5, జనవరి 2012, గురువారం

చమత్కార పద్యాలు - 167

ప్రహేళిక

నాద్యాదన్నం పిబేత్తైలం
శీఘ్రం గచ్ఛేత్ చతుష్పదైః |
న మృగో న నరశ్చాపి
యో జానాతి స పండితః ||


నా అనువాదం
అన్నమును దినదు సదా తైలముం ద్రాగు
కాళ్ళు చూడ నాల్గు కలవు; వడిగ
సాగుచుండు గాని జంతువును నరుఁడు
కాని దేదొ చెప్ప గలరె మీరు?


మిత్రులారా,
సమాధానం చెప్పండి.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

6 కామెంట్‌లు:

  1. మా భాషలో చెప్పాలంటే "కారు". అన్నం తినదుగానీ పెట్రోలు తెగ త్రాగుతుంది. మా జీవితమే నాలుగు చక్రాల బండితో ముడి పడింది. "కారు లేకపోతే కాళ్ళు లేనట్లే" అన్న చందంగా :-)

    రిప్లయితొలగించండి
  2. యంత్రశక్తి నిచ్చు నన్నమై తైలమ్ము
    చతుర ద్రిప్పు దీని చక్రములను
    పరుగు పెట్టు యంత్రవాహనంబును దీని
    స్వీయచలిత మండ్రు విజ్ఞు లెలమి !

    రిప్లయితొలగించండి
  3. సరిగ్గా నేను కుడా అదే అనుకుంటున్నాను " గానుగ కానీ , కారు కానీ " రెండిటిలో ఏదో ఒకటని

    రిప్లయితొలగించండి
  4. సమాధానం ....
    తైలశకటం (కారు, బస్సు, లారీ, జీప్ .. ఇలా ఏదైనా కావచ్చు)
    *
    చంద్రశేఖర్ గారూ,
    సరిగ్గా ఊహించారు. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీరు ‘ఏమో’ అనుకున్నదే సరైనది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సరియైన సమాధానాన్ని ఛందోబద్ధంగా చెప్పిన మీ నైపుణ్యం అభినందనీయం.
    *
    జిలేబి గారూ,
    మీరు చెప్పింది అర్థం కావడం లేదు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    అభినందనలు.

    రిప్లయితొలగించండి