16, జనవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 593 (పసలేని పశువు కడివెడు)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
కనుమ పండుగ శుభాకాంక్షలు
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్.
ఈ సమస్యను పంపిన
‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. రసహీనంబగు కవితను
    వెస పామరుడొక్క రాజు విని బహుమతిగా
    నొసగెను లక్షలను కవికి
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్

    రిప్లయితొలగించండి
  2. మూర్తి గారూ! 'త్రస్తరించు' పద్యము బాగుంది.
    నేమాని గారూ! 'రాజు బహుమతి' బాగుంది.

    దెస తోచక వరదలలో
    గస బెట్టుచు పాల ' కేన్లు' గాడిద పైనన్
    వెస మోపి పంచె నొక్కడు
    'పస లేని పశువు కడివెడు పాలనొసెంగెన్'

    రిప్లయితొలగించండి
  3. హనుమఛ్ఛాస్త్రి గారూ మీ పద్యము చాలా బాగుంది.ఆ పరిస్థితులలో ' ఖరము పాలు ' బహు పసందుగా ఉంటాయి. నా పూరణ నాకు తృప్తిగా లేదు.

    రిప్లయితొలగించండి
  4. మూర్తి గారు ధన్య వాదములు.
    ' కడివెడు పాల' కోసం చిన్న సవరణ...

    దెస తోచక వరదలలో
    గస బెట్టుచు ' పాల కడవ ' గాడిద పైనన్
    వెస మోపి పంచె నొక్కడు
    పస లేని పశువు ' కడివెడు పాల ' నొసెంగెన్.

    రిప్లయితొలగించండి
  5. పిసినారి షావుకారికి
    పసలేని పశువు కడివెడుపాల నొసంగెన్
    పసిబాలుడు రుచి లేవని
    కసికసిగాలేచిపాల కడవను తన్నెన్!!!

    రిప్లయితొలగించండి
  6. అసలుకె మోసము నిచ్చెను
    పస లేని పశువు ,కడివెడు పాల నొసంగెన్
    పస గలిగెడి మా యావులు
    రుస రుస లే దాని గుణము రోజంతయునున్

    రిప్లయితొలగించండి
  7. కసవును మెసవుచు బుధ్ధిని
    పసలేని పశువు కడివెడు పాల నొసంగున్
    వసుధను మొలిచిన గింజలు
    వసువులు గురిపించు మానవాళికి - నరుడో???

    రిప్లయితొలగించండి
  8. డి.నిరంజన్ కుమార్సోమవారం, జనవరి 16, 2012 6:04:00 PM

    అసలే చిక్కిన పశువది
    కసువైనను మేయదెపుడు కాసింతైనన్
    ముసలితనంబున నేడా
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్

    రిప్లయితొలగించండి
  9. నస బెట్టకు నే నమ్మను
    కసవూడ్చుము వేగ ననిన కాముడ దేమో
    విసవిస పోయెను నిజమొకొ
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్.

    రిప్లయితొలగించండి
  10. ముసిముసి నవ్వుల కృష్ణుడు
    వెస విడువగ వత్స త్రాగె వేకువ జామున్
    రుసరుసలు రాక మున్నే
    పసలేని పశువు కడివెడు పాలనొసంగెన్ !

    రిప్లయితొలగించండి
  11. డి.నిరంజన్ కుమార్సోమవారం, జనవరి 16, 2012 9:09:00 PM

    మసకేసిన చీకటిలో
    పసువుంగని పాలుపితుక పాలేరరుగన్
    కసువేదినకచ్చెరువున
    పసలేని పసువు కడివెడు పాలనొసంగెన్

    రిప్లయితొలగించండి
  12. ఉసురుండునొ హింసింపగ
    ముసలితనము నమ్మ దాని ముష్కరునకు, నే
    వెస బెట్టితి కసవింతయు
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్ !

    రిప్లయితొలగించండి
  13. పసిబాలుడు రేపల్లెన
    వసుదేవ సుతుండునాడు పశుపాలకుడై
    రసములు పొదుగున నింపగ
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్!!!

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిసోమవారం, జనవరి 16, 2012 11:33:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    అసురుని వలె హింసించుచు
    పసి దూడను కాల దన్నె పశువా యనుచున్
    అసహాయ తిరుగబడుటకు
    పసలేని పశువు, కడివెడు పాల నొసంగెన్

    రిప్లయితొలగించండి
  15. రస మురళీగానము విని
    వెస గోపాలకుని జేరి వివశంబుననా
    ససిధారల చేపుచు వడిఁ
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్!

    రిప్లయితొలగించండి
  16. బసకైనను నోచుకొనని
    వ్యసనుఁడు గడియించె 'గాలి' వరుసగ నేవో
    దెసలన్నది యే మాయన
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్?

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రుల పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి.
    పండిత నేమాని వారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    సుబ్బారావు గారూ,
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    నిరంజన్ కుమార్ గారూ,
    మిస్సన్న గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ మీ పూరణలు దేనికదే ప్రత్యేకంగా, వైవిధ్యంగా, కొండొకచో చమత్కారంగా ఉండి అలరించాయి. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    "సత్యనిష్ఠ "తో
    లేగకు పాలుకుడిపి వచ్చి నీ కాహార మౌదునని
    పులికి వాగ్దానమిచ్చి దిగాలుపడ్డ మనసుతో
    బలహీనమైన పశువు యింటికి చేరి తన పిల్లకు
    కడుపారా పాలు పట్టిన వైనంబేమన:

    01)
    ___________________________________

    పసి వత్సము పాలు కుడుప
    పసితిండిని గడు వడిగిన - పసరము వడిగా
    బస జేరి, మదిని సుంతయు
    పసలేని పశువు కడివెడు - పాల నొసంగెన్ !
    ___________________________________
    పసితిండి = పులి

    రిప్లయితొలగించండి
  19. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అసలే బక్కటి జీవుడు
    బుసబుస రుసరుసలు లేని బుడతడు గాంధీ
    పసగల స్వాతంత్ర్య మొసగె:
    "పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్"

    గాంధీ గారి:
    బరువు = 46 kg
    పొడవు = 5' 3"

    రిప్లయితొలగించండి
  21. ప్రియంక రోదన:

    అసలీ టీవీ నాయిక
    తసదియ నగవుచు అమేథి తన్నుకు పోయెన్
    కసిగొన నిదియెట్లన్నన్:
    "పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్"

    రిప్లయితొలగించండి


  22. అసమాన ప్రతిభ తోడుగ
    మసకయె లేని ప్రభుత పలు మానవులన్ మా
    ర్చె! సవాలుల నెదురుకొనుచు
    పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి