4, జనవరి 2012, బుధవారం

సమస్యాపూరణం - 580 (శివుని పూజింతురు)


కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
శివుని పూజింతు రేకాదశీదినమున.

41 కామెంట్‌లు:

  1. శివుని పూజింతు రేకాదశీ దినమున
    భక్తి శ్రద్ధలు మీరగా శక్తియుతుని
    మాధవునకు నభేద ముమాధవునకు
    సంతతమ్ము భావించుచు సాధు జనులు

    రిప్లయితొలగించండి
  2. హరిని నమ్మువారు కొలుతురాతనినిక
    సకల జనులను గాచెడి స్వామి యనుచు,
    ఆది దేవుని పూజింప నాశ పడిన
    శివుని పూజింతు రేకాదశీదినమున.

    రిప్లయితొలగించండి
  3. శివుని పూజింతు రేకాదశీ దినమున
    ననగ నేల కొ పూజించ నను దినమ్ము
    నుబ్బు లింగడు గద కడు నుబ్బు పోయి
    భూతి నొసగును మనకిక భూరి గాను .

    రిప్లయితొలగించండి
  4. మాస శివరాత్రి దినమున మఱు వ కుండ
    శివుని పూజింతు , రే కాదశీ దినమున
    పూలు గ్రుచ్చిన దం డల బూజ సేయ
    భవ్యు డొసగును సంపద భక్తు లకును .

    రిప్లయితొలగించండి
  5. కల (నాలుగు పాదాల లో కల -త్రి జటా స్వప్నము )
    --------

    కలవింక మంచి రోజులు
    కలతల నే జెంద బోకు కలికీ ! సీతా!
    కలయుటకు వచ్చు రాముడు
    కలకాలము హాయి గుండు కాంతుని తోడన్ .

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    త్రిమూర్తులకభేధము :
    01)
    __________________________________

    శంభు పూజింప తిథివార - శంక లేల ?
    సృష్టి జేయంగ నాతడే - సృష్టి కర్త !
    స్థితిని నడిపింపగా వాడె -సిరివరుణుడు !
    సృష్టి లయమును జెందింప - శివుడనబడు !
    సత్యమిదియేను భువిలోన - నిత్యమైన !
    శివుడె విష్ణువే గావున - శిష్టు లెపుడు
    శివుని పూజింతు రేకాద - శీ దినమున !
    __________________________________

    రిప్లయితొలగించండి
  7. ఆదిశంకరులందించి నట్టి తత్వ
    మద్వైతామృతవర్షిణి ననుభవించి
    పన్నుగ “శివాయ విష్ణురూపాయ” యనుచుఁ
    శివుని పూజింతు రేకాదశీదినమున.

    రిప్లయితొలగించండి
  8. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, జనవరి 04, 2012 9:43:00 AM

    శివుడు తనలోన లేనట్టి జీవి గలదె ?
    సర్వ కాల సర్వా వస్థ పర్వ పూజి
    తుండొక శివుండె ,వేద వేద్యులగు హరిని
    శివుని పూజింతు రేకా దశీ దినమున

    రిప్లయితొలగించండి
  9. మాస్టారూ, సమస్యకి తగ్గట్లుగా మంచి శివకేశవ చిత్రం పోస్టు చేశారు ధన్యవాదాలు. అది అంతర్జాలంలో ఎక్కడదొరుకుతుందో చెప్పగలరా!

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్ గారూ,
    ప్రొద్దున గూగుల్ లో `images of Shiva and Vishnu' అని వెదికితే దొరికింది. సేవ చేసికొని బ్లాగులో పేస్ట్ చేసాను. ఇప్పుడు మీ కోసం వెదికితే దొరకదే ... అరగంట శ్రమపడితే చివరికి దొరికింది. క్రింది url లో చూడండి.
    http://www.vaikhari.org/shankaranarayana.html

    రిప్లయితొలగించండి
  11. వారమున సోమవారము భవునకమిత
    యిష్టమనిజెప్పి భూసురశ్రేష్టతతులు
    సోమవారమేకాదశి చూపినంత,
    శివుని పూజింతురేకాదశీదినమున.

    రిప్లయితొలగించండి
  12. చంద్రశేఖర్ గారూ,

    ఈ క్రింది దానినుండీ కూడా మీరు హరిహర చిత్రాన్ని పొందవచ్చును.
    https://www.google.com/search?tbm=isch&hl=en&source=hp&biw=1366&bih=667&q=siva%2Bvishnu&gbv=2&oq=siva%2Bvishnu&aq=f&aqi=g-C3g-CS3g-sCS1g-CS2g-sCS1&aql=&gs_sm=e&gs_upl=867l4475l0l5730l11l11l0l0l0l0l360l2202l2-7.1l8l0

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారి వ్యాఖ్య
    శంకరార్యా !
    శంకరాభరణం క్రింది శ్లోకంలోనూ, సుబ్బారావుగారి పూరణలోనూ నాకు కొన్ని యక్షరములకు బదులు చిత్ర విచిత్ర యాకృతులు కన్పట్టు చున్నవి !
    అన్నీ కాదు కొన్నే ! నా యక్షరముల నందరూ చూడ గలుగు తున్నారా ?

