బాదరాయణ సంబంధం
కోరి ప్రేమించి పెండ్లాడి క్రొత్త జంట
పురము వీడ్వడి వేరు కాపురము బెట్టె
నంతలో చుక్కతెగి పడ్డ యట్లు దిగిరి
బండి గట్టుక వచ్చిన బంధు తతులు
వరుని వైపున వారని వధువు తలచె
వధువు వైపున వారని వరుడు తలచె
వస్తు చయముల సమకూర్చ వరుని వంతు
వండి వార్చంగ వడ్డించ వనిత వంతు
ఇష్ట మైనట్టి వన్ని వండించు కొనుచు
తినుచు త్రాగుచు బంధువుల్ దిరుగు చుండ
తీరికే లేదు పాపము తినగ ద్రావ
కూడి తలపోయ నింకేడ ? క్రొత్త జంట
తిష్ట వేసిన బంధుల తీరు జూచి
చేరి తమలోన జంట చర్చించు కొనగ
తమకు వారికి నెట్టి బంధమ్ము లేమి
యెరిగి యడిగిరి , వారు జంకేమి లేక
"అయ్యొ! మా బండి చక్రాల కొయ్య గాని
అట్టె మీయింటి ముందున్న చెట్టు గాని
బదరికా వృక్ష సంబంధ మగుట, మనము
బాదరాయణ సంబంధ బంధువులము"
అనిరి, నివ్వర పోయిరి వినిన జంట ,
పరగ నేబంధములు లేని బంధమునకు
చేరి యీమాట భూమి ప్రసిద్ధి గాంచె
బాదరాయణ సంబంధ బంధ మనుట
రచన
కోరి ప్రేమించి పెండ్లాడి క్రొత్త జంట
పురము వీడ్వడి వేరు కాపురము బెట్టె
నంతలో చుక్కతెగి పడ్డ యట్లు దిగిరి
బండి గట్టుక వచ్చిన బంధు తతులు
వరుని వైపున వారని వధువు తలచె
వధువు వైపున వారని వరుడు తలచె
వస్తు చయముల సమకూర్చ వరుని వంతు
వండి వార్చంగ వడ్డించ వనిత వంతు
ఇష్ట మైనట్టి వన్ని వండించు కొనుచు
తినుచు త్రాగుచు బంధువుల్ దిరుగు చుండ
తీరికే లేదు పాపము తినగ ద్రావ
కూడి తలపోయ నింకేడ ? క్రొత్త జంట
తిష్ట వేసిన బంధుల తీరు జూచి
చేరి తమలోన జంట చర్చించు కొనగ
తమకు వారికి నెట్టి బంధమ్ము లేమి
యెరిగి యడిగిరి , వారు జంకేమి లేక
"అయ్యొ! మా బండి చక్రాల కొయ్య గాని
అట్టె మీయింటి ముందున్న చెట్టు గాని
బదరికా వృక్ష సంబంధ మగుట, మనము
బాదరాయణ సంబంధ బంధువులము"
అనిరి, నివ్వర పోయిరి వినిన జంట ,
పరగ నేబంధములు లేని బంధమునకు
చేరి యీమాట భూమి ప్రసిద్ధి గాంచె
బాదరాయణ సంబంధ బంధ మనుట
రచన
లక్కాకుల వెంకట రాజారావు
బాగున్నదండీ.
రిప్లయితొలగించండిలక్కాకుల వారూ! బహు
రిప్లయితొలగించండిచక్కగ నే చెప్పినారు సంతస మందన్
ఇక్కడ నుండియు జంటలు
ఎక్కడి వారైన రాగ నేర్పుగ మెలగున్.
శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు అద్భుతముగా చెప్పారు. హృదయపూర్వకాభినందనలు.
రిప్లయితొలగించండినా పద్యము లోని నాల్గవ పాదం లో యతి మైత్రి దోషాన్ని సరి చేస్తూ...
రిప్లయితొలగించండిలక్కాకుల వారూ! బహు
చక్కగ నే చెప్పినారు సంతస మందన్
ఇక్కడ నుండియు జంటలు
ఎక్కడి వారైన మర్మ మెరుగుచు మెలగున్.
శ్రీమతి మందాకిని గారికి ,శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారికి ,మనోజ్ఞమైన పద్యాన్ని బహూకరించిన శ్రీగోలి హనుమఛ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండికొత్త జంట అవస్త చక్కగా వివరించారు. అభినందనలు.
రిప్లయితొలగించండి