2, జనవరి 2012, సోమవారం

చమత్కార పద్యాలు - 164

ప్రహేళిక

కృష్ణముఖీ న మార్జారీ
ద్విజిహ్వా న సర్పిణీ |
పంచభర్త్రీ న పాంచాలీ
యో జానాతి స పండితః ||


నల్ల నగును ముఖము, పిల్లి కానేకాదు;
నాల్క లుండు రెండు, నాగు కాదు;
పంచభర్తృక యగుఁ బాంచాలి కాఁబోదు;
దీని నెఱుఁగువాఁడె ధీయుతుండు.


ఏమిటో చెప్పగలరా?
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ నుండి శ్లోకం, దానికి నా అనువాదం)

5 కామెంట్‌లు:

  1. జవాబు = ఆకాశము అనుకుంటున్నాను. ౧.నల్లగా ఉంటుంది ౨. రెండు నాలుకలు = సూర్యుడు ,చంద్రుడు ౩. పంచ భూతములు = అగ్ని , నీరు , నిప్పు , వాయువు , ఆకాశము. = అందుకని పాంచాలి కాదు. గనుక ఆకాశము.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
    సమాధానము= జడ

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి గారూ ! భూమి అనబోయి అగ్ని, నిప్పు అన్నట్టున్నారు

    రిప్లయితొలగించండి
  4. అవును రాత్రి నిద్ర వచ్చేస్తుంటే టైప్ చేసాను . సరిగా చూడ లేదు. బాగా గుర్తు చేసారు ధన్య వాదములు. " భూమి , అగ్ని , వాయువు , నీరు , ఆకాశం "

    రిప్లయితొలగించండి