    రిప్లయితొలగించండి
  14. సంపత్ కుమార్ గారూ,
    ధన్యవాదాలు. ఈరోజు ఉదయం నాకు మొదట దొరికిన సైట్ ఇదే. అందులో ఆ చిత్రం మీద క్లిక్ చేస్తే vaikhari.org కు దారి చూపింది.

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    నాకైతే మీరు చెప్పిన చోట్ల ఏ విచిత్రాకృతులూ కనిపించడం లేదు.

    రిప్లయితొలగించండి
  16. ఈరోజు విషయము బాగుగ నున్నది. ఎందరో వెంటనే స్పందించుటయునూ ముదావహమే.

    శ్రీ చంద్రశేఖర్ గారు - వారి పద్యము 2వ పాదములో గణములను చూడలేదు.
    అంతే కాదు "శివాయ విష్ణురూపాయ" (శివుని కొరకు విష్ణు రూపుని కొరకు అని అర్థము)ఆవిధముగా వదలివేయకుండ నమః అని చేర్చగలిగితే బాగుంటుంది.

    శ్రీ సంపత్కుమార్ శాస్త్రి గారు "శ్రేష్ట" అని వాడేరు - "శ్రేష్ఠ" అనుట సాధువు.

    రిప్లయితొలగించండి
  17. పుణ్యతిథులివి మనసార పూజ చేయ
    హరుడు హరియని భేదము లల్ప బుద్ధి
    తోడ నెంచుటేలనొ? ముకుందుడిని, పరమ
    శివుని పూజింతురేకాదశీ దినమున.

    అక్షరాలన్నీ యథాతథంగానే కనిపిస్తున్నాయండీ.

    రిప్లయితొలగించండి
  18. హరిహర స్వామిని తిక్కన సోమయాజి గారు వర్ణించిన పద్యము:

    శ్రీయన గౌరి నాబరగు జెల్వకు జిత్తము బల్లవింప, భ
    ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూ
    పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
    ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వము గొల్తు నభీష్టసిద్ధికై

    ఆద్యక్షర సహితముగా శివుని, ఆద్యక్షర రహితముగా విష్ణువుని స్తోత్రము చేసే ఈ శ్లోకమును చూడండి:

    గవీశ పత్రో నగజార్తి హారిః
    కుమార తాతః శశిఖండమౌళిః
    లంకేశ సంసేవిత పాదపద్మః
    పాయాదనాదిః పరమేశ్వరో మాం

    గవీశ పత్ర: ఎద్దు వాహనముగా గలవాడు
    వీశ పత్ర: పక్షి వాహనముగా గలవాడు
    నగజార్తి హారి: పార్వతి యొక్క ఆర్తిని పోగొట్టిన వాడు
    గజార్తి హారి: గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడు
    కుమార తాత: కుమార స్వామికి తండ్రి
    మార తాత: మన్మధుని తండ్రి
    శశిఖండ మౌళి: చంద్ర రేఖను ధరించిన వాడు
    శిఖండ మౌళి: నెమిలి పింఛమును ధరించినవాడు
    లంకేశ సేవిత పాదపద్మ: రావణునిచే సేవింపబడు పాదములు గలవాడు
    క (బ్రహ్మ) + ఈశ (శివుడు) చే పూజింపబడు పాదములు గలవాడు
    పరమేశ్వర : పరమేశ్వరుడు
    రమేశ్వర: విష్ణువు
    మాం: నన్ను
    అనాది : జన్మము లేనివాడు
    నాది (న + ఆది) : జన్మము లేనివాడు(తొలి అక్షరము లేనివాడు)
    పాయాత్: రక్షించుగాక

    రిప్లయితొలగించండి
  19. అద్భుతమైన రచన! వ్రాసినవారికి, ఇక్కడ ప్రచురించిన పండితులవారికి నమస్సులు.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ నాకే హరిహర చిత్రం కన్పడుట లేదు ఈ సమస్యాదిలో.

    రిప్లయితొలగించండి
  21. మిస్సన్న గారూ,
    అందరికీ కనిపిస్తున్న చిత్రం మీకు కనిపించక పోవడం చిత్రమే!

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని వారూ,
    ఆద్యక్షర విశష్టముమాధవస్తుతి శ్లోకం తెలిపినందుకు ధన్యవాదాలు.
    నా వద్ద ఉన్నశ్లోకంలో రెండు పాంఠాంతరాలు ...
    లంకేశ ‘సంసేవిత ..’ అన్నచోట ‘సంపూజిత’ అని ఉంది. ఇది ఆంతగా గమనించవలసింది కాదు.
    ‘పాయాదనాదిః పరమేశ్వరో మాం’ అన్నచోట ‘పాయా దపాయాత్ పరమేశ్వరో వః’ అని ఉంది. (ప)రమేశ్వరః, వః = మిమ్ములను, అపాయాత్ = ఆపత్తునుండి, పాయాత్ = రక్షించుగాక!

    రిప్లయితొలగించండి
  23. అయ్యా శ్రీ శంకరయ్య గారూ! పాయాత్ అనాదిః పరమేశ్వరో మాం అంటేనే అన్వయము సరిపోతుంది. అనాది అంటే ఆది అక్షర రహితముగా అని కదా అర్థము. ఇందులో అనాది శబ్దము చాలా ముఖ్యమయినది. అయినా పాఠాంతరములు ఉండుట సహజమే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. పండిత నేమాని వారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని పూరణలు. అభినందనలు.
    మొదటి పూరణలో ‘ఉబ్బుపోయి...?" అది ‘ఉబ్బిపోయి’ అనుకుంటాను.
    మీ దత్తపతి బాగుంది. అభినందనలు.
    ‘హాయిగుండు’ అన్నదాన్ని ‘హాయి గల్గు/ దక్కు/ చెలగు’ ఇలా ఉంటే బాగుంటుంది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషాన్ని నేమాని వారు ప్రస్తావించారు కదా! అక్కడ ‘తత్త్వ/ మైన యద్వైత మాధురి ననుభవించి’ అంటే సరి!
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘అమిత యిష్టము, శ్రేష్ట’ శబ్దప్రయోగాలే పానకంలో పుడక లయ్యాయి. నా సవరణ ...
    ‘........... భవున కెంతొ
    యిష్టమనిజెప్పి భూమీసురేంద్రతతుల’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  25. పండిత నేమాని వారూ,
    నేను పాఠాంతరం ఉందన్నానే కాని నేను చెప్పిందే సరి అనలేదు కదా! మీరు చెప్పిన పాఠమే యుక్తంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. ధన్యవాదములు గురువుగారూ,

    శ్రీ నేమాని వారికి నమస్సులు. ఒక చిన్న సందేహము. యిష్ట మరియు శ్రేష్ఠ లలో ప్రాస యతి చెల్లుతుందా?

    రిప్లయితొలగించండి
  27. అయ్యా! శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
    ఇష్ట మరియు శ్రేష్ఠ పదాలకు యతిమైత్రి ఉందా అని మీ సందేహము.
    క్లిష్టమైన సందర్భాలలో అలా యతి వేసుకొనవచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    మీతో నేను ఏకీభవిస్తున్నాను. అన్యథా నేను భావించలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యా ! ధన్యవాదములు !
    హరిహరుని చిత్రము చక్కగా నున్నది !

    నాకు కనుపించే వికృతాకృతులు మీకు చూపుదామని
    copy&paste చేస్తే వికృతులు పోయి ఆకృతులు గోచరిస్తున్నవి !

    రిప్లయితొలగించండి
  30. ఇప్పుడు నేను post చేసిన దానిలో వికృతాకృతులు కూడా గోచరిస్తున్నవి !
    copy&paste చేస్తే వికృతులు పోయి ఆకృతులు గోచరిస్తున్నవి !
    వింతగా నున్నది !

    రిప్లయితొలగించండి
  31. తులసి పూజించ క్షీరాబ్ధి ద్వాద శనగ
    దుర్గ పూజలు నవరాత్రి దినము లందు
    విష్ణు పూజించు నిరతము వైష్ణ వుండు
    శివుని పూజింతు రేకాదశీ దినమున

    అవును ఎందుకనొ కొన్ని పొస్టులు జిగ్ జాగ్ వస్తున్నాయి. అంతె కాదు పైన " శంకరాభరణం " క్రింద కుడా కొన్ని అక్షరాలు అలాగె వస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  32. వసంత కిశోర్ గారూ,
    రాజేశ్వరక్కయ్యా,
    ఇప్పుడు సరిగా కనిపిస్తున్నాయా?
    నిన్ననో, మొన్ననో నేను బ్లాగు టెంప్లేట్ డిజైన్ తెరిచి ఫాంటులను మార్చాను. ఇది దాని ప్రభావమే. ఇప్పుడు సరి చేసాను.

    రిప్లయితొలగించండి
  33. ధన్య వాదములు తముడు ! ఇప్పుడు సరిగానే ఉన్నాయి

    రిప్లయితొలగించండి
  34. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘ద్వాదశి + అనగ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘ద్వాదశి యన’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !
    ఇప్పుడంతా సరియైనది !
    చక్కగా కన్పడు చున్నవి !

    రిప్లయితొలగించండి
  36. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, జనవరి 05, 2012 4:44:00 AM

    శ్రీ నేమాని వారికీ, మాస్టారికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  37. గురువుగారూ బహుశా నాబోటి పాపాత్ములకు హరిహర చిత్రం కనుపించదేమో!

    రిప్లయితొలగించండి
  38. మిస్సన్న గారు,

    చింతించ వలదు. అది మీ తప్పు కాదు. హరిహరులు 'సన్న' బడి పోయారు అంతే !

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  39. జిలేబీ గారూ హరిహరులు నల్లపూసై పోయారంటారు. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  40. నేను కనుగొంటి మందాకినీ! పవిత్ర
    హరిహరుల చిత్రపటము బ్రౌజరును మార్చి
    యంత్ర మందున కలదిట్టి తంత్ర మనుచు
    తెలియ జేసిన మీకగు దివ్య శుభము.

    రిప్లయితొలగించండి