కవిమిత్రుల నూతన సంవత్సర శుభాకాంక్షలు
శ్రీ చింతా రామకృష్ణారావు గారు
శ్రీ జ్ఞాన సంపన్నులైన, సచ్చిదానంద మూర్తులైన సాహితీ ప్రియ మిత్రులకు క్రీ.శ.2012 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.
కాల గమనంలో ఆంగ్ల వత్సరం ఒక కొలమానంగా కలిగి, ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న మనం శుభాల నాకాంక్షించడం అసందర్భం కాదని భావిస్తున్నాను.
శుభమస్తు!
******
శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు
వచ్చె నవవత్సరమ్ము , కావచ్చు నిజము
కాలగణనమ్ము దీనిలో ఘనత యేమి ?
పేద శ్రీమంతు డగున ? దీపించి యెగసి
బడుగు బ్రతుకుల వెన్నెలల్ పరుగులిడున ?
మనిషి స్వార్ధమున్ కొంతైన మాను కొనున ?
మనిషి మనిషిని దోచుట మాను కొనున ?
మనిషి దుర్మార్గ వర్తన మాను కొనున ?
మనిషి మనిషిని చంపుట మాను కొనున ?
నేతలు వినీతులై తలవ్రాత మారి
దేశ ప్రజలకు శాంతి సందేశ మిడున ?
చదువు పూర్తయి యుద్యోగ విధులు లేని
వారి బతుకులు కొలువుల చేరు వగున ?
కోత లేని ‘ పవరు ‘ సమ కూరునా ? జ
లమ్ము పారి రైతన్న పొలాలు పండి
భారతావని కాకలి తీరునా ? ప్ర
భుత్వ పథకాల తీరు ప్రమోద మిడున ?
అగును కారణ మవినీతి యన్నిటికిని
ఓటరులు నీతి మంతులై ఓటు వేసి
నీతి మంతుల నేతల నెన్ను కొనిన
నాటి నవ వత్సరమ్ములు వేడు కగును
*******
శ్రీ డా .యస్వీ రాఘవేంద్ర రావు గారు
తియ్యనౌ పల్కు మొల్కల నెయ్యమలర
సమత మమతయు ననెడి సస్యములు పండ
మీదు జీవిత కేదార వీధులందు
క్రొత్త వర్షమ్ము శుభములు కురియుగాక!
******
శ్రీ జ్ఞాన సంపన్నులైన, సచ్చిదానంద మూర్తులైన సాహితీ ప్రియ మిత్రులకు క్రీ.శ.2012 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.
కాల గమనంలో ఆంగ్ల వత్సరం ఒక కొలమానంగా కలిగి, ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న మనం శుభాల నాకాంక్షించడం అసందర్భం కాదని భావిస్తున్నాను.
శుభమస్తు!
******
శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు
వచ్చె నవవత్సరమ్ము , కావచ్చు నిజము
కాలగణనమ్ము దీనిలో ఘనత యేమి ?
పేద శ్రీమంతు డగున ? దీపించి యెగసి
బడుగు బ్రతుకుల వెన్నెలల్ పరుగులిడున ?
మనిషి స్వార్ధమున్ కొంతైన మాను కొనున ?
మనిషి మనిషిని దోచుట మాను కొనున ?
మనిషి దుర్మార్గ వర్తన మాను కొనున ?
మనిషి మనిషిని చంపుట మాను కొనున ?
నేతలు వినీతులై తలవ్రాత మారి
దేశ ప్రజలకు శాంతి సందేశ మిడున ?
చదువు పూర్తయి యుద్యోగ విధులు లేని
వారి బతుకులు కొలువుల చేరు వగున ?
కోత లేని ‘ పవరు ‘ సమ కూరునా ? జ
లమ్ము పారి రైతన్న పొలాలు పండి
భారతావని కాకలి తీరునా ? ప్ర
భుత్వ పథకాల తీరు ప్రమోద మిడున ?
అగును కారణ మవినీతి యన్నిటికిని
ఓటరులు నీతి మంతులై ఓటు వేసి
నీతి మంతుల నేతల నెన్ను కొనిన
నాటి నవ వత్సరమ్ములు వేడు కగును
*******
శ్రీ డా .యస్వీ రాఘవేంద్ర రావు గారు
తియ్యనౌ పల్కు మొల్కల నెయ్యమలర
సమత మమతయు ననెడి సస్యములు పండ
మీదు జీవిత కేదార వీధులందు
క్రొత్త వర్షమ్ము శుభములు కురియుగాక!
******
నూతన సంవత్సరమున
రిప్లయితొలగించండిచైతన్యము కల్గుగాక జనుల మనములన్,
వాతెరలను మన పద్యపు
రీతులనిన తెనుగు వాణి ప్రీతిని పొంగన్
శంకరయ్యగారు..! మీకు మీ కుటుంబ సభ్యులకు 2012 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిఅయ్యా డా రాఘవేంద్ర రావు గారి శుభాకాంక్షలు బాగుగనున్నవి. వారికి నమోవాకములు. యొక్క అను అర్థమునిచ్చే దుగాగమ సంధి నీ, నా, తన లకు మాత్రమే పరిమితము అని మా తరగతి అధ్యాపకులు మాకు బోధించేరు. మీదు అనే ప్రయోగము సందేహాస్పదము అగుచున్నది.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ మిస్సన్న గారి శుభాకాంక్షల పద్యములో ఒక చిన్న సవరణ:
రిప్లయితొలగించండిచైతన్యము కలుగు గాక కు బదులుగా చైతన్యము హెచ్చు గాక అంటే బాగుంటుంది అనుకొనుచున్నాను. స్వస్తి.
శంకరార్యులకు, కవిమిత్రు లందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిజాతర నిత్యము జరుగుచు
చైతన్యము హెచ్చి సుఖము శాంతుల తోడన్
నూతన సంవత్సరమున
ప్రీతిగ సిరులన్ని భువిని పెంపొంద వలెన్
నమస్కారం అండీ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్.
రిప్లయితొలగించండినేమని పండితార్యా మీ సూచన శిరోధార్యము. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీపతిశాస్త్రి చెప్పారు...
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
నూతన సంవత్సర శుభాకాంక్షలు
బ్లాగు నిర్వహించు బడిపంతులయ్యకు
స్పందనలను దెలుపు పండితులకు
పూరణములు జేయు బుధవర్గములకును
స్వస్తి గూర్చు నూత్నవత్సరమ్ము
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిఆది దంపతు లైనట్టి యాది దేవు
రిప్లయితొలగించండిలాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని రెప్ప యట్లయి గాచు గాత!
కంది శంకరు గురువుని గరుణ తోడ .
నమస్కారములు
రిప్లయితొలగించండిప్రియమైన సోదరు లందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు