31, జనవరి 2012, మంగళవారం

పోతన భోగినీ దండకము - 3

* వారకన్య తల్లి పల్కు నిరాకరించుట *
ధనాదానవిద్యామతల్లిన్ విటస్వాంతభల్లిన్ నిరూపించి కోపించి బుద్ధిం బ్రదీపించి "అమ్మా! విన న్నొల్లఁ బొమ్మా, విచారించు కొమ్మా, భవన్నీతి దుర్నీతి, సన్మానుషం బింతయున్ లేని దుర్మానసశ్రేణి నీవేల యీవేల భూషించెదే? యేమి భాషించెదే? యేల నన్నుం బ్రమోషిచెదే? రాయ చౌహత్తమల్లున్, వధూటీ సరోజాతభల్లున్, మహారాజ వేశ్యాభుజంగున్, హయానేకప గ్రామ హేమాది నానామహాదాన చంగున్, వధూలోక పాంచాలు, సర్వజ్ఞసింగ క్షమాపాలుఁ గైకొంట తప్పే? కకుప్పాల సంకాశుఁడే, వాని యొప్పుల్ సతుల్ చెప్పరే? యేల నొప్పింప? మాతల్ తనూజాతలన్ జాతవిత్తాశలై యాశలం బేశలత్వంబు లే కర్మిలిం బాపినారోటు? రారోటు రక్షాతతిన్? గోర్కులీరోటు? నీవింత సెగ్గింప నెగ్గేమి గావించితిన్, లోకనిర్మాత నిర్మాతగాఁ జేయ కేలా సదుర్మాతఁ గావించె? విజ్ఞాత యోషా మనోవృత్త సంఘాతవున్, మాతవున్, గామసిద్ధాంత విఖ్యాతవున్, జూడ నేతద్దురాలాపముల్ చిత్తసంతాపముల్ గాఁ బ్రయోగింతురే? కూఁతుఁ జింతానదిన్ ముంతురే? పిన్ననాఁ డెల్ల నాఁ డెవ్వరిం గోరవే, చేరవే? మున్ను రంభోర్వశీమేనకాదుల్ సుకందర్ప సిద్ధాంతవేదుల్ వశీకార విద్యాధురీణుల్ ప్రవీణుల్ వరశ్రేణి నూహింపరే! చూచి మోహింపరే! వార లూహింపరే నీతులన్? నిర్దయాలాపవై పాపవై పాపవేలా మనోజవ్యథన్? నిన్ను నేమందు, నేమందులన్ మానదే మానసత్త్వంబు, చింతింపు మవ్వా! విభుండేమి దవ్వా? యెఱింగించి రప్పించెదో, కాక కామానలజ్వాలకున్ నన్ను నొప్పించెదో? యింత ఱంతేల నీకుం గొఱంతే లసద్ద్రవ్యముల్, తల్లి! నే నెల్లవేళన్ మనోజాగ్నిచేఁ గంది లోఁ గుందఁగా మ్రంద, వీమందటల్ చాలు ముందేటికిం గంటివే? కెంటసం బేల, ఘంటాభవై మ్రోసెదే? యన్యకుం గన్యఁ గానైతి, యుద్దామశృంగారుపై, దీనమందారుపై, భూమిభృద్గాయగోవాళుపైఁ, గామినీలోలుపై, రాయ శుండాలహర్యక్షుపై, రాయ కందర్ప ఫాలాక్షుపై, రాయ గోపాంగనాబృంద గోవిందుపై, సంతతానందుపైఁ, బోచమాంబా లసద్గర్భ సంజాతుపై, లోకవిఖ్యాతుపైఁ, బాదపీఠాంకితారాతి భూపావళీఫాలుపై, సింగభూపాలుపై వ్రాలి నాచిత్త మున్మత్తమై సోలి, కామానలాయత్తమై రాదు తేరాదు, నే నామరుండైన గౌరీవరుండైన వాణీధరుండైన లక్ష్మీవిభుండైన దేవప్రభుండైన నన్యున్ మదిం గోరఁగా నొల్లనే, యుల్లసత్ఫుల్ల మందార రాజన్మరందంబు నందంబునం గ్రోలు మత్తాలి దుత్తూరముం గోరునే? హేమరాజీవరాజీ రజోరాజితాకాశ గంగానదీలోల కల్లోల డోలాచల ద్రాజహంసంబు శైవాల జంబాల గండూపదీ భేకభేకీ ఢులీ సంకులాసార కాసారముం జేరునే? మండితాఖండలానీత జీమూత నిర్యత్పయోధారలం ద్రావు సారంగి కుంభాంతరాంభః ప్రపూరంబులం ద్రావునే? మాధవోజ్జాత చూతాంకుర స్వాదలీలా లసత్కోకిలేంద్రంబు ఝిల్లీరవక్రూర భల్లాతకీశాఖకుం బోవునే? సింగభూపాల బాహా పరీరంభ సంరంభ సంజాత సంతోషముం గోరు యోషాశిరోరత్న మాశించునే నీచసంభోగ మంబా! కుతర్కావలంబా! చలంబా! విలం బానులాపంబులన్ బాలసూర్యాభునిం బాయ నాడన్ పురోభాగినీ! భోగినీరాజుకంటెన్ మహాభాగు, నాభాగ సౌభాగ్య శోభాగరిష్ఠున్, వరిష్ఠుం బ్రవేశించి, నీతిం బ్రకాశించి, నృత్తావధానంబులన్ మంజుగానంబులన్ జిత్త మార్జింతునే, విత్తమున్ లేమి వర్జింతునే, యెట్టిదిన్ విత్తమే రిత్తమై యేటికే? నిత్యదంభా! దురారంభయుక్తిం బ్రమోషింప విద్వేషినే? యేలనే గోలనే, బాలనే, మానలేనే నరాధీశ చూడామణిన్, వారకన్యా జనగ్రామణీ, పాపజాతీ! భవజ్జాతి దుర్జాతి పొ" మ్మంచు, "లె" మ్మంచు, "నో చెల్లనేఁ జెల్ల రేచెర్ల గోత్రోద్భవున్ మానలే" నంచు "నాయన్నలా, యన్యులం జేరఁబో" నంచు హృద్భల్లితో వక్రవాగ్భిల్లితోఁ దల్లితో మాటఁ జాలించి ధైర్యంబు గీలించి, సంజాత శాతోదరిన్ సోదరిం జూచి
* వారకన్య సోదరిని దన వెత దీర్ప వేఁడుట *
"అక్కా! ప్రసూనాస్త్రు ధిక్కారముం జూచితే, నేఁడు రాకేందు రాకం దురాకంపముం బొందె డెందంబు, చైతన్య సంచాలియై, కీలియై గాలి యేతెంచె, కోదండియై, తూణియై, బాణియై, కంపితప్రాణియై, కాముకారాతి తోఁతెంచె, వాసంతవేళా రమాకంద మాకందశాఖావళిం గోకిలారావ కోలాహలంబుల్ విటస్వాంత హాలాహలంబుల్ దిశల్ మించి యేతెంచెనే, నేఁడు బాలామనోరంతుతోఁ గంతుతో, సింగభూమీశుతో, భోగదేవేశుతో, న న్నివేదింపవే, కాము సంతాపమున్ డింపవే, డింపి పుణ్యంబునం బోఁగదే, రాఁగదే, లేగదే" యంచుఁ జింతించు నాత్మానుజాతం దనూజాతశంకాసమేతం గృశీభూతఁ గన్గొంచు
* వారకన్య సోదరి దాని వలపును సింగరాజునకుఁ దెలిపి కావ వేఁడుట *
"బాలా! లలాటాక్షు సేవింపుమీ, రాహు భావింపుమీ, శేషభోగిం బ్రకర్షింపుమీ, చంపకశ్రేణి వర్షింపుమీ" యంచు భీతిన్ నివారించి, నీతిన్ విచారించి, యారామ యారామ సౌధాంతరాళస్థలిన్ నర్తనాగారవేదిన్ మణిస్వర్ణ పర్యంకికా భాసమానున్, మనోభూసమానున్, ఘనున్, రావుసింగక్షమానాథ పౌత్రున్, సమీచీన రేచెర్ల గోత్రాంబు సంజాతమిత్రున్, మహోదారచారిత్రు, సర్వజ్ఞసింగోర్వరాధ్యక్షు నీక్షించి దండప్రణామంబు సాపేక్షఁ గావించి, హస్తాబ్జముల్ మోడ్చి "దేవా! భవన్న్యస్త సౌజన్యధన్యన్, జగన్మాన్యఁ, గన్యన్, నిరన్యాంకపీఠాధిరోహన్, నిరన్యోపగూహన్, నిరన్నాభిలాషన్, నిరన్యాభిభాషన్, నిరన్యావకాశన్, నిరన్యప్రకాశన్, బ్రసూలోచన క్షిప్త బాష్పాంబుపూరన్, మనోజాత బాణావళీ శంకితప్రాణభారన్, సఖీమానస న్యస్త చింతాసమూహన్, భగిన్యంక సంప్రాపితానేకదేహన్, భవద్వైభవాకృష్టచిత్తన్, బరాయత్త వృత్తన్ గృపం జూడు" మంచుం బ్రశంసింప
* సింగరాజు వారకన్యను జేపట్టి భోగినిఁగాఁ జేయుట *
ఆ భోగదేవేంద్రుఁ, డా సత్యభాషా హరిశ్చంద్రుఁ, డా కామినీ లోక పాంచాలుఁ, డా సింగభూపాలుఁ, డా బాల నాబాలశీతాంశు ఫాలన్, సరోజాతహస్తన్, బ్రశస్తన్, శుకాధీశవాణిన్, లసన్నీలవేణిన్, మృగేంద్రావలగ్నన్, మనోజాగ్నిమగ్నన్ దయాదృష్టి రావించి భావించి నెయ్యంబు గావించి బాహాపరీరంభ సంరంభ నిర్ముక్త సంతాపఁ గావించి, కందర్పకేళిన్ వినోదించి, సద్భోగినింగాఁ బ్రసాదించి, తన్మాత నుద్యద్గజారూఢఁ జేయించి, విఖ్యాతి మ్రోయించి యిష్టంబు లిప్పించి యొప్పెం గడున్.

ఉ.
పండితకీర్తనీయుఁ డగు బమ్మెర పోతన యాసుధాంశుమా
ర్తాండ కులాచలాంబునిధి తారకమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదానవిహర్తకు రావు సింగభూ
మండల భర్తకున్ విమత మానవనాధ మదాపహర్తకున్.


                                                    శ్రీ కృ ష్ణా ర్ప ణ మ స్తు.

                                 భోగినీ దండకము సంపూర్ణము.

సమస్యాపూరణం - 608 (కొక్కొరోకొ యనెను)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
కొక్కొరోకొ యనెను  కుక్క పిల్ల.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

30, జనవరి 2012, సోమవారం

పోతన భోగినీ దండకము - 2

* తల్లి కూఁతునకుఁ గులవృత్తి ధర్మములను బోధించి రాజుపై వలపును వారింపఁ జూచుట *

"బాలా! జడత్వంబు మేలా? వినోదింప వేలా? విచారింప నేలా? విలోకింపు బేలా! వయోరూపసౌందర్యముల్ రిత్తగాఁ జేయు నీవృత్తికిన్ మెత్తురే? వత్తురే కాముకుల్ డాయఁ, గాయంబు విద్యున్నికాయోపమేయంబు హేయంబు ప్రాయంబు ధారాధరచ్ఛాయ, మెన్నే నుపాయంబులన్ విత్త మాయత్తముం జేయుమా, రిత్తవారంబు నేరంబు గా దీ విచారంబు వంశానుచారంబు, సంసారసారంబు,  లాభాధికారంబు, చర్చింప నీకు న్నలంకారమే కాన ధిక్కారముం జేయరా దీ వికారంబు లేలే, శుభాకార యేలే, గుణోదార యేలే, కులోద్ధార యేలే, తటిదేహ యేలే, వరారోహ యేలే, లలాటాలక వ్యూహ యేలే, మహోత్సాహ యేలే, విరాజన్ముఖాంభోజ యేలే, మహోరోజ యేలే, కలాలాప యేలే, జగన్మోహనద్రూప యేలే, చలచ్చంచలాలోకనవ్రాత యేలే, నయోపేత యేలే, మహామర్మభేదంబులై, సుప్రసాదంబులై, కౌముదీమూలకందంబులై, మందమందంబులై, చూడ నందంబులై, మోహనశ్రీవిలాసంబులై యున్న నీ చారుహాసంబులన్ సోలి యేలిన్ భుజంగాలి బాళిం బడం దార్చుటో; కాక, లోలంబులై, మోహజాలంబులై, కాము బాణంబులై, యప్రమాణంబులై, మీనశోభంబులై, చంచలాభంబులై, మోహితాశేషలోకంబులై యొప్పు లీలావలోకంబులం గూర్చుటో; కాక, రాజత్త్రిలోకీ వశీకార మంత్రంబులై, యుల్లసత్కామ తంత్రంబులై, దర్పకోద్రేక యంత్రంబులై, మోహవారాశి భంగంబులై, సూచితానేక నర్మప్రసంగంబులై, కాము కేళీకలాపంబులై యొప్పు నీ భాసమానానులాపంబులన్, విత్తవల్లోక చిత్తంబులన్ రాగమత్తంబులం జేసి తత్తన్నిమిత్తంబులన్ నిత్యమున్ విత్త మెల్లం బ్రమోషించి దూషించి, భర్జించి, తర్జించుటో; కాక, తోరంబులై, మధ్యభారంబులై, నిర్జితానంగ సౌధోపరి స్వర్ణకుంభంబులై యొప్పు నీ విప్పు వక్షోజకుంభంబులం జూపి పౌరావళిన్ నర్మలీలా కురంగావళిం జేసి నిర్జించి వర్జించుటో; కాక, నీ కీ కులాచారముల్ మాన నే కీరసల్లాప బోధించెనో! నేడు నాతోడు నాతోడ నాతోడ మాటాడుమా, చూడుమా, కన్యకాలోక చింతామణీ, గోత్రరక్షామణీ, ధీమణీ, యెవ్వ రెవ్వాని భూషించిరే, యేమి భాషించిరే, నేఁడు నీతోడ భాషించు ప్రోడల్ కుమారీ! కుమారాన్నపోతావనీనాథ సూనున్ వధూచిత్త విత్తాపహారావధానున్, సదాదాన విద్యానిరూఢున్, మనోజాత హృద్యానవద్యైక విద్యావలీఢున్, బ్రభాభాను, రాగానుసంధాను, మాయారమానాథు, సర్వజ్ఞ సింగ క్షమానాథు నీ సన్నిధానంబునం జెప్పిరో, యేమి వాతప్పిరో, యప్పరో, యప్పయోజాత గంధుల్ సుగంధుల్ పురిన్ నీ వయస్యల్ మహాసౌమనస్యల్ సువర్ణా! సువర్ణంబు లార్జించుటల్ చూడవా? చూడ వాంఛింతురా రాజులన్? వార లారాజులం గానరా? రాజుఁ గామింతురా? రాజబింబాననా! రాజరాజాధి రాజోన్నతిన్ రాజులన్ మించి రాజిల్లు నారాజు వంచింప నెంచంగ శోభిల్లునే, చెల్లునే, భూమి నీజాతి యేనాతి యీరీతిఁ బ్రీతిం బ్రకాశించి రాజిల్లునే, చెల్లదే నీపటుత్వంబు వాచా కటుత్వంబు, బాలేందు శోభాలికా! బాలికల్ సేయు యత్నంబులే నీ ప్రయత్నంబు? లంభోజనాళాంతర స్ఫురత్తంతు యోగంబునం జిక్కునే గంధనాగంబు? కంపించునే మక్షికాపక్ష విక్షేప వాతాహతిం గాంచనాగంబు? మిథ్యామమత్వంబులన్ రంజకత్వంబులన్ గూఢయంత్రంబులన్ మోహమంత్రంబులన్ మారుతంత్రంబులన్ జిక్కఁడే, చొక్కఁడే, దిక్కులం జిక్కులం బెట్టు మేధన్ మహావేధనైనన్ విరోధించి వాకట్టు, నీతిన్ బలారాతిమంత్రిం బ్రమోషించు, భాషావిశేషంబులన్ శేషుతోనైన భాషించు, మాయావిధానంబులన్ మాధవున్ మెచ్చఁ, డచ్చోట నెప్పాట మెప్పించెదే? చీటికిన్ మాటికిన్ బోటి యా మేటి యిచ్చోటికిన్ రాఁడు పాటించి, నీపాటి పాఠీననేత్రల్ ధరిత్రీశు చిత్తంబు మత్తంబుగాఁ జేయఁగాఁ జాలరే, యేల రేలుంబగళ్లున్ విచారంబు? చాలింపవే, వారవేశ్యాభుజంగుండు గాఁడే; మహారాయ వేశ్యాభుజంగుండు నిన్నేల యేలున్? పరస్త్రీలకున్ వేళ యీఁ డెన్నఁడున్, దత్తుఁ బాంచాలు భద్రున్ మరుం గూచిమారున్ వినంవుం జీరవుం జేర వీరీతి నేనాతిచే వింటివే యింటి నీవంటి దీవెంటలం దంటయై గెంటిపోఁ? దమ్మికంటీ, నినుం గంట యీవెంటకా? హా! కనుంగొంటి నీగొంటు చెయ్దంబు, దైవంబు క్రేఁగంటి కేనెంత కంటైతినో! జంట నింటింటికిన్ వెంటవెంటం బడన్ బంటనే? దాఁట నింటిన్, జెనంటీ! చిరంటీ గుణం బేటికే? మాయలాఁడే, విభుం డైనఁ బోఁడే, వినోదింప నీఁడే, నిమగ్నుండు గాఁడే, మముం జేరనీఁడే, నినుం జేరరాఁడే, ప్రవేశింపరాదే, ప్రమోషింపఁ గాదే, ప్రవర్తింతు వెచ్చోట నచ్చోటి కేమేఁ బ్రియం బాడరామే, నినుం బాయలేమే, మహోపాయవై కన్యకా! ధన్యు నన్యున్ మదిం గోరుమా, చేరుమా, చేరుమా కిష్టముల్, వీట లేరే మగల్, చేరరారే నినుం గోరి తారే విహారేహులై గేహళీవాటికిన్ మాటికిన్, వచ్చు నేవారి నీవారిఁగాఁ జూడవున్ గూడవున్, వారిజామోద! యీవార రామల్ మనోరాములన్ రిత్తపోరాములం గాని నిక్కంపుఁ బోరాములం జేసి గారాములం జిక్కిరే, చొక్కిరే, వారు వారాదికృత్యంబులం జేయ వారక్రియల్ చెల్లవే, తల్లి రాజుల్ బహువ్యాజులే, భోజులే, చంచలచ్చిత్తులే, మత్తులే, ప్రేరకాయత్తులే, నూతనాసక్తులే, లోభసంయుక్తులే, దోషసంయుక్తులే, రంధ్రసంపాదులే, వీతమర్యాదులే, వారి సేవింపఁగా రాదులే, కాదులే, వాదు లేలా, నవైలాలతాదేహ! సందేహమే దేహమేలే నలంపన్, నిలింపాంగనాభా! సునాభా! మదిన్ మానవే మానవేశాభిలాషంబులన్, నిన్ను లేమా! భరింపంగలేమా? కరంగింప లే మా నరేశున్, జితశ్రీసురేశున్, గతిశ్రీజితోద్దండ వేదండ! మాదండ నేదండముం జెందదే, రాచదండంబు గండంబు పుండ్రేక్షుకోదండ విభ్రాజితభ్రూయుగా! భూమిపాలావరోధంబు లో సన్నిరోధంబు నీకున్ మహాభద్రమా? భద్రమాతంగకుంభస్తనీ! కన్నవారంబుగామా, హితాదేశముల్ సేయఁగా మాకు ధర్మంబు, కామాశుగాలోకనా! యేల కామాతురత్వంబునుం జెంద, రామా! భవత్సంగతిన్ మున్నుగామా, త్రిలోకాభిరామాంబరానేక హేమాదులున్ నీకు నీమా, కులోత్తంస! నే మాకులత్వంబునుం బొంద మా మాట లేపాట వేమాటు లాలింపువారిన్ నిరీక్షింప కీమానవాధీశుపై మానసం బేల పట్టించెదే, ముద్దుపట్టీ, భవచ్చాతురిం బట్టి సర్వజ్ఞ సింగ క్షమానాథుఁ దప్పించి దర్పించి లోకత్రయిన్ నీకు నర్పింతునే, మారునిం జారుఁ గావించి రప్పింతునే, బ్రాఁతియే పైఁడి? నా పైఁడి! యేపైఁడి లేదింటిలో? వింటివా, రాచపోరామి యిట్టట్టుఁ బోరామికిన్ మూలమే, మేలమే? యిందునవ్యారవిందాననా! ముందు విన్దాననే లాట కర్ణాట పాంచాల బంగాళ చోళాది రాజన్య కన్యల్ వయోరూప ధన్యల్ సదాసక్తలై డాసి యున్నా రటే, రా రటే పాసి, తత్పాద రాజీవ సందర్శనారంభ సంరంభులై వీత హృద్దంభులై కుంభినీశుల్ బహూపాపన ద్రవ్యహస్తుల్ ప్రశస్తుల్ మహాభక్తి నక్తందివంబుల్ ప్రవేశించి యున్నారు, కన్నారు, విన్నారు లోకుల్, వరాలోక! నీకేల లీలావకాశంబు సిద్ధించు? సిద్ధించెనా మన్మథాకారుతోఁ గూడి క్రీడింపఁగాఁ బోలదే, వాని వాణిన్ మహావాణి కాఁపున్నదే, మన్న దే రత్నగర్భంబుతో భూమి తద్బాహుపీఠిన్, దిశాకుంభి కుంభీన సాగేంద్ర కూర్మాదులం బాసి కూర్మిన్ విలోకంబులన్ లచ్చి వర్తించునే, దిక్కులం దెల్లఁ గీర్తుల్ ప్రవర్తించునే, దుర్లభుండే, బహుప్రేయసీ వల్లభుండే, సదైకానుషంగంబు భంగంబు పణ్యాంగనాజాతికిన్ నీతికిం దప్పితేఁ జెప్పితిం గూన, సిద్దంబు తద్ధాత మున్ వారభామాతనూజాతకున్ నేతగా మాత నుజ్జాత గావించె, నిర్ణీతమే యేతదర్థంబు మర్యాద నిమ్మేదినిన్ వారమే నాదినుండిం బ్రయోగింతునే దాదినై, కామశాస్త్రాది విద్యాసమేతన్ భవన్మాత నుద్దామ మాయాప్రభూతన్ గురంగీ విలోకా నిరంగీకృతుల్ మాని నామాట నీమాటు పాటింపవే, నందనీ! నిందనీయంబు గాదే, మహానందనీయంబుఁ జిత్తంబులో నందనీవే, జనానందనీయా! కఠోరాచలవ్రాత కాఠిన్యమున్ డింప, రత్నాకరశ్రేణి లోఁతున్ నివేదింప, విత్తేశుగేహంబునున్ రిత్తసేయన్, జగచ్చక్షువుం గన్నుమూయన్, సదాగామి నాఁకట్ట, నుద్యద్భుజంగావలిం బట్ట, వారాంగనాజాతికిన్ న్యాయమే, మామకన్యాయసంపన్నవై పన్ని యో కన్య నీ వన్యులన్ బౌరసంపన్నులన్ భిన్నులన్ ఖిన్నులన్ జేసి మన్మందిరాళింద భూమండలాసన్నులం జేయుమీ, రాచబిడ్డేటికే బిడ్డ! వాచాటతల్ సాఁగవే, సాఁగినన్ నీకు జూదంబులా, కాక వీణావినోదంబులా, గద్య పద్యానువాదంబులా, మాళవీముఖ్య రాగానుకూలంబులా, దండలాస్యాది నృత్యావధానంబులా, యింద్రజాలాది మాయావిధానంబులా, వశ్యమంత్ర ప్రయోగోపసంహార విద్యావిచారంబులా, మందిరారామ వాటీలతాజాల మూలాభిషేక ప్రచారంబులా, హేమడోలావరోహంబులా, నీరజావాస వీచీ సమూహావగాహంబులా, బంధుగేహ ప్రవేశంబులా, రాజహంసావళీ మందయానోపదేశంబులా, నీల కంఠావళీ నృత్యశిక్షావిశేషంబులా, కాముకవ్రాత చిత్తప్రమోషంబులా, బొమ్మరిండ్లాటలా, పాటలా, పాటలామోద! రాజోపకంఠాటనంబుల్ కఠోరాసిధారావలేహంబులే, శార్కరాంభోవగాహంబులే, సింహయోగంబులే, సర్పవల్మీక భోగంబులే, శైలశృంగాగ్ర వీథీవిహారావధానంబులే, తుంగతాళాగ్ర కోటీతప స్సంవిధానంబులే, మత్తశార్దూల కుంజ ప్రచారంబులే, సింధు మధ్యప్రతారంబులే, గంధశుండాల శుండావినోదంబులే, సప్రమాదంబులే, కొమ్మ! మా కొమ్మదే రాచసఖ్యం బసౌఖ్యంబు మే మొల్ల, మే మొల్లముల్ మాకు లాభంబులే? డింభ కే వేళ నెమ్మోము సొంపారు, నేవేళఁ బాలిండ్లు పెంపారు, నేవేళ ఫాలంబునం గుంతలశ్రేణు లల్లాడు, నేవేళ మైదీఁగయున్ వీడు, నేవేళ నాయాస మున్నూడు నంచుం బ్రతీక్షింప నీ వంతవై యింతవై నేఁడు భూపాలు పాలై ప్రవర్తించుచోఁ గంబుకంఠీ! భవద్దర్శనోత్కంఠతన్ రాజగేహోపకంఠంబులన్ వచ్చు నీవారి వారింతురే వారి దౌవారికుల్ వారధర్మంబువారంచు దుర్వారులై, తన్మహాగేహ నిర్యూహ సేవారతాయాత భూపాలక వ్రాత వేదండ గండస్థలీ నిస్సర ద్దానధారావళీ జాత జంబాల సంఘంబు దుర్లంఘనీయంబు మాకున్, మహాదుర్గమంబే చొరన్ నిర్గమింపన్, మహోత్సాహవై వత్స! మత్సాహచర్యంబు కార్యంబు గైకొందు రమ్మంచు లె మ్మంచు వల్లించు తల్లిన్ ......


(చివరి భాగం రేపు ...)

సమస్యాపూరణం - 607 (కారము వర్జించువాఁడు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
కారము వర్జించువాఁడు కాంచునె సుఖముల్?

29, జనవరి 2012, ఆదివారం

పోతన భోగినీ దండకము - 1

(ఇంతకాలం ‘పోతన భోగినీదండకం’గురించి వినడమే కాని ఎప్పుడూ చదివింది లేదు, చూసింది లేదు. అదృష్టవశాత్తు నిన్న దొరికింది. పుస్తకం పూర్తిగా జీర్ణావస్థలో ఉంది. చదివి ఆనందించాను. ఈ ఆనందాన్ని మీకూ పంచాలని బ్లాగులో ప్రకటిస్తున్నాను. పెద్దది కనుక రెండు మూడు భాగాల్లో ఇస్తున్నాను)

                           భోగినీ దండకము - 1
                                బమ్మెర పోతనామాత్య ప్రణీతము
                                         *************
* శ్రీ సర్వజ్ఞ సింగరాజ వర్ణనము *
శ్రీమన్మహా మంగళాకారు, నాకార లక్ష్మీకుమారుం, గుమారీ మనోరాము, రామాంబరీషాది రాజన్య రాజద్యశః కాముఁ, గామాహిత క్షీరవారాశి తారా శి వాగేంద్ర మందార కుందారవిందాహితాకాశకల్లోలినీ కాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీభూషి తాశాంగ నాలోకసీమంతు, సీమంతినీ మానసారామవాటీ వసంతున్, వసంతావనీనాధ సంసేవితాంచత్పదాంభోజు, నంభోజరాజీ సుహృత్తేజుఁ, దేజో జయ ప్రాభవోద్దాము, నుద్దామ జన్యావనీ భీము, భీమప్రతాపానలాభీలకీలా వినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వార గర్వాటవీవారు, వారాధిపోరుప్రభా భాసురస్ఫార కల్యాణ దుర్వారు, వారాశివేలా పరీతావనీభార ధౌరేయరాజ న్మహాబాహు, బాహాకఠోరాసిధారా వినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్, సమూహా మహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్, వల్లభా మానసాదుర్లభున్, దుర్లభారిక్షమానాథ మత్తేభయూథంబులం జించి చెండాడు రాసింగమున్, సింగభూపాలు, భూపాల గోపాల గోపాలికా కృష్ణగోపాలు, 
* వేశ్యాకన్య రాజుం జూచి మోహించుట *
గోపాలదేవోత్సవ క్రీడలో, మేడలోనుండి జాలాంతరాళంబులన్ వారయోషాతనూజాత, విద్యావయోరూపసౌందర్య చాతుర్యవిఖ్యాత, చంచద్గుణోపేత, భృంగాంగనాలబ్ధకేళీ మహాహస్త కంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషునీకాశయై యుండి తద్వైభవంబుల్ విమర్శించి, హర్షించి, సంతోష బాష్పాంబుపూరంబు వర్షించి, కందర్ప బాణాహతిం జెంది, లోఁగుంది, మోహించి, సంగంబు నూహించి "యేవేళఁ దల్లిం బ్రమోషింతు, నేలీల భూపాలకుం జేరి భాషింతు, నేరీతిఁ గామానలంబున్ నివారింతు, నే నాతితోడన్ విచారింతు, నేవెంట రాచూలి వంచింతు,  నేజంటఁ గోర్కుల్ ప్రపంచింతు, మున్నే ప్రశస్తారవిందంబనైనన్ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబనై యుందుఁబో, రత్నహారంబునైనన్ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో, యేల యిట్లైతి నెట్లోకదే" యంచు శంకించుచున్, నిత్యకల్యాణు, లీలావతీపంచబాణున్ మనోవీథి నంకించుచున్, ఘోషమాణాలికిన్, మందవాతూలికిన్, జంద్రమఃకీలికిన్, గోకిలారావాదంభోళికిన్, జిత్తభూభల్లికిన్, దల్లికిన్ లోఁగి, కామానలజ్వాలలన్ వేఁగి, చింతాభరాక్రాంతయై యేఁగి, సంతాపఘర్మాంబులం దోఁగి చింతించు నింతిం బరీక్షించి,
* వారకన్య తల్లి వచ్చి కూఁతు నవస్థఁ గనుఁగొనుట *
బుద్ధిన్ విచక్షించి, తన్మాత మాయాపరాభూత జామాత, మిథ్యానయోపేత, విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత, లోకైకవిఖ్యాత, వారాంగనాధర్మశిక్షాది సంభూత, సమ్మోహితానేక రాజన్యసంఘాత, వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి నీతిన్ విచారించి, బాలన్, మిళత్కుంతలవ్రాతఫాలన్, గరాంభోజరాజత్కపోలన్, సమందోష్ణనిశ్శ్వాసజాలన్, విపర్యస్తసంవ్యానచేలన్, మహాందోల, నప్రేంఖిత స్వర్ణడోలన్, మృగేంద్రావలగ్నన్, దయావృష్టిమగ్నన్, మనోజాగ్నిభగ్నన్,  నిరంధన్, బరిత్రస్త ధమ్మిల్లబంధన్, సముద్విగ్న మోహానుబంధన్, నిరాలాప, నావర్జితాలేప, నస్వీకృతానేక కేయూరహారన్, గళద్బాష్పధారన్, బరిత్యక్తలాస్యన్, బరాభూత లీలావయస్యన్, బదాలేఖనా లక్షితక్షోణిభాగన్, బరిక్షీణరాగన్ విలోకించి, బుద్ధిన్ వివేకించి, లోనం బరాయత్తయై, చిత్తజాతాసిధారా చలచ్చిత్తయై, విన్నయై, ఖిన్నయై యున్న భావంబు భావించి, నెయ్యంబు గావించి, రావించి

(మిగిలిన భాగం రేపు ...)

సమస్యాపూరణం - 606 (జయజయ యంచు కౌరవులు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.

28, జనవరి 2012, శనివారం

‘శ్రీపంచమి’ శుభాకాంక్షలు!

‘శ్రీపంచమి’ పర్వదినం సందర్భంగా 
బ్లాగు సభ్యులందరికి
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి
శుభాకాంక్షలు.

శారద! శంకరాభరణ సభ్య మహాకవి పండితావళీ
సార హృదంతరాళమున సంతతమున్ వెలుగొందుచున్ సుధీ
సారము నింపునో జనని! సంస్తుతి జేయుదు నీ మహత్త్వమిం
పారెడు శబ్ద భావ రస పర్వముగా నతులాచరించుచున్.


సమస్యాపూరణం - 605 (వాణిని తిరస్కరించెడివాఁడె)


కవిమిత్రులారా,
అందరికీ ‘శ్రీపంచమి’ పర్వదిన శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
వాణిని తిరస్కరించెడివాఁడె బుధుఁడు.

27, జనవరి 2012, శుక్రవారం

చమత్కార పద్యాలు - 184

        ఆంధ్రసంస్కృత అనులోమ విలోమ పద్యం

క్రింది పద్యాన్ని అనులోమంగా చదివితే తెలుగు, విలోమంగా చదివితే సంస్కృతం. 


కం.
తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తేజా
దేవర గౌరవ మహిమన
మావలసిన కవిత మరిగి మాకునధీశా.

                                                            (పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ నుండి)
అనులోమంగా తెలుగు ...
ప్రతిపదార్థాలు 
అతి విభావిసు తేజా = మిక్కిలి ప్రకాశించే పరాక్రమం కల
అధీశా = ఓ మహారాజా!
దేవర గౌరవ మహిమన = మీ ఘనత యొక్క మహిమ చేతనే
మా వలసిన కవిత = మా ప్రియమైన కవిత్వం
తాన్ = అది
వినువారికి సరవిగన్ = వినే వారికి యుక్తంగా
భావనతోన్ = భావించడంతో
మాకు మరిగి = మాకు అలవడి
ఆనున్ = కనిపిస్తుంది.


భావం
మిక్కిలి ప్రకాశించే పరాక్రమం గల ఓ మహారాజా! మీ ఘనత యొక్క మహిమ చేతనే మా ప్రియమైన కవిత్వం ఆలకించేవారు అది యుక్తంగా భావించడంతో మాకు అలవడి వ్యక్తమౌతున్నది. (ఓరాజా! మేమాశ్రయించిన మీ మహత్వం వలననే శ్రోతల కానందకరమైన కవిత్వం మా కబ్బిందని భావం)

విలోమంగా సంస్కృతం

ఆర్య.
శాధీన కుమాగిరి మత
వికసి లవమాన మహిమ వరగౌరవదే
జాతే సువిభా వితి నను
నాతో నవభాగవి రసకిరి వానుమితా.

 
పదవిభాగం
శాధి, ఇన, కుం, ఆగిరి, మత, వికనసి, లవమాన, మహిమవరగౌరవదే, జాతే, సువిభౌ, ఇతి, నను, నా, అతః నవభాః, గవి, రసకిరి, వా, అనువితా.


అన్వయం 
ఇన, ఆగిరి, కుం, శాధి, మత, వికనసి, లవమాన, నను, మహిమవరగౌరవదే, సువిభౌ, ఇతి, జాతే, నా, అతః, నవభాః, రసకిరి, గవి, అనువితా వా.

ప్రతిపదార్థాలు
ఇన =ఓ రాజా!
ఆగిరి = పర్వతాలున్నంత కాలం
కుం = భూమిని
శాధి = శాసించు.
మత = సర్వ సమ్మతుడా!
వికనసి = మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు.
లవమాన = లవుని యొక్క మానం వంటి మానం కలిగిన
నను = ఓ భూవరా!
మహిమవరగౌరవదే = గొప్పతనంచే శ్రేష్ఠమైన గౌరవాన్నిచ్చే
సువిభౌ = నీ వంటి మంచి రాజు
ఇతి = ఈ విధంగా
జాతే = కలిగి ఉండగా
నా = పండితుడైన మనుష్యుడు
అతః = ఇటువంటి గౌరవం వల్ల
నవభాః = క్రొత్త వికాసం గలవాడై
రసకిరి = రసం చిమ్మే
గవి = భాషలో
అనువితా వా = స్తుతింపనివాడగునా! (తప్పక నుతించేవాడౌతాడని అర్థం)


భావం
ఓ రాజా! పర్వతాలున్నంత కాలం భూమిని శాసించు. సర్వసమ్మతుడా! మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుతున్నావు. లవుని యొక్క మానం వంటి మానం కలిగిన ఓ భూ వరా! గొప్పతనంచే శ్రేష్ఠమైనట్టి నీ వంటి మంచి రాజు ఈ విధంగా కలిగి ఉండగా పండితుడైన మనుష్యుడు ఇట్టి గౌరవం వల్ల క్రొత్త వికాసం కలవాడై రసం చిమ్మే భాషలో స్తుతింపనివాడవుతాడా? 

(‘ఆంధ్రామృతం’ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

సమస్యాపూరణం - 604 (దైవ మనెడి పదము)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
దైవ మనెడి పదము తద్భవమ్ము.

26, జనవరి 2012, గురువారం

చమత్కార పద్యాలు - 183

ఆంధ్రసంస్కృత భాషాశ్లేష

కం.
మా యమ్మాన సు నీవే
రాయలవై కావ దేవరా జేజేజే
మా యాతుమ లానిన యది
పాయక సంతోస మున్న పల మిల సామీ.

                                               (కళాపూర్ణోదయము - పింగళి సూరన)

తెలుగు పరమైన అర్థతాత్పర్యాలు
పదవిభాగం
మాయమ్మ, ఆన, చు, నీవు, ఏ, రాయలవు, ఐ, కావనే, దేవరా, జేజేజే, మాయాతుములు, ఆనినయది, పాయక, సంతోసము, ఉన్నపలము, ఇలసామీ.

అన్వయం
దేవరా, జేజేజే, సామీ, రాయలవై, కావనే, సంతోసము, పాయక, మాయాతుములు, ఆనినయది, ఉన్నపలము, మాయమ్మ, ఆన సు.


ప్రతిపదార్థాలు
దేవరా = ఓ ప్రభువా!
జేజేజే = మీకు ముమ్మాటికీ జయము.
సామీ = ఓ అధిపా!
రాయలవై = రాజువై
కావనే = రక్షించడం వల్లనే
సంతోసము = ఆనందం
పాయక = విడువకుండా
మాయాతుములు = మా ఆత్మలను
ఆనినయది = అంటిపెట్టుకొని ఉంది.
ఉన్నపలము = ఇది మాకు సిద్ధించిన ఫలం.
మా +అమ్మ+ఆన సు = మా తల్లి తోడు సుమా!

తాత్పర్యం
ఓ ప్రభువా! ముమ్మాటికీ నీకు జయం.ఓ అధిపతీ! నీవు రాజువై రక్షించడం వల్లనే ఆనందం విడువకుండా మా ఆత్మలను అంటిపెట్టుకొని ఉంది. ఇది మాకు సిద్ధించిన ఫలం.మా తల్లి తోడు సుమా!


సంస్కృతపరమైన అర్థతాత్పర్యాలు
పదవిభాగం
మా, ఆయం, మాన, సునీవే, రాః, అలవా, ఏకా, అవత్, ఏవ, రాజే, ఆజేజే, మా, ఆయాతు, మలాని, న, యది, పాయక, సంతః, అసముత్, న, పల, మిల, సా, అమీ.
అన్వయం
హే సునీవే, ఆయం, మామాన, అలవా, రాః, ఏకైవ, అవత్, అజేజే, రాజే, మా, ఆయాతు, మలాని, న, హేపాయక, సంతః, యది, అసముత్, నపల, మిల, అమీ, సా.


ప్రతి పదార్థాలు
హే సునీవే = శుభప్రదమైన మూలధనం కలిగిన ఓ రాజా!
ఆయం = రాబడిని
మామాన = లెక్క చేయవద్దు.
అలవా = ఛిన్నాభిన్నం కాని
రాః = ధనం
ఏక +ఏవ = ఒక్కటే
అవత్ = కష్టసమయంలో రక్షించే దవుతుంది.
అజేజే = మేకపోతుతో యజ్ఞం చేసే
రాజే = రాజుకోసం
మా = లక్ష్మి
ఆయాతు = వస్తుంది.
మలాని = పాపాలు
న = పొందవు.
హేపాయక = ఓ రక్షకా!
సంతః = సత్పురుషులు
యది = ఒకవేళ వస్తే,
అసముత్ = సంతోషం లేనివాడివై
నపల = దర్శనమివ్వకుండా పోవద్దు.
మిల = వారితో కలుసుకో.
అమీ = వీరు
సా = ఆ లక్ష్మి (అని నమ్ము).

భావం
శుభ ప్రదమైన మూలధనం గల ఓ రాజా! రాబడిని లెక్క చేయకు. ఛిన్నాభిన్నం కానట్టి ధన మొక్కటే కష్ట సమయంలో రక్షిస్తుంది. మేకపోతుతో యజ్ఞం చేసే రాజుకు లక్ష్మి వస్తుంది.  పాపాలు పొందవు. ఓ రక్షకా! సత్పురుషులు వస్తే సంతోషం లేనివాడివై దర్శనమివ్వ కుండ పోవద్దు. వారిని కలుసుకో. వీళ్ళే ఆ లక్ష్మి అని నమ్ము. 

‘ఆంధ్రామృతం’ శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో ...

సమస్యాపూరణం - 603 (గణతంత్ర మ్మనెడు మాట)

కవిమిత్రులారా,

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
గణతంత్ర మ్మనెడు మాట కల్లగ మిగిలెన్.

25, జనవరి 2012, బుధవారం

చమత్కార పద్యాలు - 182

ప్రహేళిక

సువర్ణాలంకృతా నారీ
హేమాలంకృతి వర్జితా |
సా నారీ విధవా జాతా
గృహే రోదితి తత్పతిః ||

సువర్ణాలంకృతురాలైన ఒక స్త్రీ బంగారు నగలు లేనిది. 
ఆమె విధవ. కాని ఆమె భర్త ఇంట్లో ఏడుస్తున్నాడు. 

