శాస్త్రీజీ ! ధన్యవాదములు ! భాష కన్నా భావమే ప్రధానమని ఘటోత్కచులవారు "మాయాబజార్" లో సెలవిచ్చారు గదా ! మన భావాన్ని మనం వెళ్ళగ్రక్కితే భాషా సంస్కరణ కు గురువులూ ,పెద్దలూ ఉండనే ఉన్నారు !
పండిత నేమాని వారూ, ముళ్ళబాట వంటి రాజకీయాలపై మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * జిలేబి గారూ, చక్కని భావాన్ని వెలిబుచ్చారు. సంతోషం! మీ భావానికి నా పద్యరూపం ....
ప్రేమ యనునది జగమునఁ బెంపుసేయ నదియు విశ్వజనీనమై యలరునటుల నరుఁడు సేయు యోగము చెప్పతరము గాదు పూలపానుపు కా దది ముళ్ళబాట. * వసంత కిశోర్ గారూ, ఇప్పటికి చేరిన మీ ‘డజన్’ పూరణలు చదివి ఎంతో సంతోషించాను. మీ పద్యరచనాభిలాషను, భావవైవిధ్యాన్ని, ముఖ్యంగా ఓపికకు నా నమోవాకాలు. మొదటి పూరణలో ‘పుణ్యబాట’ను ‘పుణ్యపథము’ అందాం. రెండవ పూరణలో ‘సౌమ్యబాట’ను ‘సౌమ్యపథము’ అందాం. మూడవ పూరణలో ‘రమ్యపథము, వ్యాజ(?)పథము’ అందాం. ఏడవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘ప్రభుత్వ’ అన్నదాన్ని ‘ప్రభుతలో’ అందాం. ఎనిమిదవ పూరణలో ‘నిష్ఠ’ను ‘నిష్ట’ అన్నారు. టైపాటు కాబోలు! ఇక నైషధం, రామాయణం, భారతం కథాంశాలతో మీ పూరణలు మనోహరంగా, కరుణరసావిష్కృతాలై అలరారు తున్నాయి. ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
లక్కాకుల వెంకట రాజారావు గారూ, మనోహరమైన అనుప్రాసతో మీ పూరణ అలరిస్తున్నది. చాలా బాగుంది. అభినందనలు. మిస్సన్న గారూ, మీ సూచన బాగుంది. ధన్యవాదాలు. కాని ఇప్పుడు మార్చడం వీలుకాదు కదా! మీ మూడు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు. అయినా ఇంత ధారాళంగా పద్యరచన చేసే మీకు అది ముళ్ళబాట ఎలా అవుతుంది? నేను మాత్రం బ్లాగు నిర్వహణను ముళ్ళబాటగా ఎంతమాత్రం భావించడం లేదండీ!
తమ్ముడూ ! ధన్య వాదములు. రాత్రి నిద్ర కళ్ళని రాసాను . ఎలా ఉందో అని భయం వేసింది. ఇక తమ్ముని తిట్టడమా ? అమ్మో ? అన్న దమ్ముల్ని అమ్మలా చూసు కోవాలి . అసలు నేను ఆడవాళ్ళ మీద రాసి రాసి బోలెడు తిట్లు తిన్నాను [ పత్రికల్లో ] నిజాన్ని నిజంగా రాయడమే అలవాటు. సోదరులు పండిత నేమాని వారి మందారం ఎక్కడో చదివిన గుర్తు. ఇక " ప వర్గ " నిషేధం తొ నా " కిట్టింపు "
మిస్సన్న గారూ, ధన్యవాదాలు. పవర్గ నిషేధంతో అద్భుతమైన పద్యం చెప్పారు. అభినందనలు. మీ కొసరు పూరణలు చాలా బాగున్నాయి. ‘ఆర్థిక + ఉద్యోగ’ అన్నప్పుడు యడాగమం రాదు కదా. ‘ఆర్థికోద్యోగపు’ అంటే సరి! * రాజేశ్వరి అక్కయ్యా, పెద్దవాళ్ళ తిట్లు దీవెన లంటారు. నిషిద్ధాక్షరి ప్రయత్నం ప్రశంసించదగిందే. అందమైన పద్యం వ్రాసారు. కాని పద్యంలో నిషిద్ధమైన ‘భ’ రెండుసార్లు, ‘మ’ ఐదుసార్లు వచ్చాయి. పవర్గ నిషేధమంటే ... పఫబభమ ... ఈ అక్షరాలలో ఏదీ రాకూడదు కదా!
మాస్టారూ, ఒక సందేహం. ఇదివరలో ఈ ప్రస్తావన వచ్చింది గానీ సరైన సమాధానం ఏమిటో గుర్తుకు రావటం లేదు - "అరయoగ ననేక రంగులందు ననుండున్" అనే పాదంలో సున్న ద్వారా "మ" కారం వచ్చింది కదా. "ప" వర్గ నిషేధం అయినట్లేనా?
శ్రీ గురుభ్యో నమః. నేమాని పండితార్యా ధన్యవాదములు. ఇక ప్రశాంతంగా నిద్ర పడుతుంది. క్రొత్త విషయాన్ని తెలుసుకొనే అవకాశం కలిగించిన మనతెలుగు వారికీ ధన్యవాదములు.
రాజకీయాల లోన ఘోరములు మెండు
రిప్లయితొలగించండిగట్టివానికి నేని నిక్కట్టు లొదవు
పదవికై ప్రాకులాడంగ వలదు వలదు
పూల పానుపు కాదది ముండ్ల బాట
ప్రేమ యన్నది పెంపొందింప
రిప్లయితొలగించండిఅది విశ్వజనీన ప్రేమ అగుటకు
మనిషి చేయు యోగం
పూల పానుపు కాదు ముండ్ల బాట
జిలేబి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
నేమానివారివి కృత యుగపు మాటలు !
నేటి రాజకీయం :
01)
______________________________________
పుడమి నధికార మొసగెడి - పోరు బాట !
పుట్ట నుండెడి పాముల - పొట్ట వంటి
పూని జనులను దోచెడు - పుణ్య బాట !
పూల పానుపు ! కాదది - ముండ్ల బాట !
______________________________________
నేటి రాజకీయం :
రిప్లయితొలగించండి02)
______________________________________
రాజకీయుల రంకుకు - రాచ బాట !
రంకు నేర్చిన వారికి - బొంకు బాట !
రమ్య రమ్యాతి రమ్యమౌ - సౌమ్యబాట !
పూల పానుపు ! కాదది - ముండ్ల బాట !
______________________________________
రంకు = పార్టీలు మారడం
బొంకు = శుష్క వాగ్ధానం
సౌమ్య బాట = మెత్త మెత్తగా మొత్తం దోచుకోవడం
నేటి రాజకీయం :
రిప్లయితొలగించండి03)
______________________________________
రంగు మార్చెడి బింబపు - రమ్య బాట
రమణులను తార్చ బూనెడి - రంకు బాట
రాజ భోగమ్ము దేల్చెడి - వ్యాజ బాట
పూల పానుపు ! కాదది - ముండ్ల బాట !
______________________________________
బింబము= ఊసరవెల్లి
వ్యాజము = మోసము
రాగ మోహము లనుపేర రంగులెన్నొ
రిప్లయితొలగించండిసాగరమ్ముల నన్నిట సరియగునిది
భవము దాటుట కష్టము భక్తి లేక
పూల పానుపు కా దది ముండ్లబాట.
కిషోర్ జీ ! పూరణ లో చక్కని బాటలు వేశారు.కానీ పుణ్య బాట,రమ్య బాట,వ్యాజ బాట దారి తప్పిన వనుకుంటాను. (వట చెట్టు లా...)
రిప్లయితొలగించండివాలు చూపుల వయ్యారి వలను చిక్కి
రిప్లయితొలగించండిఏలు కొనియెద ననుకొన్న మేలు కాదు
వారి జాక్షుల చిత్తమ్ము భ్రాంతి గొలుపు
పూల పానుపు కా దది ముండ్ల బాట
నేటి సామాన్యుడి జీవనం :
రిప్లయితొలగించండి04)
______________________________________
సత్య పాలన గావింప - చవట యగును !
సాటి వారిని సేవింప - యోటి యగును !
చదువు, విఙ్ఞాన మెంతున్న - సస్య మెచట ?
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
______________________________________
సస్యము = పంట(ఫలితం)
శాస్త్రీజీ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిభాష కన్నా భావమే ప్రధానమని
ఘటోత్కచులవారు "మాయాబజార్" లో సెలవిచ్చారు గదా !
మన భావాన్ని మనం వెళ్ళగ్రక్కితే
భాషా సంస్కరణ కు గురువులూ ,పెద్దలూ ఉండనే ఉన్నారు !
నేటి సామాన్యుడి జీవనం :
రిప్లయితొలగించండి05)
______________________________________
శిష్ట వర్తన జరియింప - శిక్ష లొదవు !
చెడ్డ దారిని నడచిన - దొడ్డ యగును !
చేత విద్యలు పెరిగిన - చేవ జచ్చు !
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
______________________________________
సామాన్యుడి జీవనం :
రిప్లయితొలగించండి06)
______________________________________
పుణ్య తీర్థమ్ము లన్నిట - పురుగు పట్టె !
పురుగు లన్నియు నేడిల - మెరుగు లయ్యె !
పురుష కారము నేడిట - బువ్వ నిడదు !
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
______________________________________
సామాన్యుడి జీవనం :
రిప్లయితొలగించండి07)
______________________________________
దొంగ లందరు ప్రభుత్వ - దొరలు నేడు !
దొరికి నంతయు దోచెడి - దొరల కతన
దీన జనులను రక్షింప - దిక్కు లేదు !
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
______________________________________
పెట్టి పుట్టినవారికి పేర్మి మీర
రిప్లయితొలగించండిపుడమి బ్రతుకును నడుపగ పూల బాట
పాపకర్మల ఫలితము బడయు వార్కి
పూల పానుపు కాదది ముండ్ల బాట.
మిత్రులారా! ఈ నిషిద్ధాక్షరిని చూడండి. ఎప్పుడో మా అమ్మాయి అడిగితే నేను చెప్పేను.
రిప్లయితొలగించండిమందారపుష్పము పై కందపద్యము - మకార నిషేధము.
తొలి వేల్పుచెట్టు పూవన
జెలగును కడు నెర్రనగుచు సిరులకు నెలవై
వెలయించును తేనెలు పూ
జలలో వేలుపుల సిగల చక్కగ నొప్పున్
(వేలుపు చెట్టు అంటే కల్ప వృక్షము - కల్ప వృక్షాలలో మొదటిది మందారమే).
ధర్మరాజు తమ్ములతో :
రిప్లయితొలగించండి08)
______________________________________
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
నేటి వనవాస దీక్షను - నిష్ట తోడ
నెఱప బూనుట మనకేమొ - యొఱక మగును
నేస్తు డాప్తుడు కృష్ణుడే -నేడు దిక్కు !
______________________________________
ఒఱకము = కష్టము
నలుడు దమయంతితో :
రిప్లయితొలగించండి09)
______________________________________
పిట్టలను బట్ట , విసిరితి - పుట్ట మీద !
పుట్టమును బట్టి పూనిక - పులుగు లన్ని
చెట్టు పైకెక్కె చిత్రమ్ము - జేసె విధియె !
వస్త్రమే లేదు , నేడు ,వి - వస్త్ర నైతి !
నెలత వనవాస దీక్షను - నియతి తోడ
నెరప బూనుట నీకిట - నరక మగును
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
పుట్టినింటికి పోవుమా - పొలతి నీవు !
______________________________________
హరిశ్చంద్రుడు చంద్రమతితో :
రిప్లయితొలగించండి10)
______________________________________
కాలకౌశికు కమ్మితి - కరుణ మాలి !
కటిక వానిపై కోపమ్ము - కలికి వలదు !
కాల కౌశికు సేవింపు - కష్ట మైన !
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
______________________________________
అడవికి తానూ వస్తానన్న సీతతో రాముడు :
రిప్లయితొలగించండి11)
______________________________________
కేకరాక్షి పలుకులకు - కినియ కుండ
కైక వరముల కొడబడి - కాననముల
కేగు చుంటిని ! నామాట - కినుక లేక
కర్ణ మొగ్గుము , నాయందు - కరుణ జూపి
కోట లోననె యుండుమో - కోమలాంగి
కాననంబుల నీ కేల - కష్ట మింక
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
______________________________________
కేకరాక్షి = మెల్లకన్ను గలది
(గూనివారికి మెల్ల సహజ భూషణము గదా )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివంశాంకురం కోసమైనా నీవు వసించెదనని వాగ్దానం
రిప్లయితొలగించండిచెయ్యమన్న లక్ష్మణునితో పావనజాత :
12)
______________________________________
కనుల కల్హార మందశ్రు - కణము లొలుక
కలికి జానకి పలికెను - కరుణ చిలుక !
కడుపులోనున్న పిల్లల - గనెడు వరకు
కనిన కూనల రామున - కప్పగించ
కాన నంబుల వసియింతు - కష్ట మోపి !
పూల పానుపు కాదది !- ముండ్ల బాట !
______________________________________
చేల తలనేల,కనులు లోకాల నేల,
రిప్లయితొలగించండికేల తుల లేని సిరుల వరాలు దేల
గ్రాలు శ్రీసాయి కరుణాల వాల లీల
పూల పానుపు-కాదది ముండ్ల బాట
రాజా రావుగారూ చక్కని అనుప్రాసతో మీ పూరణ సాయిమనోహరంగా ఉంది.
రిప్లయితొలగించండిసమస్య ' పూల రహదారి కాదది ముండ్ల బాట ' అని కానీ ' పూల పానుపు కాదది ముండ్ల శయ్య ' అని కానీ ఇస్తే ఇంకా బాగుండేదేమో.
రిప్లయితొలగించండియతులు ప్రాసలు ఛందస్సు వ్యాకరణము
గ్రామ్య గ్రాంథిక భేదముల్ గహనములవి
పద్య రచనన్న నాబోటి పామరులకు
పూల పానుపు-కాదది ముండ్ల బాట
వీపుపై మోయలేనంత పెద్ద బరువు
రిప్లయితొలగించండిచిన్న బాటిలు బాక్సులు చిట్టి చేత
ప్రాయమో మూడు నాల్గేమొ బాల్యమన్న
పూల పానుపు-కాదది ముండ్ల బాట
మిడిమిడి జ్ఞాన సూచనల్ మెచ్చుకోళ్ళు
రిప్లయితొలగించండివరలు నజ్ఞాత వ్యాఖ్యలు వాదములును
పూలు రాళ్ళును బ్లాగును పూని నడుప
పూల పానుపు-కాదది ముండ్ల బాట
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిముళ్ళబాట వంటి రాజకీయాలపై మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
జిలేబి గారూ,
చక్కని భావాన్ని వెలిబుచ్చారు. సంతోషం! మీ భావానికి నా పద్యరూపం ....
ప్రేమ యనునది జగమునఁ బెంపుసేయ
నదియు విశ్వజనీనమై యలరునటుల
నరుఁడు సేయు యోగము చెప్పతరము గాదు
పూలపానుపు కా దది ముళ్ళబాట.
*
వసంత కిశోర్ గారూ,
ఇప్పటికి చేరిన మీ ‘డజన్’ పూరణలు చదివి ఎంతో సంతోషించాను. మీ పద్యరచనాభిలాషను, భావవైవిధ్యాన్ని, ముఖ్యంగా ఓపికకు నా నమోవాకాలు.
మొదటి పూరణలో ‘పుణ్యబాట’ను ‘పుణ్యపథము’ అందాం.
రెండవ పూరణలో ‘సౌమ్యబాట’ను ‘సౌమ్యపథము’ అందాం.
మూడవ పూరణలో ‘రమ్యపథము, వ్యాజ(?)పథము’ అందాం.
ఏడవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘ప్రభుత్వ’ అన్నదాన్ని ‘ప్రభుతలో’ అందాం.
ఎనిమిదవ పూరణలో ‘నిష్ఠ’ను ‘నిష్ట’ అన్నారు. టైపాటు కాబోలు!
ఇక నైషధం, రామాయణం, భారతం కథాంశాలతో మీ పూరణలు మనోహరంగా, కరుణరసావిష్కృతాలై అలరారు తున్నాయి.
ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిభవసాగరాన్ని దాటడాన్ని ముళ్లబాటతో పోల్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని ఈ పద్యాన్నే నేను వ్రాస్తే ‘ఏరా, తమ్ముడూ! ఆడవాళ్ళంటే నీకంత చులకనా?’ అని మీరే చీవాట్లు పెట్టేవాళ్ళు! :-)
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మకార నిషేధంతో మందారపుష్పం మీది మీ పూరణ. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
‘పవర్గ నిషేధం’తో అదే మందారపుష్పంపై మిత్రు లెవరైనా పూరణ చెప్పవలసిందిగా మనవి.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన అనుప్రాసతో మీ పూరణ అలరిస్తున్నది. చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీ సూచన బాగుంది. ధన్యవాదాలు. కాని ఇప్పుడు మార్చడం వీలుకాదు కదా!
మీ మూడు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
అయినా ఇంత ధారాళంగా పద్యరచన చేసే మీకు అది ముళ్ళబాట ఎలా అవుతుంది?
నేను మాత్రం బ్లాగు నిర్వహణను ముళ్ళబాటగా ఎంతమాత్రం భావించడం లేదండీ!
నేమాని పండితార్యా మీ నిషిద్ధాక్షరి అనుపమం.
రిప్లయితొలగించండినా ప్రయత్నం.
సురతరువని వాసి గలదు
అరయoగ ననేక రంగులందు ననుండున్
సరి యెఱ్ఱనిదే చక్కన
తరువులలో రాణి యగుచు తనరెడు నదియే.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిబ్లాగు నిర్వహణను పూల బాటగా భావించడం మీ సమర్థకు నిదర్శనం.
ఇక నేను ఒక్కొక్క రోజు పద్యం తట్టక పడే వేదన నేం చెప్పమంటారు.
ఇంటిలో భర్త పిల్లలు వంట పెంట
రిప్లయితొలగించండిబయట నార్థిక యుద్యోగ బాధ్యతలును
నేటి మహిళకు జీవిక నిజముగాను
పూల పానుపు-కాదది ముండ్ల బాట
రాముడనె జానకీ వెంట రాకు వినుము
రిప్లయితొలగించండిక్రూర మృగములు రక్కసుల్ ఘోరతరము
వనములో నుండుటన రాణి వాస మగునె
పూల పానుపు-కాదది ముండ్ల బాట
తమ్ముడూ ! ధన్య వాదములు. రాత్రి నిద్ర కళ్ళని రాసాను . ఎలా ఉందో అని భయం వేసింది. ఇక తమ్ముని తిట్టడమా ? అమ్మో ? అన్న దమ్ముల్ని అమ్మలా చూసు కోవాలి . అసలు నేను ఆడవాళ్ళ మీద రాసి రాసి బోలెడు తిట్లు తిన్నాను [ పత్రికల్లో ] నిజాన్ని నిజంగా రాయడమే అలవాటు.
రిప్లయితొలగించండిసోదరులు పండిత నేమాని వారి మందారం ఎక్కడో చదివిన గుర్తు. ఇక " ప వర్గ " నిషేధం తొ నా " కిట్టింపు "
సుందర మందారము గని
అందముగా కనుల విందు నాహా యనుచున్ !
డెందము చిందులు వేయగ
వందన మిడి భక్తి మీర భర్గుని కొసగెన్ !
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
పవర్గ నిషేధంతో అద్భుతమైన పద్యం చెప్పారు. అభినందనలు.
మీ కొసరు పూరణలు చాలా బాగున్నాయి.
‘ఆర్థిక + ఉద్యోగ’ అన్నప్పుడు యడాగమం రాదు కదా. ‘ఆర్థికోద్యోగపు’ అంటే సరి!
*
రాజేశ్వరి అక్కయ్యా,
పెద్దవాళ్ళ తిట్లు దీవెన లంటారు.
నిషిద్ధాక్షరి ప్రయత్నం ప్రశంసించదగిందే. అందమైన పద్యం వ్రాసారు. కాని పద్యంలో నిషిద్ధమైన ‘భ’ రెండుసార్లు, ‘మ’ ఐదుసార్లు వచ్చాయి. పవర్గ నిషేధమంటే ... పఫబభమ ... ఈ అక్షరాలలో ఏదీ రాకూడదు కదా!
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీ సవరణ చాలా బాగుంది.
మాస్టారూ, ఒక సందేహం. ఇదివరలో ఈ ప్రస్తావన వచ్చింది గానీ సరైన సమాధానం ఏమిటో గుర్తుకు రావటం లేదు - "అరయoగ ననేక రంగులందు ననుండున్" అనే పాదంలో సున్న ద్వారా "మ" కారం వచ్చింది కదా. "ప" వర్గ నిషేధం అయినట్లేనా?
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపూల పానుపు కా దది ముండ్లబాట
బ్రతుకుతెరవైన శ్రమజీవి బ్రతుకుబాట
కష్టములకోర్చి నడచిన కలుగు సుఖము
నడువలేనట్టి వారికి నరకమగును
గురువుగారూ శ్రీ చంద్ర శేఖర్గారి ప్రశ్నకు తొందరగా జవాబు కావాలి. నరాలు తెగిపోయే టెన్షన్లో ఉన్నాను,
రిప్లయితొలగించండి" ప " అంటే " ప " ఒక్కటే అనుకున్నాను. ధన్య వాదములు.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిఅనుస్వారము (0) ను మకారముతో సమానముగ గుర్తించాలా? ముఖ్యముగ నిషిద్ధాక్షరిలో.
అనుస్వారము క వర్గమునకు ఙ్ గాను, చ వర్గమునకు ఞ్ గాను, ట వర్గమునకు ణ గాను, త వర్గమునకు న గాను, ప వర్గమునకు మ గాను సరిపోవును. అటులనే య, ర, ల, వ, శ, ష, స, హ లకు మ గాను సరిపోవును. నిషిద్ధాక్షరిలో మ కారముగ అనుస్వారమును గుర్తించుట లేదు. స్వస్తి.
శ్రీ గురుభ్యో నమః. నేమాని పండితార్యా ధన్యవాదములు. ఇక ప్రశాంతంగా నిద్ర పడుతుంది. క్రొత్త విషయాన్ని తెలుసుకొనే అవకాశం కలిగించిన మనతెలుగు వారికీ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని మహాశయా! సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న గారూ, నాలుగు సున్నలకు నాలుగు వీరతాళ్ళు మీకు. శుభరాత్రి.