8, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 584 (మానము లేని స్త్రీని గని)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది
మానము లేని స్త్రీని గని
మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్
.

9 కామెంట్‌లు:

  1. దీనుల కాచు యీశ్వరుని దేవిగ పూజల నందుకొంచు చం
    ద్రానన యై భువిం జనుల తల్లిగ వేల్పుగ నుండు నెప్పుడున్.
    మానని నమ్మకమ్మునిడి మమ్ముల బ్రోవవె యంచు నెట్టి దు
    ర్మానము లేని స్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్.

    దుర్మానము = గర్వము

    రిప్లయితొలగించండి
  2. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, జనవరి 08, 2012 12:50:00 PM

    ధీనిధు లై మహోన్నత సుధీ విభవమ్మున తెల్గు భారతిన్,
    వాణిని తెల్గునాట జన వాడుక మాటలు కూర్చితెల్గులన్
    జ్ఞాన ప్రసూన దాయినిగ, గ్రాంధిక కేవల తత్త్వగణ్యతా
    మానము లేని స్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

    రిప్లయితొలగించండి
  3. కానలలోన నొక్క సతి కందుచునుండగ నాదుకొంటిరా
    మానములేని స్త్రీని గని, మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్
    ధ్యానమునందు కూర్మిమెయి దర్శనమిచ్చి, వరమ్ములిచ్చి, సు
    జ్ఞానపథమ్ము జూపిన జగజ్జననిన్ బహుధా నుతించుచున్

    రిప్లయితొలగించండి
  4. నేనొక రేయి గంటి కల నిద్దురలో మన తెన్గు తల్లియే
    జ్ఞానములేని వారలయి కాదని పుత్రు లగౌర వించగా
    దీనత వీధి గుమ్మమున దిక్కులు జూచుచు నున్నపుత్ర స
    మ్మానములేని స్త్రీని గనిమాతగ మ్రొక్కిరి పండితోత్తముల్.

    రిప్లయితొలగించండి
  5. సాయిరాం తొంబై మూడు సోదరి
    సొబగైన కవితలల్లగ వారి నిరహం కార సొగసును
    దురభిమానము లేని స్త్రీని గని
    మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్.

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. హీన చరిత్రయై పరమ హేయముగా చరియించు జాణయై
    మేన పటుత్వముల్ సడల మేటి పతివ్రత నన్న మెత్తురే
    మానము లేని స్త్రీని గని? మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్.
    హీనుడు భర్త యయ్యు కలహిమ్పని సాధ్వి నటన్న చిత్రమే?

    రిప్లయితొలగించండి
  7. ఇందిరమ్మ:

    దీనులు పాకులన్ దునిమి తేరకు నిచ్చుచు బంగ్లదేశమున్
    వీనుల విందుగా మొరుగు వీథుల కుక్కల జేసి మంత్రులన్
    మీనము మేషమున్ గనక మేదిని నేలగ రాజనీతినిన్
    మానము లేని స్త్రీని గని
    మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్

    రిప్లయితొలగించండి