కవిమిత్రులారా, ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే! (ఇది మత్తకోకిల. దీని గణాలు ర-స-జ-జ-భ-ర. యతిస్థానం 11. ప్రాసనియమం ఉంది) ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
ఈనాటి ప్రక్రియ చాల ప్రశంసనీయము. సత్కవి వతంసులకు చక్కని అవకాశము. ఆ విధముగానే అందరును రసమాధురితో పద్యములను మత్తకోకిల గళముతో కమనీయముగా అలరింపజేసేరు. అందరకీ అభినందనలు.
శంకరయ్య గారూ, ఈ వ్యాఖ్య ఎక్కడ వ్రాయాలో తెలియక ఇక్కడ వ్రాస్తున్నాను. అసందర్భమైతే మన్నించాలి.
ఎందరో గొప్ప కవులకు తీసిపోని పద్యాలిక్కడ పొగవుతున్నాయి. అయితే ఇక్కడ ఛందస్సు గురించిన అవగాహన ఉన్న తెలుగువారు ఎందరో మీరెరుగనిది కాదు. కనుక ఛందస్సు గురించిన మౌలిక అంశాలైన గణవిభజన, పద్యరీతులు, అలంకారాలకు సంబంధించినా సమాచారం క్లుప్తంగా ఈ బ్లాగులోనే మరో పుట (పేజీ) సృష్టించి ఉంచినట్లైతే నాబోటివారికి మిత్రుల పద్యాలు, వాటిలో చమత్కారాలు అర్థం చేసుకోవటానికి తేలికగా ఉంటుదని నా అభిప్రాయం.
అమ్మా! మందాకిని గారూ! మీ పూరణలో భావము బాగున్నది. కానీ 3వ పాదములో సుజ్జనాళి అన్నారు. సుజనాళి అనాలి కానీ సుజ్జనాళి అనరాదు. 3వ పాదమును ఇలాగ మార్చండి: సజ్జనాళియు దేవదేవుని సంస్తుతుల్ పొనరింపగా
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! మీ పూరణ సముచితముగా శోభిల్లుచున్నది. 3వ పాదములో నొక్క అని నుగాగమము చెయ్యాలి, కాని యొక్క అని యడాగమము చేసేరు. చిన్న సవరణ చేయండి. స్వస్తి.
పండిత నేమాని వారూ, అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు. ముద్రాలంకార శోభితమైన మీ ప్రశంసాపద్యం అలరించింది. నా పూరణలోని వ్యాకరణదోషాన్ని సవరించినందుకు ధన్యవాదాలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు. మొదటి పాదం చివర ‘నోటిని జూపుచూ’ అని వ్యావహారిక ప్రయోగం చేసారు. దానిని ‘నోటిని జూపెగా / యిజ్జగంబుల .. ’ అందాం. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చక్కని పూరణ మీది. అభినందనలు. * మందాకిని గారూ, ప్రశస్తమైన పూరణ. అభినందనలు. సవరణతో నిన్నటి పూరణ అన్వయక్లేశాన్ని తొలగించుకుంది. బాగుంది. అభినందనలు. మీ రెండవ మూడవ పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు. పండిత నేమాని వారి సూచనను గమనించారా? * వసంత కిశోర్ గారూ, బాగుంది మీ మొదటి పూరణ. కాని ‘పద్యమో, పద్దియమో, పద్దెమో’ చెప్పాలి కాని ‘పజ్జెం’ చెప్పారేమిటి? మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ చాలా బాగుంది. పద్యంలో ‘ఉజ్జ, రజ్జు, సజ్జ’ శబ్దాల ప్రయోగం ప్రశంసార్హం. అభినందనలు. * చింతా రామకృష్ణారావు గారూ, మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. * మిస్సన్న గారూ, కృష్ణలీలలను చక్కగా వర్ణించారు. మంచి పూరణ. అభినందనలు. ద్వితీయపాదాంతంలో ‘సఖులకున్’ అన్నప్పుడు గణదోషం. అక్కడ రగణానికి బదులు సగురువు పడింది. * నిరంజన్ కుమార్ గారూ, చక్కని భావంతో పూరణ చెప్పారు. అభినందనలు. కాని ‘పజ్జవిద్య, చూపుతూ (చూపుచున్), అందరూ (అందరున్)’ పదాల ప్రయోగమే పానకంలో పుడకలవుతున్నాయి. * తాడిగడప శ్యామలరావు గారూ, ప్రశస్తమైన పూరణ. అభినందనలు. రెండవపాదంలో ‘పద్యసారఘ’ అందాం. సారఘ మంటే తేనె. * ‘అచంగ’ గారూ, బ్లాగును సందర్శించినందుకు, ఇందలి పద్యాలు నచ్చినందుకు సంతోషం. ‘ఛందస్సు’ పాఠాలను ప్రారంభించాలనీ, అవికూడా క్రొత్తగా పద్యాలు వ్రాయాలనుకునే వారికి ఉపయోగంగా ఉండాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. అయితే పాఠాలను సిద్ధం చేయడానికి సమయం చిక్కడం లేదు. ఈ ఫిబ్రవరిలో మా అబ్బాయి పెళ్ళి చేయాలని ప్రయత్నం. ఆ తర్వాత కావలసినంత తీరిక. అప్పుడు ప్రారంభిస్తాను. ధన్యవాదాలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, సాయినాథుని ప్రస్తావించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
గురువు గారూ ధన్యవాదములు. రాయల వారిని కొనియాడుచు మీరు చెప్పిన పద్యము చాలా బాగుంది. శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పద్యము కూడా చాలా బాగుంది.కైత లల్లిన నట్టి అనాలనుకొంటాను. నుగామము మీద యడాగమము రాదని శ్రీ పండిత నేమాని వారిదివరలో చెప్పి నట్లు గుర్తు. మిత్రుల పూరణ లన్నీ బాగున్నాయి. కిశోర్జీ మా యిసా పట్నం లో కొన్నాళ్ళుండటం వల్న పజ్జా లంటున్నారు. ఫర్వా లేదు !
శంకరార్యా ! ధన్యవాదములు ! కృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లాల వారి వ్యావహారికంలో పద్యాన్ని పజ్జెమనే అంటారు !
అదీగాక చిన్నప్పుడెప్పుడో ---పద్యము(ప్ర)--పజ్జెము(వి) అని చదువుకున్న గుర్తు !
అయినా సందేహ నివృత్తి కోసం జి ఎన్ రెడ్డి గార్ని తిరగేసాను ! విచిత్రం ! అందులో పద్యము , పజ్జెము అనే పదాలే లేవు ! కాని శూద్రుడు = పజ్జుడు , పద్యుడు అనే పదాలు ఉన్నవి !
పజ్జుడు = పద్యుడు ---ఐనప్పుడు పద్యము = పజ్జెము అంటే తప్పు లేదనిపించింది !
అందుకే ప్రయోగించాను ! అదీ విషయం ! *********** ఓలమ్మి ఓలమ్మి ! యీ యిసయం యిశాపట్టం లో సదూ కున్న మూత్తిగారు బేగ సెప్పీసినారు గాదేటి ! ఒల్లకో !
సమస్యాపూరణం;599 ------------- పజ్జజేరిరి గోపకాంతలు పాడియాడుచు వివశలై మజ్జరే,నడిరేయిలో నతిమధురగానము నల్లనన్ ముజ్జగమ్ముల మోహనుండట ,మురళి చేగొని యూదగా గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే . ----------------------- శంకరయ్యగారికి ఒక విజ్ఞప్తి. మీరు ప్రతిరోజు ఒక సమస్యనిస్తే కొందరే దానిని చదివి పూరిస్తున్నారు.ఆ రోజే మీరు వాటిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.దానికి బదులుగా సమస్య ఇచ్చి ఆరోజు ,మరుసటి రోజు ఆగి ,మూడో రోజున మరొక సమస్యనిస్తూ, ముందటి సమస్య పూరణల నన్నిటినీ సమీక్ష చేస్తే బాగుంటుంది.ఎక్కువమందికి సమ యమూ,అవకాశమూ కలుగుతుంది.
బొజ్జ వేల్పును మ్రొక్కి వాణికి పూజ సేసి సమాదృతిన్
రిప్లయితొలగించండిసజ్జనుల్ కడు ప్రోత్సహింపగ సత్కవుల్ శుభచిత్తులై
యొజ్జలన్ వినుతించి సత్కృతులొప్పుగా నొనరింపగా
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యకలాడరే!
బుజ్జగించెడి తల్లికిన్ తన బోసినోటిని జూపుచూ
రిప్లయితొలగించండినిజ్జగంబుల నేలువేలుపు నెల్లవేళల బ్రోచెగా
యొజ్జయై తను నమ్మువారికి యోగముల్ నిడు కృష్ణునిన్
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
బుజ్జగించుచు తల్లిదండ్రులు బువ్వ బెట్టుచు పెంచగా
రిప్లయితొలగించండిఒజ్జలే మరి పల్కు పద్యము నోర్పుతో చదివించగా
గుజ్జు రూపపు దేవదేవుని కోరి దల్చుచు వ్రాయగా
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
ముజ్జగమ్ములనేలుచున్నది ముద్దుపల్కులతల్లియే
రిప్లయితొలగించండిసజ్జనాళినికావమంచునుశారదమ్మనుకోరుమా
యొజ్జలందరపూజలందెడు యొక్కదేవిని గొల్వగా
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________
ఒజ్జయై ఘన శంకరయ్యిట - నుండగా , మరి యందరున్
గుజ్జువేలుపు కొల్చుచున్ ,మది - కోరి నంతనె వచ్చుగా
పజ్జెముల్ ప్రజ కింపుగా, ఘన - భావముల్ కదలాడగా
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన - కావ్యకన్యక లాడరే!
_____________________________
గురువు గారు, ఇప్పుడు కుదిరిందండి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిభీకర సంగరంబు నను భీమ కరాళపు నృత్యమందునన్
కోకిల గానముల్ వినగ కోరకు మయ్యరొ బుద్ధిహీనతన్.
నీ కులమంతకూలునిట, నేలను వాలును భోజనమ్ముకై
కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.
మహాభారత యుద్ధంలో ఒకరి పలుకులు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమజ్జనమ్ముల నాడి సంధ్యను మానసమ్మున గొల్చుచు
రిప్లయితొలగించండిన్నుజ్జ కందిన రమ్య గాధల నొప్పు రీతుల బేర్చుచున్
రజ్జె సజ్జయి రక్తి గొల్పగ రామచంద్రు నుతింపగా
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే
ముజ్జగంబుల సంచరించెడి పూజ్య సత్కవి భావనా
రిప్లయితొలగించండిసజ్జగంబుల నుల్లసిల్లుచు, సాహితీ రసరమ్యమై
కజ్జలంబెడఁబాపు కాంతుల కావ్య వీధుల లోన తా
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
ఉజ్జగొంచు విశేషణంబుల నొప్పుచుండిన పద్యముల్
రిప్లయితొలగించండిరజ్జులాడుటవీడి, నిత్యము లక్షణంబుగ వెల్గుచున్
సజ్జనుండు నుతించు రీతిని "శంకరాభరణం"బునన్
గజ్జెలందెలు ఘల్లుఘల్లన కావ్య కన్యక లాడరే.
ఉజ్జ = ఊహ,
రజ్జులాడు = గొడవపడు ( ఒక పద్యమును ఖండించునట్లుగా మరొక పద్యము... )
ఈనాటి ప్రక్రియ చాల ప్రశంసనీయము. సత్కవి వతంసులకు చక్కని అవకాశము. ఆ విధముగానే అందరును రసమాధురితో పద్యములను మత్తకోకిల గళముతో కమనీయముగా అలరింపజేసేరు. అందరకీ అభినందనలు.
రిప్లయితొలగించండిమత్తకోకిలముల్ మనోహర మంగళాస్పద రాగసం
పత్తినే వినిపింపజేసెను భావ వైభవ పుష్టితో
తత్తదద్భుత గానలోలురు తజ్ఞులెంతయు పొంగుచున్
క్రొత్త సొంపులనింపి చెన్నుగ కూర్చిరింపుగ పద్యముల్
(మత్తకోకిల వృత్తములో ఆ వృత్తనామము వ్రాయుటతో ముద్రాలంకారము ఇందు కలదు.)
శ్రీ సంపత్కుమార్ శాస్త్రి గారి పూరణ బాగున్నది. అందలి 3వ పాదములో ఈ చిన్న మార్పు చేర్చితే ఇంకా బాగుంటుంది:
రిప్లయితొలగించండి(సజ్జనుల్ వినుతించు రీతిగ)
ఇజ్జగమ్మున తెల్గుభాషకు నెద్దిసాటియటంచు తా
రిప్లయితొలగించండికజ్జమాడుటెకాదు కమ్మని కైతలల్లినయట్టి యా
సజ్జనుండగు కృష్ణరాయలు స్వామియై పాలింపగా
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యకలాడరే
ఇజ్జగమ్మున తెల్గుభాషకు నెద్దిసాటియటంచు తా
రిప్లయితొలగించండికజ్జమాడుటెకాదు కమ్మని కైతలల్లినయట్టి యా
సజ్జనుండగు కృష్ణరాయలు స్వామియై ధరనేలగా
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యకలాడరే
తొలిపద్యంలో గణదోషం జరిగంది.
ముజ్జగమ్ముల బొజ్జనింపుక ముద్దుముద్దుగ నాడుచున్
రిప్లయితొలగించండిబుజ్జగించి యశోద పెట్టెడు బువ్వ కాదని సఖులకు-
న్నొజ్జయై పొరుగిళ్ళకుంజని యుట్ల దోచెడు దొంగ కా ల్గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యకలాడరే!
సొజ్జ భక్ష్యముతోడ విందులు జున్నుపాలవి వేదికల్
రిప్లయితొలగించండికజ్జికాయలు పాయసమ్ములు ఖర్జురమ్ములు పల్కులై
మజ్జిగల్ మధుపాత్ర లించుక మంద్రరీతుల సద్దులై
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
భక్ష్యాలు,జున్నుపాలంత కమ్మటి వేదికలపైన , వారిపల్కులు కజ్జికాయలు, ఖర్జురమ్ముల్లా వినిపిస్తూ, తియ్యటి మజ్జిగలు, తేనెల పాత్రలు పిలుస్తున్నట్టు చిన్న సద్దులతో రుచికరమైన విందుభోజనంలా ఘల్లుఘల్లున గజ్జెలతో నాట్యం చేస్తున్నట్టు కావ్యకన్యకలు విందులు చేస్తున్నాయి.
పజ్జవిద్యను జూపుతూపలు పండితోత్తములందరూ
రిప్లయితొలగించండిరజ్జురజ్జగునట్లుజేయగ రమ్యమౌపలుపూరణల్
గజ్జలయ్యెను అక్షరమ్ములు ఘల్లుఘల్లనె పాదముల్
గజ్జలందెలు ఘల్లుఘల్లన కావ్య కన్యక లాడరే
ముజ్జగంబుల నేలు దేవుని మోహనాకృతిలీలలన్
రిప్లయితొలగించండిబుజ్జగించుచు పద్యసుధలన్ బోధలన్ ప్రకటింపగా
సజ్జనావళి మెచ్చగా కడు సంతసంబున పొంగుచుం
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
శ్రీ శ్యామలరావుగారి పూరణ బాగున్నది కాని 2వ పాదములో గణభంగము. కాస్త చూడండి.
రిప్లయితొలగించండిశంకరయ్య గారూ, ఈ వ్యాఖ్య ఎక్కడ వ్రాయాలో తెలియక ఇక్కడ వ్రాస్తున్నాను. అసందర్భమైతే మన్నించాలి.
రిప్లయితొలగించండిఎందరో గొప్ప కవులకు తీసిపోని పద్యాలిక్కడ పొగవుతున్నాయి. అయితే ఇక్కడ ఛందస్సు గురించిన అవగాహన ఉన్న తెలుగువారు ఎందరో మీరెరుగనిది కాదు. కనుక ఛందస్సు గురించిన మౌలిక అంశాలైన గణవిభజన, పద్యరీతులు, అలంకారాలకు సంబంధించినా సమాచారం క్లుప్తంగా ఈ బ్లాగులోనే మరో పుట (పేజీ) సృష్టించి ఉంచినట్లైతే నాబోటివారికి మిత్రుల పద్యాలు, వాటిలో చమత్కారాలు అర్థం చేసుకోవటానికి తేలికగా ఉంటుదని నా అభిప్రాయం.
బుజ్జగించుచు తల్లి నేర్పెడి బోధ భావిని తీర్చగా
రిప్లయితొలగించండినొజ్జ నేర్పిన యన్ని విద్యలు నున్నతమ్ముల జేర్చగా
సుజ్జనాళియు దేవదేవుని స్తోత్రపాఠము జేయగా
గజ్జెలందెల ఘల్లుఘల్లున కావ్యకన్యకలాడరే!
అమ్మా! మందాకిని గారూ! మీ పూరణలో భావము బాగున్నది. కానీ 3వ పాదములో సుజ్జనాళి అన్నారు. సుజనాళి అనాలి కానీ సుజ్జనాళి అనరాదు. 3వ పాదమును ఇలాగ మార్చండి:
రిప్లయితొలగించండిసజ్జనాళియు దేవదేవుని సంస్తుతుల్ పొనరింపగా
పండితుల వారికి
రిప్లయితొలగించండిమన్నించాలి. పొరబాటు జరిగింది.
మనసులో ఉన్నది సజ్జనాళి అనే. చూసుకోకుండా యతి కూడా వేశానన్నమాట.
సవరణకు ధన్యవాదాలు.
సజ్జనస్తుత పాలకుండును, శత్రురాజ విలాస సం
రిప్లయితొలగించండిపజ్జయాంచితుఁ డైన రాయలవారి కొల్వున నిండఁగా
నొజ్జ లాంధ్రకవిత్వవాణికి యొప్పి రష్టదిశేభముల్
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిమీ పూరణ సముచితముగా శోభిల్లుచున్నది. 3వ పాదములో నొక్క అని నుగాగమము చెయ్యాలి, కాని యొక్క అని యడాగమము చేసేరు. చిన్న సవరణ చేయండి. స్వస్తి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
శంకరార్యుని శిష్య బృందం :
02)
____________________________________
జజ్జరల్ పలికేటి వారొకొ - శంకరార్యుని శిష్యులే
పజ్జెముల్ రచియించుటందున - వారి సాటి మరెవ్వరే
యిజ్జగంబున తెల్గు తల్లికి - నింపు గూర్చెడి సజ్జనుల్
గొజ్జగల్ గద హారమందున - కోటి కాంతులు నింపుచున్
తల్లి భారతి కంఠమందున - తారలై వెలుగొందరే !
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన - కావ్యకన్యక లాడరే!
____________________________________
జజ్జర = ప్రగల్భము
గొజ్జగ = చామంతి
ముజ్జగంబుల నేలు సాయికి మ్రొక్కి పాటలు పాడరే
రిప్లయితొలగించండిపజ్జ చేరి మహాను భావుని పాదపూజలు సేయరే
గజ్జ లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే
సెజ్జ హారతు లియ్యరే యభి షేకముల్ పలు సేయరే
శంకరార్యుని శిష్య బృందం :
రిప్లయితొలగించండి02అ)
___________________________________
జజ్జరల్ పలికేటి వారొకొ ?- శంకరార్యుని శిష్యులే !
పజ్జెముల్ రచియించుటందున - వారి సాటి మరెవ్వరే !
యిజ్జగంబున తెల్గు తల్లికి - నింపు గూర్చెడి సజ్జనుల్ !
గొజ్జగల్ వలె హారమందున - కోటి కాంతులు నింపుచున్
పజ్జనుందురు తల్లి భారతి - పాదమందున గజ్జెలై !
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన - కావ్యకన్యక లాడరే!
___________________________________
జజ్జర = ప్రగల్భము
గొజ్జగ = చామంతి
పజ్జ = దాపు , సమీపము ,చెంత
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
ముద్రాలంకార శోభితమైన మీ ప్రశంసాపద్యం అలరించింది.
నా పూరణలోని వ్యాకరణదోషాన్ని సవరించినందుకు ధన్యవాదాలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
మొదటి పాదం చివర ‘నోటిని జూపుచూ’ అని వ్యావహారిక ప్రయోగం చేసారు. దానిని ‘నోటిని జూపెగా / యిజ్జగంబుల .. ’ అందాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పూరణ మీది. అభినందనలు.
*
మందాకిని గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
సవరణతో నిన్నటి పూరణ అన్వయక్లేశాన్ని తొలగించుకుంది. బాగుంది. అభినందనలు.
మీ రెండవ మూడవ పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
పండిత నేమాని వారి సూచనను గమనించారా?
*
వసంత కిశోర్ గారూ,
బాగుంది మీ మొదటి పూరణ.
కాని ‘పద్యమో, పద్దియమో, పద్దెమో’ చెప్పాలి కాని ‘పజ్జెం’ చెప్పారేమిటి?
మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. పద్యంలో ‘ఉజ్జ, రజ్జు, సజ్జ’ శబ్దాల ప్రయోగం ప్రశంసార్హం. అభినందనలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
కృష్ణలీలలను చక్కగా వర్ణించారు. మంచి పూరణ. అభినందనలు.
ద్వితీయపాదాంతంలో ‘సఖులకున్’ అన్నప్పుడు గణదోషం. అక్కడ రగణానికి బదులు సగురువు పడింది.
*
నిరంజన్ కుమార్ గారూ,
చక్కని భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
కాని ‘పజ్జవిద్య, చూపుతూ (చూపుచున్), అందరూ (అందరున్)’ పదాల ప్రయోగమే పానకంలో పుడకలవుతున్నాయి.
*
తాడిగడప శ్యామలరావు గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
రెండవపాదంలో ‘పద్యసారఘ’ అందాం. సారఘ మంటే తేనె.
*
‘అచంగ’ గారూ,
బ్లాగును సందర్శించినందుకు, ఇందలి పద్యాలు నచ్చినందుకు సంతోషం.
‘ఛందస్సు’ పాఠాలను ప్రారంభించాలనీ, అవికూడా క్రొత్తగా పద్యాలు వ్రాయాలనుకునే వారికి ఉపయోగంగా ఉండాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. అయితే పాఠాలను సిద్ధం చేయడానికి సమయం చిక్కడం లేదు. ఈ ఫిబ్రవరిలో మా అబ్బాయి పెళ్ళి చేయాలని ప్రయత్నం. ఆ తర్వాత కావలసినంత తీరిక. అప్పుడు ప్రారంభిస్తాను. ధన్యవాదాలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
సాయినాథుని ప్రస్తావించిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదములు. మీరు సూచించిన సవరణ చక్కగా ఉన్నది. "బోసి నోటిని చూపెగా" ను "బోసి నవ్వులు చూపెగా" అని సవరణ పరిశీలింప ప్రార్థన.
రిప్లయితొలగించండిమత్తకోకిలగానమాధురి మాఘమాసమునందునే
చిత్తమందున మెచ్చునట్లుగ జేసిరీ కవికోకిలల్
మెత్తనౌ గురుశంకరార్యులు మేరుపర్వత మంతగా
యెత్తునన్ గనిపించుచుండిరి యీ వసంతపు రాకతోన్
ఈనాటి పద్యములు అన్నియూ చక్కని భావములతో అన్నిటికన్నియు సాటిగా ఉన్నవి. మిత్రులందరికి అభినందనలు.
గురువు గారూ ధన్యవాదములు. రాయల వారిని కొనియాడుచు మీరు చెప్పిన పద్యము చాలా బాగుంది. శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పద్యము కూడా చాలా బాగుంది.కైత లల్లిన నట్టి అనాలనుకొంటాను. నుగామము మీద యడాగమము రాదని శ్రీ పండిత నేమాని వారిదివరలో చెప్పి నట్లు గుర్తు. మిత్రుల పూరణ లన్నీ బాగున్నాయి. కిశోర్జీ మా యిసా పట్నం లో కొన్నాళ్ళుండటం వల్న పజ్జా లంటున్నారు. ఫర్వా లేదు !
రిప్లయితొలగించండిజజ్జరించెడి జియ్య కీయగ జాలనేనను మాటలన్
రిప్లయితొలగించండిముజ్జగంబులనేలు పల్కుల ముద్దరాలిని ముద్దుగా
బుజ్జగించుచుసాధుసత్కవిపోతనార్యులు పాడగా
గజ్జెలందెలు ఘల్లుఘల్లన కావ్యకన్యక లాడరే!
దోషాన్ని సవరించిన నా పూరణ ....
రిప్లయితొలగించండిసజ్జనస్తుత పాలకుండును, శత్రురాజ విలాస సం
పజ్జయాంచితుఁ డైన రాయలవారి కొల్వున నిండఁగా
నొజ్జ లాంధ్రకవిత్వవాణికి నొప్పి రష్టదిశేభముల్
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
దోషాన్ని తెలిపిన పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
ముజ్జగంబుల పోతనార్యుడు పూజ నీయుడు పాం డితిన్
రిప్లయితొలగించండిపజ్జమందున భావమమృత ప్రాయమే గద గ్రోలగన్
అజ్జ భాగము నందు తేనియ నంచి వ్రాసెనొ మోదమున్
గజ్జే లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే !
అజ్జ భాగము = కొన్ని పనసలు గల వేద భాగము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండికృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లాల వారి వ్యావహారికంలో
పద్యాన్ని పజ్జెమనే అంటారు !
అదీగాక చిన్నప్పుడెప్పుడో ---పద్యము(ప్ర)--పజ్జెము(వి)
అని చదువుకున్న గుర్తు !
అయినా సందేహ నివృత్తి కోసం జి ఎన్ రెడ్డి గార్ని తిరగేసాను !
విచిత్రం ! అందులో పద్యము , పజ్జెము అనే పదాలే లేవు !
కాని
శూద్రుడు = పజ్జుడు , పద్యుడు
అనే పదాలు ఉన్నవి !
పజ్జుడు = పద్యుడు ---ఐనప్పుడు
పద్యము = పజ్జెము అంటే తప్పు లేదనిపించింది !
అందుకే ప్రయోగించాను ! అదీ విషయం !
***********
ఓలమ్మి ఓలమ్మి ! యీ యిసయం యిశాపట్టం లో సదూ కున్న మూత్తిగారు
బేగ సెప్పీసినారు గాదేటి ! ఒల్లకో !
పోతనామాత్యునిపై మిత్రులు చంద్రశేఖరుల వారి పద్యము,అక్కయ్య గారి పద్యము మనోహరముగా నున్నాయి. ఈయు శబ్దము వ్యావహారికమని ఇడు,ఇచ్చు,శబ్దములనే పద్యములలో ప్రయోగించాలని విష్ణునందనుల వారు ఉటంకించినట్లు గుర్తు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా.మూర్తి మిత్రమా! మీ మెత్తటి కొరడా దెబ్బ తగిలింది. సవరించిన పూరణ:
రిప్లయితొలగించండిజజ్జరించెడి జియ్య కైనిడ జాలనేనను మాటలన్
ముజ్జగంబులనేలు పల్కుల ముద్దరాలిని ముద్దుగా
బుజ్జగించుచుసాధుసత్కవిపోతనార్యులు పాడగా
గజ్జెలందెలు ఘల్లుఘల్లన కావ్యకన్యక లాడరే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముజ్జగంబుల పోతనార్యుడు పూజ నీయుడు పాం డితిన్
రిప్లయితొలగించండిపజ్జమం దునభా వమేమ దుప్రాయ మేగద గ్రోలగన్
అజ్జ భాగము నందు తేనియ నంచి వ్రాసెనొ మోదమున్
గజ్జే లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే
సోదరులు మూర్తిగారూ! ఇలా సరి పోతుందా ? lచాలక పొతే ఏముంది ? మీరె రాసెయ్యండి. ధన్య వాదములు
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
రిప్లయితొలగించండిముజ్జగంబుల పోతనార్యుడు పూజ నీయుడు పాండితిన్
పజ్జమందున భావమే మధుప్రాయమై గద గ్రోలగన్
అజ్జ భాగము నందు తేనియ నంచి వ్రాసెనొ మోదమున్
గజ్జే లందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసవరించిన నా పద్యం :
ముజ్జగమ్ముల బొజ్జనింపుక ముద్దుముద్దుగ నాడుచున్
బుజ్జగించి యశోద పెట్టెడు బువ్వ కాదని తానుగా
నొజ్జయై చెలికాండ్లతో జని యుట్ల దోచెడు దొంగ కా ల్గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యకలాడరే!
ఉబలాటం కొద్దీ .............
రిప్లయితొలగించండిముజ్జగమ్ముల సృష్టి కర్తకు ముద్దుటాల్ మది పొంగగా
నొజ్జ, పండిత, గోలి యాదియు నోహొ చింతా శ్రీపతుల్
సజ్జనుల్ మనతెల్గు సంపద శ్యామలుల్ లక్కాకులున్
వెజ్జు లెన్నకిశోరు లీశ్వరి వేల్పుటేరు నిరంజనుల్
పజ్జెముల్ వెలయించరే రస బంధురమ్ముగ నిత్తరిన్.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమనోహరమైన పద్యం వ్రాసారు. బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీరట్టా సెప్పాక ఒల్లకుంటామా? అట్టాగే!
*
మిస్సన్న గారూ,
‘ముజ్జగంబుల సృష్టికర్తకు ...’ పద్యం సరదాగానే సాగింది. ధన్యవాదాలు.
సరదాపద్యం కనుక 2,4 పాదాంతాలలో గణదోషాలను పట్టించుకొనడం లేదు.
బుజ్జి మూషక వాహనుండగుబొజ్జ దేవుని మ్రొక్కుచున్
రిప్లయితొలగించండిముజ్జగంబుల నేలు వేల్పును ముక్తి నిమ్మని వేడుచున్
ఒజ్జ లందరు మెచ్చు రీతిగ ఉత్పలమ్ముల నల్లుచున్
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే!
గురువుగారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి నా ధన్యవాదములు. మీ సవరణ శిరోధార్యము.
రిప్లయితొలగించండిఇస్సీ మరో గణాఘాతమా! యోచించెద.
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమనోజ్ఞమైన పూరణ మీది. అభినందనలు.
సమస్యాపూరణం;599
రిప్లయితొలగించండి-------------
పజ్జజేరిరి గోపకాంతలు పాడియాడుచు వివశలై
మజ్జరే,నడిరేయిలో నతిమధురగానము నల్లనన్
ముజ్జగమ్ముల మోహనుండట ,మురళి చేగొని యూదగా
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే .
-----------------------
శంకరయ్యగారికి ఒక విజ్ఞప్తి. మీరు ప్రతిరోజు ఒక సమస్యనిస్తే కొందరే దానిని చదివి పూరిస్తున్నారు.ఆ రోజే మీరు వాటిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.దానికి బదులుగా సమస్య ఇచ్చి ఆరోజు ,మరుసటి రోజు ఆగి ,మూడో రోజున మరొక సమస్యనిస్తూ, ముందటి సమస్య పూరణల నన్నిటినీ సమీక్ష చేస్తే బాగుంటుంది.ఎక్కువమందికి సమ యమూ,అవకాశమూ కలుగుతుంది.
కమనీయము గారి పద్యము కమనీయముగా నున్నది. కాని పాదములలో గణ దోషాలు సవరించాలి.
రిప్లయితొలగించండిమత్త కోకిల నడక ;
మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల కోకిలా
ర,స జ జ భ ర