
  12. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణలో రెండవ పాదంలో యతి తప్పింది.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ మొదటి పాదంలో యతిదోషం. ఉత్వవిశిష్ట పవర్గకే యతి చెల్లుతుంది. అంటే పుఫుబుభుము లకు మాత్రమే యతిమైత్రికి కూర్చాలి.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణలో అసంపూర్తిగా ఉన్న మూడవపాదాన్ని తొలగించడం మరిచిపోయినట్టున్నారు.
    *
    చంద్ర శేఖర్ గారూ,
    `ఉతకంబు ...?

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖర్ గారూ,mi కవి'తల' అలలు chala bagunnadi.
    tappaka telugunu kApADukuMdAM sir

    varaprasad

    రిప్లయితొలగించండి
  14. సవరణలకు గురువు గారికి ధన్యవాదములు.
    ------
    నేతలు దొంగలై, దొరలు, నేతలు దోచిరి దేశసంపదల్,
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్
    జంపును నిర్థయంబుగను, సాధన జేయును ధర్మసూక్ష్మముల్,
    దారిని జూపు లోకులకు దప్పక, నీచులు బుద్ధిహీనులై|
    ( నీచులు దేశసంపదను దోచి, అడ్డుపడు వారిని జంపి, తమ వారసులకు దారులు (మార్గములను) జూపు)

    రిప్లయితొలగించండి
  15. సవరణలకు గురువు గారికి ధన్యవాదములు.
    ------
    నేతలు దొంగలై, దొరలు, నేతలు దోచిరి దేశసంపదల్,
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్
    జంపును నిర్థయంబుగను, సాధన జేయును ధర్మసూక్ష్మముల్,
    దారిని జూపు లోకులకు దప్పక, నీచులు బుద్ధిహీనులై|
    ( నీచులు దేశసంపదను దోచి, అడ్డుపడు వారిని జంపి, తమ వారసులకు దారులు (మార్గములను) జూపు)

    రిప్లయితొలగించండి
  16. కాకులుకొంగలున్ మరియుగ్రద్దలుడేగలు రాపులుంగులున్
    కేకులు కోకిలమ్మలును కీరములున్ గల పుల్గు పోలికల్
    లోకములోని మానవుల లోను గనంబడు వింతగాదు ల క్కాకుల వారి మాట వినగా సఖు లందరు తిట్ట బోరుగా

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతిశాస్త్రిశనివారం, జనవరి 21, 2012 2:09:00 PM

    భీకరమైన ఘర్జనకు భీతిలుచుండగ జంతుజాలముల్
    ఆకొనినట్టి సింహము రయంబున జంపె మదేభరాజమున్
    చీకటి వేళకున్ గుహను జేరగ, వ్రాలెను పక్షిజాలముల్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్

    గురువుగారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారు,
    మన్నించండి. మృత్యు పదాన్ని భీమ గా మారుస్తున్నాను.

    భీకర సంగరంబు నను భీమ కరాళపు నృత్యమందునన్
    కోకిల గానముల్ వినగ కోరకు మయ్యరొ బుద్ధిహీనతన్.
    నీ కులమంత కూలునిట, నేలను నిండును మాంసఖండముల్,
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    మహాభారత యుద్ధంలో ఒకరి పలుకులు.

    రిప్లయితొలగించండి
  19. లోకపు తీరు నేమనెదు? లోభులు, క్రూరులు, మోసగాళ్ళు చీ
    కాకులు వెట్టుచుండ కలికాలపు పోకడలందు ధర్మమే
    లేక నలుంగ సాధుతతి, ప్రేముడి జూపుచు గూర్చు సాయమున్
    కాకులు, కొంగలున్ మరియు గ్రద్దలు, డేగలు, రాపులుంగులున్

    రిప్లయితొలగించండి
  20. మాస్టారూ,
    "యుతకము" నకున్న నానార్థాలలో "సంశయము" ఒక అర్థము. నాల్గవ పాదాంతంలో మొదట "యుతకంబు తీరగన్" వేసి దానిని "యుతకంబు మాయగన్" అని మార్చాను. "యుతకంబు మాయగన్" అంటే సందేహము తీరుటకు" అనే భావములో.

    రిప్లయితొలగించండి
  21. వరప్రసాద్ గారూ, మీరు హనుమచ్చాస్త్రి గారి బ్లాగుని నాదనుకొన్నారు. ఆ క్రెడిట్ వారికే చెందుతుంది.

    రిప్లయితొలగించండి
  22. మిత్రులారా! ఈనాటి పాదము పక్షి గణముతో నిండి యున్నది. మిత్రుల పూరణలలో వైవిధ్యము అలరించుచున్నది. అందరికీ అభినందనలు. శ్రీ వరప్రసాద్ గారు ప్రాస నియమము పాటించుటను పట్టించుకొనలేదు. కవయః నిరంకుశః కదా. ఎక్కడి కక్కడే సంతోషము. భావము బాగున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. క్షమించాలి . ఇదినా మొదటి ప్రయత్నం. తమ్మునికి బోలెడు పని.

    వ్యాకుల పాటులన్ మఱచి వారిజ లోచన గాంచుమీ వనం
    వేకువ జామునన్ గలసి వేడుక మీరగ మోదమున్ గండు
    కోకిల పాటలున్ వినుచు కోటివ సంతము నుండిమై కమున్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుం గులున్ !

    రిప్లయితొలగించండి
  24. శ్రీకర భాగ్యశాలి యగు సీతను గైకొనుదుష్టచిత్తమున్
    భీకరరావణాసురుడు భిక్షకవేషము దాల్చి రావగా,
    తేకువజెంది పారినవి దిక్కునకొక్కటిగాగ జంతువుల్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    రిప్లయితొలగించండి
  25. కోకిల, హంస, రాచిలుక, కొమ్మల నూగెడు వానరమ్ములున్,
    చీకటి వేళ కన్నులను చీల్చుకు చూచెడి గబ్బిలమ్ములున్,
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్,
    లోకమునున్నజీవములలోపల నున్నది దేవదేవుడే

    రిప్లయితొలగించండి
  26. రాజేశ్వరి గారూ మీ పూరణ లోని ఊహ మనోఙ్ఞం .

    కాకులుకొంగలున్ మరియుగ్రద్దలుడేగలు రాపులుంగులున్
    వేకువ జామునన్ గలసి వేడుక మీరగ మోదమంది పుం
    స్కోకిల పాటలన్ వినగ గోరెడి భావన నేదునూరికిం
    గాక మరింక నెవ్వరికి గల్గు శభాష్ కవయిత్రి యూహకున్

    రిప్లయితొలగించండి
  27. కాకులుకొంగలున్ మరియుగ్రద్దలుడేగలు రాపులుంగులున్
    కోకిల పాటలన్ వినెడి కోరికఁ గూడిన వన్న సోదరీ
    మీకయి నట్టి భావనను మేలగు రీతిని మెచ్చినారు ల-
    క్కాకుల వారు మేలనుచు గౌరవ మాయెను మీకు గంటిరే!

    రిప్లయితొలగించండి
  28. మాస్టారు గారూ ! ధన్యవాదములు.
    చక్కని పూరణలు చేసిన మిత్రులందరికి అభినందనలు.
    వరప్రసాద్ గారూ , చంద్ర శేఖర్ గారూ నాబ్లాగును మెచ్చినందులకు ధన్యవాదములు.

    నా పూరణ సవరణ తో...

    లోకులు ఎన్నుకున్న ఘన లోక్సభ యందున నెంచి చూడగా
    లోకము మేలు గోరి మది రోయక శ్రద్ధను జూపి గట్టిగా
    వాకొని పోరు హంసలవి వచ్చును తక్కువ తక్కినందరున్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    రిప్లయితొలగించండి
  29. రాకు మహేంద్ర జాలమిది రాచిలుకా! కవికోకిలల్ మహా
    పోకిరులమ్మలేనివిధముల్ వచియింత్రు-వసంతమేడ? మీ
    కాకులుకొంగలున్ మరియు గ్రద్దలుడేగలురాపులుంగులున్
    కేకలు వేయుటల్ వినవ? గింజలు లేక వనమ్ములెండగా

    రిప్లయితొలగించండి
  30. మిత్రులారా!
    కవికోకిలల్ మహా పోకిరులమ్మ!
    శంకరాభరణము బ్లాగులో ఎందరో మంచి మంచి కవులు ఉన్నారు. వారందరనీ చాల కించపరిచే విధముగా చెప్పుట సబబేనా?
    శ్రీ శంకరయ్య గారు మిగిలిన కవులు దీని గురించి ఏ విధముగా స్పందించ వలెనో కదా!
    భగవాన్! ఇట్టి దోషము పరిహారమగు గాక!

    రిప్లయితొలగించండి
  31. సాకులు గావు రాచిలుక సత్యమె పచ్చని ఈ వనమ్మునన్
    కాకులుకొంగలున్ మరియు గ్రద్దలుడేగలురాపులుంగులు-
    న్నేకత చాటుచున్ మదికి నింపుగ కూడిన వేళ రక్తిమై
    కోకిల కూ కుహూ యనుచు కూసెడి రమ్య వసంత భావనన్.

    రిప్లయితొలగించండి
  32. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే! చట్టసభల్లో ‘హంసలు’ తక్కువే! చక్కని పూరణ. అభినందనలు.
    మీ బ్లాగు వీక్షించాను. బాగుంది. శబ్దచమత్కారాల కవితలు ప్రశంసనీయంగా ఉన్నాయి. మీ బ్లాగుకు వీక్షకసంఖ్యాభివృద్ధిరస్తు!
    *
    మందాకిని గారూ,
    చక్కని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
    ఇంతకీ సమస్య పాదాన్ని ఏ అన్వయంతో సమర్థించినట్టు?
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మనోజ్ఞమైన పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ నాలుగు పూరణలు (అందులో ఒకటి ప్రశంసాత్మకం) అన్నీ చక్కని భావసంపదతో, పదౌచిత్యంతో అలరారుతున్నాయి. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    ఆహా! ఇదేదో తప్పించుకొని వెక్కిరించే కొత్త పద్ధతి. బాగుంది. సమస్యా పూరణకు క్రొత్తదారి చూపినట్లయింది. చక్కగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    భావం బాగుంది. అభినందనలు.
    కాకుంటే ప్రాసను గమనించినట్టు లేదు. నా సవరణకూ లొంగకుండా ఉంది.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ మాటలతో మాకు ‘కేకులు’ తినిపించారు. ప్రశంసిస్తామే కాని తిట్టడమా? సమస్యను చమత్కారంగా పూరించారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘పోకిరులు’ శబ్దం గురించి ... ‘నిరంకుశాః కవయః’ అన్నారు కదా! ‘పోకిరి’ శబ్దానికి ‘దుష్టబుద్ధి గలవాడు’ అనే అర్థం ఉంది. లక్కాకులవారు ‘చిలిపివారు’ అనే అర్థంలో ప్రయోగించి ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటివాటిని ఉపేక్షిద్దాం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    వృత్తరచనలో మొదటి ప్రయత్నమైనా అందమైన పద్యం చెప్పారు. అభినందనలు.
    మొదటి పాదం చివర ‘వనం’ అన్నారు. దానిని ‘వనిన్’ అందాం. రెండవ పాదం చివర ‘మోదమున్ గండు’ అని గణదోషం. దానిని ‘మోదమందగా’ అందాం. మిగితా అంతా ఓ.కే. నన్నెక్కువ శ్రమ పెట్టలేదు లెండి!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    ‘రావగా’ అన్నారు. దానిని ‘వచ్చినన్’ అని సవరిద్దాం.

    రిప్లయితొలగించండి
  33. అభిమానించిన సోదరు లందరికీ ధన్య వాదములు + కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  34. వేకువజామునన్ నిదర వీడఁగఁ జూచితి దూరదర్శనం
    బా కమనీయ చానెలలయందున డిస్కవరీ యనంగ నం
    దేకముగాగ నొక్కయెడ నెల్లమృగంబులఁ బక్షిజాతులన్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    రిప్లయితొలగించండి
  35. శంకరార్యా ! నా కవి'తల' అలలు బ్లాగును వీక్షించి ప్రశంసాయుత ఆశీస్సు లందించి నందులకు కృతజ్ఞతా పూర్వక నమస్కారములు.
    మీ 'డిస్కవరీ' పూరణ చక్కగా 'కవరు' చేసినది.

    రిప్లయితొలగించండి
  36. గురువుగారు,
    అందమైన , అనాకారులైన అన్ని జీవుల్లో ఉన్నది దేవదేవుడే అని చెప్పానండి. సమస్యలో ఉన్న ప్రాణులైనా, చక్కటి రాచిలుకల్లోనైనా ఉన్న జీవుడొకడే అన్నది అన్వయం.కుదరలేదంటారా?

    రిప్లయితొలగించండి
  37. మందాకిని గారూ,
    నేను చెప్పింది మీ మొదటి పూరణ గురించి.
    ‘నేలను నిండును మాంసఖండముల్’ అనే దానికి ‘కాకులు కొంగలున్ ...’ అనే పాదం ఎలా అన్వయిస్తున్నదని సందేహం.
    మీ రెండవపూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రావణుని శవాన్ని జూచిన మండోదరి :

    01)
    ____________________________________________

    కోకిల రూపువాడు ఘన - కోవిదుడాతడు ! లాభమేమహో ?
    కాకులు కొంగలున్ మరియు - గ్రద్దలు డేగలు రాపులుంగులున్
    పీకుచు లాగుచున్న యవి - ప్రీతిని ప్రేతపు రావణాసురున్
    నీకిదె తగ్గ శిక్ష యని - నీరజ లోచన సిగ్గు జెందుచున్
    శోకము యుప్పతిల్ల గని - సొమ్మను బొందెను యుద్ధరంగమున్ !
    ____________________________________________
    సొమ్మ = మూర్చ

    రిప్లయితొలగించండి
  39. యుద్ధరంగంలో పరుషంతో మాట్లాడుతూ, నీకులమంతా కూలును, నేలంతా మాంసఖండములు పడిఉండగా వాటిని తినడానికి కాకులు మొదలైన పక్షులు అన్నీ నేలంతా నిండుతాయని నా భావమండి గురువుగారు.

    రిప్లయితొలగించండి
  40. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘శోకము + ఉప్పతిల్ల’ అన్నప్పుడు యడాగమం రాదు. అలాగే ‘సొమ్మను బొందెను’ ప్రయోగం కృతకంగా తోస్తున్నది. ఆ పాదానికి నా సవరణ ....
    ‘శోకము సంజనింప గని - సొమ్మసిలెన్ గద యుద్ధమందునన్’
    *
    మందాకిని గారూ,
    నిజమే. అందులో అన్వయాన్ని కూర్చే పదం లోపించింది కదా!

    రిప్లయితొలగించండి
  41. గురువు గారు, ఇప్పుడు కుదిరిందండి. ధన్యవాదాలు.

    భీకర సంగరంబు నను భీమ కరాళపు నృత్యమందునన్
    కోకిల గానముల్ వినగ కోరకు మయ్యరొ బుద్ధిహీనతన్.
    నీ కులమంతకూలునిట, నేలను వాలును భోజనమ్ముకై
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.

    మహాభారత యుద్ధంలో ఒకరి పలుకులు.

    రిప్లయితొలగించండి
  42. శంకరార్యులకు ధన్యవాదములతో :

    రావణుని శవాన్ని జూచిన మండోదరి :

    01అ)
    _______________________________________

    కోకిల రూపువాడు ఘన - కోవిదుడాతడు ! లాభమేమహో ?
    కాకులు కొంగలున్ మరియు - గ్రద్దలు డేగలు రాపులుంగులున్
    పీకుచు లాగుచున్న యవి - ప్రీతిని ప్రేతపు రావణాసురున్
    నీకిదె తగ్గ శిక్ష యని - నీరజ లోచన సిగ్గు జెందుచున్
    శోకము సంజనింప గని - సొమ్మసిలెన్నట యుద్ధభూమిలో !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  43. కాకులు కొంగలున్ మరియు గద్దలు డేగలు రాపులుంగులున్
    ఏకరువెట్టి పూరణల నిమ్మని జెప్పిన మీదటన్నిటన్
    ఈకలు తోకలున్ బెరికి యీకవి సంఘము గొప్పగొప్పగా
    కాకలు దీరినారుతమ కవ్వనమందున చూడముచ్చటన్

    లక్కాకులవారూ.....

    మీకటులేలదోచినది మిత్రులకేలది మిమ్ము దిట్టుటల్
    లోకములోనివాస్తవములేకద మీరిటదెల్పినారు ల
    క్కాకులవారు మీరతిగ గాబరజెందకుడెంతమాత్రమూ
    కాకులు కొంగలున్ మరియు గద్దలు డేగలు రాపులుంగులున్

    రిప్లయితొలగించండి
  44. నిరంజన్ కుమార్ గారూ,
    మీ పూరణ, లక్కాకుల వారిని సంబోధించిన పద్యం రెండూ బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  45. నెల్లూరి వైభవం:

    భీకరమైన జంతువులు భీతిని గొల్పెడు కృష్ణసర్పముల్
    సూకర జాలముల్ కరులు చూపులకందగ లేవులేవిటన్
    వేకువ జామునన్ కలవు వేడుక మీరగ నేలపట్టునన్
    కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్

    రిప్లయితొలగించండి