దీని భావం వివరించగలరా?
(‘సువర్ణాలంకృత, విధవాజాతా’ శబ్దాల అర్థవైవిధ్యాన్ని పరిగణించండి)

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
 


సమస్యాపూరణం - 602 (కడలి నీ రంతయును)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
కడలి నీ రంతయును నిండెఁ గడవలోన.
ఈ సమస్యను సూచించిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

24, జనవరి 2012, మంగళవారం

చమత్కార పద్యాలు - 181

రామకృష్ణ విలోమ కావ్యమ్
సూర్య కవి విరచితమ్
********

తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః |
శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతమ్ || 1 ||


చిరం  విరంచిర్న చిరం విరంచిః
సాకారతా సత్యసతారకా సా |
సాకారతా సత్యసతారకా సా
చిరం విరంచిర్న చిరం విరంచిః || 2 ||


తామసీత్యసతి సత్యసీమతా
మాయయాక్షమసమక్షయాయమా |
మాయయాక్షమసమక్షయాయమా |
తామసీత్యసతి సత్యసీమతా || 3 ||


కా తాపఘ్నీ తారకాద్యా విపాపా
త్రేధా విద్యా నోష్ణకృత్యం నివాసే |
సేవా నిత్యం కృష్ణనోద్యా విధాత్రే
పాపావిద్యాకారతాఘ్నీ పతాకా || 4 ||


శ్రీరామతో మధ్యమతోది యేన
ధీరో೭నిశం వశ్యవతీవరాద్వా |
ద్వారావతీవశ్యవశం నిరోధీ
నయేదితో మధ్యమతో೭మరా శ్రీః || 5 ||


కౌశికే త్రితపసి క్షరవ్రతీ
యో೭దదాద్೭ద్వితనయస్వమాతురమ్ |
రంతుమాస్వయన తద్విదాదయో೭
తీవ్రరక్షసి పతత్రికేశికౌ || 6 ||


లంబాధరోరు త్రయలంబనాసే
త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా |
జ్ఞాతాగమా రక్ష హి యాహి యా త్వం
సేనా బలం యత్ర రురోధ బాలమ్ || 7 ||


లంకాయనా నిత్యగమా ధవాశా
సాకం తయానున్నయమానుకారా |
రాకానుమా యన్నను యాతకంసా
శావాధమాగత్య నినాయ కాలమ్ || 8 ||


గాధిజాధ్వరవైరా యే
తే೭తీతా రక్షసా మతాః |
తామసాక్షరతాతీతే
యే రావైరధ్వజాధిగాః || 9 ||


తావదేవ దయా దేవే
యాగే యావదవాసనా |
నాసవాదవయా గేయా
వేదే యాదవదేవతా || 10 ||


సభాస్వయే భగ్నమనేన చాపం
కీనాశతానద్ధరుషా శిలాశైః |
శైలాశిషారుద్ధనతాశనాకీ
పంచాననే మగ్నభయే స్వభాసః || 11 ||


న వేద యామక్షరభామసీతాం
కా తారకా విష్ణుజితేऽవివాదే |
దేవావితే జిష్ణువికారతా కా
తాం సీమభారక్షమయాదవేన || 12 ||


తీవ్రగోరన్వయత్రార్యా
వైదేహీమనసో మతః |
తమసో న మహీదేవై-
ర్యాత్రాయన్వరగోవ్రతీ || 13 ||


వేద యా పద్మసదనం
సాధారావతతార మా |
మారతా తవ రాధా సా
నంద సద్మప యాదవే || 14 ||


శైవతో హననే೭రోధీ
యో దేవేషు నృపోత్సవః |
వత్సపో నృషు వేదే యో
ధీరో೭నేన హతో೭వశైః || 15 ||


నాగోపగో೭సి క్షర మే పినాకేऽ
నాయో೭జనే ధర్మధనేన దానమ్ |
నందాననే ధర్మధనే జయో నా
కేనాపి మే రక్షసి గోపగో నః || 16 ||


తతాన దామ ప్రమదా పదాయ
నేమే రుచామస్వనసుందరాక్షీ |
క్షీరాదసుం న స్వమచారు మేనే
యదాప దామ ప్రమదా నతాతః || 17 ||


తామితో మత్తసూత్రామా
శాపాదేష విగానతామ్ |
తాం నగావిషదే೭పాశా
మాత్రాసూత్తమతో మితా || 18 ||


నాసావద్యాపత్రపాజ్ఞావినోదీ
ధీరో೭నుత్యా సస్మితో೭ద్యావిగీత్యా |
త్యాగీ విద్యాతో೭స్మి సత్త్యానురోధీ
దీనో೭విజ్ఞా పాత్రపద్యావసానా || 19 ||


సంభావితం భిక్షురగాదగారం
యాతాధిరాప స్వనఘాజవంశః |
శవం జఘాన స్వపరాధితాయా
రంగాదగారక్షుభితం విభాసమ్ || 20 ||


తయాతితారస్వనయాగతం మా
లోకాపవాదద్వితయం పినాకే |
కేనాపి యం తద్విదవాప కాలో
మాతంగయానస్వరతాతియాతః || 21 ||


శవే೭విదా చిత్రకురంగమాలా
పంచావటీనర్మ న రోచతే వా |
వాతే೭చరో నర్మనటీవ చాపం
లామాగరం కుత్రచిదావివేశ || 22 ||


నేహ వా క్షిపసి పక్షికంధరా
మాలినీ స్వమతమత్త దూయతే |
తే యదూత్తమతమ స్వనీలిమా-
రాధకం క్షిపసి పక్షివాహనే || 23 ||


వనాంతయానస్వణువేదనాసు
యోషామృతే೭రణ్యగతావిరోధీ |
ధీరో೭వితాగణ్యరతే మృషా యో
సునాదవేణుస్వనయాతనాం వః || 24 ||


కిం ను తోయరసా పంపా
న సేవా నియతేన వై |
వైనతేయనివాసేన
పాపం సారయతో ను కిమ్ || 25 ||


స నతాతపహా తేన
స్వం శేనావిహితాగసమ్ |
సంగతాహివినాశే స్వం
నతేహాప తతాన సః || 26 ||


కపితాలవిభాగేన
యోషాదో೭నునయేన సః |
స నయే నను దోషాయో
నగే భావిలతాపికః || 27 ||


తే సభా ప్రకపివర్ణమాలికా
నాల్పకప్రసరమభ్రకల్పితా |
తాల్పికభ్రమరసప్రకల్పనా
కాలిమార్ణవ పిక ప్రభాసతే || 28 ||


రావణే೭క్షిపతనత్రపానతే
నాల్పకభ్రమణమక్రమాతురమ్ |
రంతుమాక్రమణమభ్రకల్పనా
తేన పాత్రనతపక్షిణే వరా || 29 ||


దైవే యోగే సేవాదానం
శంకా నాయే లంకాయానే |
నేయాకాలం యేనాకాశం
నందావాసే గేయో వేదైః || 30 ||


శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం
యానే నద్యాముగ్రముద్యాననేయా |
యానే నద్యాముగ్రముద్యాననేయా
శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశమ్ || 31 ||


వా దిదేశ ద్విసీతాయాం
యం పాథోయనసేతవే |
వేతసేన యథోపాయం
యాంతాసీద్೭విశదే దివా || 32 ||


