ఆదిదంపతుల అవ్యాజమైన ప్రేమ తల్లిదండ్రుల రూపములో భువిలో దిగి వచ్చి పిల్లలను అపరిమితమైన ప్రేమను పంచుట. ఆదిదేవుల ప్రేమ కడలి లాగా అనంతమైనది దాన్ని చిన్న కడవలో తల్లిదండ్రుల రూపములో నింపినారు. అని అన్వయము.
శ్రీ వసంత్ కిశోర్ గారి పద్యము బాగున్నది. 1వ పాదము మొదటి గణము సవరించాలి. ఆ పాదము నిలా మారిస్తే బాగుంటుంది అనుకొనుచున్నాను: ఉర్వి రూపమ్ము గోళమట్లుండు గాన
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు. ముఖ్యంగా రెండవపూరణ ఉత్తమంగా ఉంది. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, కొద్ది రోజులుగా మీ పూరణలలో ప్రావీణ్యత స్పష్టంగా కనిపిస్తున్నది. సంతోషం. ఈనాటి పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు. * మందాకిని గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉంది. ఒక్క సముద్రాన్నే కష్టం అనుకుంటే మీరు ఎన్నో సముద్రాలను కడవలో చేర్చారు. బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, అన్నివిధాల ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, పూరణ మిషతో ఒక ఖండకావ్యాన్నే వ్రాసారే. చాలా బాగుంది. అభినందనలు. మిస్సన్న గారిని అభినందించిన మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు. * శ్రీపతి శాస్త్రి గారూ, సముద్రజలాన్నే పుక్కిట పట్టిన మన మునులకు అదొక లెక్కా? చక్కని పూరణ. అభినందనలు. * వరప్రసాద్ గారూ, పద్యం బాగుంది. అభినందనలు. ‘మెండుగ గాపరికిలె’ ...? * సుబ్బారావు గారూ, మీ పూరణ మనోహరమై అలరారుతున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, నీళ్ళ పాలు పోసినవాణ్ణి బాగానే విమర్శించారే! చమత్కారమైన పూరణ. వైవిధ్యంగా ఉంది. అందుకే లక్కాకుల వారు ప్రశంసించారు ‘చతురతకు మిన్న మిస్సన్న!’ అని. అభినందనలు. * శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * నిరంజన్ కుమార్ గారూ, దైవకృప ఉంటే కానిదేమిటి అన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ అన్నివిధాల బాగుంది. అభినందనలు.
శంకరార్యా !
రిప్లయితొలగించండి"గడవ "అంటే "గడప "అనేనా ?
కడవ నొక్కటి జాలరి పడవలోన
రిప్లయితొలగించండినుంచి వేటకు వెళ్లగ నొక్క సారి
పెద్ద అల వచ్చి పైబడ బెదరె వాడు
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండి‘నిండెన్ + కడవలోన = నిండెఁ గడవలోన’
అది కడవ (కుండ), గడప కాని కడప కాని కాదు!
కిశోర్జీ ! మీ సందేహం తీరిందనుకుంటాను.
రిప్లయితొలగించండిసకల వేద వేదాంగముల కలయికను
రిప్లయితొలగించండిగీత యందు నిమిడ్చె శ్రీకృష్ణ విభుఁడు
సజ్జనావళి గ్రోల తత్సలిల సుధలు
కడలి నీరంతయును నిండెఁ గడవలోన !
మూర్తి గారూ ! బాగుంది.
రిప్లయితొలగించండిపూర్వము పుస్తకములకు స్థానము "భాండాగారములే".
'కడలి నీరను' గ్రంథమ్ము కష్ట పడుచు
వ్రాసె నొక్కడు బహు తాళ పత్రములను
కడవ నుంచెను దాచగ, ఖాళి లేదు
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.
జగము నందలి జీవికి జన్మనిచ్చు
రిప్లయితొలగించండితల్లిదండ్రుల రూపము దాల్చుచున్న
నాదిదంపతుల కరుణ హద్దు మరచె.
కడలి నీరంతయును నిండెఁ గడవలోన !
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! ధన్యవాదములు !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
____________________________
కడలి జలకంబు లాడిన - కాంత యొకతె
కడవ ముంచెను గొనిపోవ - కడలినీరు
కడలి నీరంతయును నిండె - గడవ లోన
కమల లోచన గొనిపోయె - కడవ తోడ !
____________________________
సకల బ్రహ్మాండ భాండముల్ జలజభవుడు
రిప్లయితొలగించండిచేయు కడవలే యౌట విచిత్రమేమి?
కడలు లెన్నియో యుండు నా కడవలందు
కడలి నీరంతయును నిండె కడవలోన
02)
రిప్లయితొలగించండినేమానివారి స్ఫూర్తితో :
____________________________
క్ష్మమ , గోళంపు రూపంబు - గాన మనము
గహ్వరిని బోల్చగావచ్చు - కడవ తోడ
కర్వరిని దాగియుండును - కడలు లెన్నొ
ఒక్క కడలియె కాదోయి - పెక్కులైన
కడలి నీరంతయును నిండె - గడవ లోన !
____________________________
వెళ్లె వేటకు మావతో పల్లె పడుచు
రిప్లయితొలగించండిదూర మేగిరి సంద్రాన దొరక లేదు
చేప లేవియు, చింతించె పాప మిట్లు
'నోరు దడుపంగ పనికి రా నేర విచటి
కడలి నీరంతయును,నిండె కడవ లోన
మంచి తీర్థము లొడ్డుకు మరల నెపుడు?
పైన సూరీడు మండె, నీవైన మొయిల !
కురిసి దాహార్తి దీర్చరా కూడ దేమి?'
ఆదిదంపతుల అవ్యాజమైన ప్రేమ తల్లిదండ్రుల రూపములో భువిలో దిగి వచ్చి పిల్లలను అపరిమితమైన ప్రేమను పంచుట.
రిప్లయితొలగించండిఆదిదేవుల ప్రేమ కడలి లాగా అనంతమైనది దాన్ని చిన్న కడవలో తల్లిదండ్రుల రూపములో నింపినారు. అని అన్వయము.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఆచమన్యము జేయగ నబ్ధిజలము
ముని కమండలమందున ముచ్చటగను
అలల సవ్వడులుడుగగ నమరిపోయె
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన
2 వ పాదము "మునివరేణ్యుడు చెపట్టె ముచ్చటగను" అని అంటె బాగుంటుంది.
రిప్లయితొలగించండిగురువుల, కవి మిత్రుల పూరణలు అలరించు చున్నవి
రిప్లయితొలగించండి------
దారి జూపగ దినుటకు- దానవులకు
గట్టె కప్పము మెండుగ- గాపరికిలె
కడవ యందు దాచగ కాపు,-పుడమి పైన
గడలి నీరంతయును నిండె -గడవలోన|
( పుడమి పై కడలి నీరు = అవినీతి సొమ్ము)
గాలి వానకు పొంగెను కట్ట దరికి
రిప్లయితొలగించండికడలి నీ రంతయును , నిండె గడవ లోన
చూరు వెంబడి జారెడు చుక్క లన్ని
వాన జోరుగ నింటిపై పడుట వలన .
చిక్కనగు పాలు పోతు మీ చిత్తమలర
రిప్లయితొలగించండివెలను చూడకుడని నమ్మ బలికి నావె
యెంత చిలికిన రాదేమి సుంత వెన్న?
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన!
వేల యెకరాల పంటను విక్రయించి
రిప్లయితొలగించండిరొక్కమునుబెట్టె రైతన్న రొంటిలోన
ఎంత చిత్రమ్మదెంతటి వింత గనుమ
కడలి నీరంతయును నిండె గడవలోన
పొసగ పాలలో నీళ్ళు గల్పుటలు గాదు
రిప్లయితొలగించండిపూని నీళ్ళలో పాలు గల్పుటలు నిజము
పాల కడవలో కడలి గల్పంగ జెప్పి
'చతురతకు మిన్న మస్సన్న' సాక్ష్య మిచ్చె
శ్రీ వసంత్ కిశోర్ గారి పద్యము బాగున్నది. 1వ పాదము మొదటి గణము సవరించాలి. ఆ పాదము నిలా మారిస్తే బాగుంటుంది అనుకొనుచున్నాను:
రిప్లయితొలగించండిఉర్వి రూపమ్ము గోళమట్లుండు గాన
నేమానివారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండి02అ)
____________________________
క్షాంతి , గోళంపు రూపంబు - గాన మనము
గహ్వరిని బోల్చగావచ్చు - కడవ తోడ
కర్వరిని దాగియుండును - కడలు లెన్నొ
ఒక్క కడలియె కాదోయి - పెక్కులైన
కడలి నీరంతయును నిండె - గడవ లోన !
____________________________
వామనుడెదిగినాడుగ భూమియంత
రిప్లయితొలగించండిఅణిగి యుండెగ నోటబ్రహ్మాండ మంత
కడలి నీరంతయును నిండె కడవలోన
కాని దేమిటి దైవంబు కరుణ యుండ
సాగరమ్ములు మ్రింగిరి యోగ ధనులు
రిప్లయితొలగించండిగగన మందుండి రప్పించె గంగ భువికి
వింత యేముంది మనదంత వేద భుమి
కడలి నీరంతయును నిండెఁ గడవ లోన
క్షమించాలి నిరంజన్ గారి పద్యం నేను చూడ లేదు. ముందుగా చూసి ఉంటే మార్చు కుందును గదా ! కొంచం రెండు ఒకేలా ఉన్నాయి అందుకని !
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
ముఖ్యంగా రెండవపూరణ ఉత్తమంగా ఉంది.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
కొద్ది రోజులుగా మీ పూరణలలో ప్రావీణ్యత స్పష్టంగా కనిపిస్తున్నది. సంతోషం.
ఈనాటి పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉంది. ఒక్క సముద్రాన్నే కష్టం అనుకుంటే మీరు ఎన్నో సముద్రాలను కడవలో చేర్చారు. బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
అన్నివిధాల ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
పూరణ మిషతో ఒక ఖండకావ్యాన్నే వ్రాసారే. చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారిని అభినందించిన మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
సముద్రజలాన్నే పుక్కిట పట్టిన మన మునులకు అదొక లెక్కా? చక్కని పూరణ. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
‘మెండుగ గాపరికిలె’ ...?
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ మనోహరమై అలరారుతున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
నీళ్ళ పాలు పోసినవాణ్ణి బాగానే విమర్శించారే! చమత్కారమైన పూరణ. వైవిధ్యంగా ఉంది.
అందుకే లక్కాకుల వారు ప్రశంసించారు ‘చతురతకు మిన్న మిస్సన్న!’ అని. అభినందనలు.
*
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
నిరంజన్ కుమార్ గారూ,
దైవకృప ఉంటే కానిదేమిటి అన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ అన్నివిధాల బాగుంది. అభినందనలు.
గురువు గారూ,శాస్త్రీజీ, ధన్యవాదములు. మిత్రుల పూరణ లన్నీ బాగున్నాయి.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరాజారావు గారూ ధన్యవాదాలు.
మత్స్య రూపమ్ము దాల్చు సమయమునందు
రిప్లయితొలగించండిమనువు చేతి కుంభమునందు మాధవుండు
జలచరముగ నొదిగె నక్కజమ్ముగాదె
కడలినీరంతయును నిండె గడవలోన .
-------------------