ప్రహేళిక
లంబోదర తవ చరణౌ
ఆదరతో యో న పూజయతి |
స భవతి విశ్వామిత్రో
దుర్వాసా గౌతమ శ్చేతి ||
"ఓ వినాయకా! ఎవడు నీ పాదాలను ఆదరంతో పూజింపడో వాడు విశ్వామిత్రుడో, దుర్వాసుడో, గౌతముడో అవుతా డంటారు" అని విపరీతార్థం.
మరి ఇందలి విశేషార్థం ఏమిటో చెప్పగలరా?
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
వినాయకుని పాదపూజకు నోచుకోనినాడు ఎంతటివాడైనా విశ్వానికిశత్రువౌతాడు.దుర్నివాసుడౌతాడు.పశూత్వాన్నిపొందుతాడు.
రిప్లయితొలగించండివిశ్వామిత్రుడు = అవిస్వస నీయుడు [ నమ్మకము లేనివాడు , నమ్మ దగని వాడు , తనయందు తనకు నిలకడ లేని వాడు ]
రిప్లయితొలగించండిదుర్వాసుడు = దుర్వ్య సనములు కలిగిన వాడు
గౌతముడు = గోహత్య చేసిన వాడు . అగుదురు
నాకు తెలిసి కాదు . ఊరికే వ్రాసానంతే