మాకు రోజుకూలి వాళ్లు దొరకరు. ఒకవేళ దొరికితే వాడే దిక్కు. పెరటిలోనమొక్క పెంచనోపికలేదు పచ్చగడ్డికోయు వయసు దాటె నట్టిసమయమందు గట్టిగా నుండు క ర్మకర శేఖరుండు మమ్ము “బ్రోచు”. కర్మకరుడు=కూలివాడు
చింతా రామ కృష్ణారావు గారూ, మందాకిని గారూ, లక్కాకుల వెంకట రాజారావు గారూ, శ్రీపతి శాస్త్రి గారూ, సుబ్బారావు గారూ, సంపత్ కుమార్ శాస్త్రి గారూ, రాజేశ్వరి అక్కయ్యా, గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చంద్రశేఖర్ గారూ, మిస్సన్న గారూ, అందరి పూరణలు మనోజ్ఞంగా ప్రశంసనీయంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు. * దూరపయాణం చేసి అలసి రావడం వల్ల సామూహికంగా అభినందనలు తెలిపాను. మన్నించండి.
తాండవప్రియుండు, త్ర్యంబకుఁడు, పురారి,
రిప్లయితొలగించండిపార్వతీవిభుండు, పంచశిరుఁడు,
శాశ్వతుండు, శివుఁడు, శర్వుండు, బాలహి
మకరశేఖరుండు మమ్ము బ్రోచు.
ప్రమద గణ పరివృత ప్రఖ్యాత దైవంబు,
రిప్లయితొలగించండిజగతి నెలమిఁ గాచు సాంబ శివుఁడు,
మునిజనాశ్రయుండు పూజ్యుండు మహిత హి
మకర శేఖరుండు మమ్ము బ్రోచు.
దుష్టబుద్ధిగలుగు దుర్మార్గ జనులను
రిప్లయితొలగించండిపరుల బాధ తీర్చు భవ్య జనుల,
నెట్టి భేదమనిన నెఱుగని శివుడు , హి
మకర శేఖరుండు మమ్ము బ్రోచు.
తనకు చిక్క కెవడు తప్పించు కోలేడు
రిప్లయితొలగించండికాల విధిని దాటు ఘనుడు లేడు
ఉత్తరాయణమున నుజ్జ్వలు డాదిత్య
మకర శేఖరుండు మమ్ము బ్రోచు
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిమకర రాశిలోన మార్తాండుడుదయించె
హితము గోరు ప్రాణహితుడు ఘనుడు
దేవదేవుడు హరితేజమైభాసిల్లు
మకర శేఖరుండు మమ్ము బ్రోచు
సకల ప్రాణు లందు సమహి తత్వంబును
రిప్లయితొలగించండిఆర్తి జనుల రక్ష ణావ లంబు
డాయు పెంచ నర్హు డైనట్టి మహిత హి
మకర శేఖ రుండు మమ్ము బ్రోచు
ఏరువాక మొదలు భూరిపంటలతోటి,
రిప్లయితొలగించండిశాంతి బొందు నట్టి సకల జీవ
తతులకోటికి తగు ఋతువుల గల్పించు
మకరశేఖరుండు మమ్ము బ్రోచు.
మకరశేఖరుండు = మకర ఋతువును ధరించువాడు ( సకాలములో ఋతువులను ఏర్పడజేయుచున్న మూర్తి )
వెండి కొండ నుండు విశ్వేశ్వరుడు గాన
రిప్లయితొలగించండిమసన మందు దిరుగు మాన్యు డతడు
నిఖిల జగతి నేలు నిర్వి కారు డనగ
మకర శేఖ రుండు మమ్ము బ్రోచు !
మహిత క్షేమ కరుడు మనమందు దల్చిన
రిప్లయితొలగించండిజటల ధారి శివుడు జంగమయ్య
హిమ నగజధవ హరు డీశ్వర హేమ హి
మకరశేఖరుండు మమ్ము బ్రోచు.
మాకు రోజుకూలి వాళ్లు దొరకరు. ఒకవేళ దొరికితే వాడే దిక్కు.
రిప్లయితొలగించండిపెరటిలోనమొక్క పెంచనోపికలేదు
పచ్చగడ్డికోయు వయసు దాటె
నట్టిసమయమందు గట్టిగా నుండు క
ర్మకర శేఖరుండు మమ్ము “బ్రోచు”.
కర్మకరుడు=కూలివాడు
ఉత్తరాయణమున నుఱుకు పరుగులెత్తు
రిప్లయితొలగించండినుదయభాస్కరుండు నూరి జనుల
కుల్లమలర జేయ నూకించునట్టి తి
గ్మకర శేఖరుండు మమ్ము బ్రోచు.
సుఖకరమగు నిహము శుభకరమౌ సదా
రిప్లయితొలగించండిసుకరమౌను ముక్తి నికరముగను
శమదమాదులును వశకర మగుఁ కను హి-
మకరశేఖరుండు మమ్ము బ్రోచు
చింతా రామ కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
శ్రీపతి శాస్త్రి గారూ,
సుబ్బారావు గారూ,
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రాజేశ్వరి అక్కయ్యా,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చంద్రశేఖర్ గారూ,
మిస్సన్న గారూ,
అందరి పూరణలు మనోజ్ఞంగా ప్రశంసనీయంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
*
దూరపయాణం చేసి అలసి రావడం వల్ల సామూహికంగా అభినందనలు తెలిపాను. మన్నించండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
___________________________________
మదిని దలచి నంత - మనుజుల గాపాడు
మదనరిపువు మీద - మనసు నిలిపి
మరల మరల ధ్యాన - మగ్నులమైన ,క్షే
మకర శేఖరుండు - మమ్ము బ్రోచు !
___________________________________
క్షేమకరుడు = శుభకరుడు
శంకరార్యా ! ఈ రోజు కూడా నన్ను మరిచారు !
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమరవలేదు. కాకుంటే మళ్ళీ ఆ పోస్ట్ ను తెరిచిచూడలేదు.
‘క్షేమాన్ని కల్గించే వారిలో శ్రేష్ఠుడు’ అనే అర్థంలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి