భూమితల్లి యొడిని పంట పొంగినయట్లు పులగమిచట కుండ పొంగివచ్చె బతుకు పొంగునట్లు భవితను రాబోవు భోగములకు పంట భోగిమంట
నిన్నటి పూరణలో అన్ని రకాల తమ్ములు అలరించారు/యి. గురువుగారి పచ్చటిచూతమ్ములు అతి మధురంగా, కపోతమ్ములు మనోహరముగా కనిపించాయి. వ్రాతమ్ములు, పాదనెత్తమ్ములు, కూజితమ్ములు, పారిజాతమ్ములు, భాగవతమ్ములు,పొత్తమ్ములు, సుప్రభాతమ్ములు అన్నీ బాగున్నాయి. నాకే ఏమీ తోచక నాకు ఇష్టం లేని విత్తాన్ని ఆశ్రయించాను. చల్లని తల్లి సరస్వతీ కటాక్షవీక్షణవిత్తమ్ము నాకు దొరికితే సౌభాగ్యము.
ఈరోజంతా తీరిక లేని పనులు. బ్లాగును, పూరణలను చూచే అవకాశం దొరకలేదు. ఇప్పుడు కూడా బాగా అలసి ఉన్నాను. * సరసమైన పూరణలు పంపిన క్రింది కవిమిత్రు లందరికీ అభినందనలు, ధన్యవాదాలు. గోలి హనుమచ్ఛాస్త్రి గారు, మిస్సన్న గారు, పండిత నేమాని వారు, లక్కాకుల వెంకట రాజారావు గారు (వీరివి రెండు పూరణలూ తేటగీతిలో ఉన్నాయి) మందాకిని గారు, సుబ్బారావు గారు, గన్నవరపు నరసింహ మూర్తి, నిరంజన్ కుమార్ గారు (‘హరిదాసు పాట లన్నివీధులలోన’ అంటే గణదోషం. ‘అన్నివీధులలోన హరిదాసు పాటలు’ అంటే సరి!) మంద పీతాంబర్ గారు (‘దైవ ముండు నటంట’ను ‘దైవ ముండు నటంద్రు’ అంటే బాగుంటుంది)
కవి మిత్రులందరకు భోగి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిపనికి రాని చెత్త పరమ దారిద్ర్యంబు
కాల్చి వేయ మనకు కలుగు సిరులు
క్రొత్త ఆశ లేవొ కోరక చిగురించు
భోగములకు పంట భోగిమంట.
గాదె నిండు సిరులు గంపల ధాన్యాలు
రిప్లయితొలగించండిపాడి యాలు నెడ్లు కాడి కలిమి
మోమునందు నవ్వు పూర్వ కాలపు రైతు
భోగములకు పంట భోగిమంట.
చలి నడంచుచుండు జాజ్జ్వల్యమానమై
రిప్లయితొలగించండివేడినిచ్చు మెండు వెలుగు గూర్చు
కనులపంట మరియు కాసుల పంట పల్
భోగములకు పంట భోగి మంట
వర్ష హేమంతముల గల్గు వణుకు నుండి
రిప్లయితొలగించండికొంత తెరిపి గల్గు, భువికి సుంత తగ్గు
రోగ బాధలు, జనుల కారోగ్యభాగ్య
మొదవు, భోగములకు పంట భోగిమంట
భూమితల్లి యొడిని పంట పొంగినయట్లు
రిప్లయితొలగించండిపులగమిచట కుండ పొంగివచ్చె
బతుకు పొంగునట్లు భవితను రాబోవు
భోగములకు పంట భోగిమంట
నిన్నటి పూరణలో అన్ని రకాల తమ్ములు అలరించారు/యి.
గురువుగారి పచ్చటిచూతమ్ములు అతి మధురంగా, కపోతమ్ములు మనోహరముగా కనిపించాయి.
వ్రాతమ్ములు, పాదనెత్తమ్ములు, కూజితమ్ములు, పారిజాతమ్ములు, భాగవతమ్ములు,పొత్తమ్ములు, సుప్రభాతమ్ములు అన్నీ బాగున్నాయి. నాకే ఏమీ తోచక నాకు ఇష్టం లేని విత్తాన్ని ఆశ్రయించాను. చల్లని తల్లి సరస్వతీ కటాక్షవీక్షణవిత్తమ్ము నాకు దొరికితే సౌభాగ్యము.
సంకు రాత్రి యిచ్చు సకల భోగంబులు
రిప్లయితొలగించండిభోగి మంట వెలుగు భూతి నిచ్చు
సకల లోకములకు సరి సంపదల నిచ్చు
భోగములకు పంట భోగి మంట .
పంట యింట జేర పలికెను శ్రీలక్ష్మి
రిప్లయితొలగించండిపిల్ల జెల్ల గూడ యుల్ల మందు
సంబరమ్ము నయ్యె సందడితో గూడు
భోగములకు పంట భోగి మంట
మందాకినీ గారూ మీరలా అనుకోనక్కర లేదు.
రిప్లయితొలగించండివిద్య నిగూఢ గుప్తమగు విత్తము అన్నారు పెద్దలు. ఆ విత్తాన్నేకోరుకొన్నారు మీరు. అది మీ వద్ద ఉంది. ఇంకేం కావాలి?
మిస్సన్నగారు,
రిప్లయితొలగించండిసంతోషమండీ. ధన్యవాదాలు.
అల్లుడా!కనుము!మీమామ యత్త గారు
రిప్లయితొలగించండిబావమరదులు మరదండ్రు పండుగలకు
వచ్చి రేడ్వకు ఖర్చుకు, వారి రాక
రాగ భోగములకు పంట ,భోగి మంట
బ్లాగ్ లోకంబున వెల్లివిరియు
రిప్లయితొలగించండికవితల పంట కవుల వెంట తడబడి నడకల
ఈ జిగి బిగి రాతల జిలేబి అను
రాగ భోగములకు పంట , భోగిమంట !
శంకరాభరణ 'బ్లాగ్ ల్యాండు' న
కొలువు దీర్చిన కవి పండితాదు లందరికీ,
మకర సంక్రాంతీ శుభాకాంక్షల తో
జిలేబి.
guddoo guddooo Ned'n'ri
రిప్లయితొలగించండిపట్టు పరికిణీ రెపరెపల్ పల్లెదనము
రిప్లయితొలగించండిరంగవల్లులు గొబ్బియల్ రంగుహంగు
క్రొత్త యల్లుళ్ళ మరదళ్ల కొంటె పనులు
ప్రోది భోగములకు పంట భోగిమంట.
గంగిరెద్దులాట రంగవల్లులబాట
రిప్లయితొలగించండిధాన్యరాసులన్ని దాగునింట
భోగభాగ్యములను ప్రోగుచేయు సకల
భోగములకు పంట భోగిమంట
క్రొత్తబట్టలమరు కోరికలునుదీరు
చుట్టములతొనిల్లు శోభగూరు
పాడిపంటలమరి పండుగై విలసిల్లు
భోగములకు పంట భోగిమంట
హరిదాసుపాట లన్నివీధులలోన
గొబ్బి యింటిముందు కొలువుదీరి
అంబరములనంటు సంబరములనిచ్చు
భోగములకు పంట భోగిమంట
ధాన్య ముండు నింట దైవ ముండునటంట
రిప్లయితొలగించండిదైవ మున్న యింట ధైర్య ముండు
ధైర్య ముండు నింట దైన్యమ్ము పరుగంట
భోగములకు పంట భోగి మంట!!!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపసిడి వెలుగు పరచు పైరుపంటలు పండి
అన్నదాత మదికి హాయి నొసగు
సాదు సద్గుణాది సంపదల్ సౌభాగ్య
భోగములకు పంట భోగిమంట.
ఈరోజంతా తీరిక లేని పనులు. బ్లాగును, పూరణలను చూచే అవకాశం దొరకలేదు. ఇప్పుడు కూడా బాగా అలసి ఉన్నాను.
రిప్లయితొలగించండి*
సరసమైన పూరణలు పంపిన క్రింది కవిమిత్రు లందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
మిస్సన్న గారు,
పండిత నేమాని వారు,
లక్కాకుల వెంకట రాజారావు గారు (వీరివి రెండు పూరణలూ తేటగీతిలో ఉన్నాయి)
మందాకిని గారు,
సుబ్బారావు గారు,
గన్నవరపు నరసింహ మూర్తి,
నిరంజన్ కుమార్ గారు (‘హరిదాసు పాట లన్నివీధులలోన’ అంటే గణదోషం. ‘అన్నివీధులలోన హరిదాసు పాటలు’ అంటే సరి!)
మంద పీతాంబర్ గారు (‘దైవ ముండు నటంట’ను ‘దైవ ముండు నటంద్రు’ అంటే బాగుంటుంది)
‘వైబోగములకు పంట...’ అని నేను పూరణ వ్రాద్దామనుకున్నా. శ్రీపతి గారు ‘సౌభాగ్య భోగముల పంట’ అని నా అయిడియా కొట్టేసారు. :-)
రిప్లయితొలగించండిపల్లెటూరి శోభలు బలువల్లెవాటు
రిప్లయితొలగించండిపట్టు చీరలసొబగులు పాలుగారు
పసిడి ముద్దుగుమ్మకు భోగిపళ్ళ పోత
పొరలు భోగములకు పంట భోగిమంట
కవిమిత్రులకు మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిపల్లెటూరి శోభలు బలువల్లెవాటు
పట్టు చీరలసొబగులు పాలుగారు
పసిడి ముద్దుగుమ్మకు భోగిపళ్ళ పోత
పొరలు భోగములకు పంట భోగిమంట!