ప్రహేళిక
విలాసినీం కాంచనపట్టికాయాం
పాటీరపంకై ర్విరహీ విలిఖ్య |
తస్యాః కపోలే వ్యలిఖత్ పవర్గం
తవర్గ మోష్ఠే చరణే టవర్గమ్ ||
స్వర్ణపట్టికపైనను చందనద్ర
వమున చిత్రించె విరహి లావణ్యరూపు;
చెంపపైన పవర్గను, చెలియ పెదవి
పై తవర్గ, టవర్గను పదముల నిడె.
భావం
ఒక కాముకుడు ఒకానొక విలాసవతి రూపాన్ని బంగారుపలకపై శ్రీగంధద్రవంతో చిత్రించి ఆమె చెంపపై ‘ప’వర్గాక్షరాలను, పెదవిపై ‘త’వర్గాక్షరాలను, పాదంపై ‘ట’వర్గాక్షరాలము వ్రాసాడు.
అలా వ్రాయడంద్వారా అత డామెకు పంపిన సందేశం ఏమిటో వివరించండి.
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
ప వర్గాన్ని ఓష్ట్యములని, త వర్గాన్ని దంత్యములని, ట వర్గాన్ని మూర్థన్యములనీ అంటారు కదా. ఇక్కడ కవి ఉద్దేశం చెంపలపై పెదవులతో ముద్దు పెట్టు కొన్నట్లు, పెదవులను మునిపంటితో కొరికనట్లు, పాదాలపై (ముద్దిడటానికి) శిరసును ఉంచినట్లు కావచ్చు.
రిప్లయితొలగించండిమురళీ మోహన్ గారూ! చక్కగా చెప్పారు.మీ సమాధానం సరుయైనదేనని నా అభిప్రాయం.
తొలగించండికోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిసరిగ్గా ఊహించారు. అభినందనలు.
మీ సమాధానం చాలావరకు సరైనదే. కాకుంటె పాదాలపై ముద్దుపెట్టడం కాకుండా పాదాలకు నమస్కరించడం సరైనదె.
ప్రహేళిక సమాధానం ....
రిప్లయితొలగించండి(కోడీహళ్ళి మురళి గారు ఇప్పటికే చెప్పారు)
ఆ కాముకుడు తన ప్రేయసి చిత్రపటంలోని చెంపపై ఓష్ఠస్థానీయమైన ‘ప’వర్గను వ్రాయడం వల్ల "నా పెదవులతో నీ చెంపను ముద్దుపెట్టుకొంటాను" అనీ, పెదవిపై దంతస్థానీయమైన ‘త’వర్గను వ్రాయడం వల్ల "నీ పెదవిపై దంతక్షతం చేస్తాను" అనీ, పాదాలపై మూర్ధస్థానీయమైన ‘ట’వర్గను వ్రాయడం వల్ల "నీవు కోపిస్తే నీ పాదాలపై నా తలను మోపుతాను" అని సందేశం చెప్పినాడని భావం.
శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు .
రిప్లయితొలగించండిమొత్తము మీద ముద్దు పెట్టు కోవడము,
కొఱ కడము ,పాదాక్రాంత మవడము లు
సందేశ సారము
కోరి కాముకుం డొకపరి చేర నతివ
రిప్లయితొలగించండిమూతి పగులంగ , రాలంగ మూతి పళ్లు
నెత్తి దిమ్మెర వోవ తన్నించె వాడు
తలచి రోదించె నామె చిత్రమ్ము గీచి
శంకరయ్య గారూ , చమత్కార భరితమైన శ్లోకం , సరసమైన అనువాదం ! శ్లోకం మూడో పాదం - "వ్యలిఖత్ " అని ఉండాలి ! వి + అలిఖత్ , యణాదేశం . ప్రథమైక వచన భూత కాలం అలిఖత్ . " అలిఖత్ - అలిఖతాం - అలిఖన్ " ఇవీ ధాతుస్వరూపాలు .
రిప్లయితొలగించండిఒకవేళ మీ వద్దనున్న పుస్తకం లో వ్యలిఖ్యాత్ అనుంటే , అచ్చుతప్పై ఉండవచ్చు . గమనింపగలరని ప్రార్థన ! కోడీహళ్లీ మురళీ మోహన్ గారికి అభినందనలు !!!
విష్ణునందన్ గారూ.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
హితమె చెప్పితిరి ప్రహేళికా గ్రంథమ్ము
నందు మీరు చెప్పినట్లె కలదు;
వేల నతులు మీకు విష్ణునందన్ గారు!
క్షమను గోరి చేతు సవరణమ్ము.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
రిప్లయితొలగించండిచమత్కారభరితమైన పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
ఇది ఆ శ్లోకానికి కొనసాగింపు లాగా, ఆ విలాసవతి సమాధానం లాగా ఉంది. ఇందులోను మూతి, నెత్తి, పాదతాడనం మూడింటిని ప్రస్తావించారు.