15, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 592 (మకర సంక్రమణము మతిని)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
మకర  సంక్రమణము  మతిని చెఱచు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

  1. ఈ నాటి టీవీ లలో
    సంక్రాంతి సంభరాల కార్యక్రమములను
    గాంచిన ఇదేయే నా సంక్రాంతి అని
    మకర సంక్రమణం మతిని చెరుచు

    రిప్లయితొలగించండి
  2. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, జనవరి 15, 2012 8:51:00 AM

    వచ్చి మనిషికి సద్బుధ్ది నిచ్చి తీర్చి
    మార్చు'మకర సంక్రమణము'మతిని - చెఱచు
    దురిత స్వార్థాది' పిదప బుధ్ధుల'ను - కాల్చి
    మలినములు లేని 'బంగారు మనిషి' జేయు

    రిప్లయితొలగించండి
  3. భోగి మంట గొబ్బి పొంగలి పితరుల
    తర్పణములు గ్రామ దైవ సేవ
    లనిన పడని వారి కను మానమేలయా
    మకర సంక్రమణము మతిని జెఱచు !

    రిప్లయితొలగించండి
  4. జిలేబి గారికి ధన్య వాదములు.వారి ఆలోచనకు నా పద్య రూపం.



    పండు గనుచు చూపు పదులుగా సినిమాలు
    మంచి వనగ నొకటి నెంచ లేము
    దూర దర్శిని తల దూరిచి దర్శించ
    మకర సంక్రమణము మతిని చెఱచు.

    రిప్లయితొలగించండి
  5. వికట రాజకీయ వేత్తలు వర్ధిల్లి
    వేషధారులైరి విరివి గాను
    హీనుల గని దించ మీన మేషము లేల
    మకర సంక్రమణము మతిని జెఱచు !

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారి పలుకులకే మరో పద్యము ,

    ఊరు వాడ లందు దూరదర్శిను లెన్నొ
    వెల్లి విరిసె, నేడు నెల్లి చూడ
    సంబరమ్ము లివియ సంక్రాంతి నాడంచు
    మకర సంక్రమణము మతిని చెఱచు

    రిప్లయితొలగించండి
  7. అల్లు డయిన వాడు మల్లుని మఱపించు
    కోర్కె దీర్చు మనుచు కోతి వోలె
    చెట్టు నెక్కి దిగడె పట్టిన పంతమున్
    మకర సంక్రమణము మతిని చెఱచు

    రిప్లయితొలగించండి
  8. భోగ భాగ్య మిలను భూరి నొసగు నట్టి
    మకర సంక్ర మణము , మతిని జెరచు
    పంట రాక మిగుల పాట్లు పడుట వల్ల
    నేరి కైన తప్ప దీ యవస్థ

    రిప్లయితొలగించండి
  9. సంక్రాంతి శుభా కాంక్షలు
    సంక్ర మణము మీకు నొసగు సంతస మెపుడున్
    సంక్రాంతి మూడు రోజులు
    శంకరు నే వేడు కొనుడు సహ చరు లారా !

    రిప్లయితొలగించండి
  10. శ్రీగురుభ్యోనమ:

    విసుగు కలుగజేయు విద్యుత్తు కోతలు
    కనగ పశువులకును కసువు కరవు
    బోరుబావులందు నీరు యింకిన వేళ
    మకర సంక్రమణము మతిని జెఱచు

    రిప్లయితొలగించండి
  11. డి.నిరంజన్ కుమార్ఆదివారం, జనవరి 15, 2012 7:03:00 PM

    కోడిపందెములును క్రొత్తవేషములును
    అంబరముల నంటు సంబరములు
    ముద్దుగుమ్మలేయు ముగ్గుల లోగిళ్ళు
    మకర సంక్రమణము మతిని చెరచు

    రిప్లయితొలగించండి
  12. డి.నిరంజన్ కుమార్ఆదివారం, జనవరి 15, 2012 9:10:00 PM

    అతివలేయు ముగ్గులానందపరచును
    పిండివంటలెన్నొ ప్రీతి పరచు
    ఇలును వీడ జనులు చలికి వెరచు
    మకర సంక్రమణము మతిని చెరచు

    రిప్లయితొలగించండి
  13. డి.నిరంజన్ కుమార్ఆదివారం, జనవరి 15, 2012 10:13:00 PM

    గాలిపటములాట గగనమందునజూడ
    సర్వజనులకెంతొ సంతసంబు
    పంటజేరు గడప మంటపాలగు కలప
    మకర సంక్రమణము మతిని చెరచు

    రిప్లయితొలగించండి
  14. జిలేబీ గారూ,
    మీ భావాన్ని కవిద్వయం గోలివారు, గన్నవరపు వారు ఛందోబద్ధం చేసారు. ఎంత అదృష్టవంతులు. మా మీత్రులకు మీరు ‘బుజ్జిపండే’ అయ్యారు. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రశస్తమైన భావంతో తేటగీతిలో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    ‘దురిత స్వార్థాది పిదప బుధ్ధుల’ అన్నప్పుడు ‘త’ గురువై గణదోషం. ‘స్వార్థాది పిదప ..’ అనడం దుష్టసమాసం అవుతున్నది.
    ‘దురిత లోభమోహాది బుద్ధులను’ అని సవరిస్తే ఎలా ఉంటుంది?
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    జిలేబీ గారి భావాన్ని ఛందోబద్ధం చేసినందుకు ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వికట రాజకీయాలను నిరసించిన మీ పూరణ చక్కగా ఉంది.
    పండుగ అల్లుళ్ల పంతాలని వివరించిన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    జిలేబీ గారి భావానికి పద్యం రూపం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    ‘నీరు + ఇంకిన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నీరడు గంటిన/ నీర మింకిన’ అంటే సరి!
    *
    నిరంజన్ గారూ,
    మీ మూడు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    రెండవ పూరణ మూడవపాదం గణం తప్పింది. ‘వెరచు’ను ‘వెరచుచుంద్రు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి