7, జనవరి 2012, శనివారం

చమత్కార పద్యాలు - 169

ప్రహేళిక

అయోముఖీ దీర్ఘకాయా
బహుపాదా జనాశయా |
అస్పృష్ట్వా భూతలం యాతి
యక్షిణీ దేవతా చ న ||


ఇనుపమోము, దీర్ఘాకృతి, యెన్నొ కాళ్ళు
కలిగి మానవులను మ్రింగు, నిలను దాఁక
కుండ పరుగిడు యక్షిణియో సురుండొ
కాదు; దీనిఁ జెప్పెడివాఁడె ఘనుఁడు సుమ్ము.


సమాధానం సులభమైనదే! 
ఐనా నిన్నటి మిత్రుల వ్యాఖ్యల వల్ల సమాధానం రేపే ప్రకటిస్తాను. 
ఈలోగా ఎందరు సమాధానం చెప్తారో చూద్దాం!

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

3 కామెంట్‌లు: