(ఇంతకాలం ‘పోతన భోగినీదండకం’గురించి వినడమే కాని ఎప్పుడూ చదివింది లేదు, చూసింది లేదు. అదృష్టవశాత్తు నిన్న దొరికింది. పుస్తకం పూర్తిగా జీర్ణావస్థలో ఉంది. చదివి ఆనందించాను. ఈ ఆనందాన్ని మీకూ పంచాలని బ్లాగులో ప్రకటిస్తున్నాను. పెద్దది కనుక రెండు మూడు భాగాల్లో ఇస్తున్నాను)
భోగినీ దండకము - 1
బమ్మెర పోతనామాత్య ప్రణీతము
*************
* శ్రీ సర్వజ్ఞ సింగరాజ వర్ణనము *
శ్రీమన్మహా మంగళాకారు, నాకార లక్ష్మీకుమారుం, గుమారీ మనోరాము, రామాంబరీషాది రాజన్య రాజద్యశః కాముఁ, గామాహిత క్షీరవారాశి తారా శి వాగేంద్ర మందార కుందారవిందాహితాకాశకల్లోలినీ కాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీభూషి తాశాంగ నాలోకసీమంతు, సీమంతినీ మానసారామవాటీ వసంతున్, వసంతావనీనాధ సంసేవితాంచత్పదాంభోజు, నంభోజరాజీ సుహృత్తేజుఁ, దేజో జయ ప్రాభవోద్దాము, నుద్దామ జన్యావనీ భీము, భీమప్రతాపానలాభీలకీలా వినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వార గర్వాటవీవారు, వారాధిపోరుప్రభా భాసురస్ఫార కల్యాణ దుర్వారు, వారాశివేలా పరీతావనీభార ధౌరేయరాజ న్మహాబాహు, బాహాకఠోరాసిధారా వినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్, సమూహా మహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్, వల్లభా మానసాదుర్లభున్, దుర్లభారిక్షమానాథ మత్తేభయూథంబులం జించి చెండాడు రాసింగమున్, సింగభూపాలు, భూపాల గోపాల గోపాలికా కృష్ణగోపాలు,
* వేశ్యాకన్య రాజుం జూచి మోహించుట *
గోపాలదేవోత్సవ క్రీడలో, మేడలోనుండి జాలాంతరాళంబులన్ వారయోషాతనూజాత, విద్యావయోరూపసౌందర్య చాతుర్యవిఖ్యాత, చంచద్గుణోపేత, భృంగాంగనాలబ్ధకేళీ మహాహస్త కంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషునీకాశయై యుండి తద్వైభవంబుల్ విమర్శించి, హర్షించి, సంతోష బాష్పాంబుపూరంబు వర్షించి, కందర్ప బాణాహతిం జెంది, లోఁగుంది, మోహించి, సంగంబు నూహించి "యేవేళఁ దల్లిం బ్రమోషింతు, నేలీల భూపాలకుం జేరి భాషింతు, నేరీతిఁ గామానలంబున్ నివారింతు, నే నాతితోడన్ విచారింతు, నేవెంట రాచూలి వంచింతు, నేజంటఁ గోర్కుల్ ప్రపంచింతు, మున్నే ప్రశస్తారవిందంబనైనన్ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబనై యుందుఁబో, రత్నహారంబునైనన్ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో, యేల యిట్లైతి నెట్లోకదే" యంచు శంకించుచున్, నిత్యకల్యాణు, లీలావతీపంచబాణున్ మనోవీథి నంకించుచున్, ఘోషమాణాలికిన్, మందవాతూలికిన్, జంద్రమఃకీలికిన్, గోకిలారావాదంభోళికిన్, జిత్తభూభల్లికిన్, దల్లికిన్ లోఁగి, కామానలజ్వాలలన్ వేఁగి, చింతాభరాక్రాంతయై యేఁగి, సంతాపఘర్మాంబులం దోఁగి చింతించు నింతిం బరీక్షించి,
* వారకన్య తల్లి వచ్చి కూఁతు నవస్థఁ గనుఁగొనుట *
బుద్ధిన్ విచక్షించి, తన్మాత మాయాపరాభూత జామాత, మిథ్యానయోపేత, విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత, లోకైకవిఖ్యాత, వారాంగనాధర్మశిక్షాది సంభూత, సమ్మోహితానేక రాజన్యసంఘాత, వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి నీతిన్ విచారించి, బాలన్, మిళత్కుంతలవ్రాతఫాలన్, గరాంభోజరాజత్కపోలన్, సమందోష్ణనిశ్శ్వాసజాలన్, విపర్యస్తసంవ్యానచేలన్, మహాందోల, నప్రేంఖిత స్వర్ణడోలన్, మృగేంద్రావలగ్నన్, దయావృష్టిమగ్నన్, మనోజాగ్నిభగ్నన్, నిరంధన్, బరిత్రస్త ధమ్మిల్లబంధన్, సముద్విగ్న మోహానుబంధన్, నిరాలాప, నావర్జితాలేప, నస్వీకృతానేక కేయూరహారన్, గళద్బాష్పధారన్, బరిత్యక్తలాస్యన్, బరాభూత లీలావయస్యన్, బదాలేఖనా లక్షితక్షోణిభాగన్, బరిక్షీణరాగన్ విలోకించి, బుద్ధిన్ వివేకించి, లోనం బరాయత్తయై, చిత్తజాతాసిధారా చలచ్చిత్తయై, విన్నయై, ఖిన్నయై యున్న భావంబు భావించి, నెయ్యంబు గావించి, రావించి
(మిగిలిన భాగం రేపు ...)

‘భోగినీ దండకము’ అలభ్య రచన అని ఇంతకాలం అనుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇది పోతన రచన అని వినటం తప్ప దాని విశేషాలు గానీ, దండకం నుంచి ఉటంకింపులు గానీ ఎక్కడా చదవలేదు.
రిప్లయితొలగించండిఇన్నాళ్ళకు మీరిలా బ్లాగులో ఇవ్వటం వల్ల చదివే అవకాశం కలిగింది. దీని సరళ అనువాదం కూడా మీరు ఇవ్వగలిగితే ఎక్కువమందికి బోధపడుతుంది.
మీకు లభ్యమైన ఈ దండకాన్ని ఎవరు, ఏ సంవత్సరం ప్రచురించారు? ఈ రచన ‘భాగవతం’ కంటే ముందు రాసిందేనా?
వేణు గారి సందేహాలే నాకూ వున్నాయి. దండకం ప్రచురించినందుకు కృతఙ్ఞతలు.
రిప్లయితొలగించండి‘భోగినీ దండకము’ చదివే అవకాశం కలిగించి నందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాస్టారూ,
రిప్లయితొలగించండిమీరు భోగినీదండకం పోస్టు చేయటంవల్ల నా చిరకాలవాంఛ తీరబోతోంది. మీరు పి.డి.ఫ్. ఫైల్లో వేయమని ప్రార్థన. అది నేను మీ దగ్గరనుంచి సేకరించుకొంటాను. ధన్యవాదాలతో-చంద్రశేఖర్.
పోతన శైలి యచ్చుపడ భోగిని దండకమొప్పుచుండె, చే
రిప్లయితొలగించండిజేత తనెంత పున్నెములు జేసెనొ ధన్యతగాంచె వేశ్య, భూ
జాతలుగూడపొందని నిజమ్మిది, బ్లాగున బెట్టినందుకున్
జోతలు క్రొత్తక్రొత్తలు రుచుల్ చవిజూపిన మీకు శంకరా!
----శంకరయ్య గార్కి ధన్యవాదములతో
గురువుగారూ అపురూపమైన సేకరణ.
రిప్లయితొలగించండిఅలాగే దండకం మొదటి భాగం లో ఒక అపురూపమైన అలంకారం భాసిస్తోంది. రాజును గూర్చిన ప్రతీ విశేషణం లోని చివరి పదంతో తరువాతి విశేషణం ప్రారంభ మవుతోంది. దీన్నేమంటారో తెలియదు. మంచి అందమైన రచన.
ఇది ముక్తపదగ్రస్తము అనే శబ్దాలంకారము.
రిప్లయితొలగించండికర్ణపేయమైన అనుప్రాసాలంకారం కూడా ఉంది.
రిప్లయితొలగించండిమిస్సన్నగారూ మీరు పేర్కొన్నదానిని ముక్తపదగ్రస్తము అని అంటారని అనుకుంటాను. అయితే ఈ అలంకారాన్ని దండకంలో చదవడం ఇదే మొదటిసారి.
రిప్లయితొలగించండిమిత్రులు శంకరయ్య గారు!
రిప్లయితొలగించండిమీ అపురూపమైన సేకరణ కిదే నా హార్దికాభినందన!
దయచేసి ప్రచురణకర్తల వివరాలను, ప్రచురణ సంవత్సరాన్ని ప్రకటించగలరు.
మందాకిని గారూ ధన్యవాదాలు. మీరన్నట్లు చక్కని అనుప్రాసాలంకారం కూడా భాసిస్తోంది.
రిప్లయితొలగించండిమురళీ మోహన్ గారూ ధన్యవాదాలండీ.
రిప్లయితొలగించండిఈ పుస్తకం on line లో (archive.org) లభ్యం గానే వుందండీ చాలా కాలం నుంచీ! ఆ online library web site లో Search లో bhogini అని ఆంగ్లంలో type చేసి, పక్కనే Texts అనేది select చేసుకుని Go చేస్తే, on line ఎడిషన్స్ ప్రత్యక్షమవుతాయి! free గానే download చేసుకోవచ్చును!
రిప్లయితొలగించండిశ్రీ వెంకట్ బి రావుగారికి ధన్యవాదాలు. సులభంగా దొరికింది. వావిళ్ళవారి ప్రతి, ప్రతిపదార్ధ సమేతము.
రిప్లయితొలగించండివేణు గారూ,
రిప్లయితొలగించండి‘కష్టేఫలే’ గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చంద్రశేఖర్ గారూ,
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మిస్సన్న గారూ,
మందాకిని గారూ,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
ఆచార్య ఫణీంద్ర గారూ,
ధన్యవాదాలు. నాకు దొరికిన ‘భోగినీదండకం’ ప్రతి 1916 లో ‘తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య’ గారి టీకతో ‘వేమూరు వేంకట కృష్ణమ సెట్టి అండు సన్సు, మదరాసు’ వారిచే ప్రకటింపబడింది. వెల 3 అణాలు.
జీర్ణావస్థలో ఉన్న ఈ పుస్తకాన్ని రామాచారి అనే మిత్రుడు ఇచ్చాడు.
మిత్రులు కోరితే టీకా తాత్పర్యాలు ఇస్తాను.
వెంకట్ బి. రావు గారు నెట్ లో లభించే వివరాలు ఇచ్చారు. ఆసక్తి ఉన్న మిత్రులు వారిచ్చిన లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకొనవచ్చు.
*
వెంకట్ బి. రావు గారూ,
ధన్యవాదాలు.
నాకు దొరికిన పుస్తకం ఇదే. కాని చంద్రశేఖర్ గారు పేర్కొన్నట్లు ఇది ‘వావిళ్ల’ వారి ప్రచురణ కాదు.
మాస్టారూ, నాదే పొరపాటు. నాకు నెట్లో దొరికినది కూడా ‘భోగినీదండకం’ ప్రతి 1916 లో ‘తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య’ గారి టీకతో ‘వేమూరు వేంకట కృష్ణమ సెట్టి అండు సన్సు, మదరాసు’ వారు వేసినదే. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినమస్కారములు .
రిప్లయితొలగించండిభోగినీ దండకం చాలా మంచి కావ్యము.శ్రమ అనుకోక పొతే అర్ధ తాత్పర్యములు వివరించ గలరు. [ ఇంకా ఆనందం గా ఉంటుంది.]
nenu bhoginidandakam chadivaanu. 70va dashakam lo yuvabharathi secunderabad vaaru bhoginidandakam nu vyakhyanam to veluvarinchaaru. pothanagari veerabhadhra vijayam kooda baguntundi.
రిప్లయితొలగించండిబాగుంది. కానీ ఇంతకాలం పండితుల నిర్లక్ష్యానికి గురయింది. శ్యామలాదండకమొక్కటే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ భోగినీదండకము పై విస్త్ఋత ప్రచారం జరగాలి.
రిప్లయితొలగించండి