వాయుజో೭నుమతో నేమే
సంగ్రామే೭రవితో೭హ్ని వః |
వహ్నితో విరమే గ్రాసం
మేనే೭తో೭మనుజో యువా || 33 ||


క్షతాయ మా యత్ర రఘోరితాయు-
రంకానుగానన్యవయో೭యనాని |
నినాయ యో వన్యనగానుకారం
యుతారిఘోరత్రయమాయతాక్షః || 34 ||


తారకే రిపురాప శ్రీ-
రుచా దాససుతాన్వితః |
తన్వితాసు సదాచారు
శ్రీపరా పురి కే రతా || 35 ||


లంకా రంకాగారాధ్యాసం
యోనే మేయా కారావ్యాసే |
సేవ్యా రాకా యామే నేయా
సంధ్యారాగాకారం కాలమ్ || 36 ||


ఇతి
శ్రీదైవజ్ఞపండిత సూర్యకవి విరచితం
విలోమాక్షర రామకృష్ణకావ్యం
సమాప్తమ్




సమస్యాపూరణం - 601 (విఱుగఁ బండిన చేలను)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

23, జనవరి 2012, సోమవారం

ప్రహేళిక - 51

నామగోపన పద్యం

తే.గీ.
"కంజదళనేత్ర! మాధవ! కంసభేది!
శంఖచక్రగదాధర! సాధులోక
రక్షకా! చేతు నీదు ప్రార్థనము లయ్య!"
యనిన గుప్తనామం బేదొ యరయుఁ డిపుడు.


పై పద్యంలో దాగిన పేరేదో చెప్పండి.

చమత్కార పద్యాలు - 180/A

                      ప్రహేళిక సమాధానం

లంబోదర తవ చరణౌ
ఆదరతో యో న పూజయతి |
స భవతి విశ్వామిత్రో
దుర్వాసా గోతమ శ్చేతి ||


"ఓ వినాయకా! ఎవడు నీ పాదాలను ఆదరంతో పూజింపడో వాడు విశ్వామిత్రుడో, దుర్వాసుడో, గౌతముడో అవుతా డంటారు" అని విపరీతార్థం.


విశేషార్థం
లంబోదర = వినాయకా!
యః = ఎవడు
తవచరణౌ = నీ పాదాలను
ఆదరతః = ఆదరంతో
న పూజయతి = పూజింపడో
సః = వాడు
విశ్వ + అమిత్రః = జగద్ద్రోహి,
దుర్వాసాః = చిరిగిన బట్టలు కలవాడు (దుష్టం వాసః యస్య సః దుర్వాసాః)
గోతమః = అత్యంత పశువు (గౌః గోతమః)
భవతి = అగును
ఇతి = అని (అంటారు).


(శ్రీ శ్రీభాష్యం విజయసార్థి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

లక్కాకుల వెంకట రాజారావు గారు దాదాపుగా సరియైన అర్థాన్ని చెప్పారు. అభినందనలు.
రాజేశ్వరి అక్కయ్య ప్రయత్నం ప్రశంసనీయం.

సమస్యాపూరణం - 600 (కోటికి పడగెత్తికూడ)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

22, జనవరి 2012, ఆదివారం

చమత్కార పద్యాలు - 180

ప్రహేళిక

లంబోదర తవ చరణౌ
ఆదరతో యో న పూజయతి |
స భవతి విశ్వామిత్రో
దుర్వాసా గౌతమ శ్చేతి ||


"ఓ వినాయకా! ఎవడు నీ పాదాలను ఆదరంతో పూజింపడో వాడు విశ్వామిత్రుడో, దుర్వాసుడో, గౌతముడో అవుతా డంటారు" అని విపరీతార్థం.
మరి ఇందలి విశేషార్థం ఏమిటో చెప్పగలరా?

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 599 (గజ్జె లందెలు ఘల్లు ఘల్లన)

 కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
గజ్జె లందెలు ఘల్లు ఘల్లన కావ్యకన్యక లాడరే! 
(ఇది మత్తకోకిల. దీని గణాలు ర-స-జ-జ-భ-ర. యతిస్థానం 11. ప్రాసనియమం ఉంది)
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

21, జనవరి 2012, శనివారం

లక్కాకుల వారి సాయి షష్ఠ్యంతాలు

సాయి నాధునికి  " షష్ఠ్యంతాలు "
కం. 
జయ మంగళ శుభ కరునికి
జయతు జయతునిఖిల లోక జగదీశునకున్
జయ పావన శుభ చరితుకు
జయతుజయతు సాయి నాధు చరణ యుగళికిన్

కం. 
జయ బాబా నామునికిన్
జయతు జయతు సాయి రాము సర్వజ్ఞు నికిన్
జయ భక్త జన వరదునికి
జయతు జయతు కరుణామయు చరణ యుగళికిన్

కం. 
జయ సర్వాంతర్యామికి
జయతు జయతు సర్వ కార్య జయ శీలునకున్
జయ శిరిడీ నిలయునికిన్
జయతు జయతు దేవ దేవు చరణ యుగళికిన్

కం. 
జయ యోగీశ్వర వరునికి
జయతు జయతు సాయి కృష్ణ జనార్ధనునికిన్
జయ గీతా చార్యునికిని
జయతు జయతు పరమ గురుని చరణ యుగళికిన్

కం. 
జయ జగదా ధారునికిని
జయతు జయతు జంగమ పతి సాయి శివునికిన్
జయ దీన జనావనునికి
జయతు జయతు లోక ప్రభునిచరణ యుగళికిన్

కం. 
జయ బ్రహ్మార్చిత మూర్తికి
జయతు జయతు దత్త సాయి జ్ఞా నాంభసికిన్
జయ చిన్మయ సందీప్తికి
జయతు జయతు పరమ పురుషు చరణ యుగళికిన్

కం. 
జయ సర్వ వ్యాపనునికి
జయతు జయతు సాయి విష్ణు జలజేక్షణుకున్
జయ నారాయణ విభునికి
జయతు జయతు వేద వేద్యు చరణ యుగళికిన్

కం. 
జయ నిత్య పరం జ్యోతికి
జయతి జయతు సర్వ సిధ్ధి సంభావ్యు నకున్
జయ గుణ సాయి ప్రభునికి
జయతు జయతు సద్గురు వర చరణ యుగళికిన్
 
వెంకట రాజా రావు . లక్కాకుల





చమత్కార పద్యాలు - 179

                                    ప్రహేళిక
హనుమంతుడు సీతతో అంటున్నాడు ...

సువర్ణస్య సువర్ణస్య
సువర్ణస్య చ జానకి |
ప్రేషితా తవ రామేణ
సువర్ణస్య చ ముద్రికా ||


జానకి = ఓ సీతా!
సువర్ణస్య = చక్కని నామాక్షరములు గలది (చక్కని అక్షరాలు చెక్కబడినది)
సువర్ణస్య = ఎనభై రక్తి గలిగిన పరిమాణం కలది
సువర్ణస్య = మంచి వన్నెగలది (అయిన)
సువర్ణస్య ముద్రికా = బంగారపు ఉంగరము
తవ = నీకు
రామేణ = రాముని చేత
ప్రేషితా = పంపబడ్డది.


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 598 (కాకులు కొంగలున్ మరియు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుంగులున్.   
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

20, జనవరి 2012, శుక్రవారం

చమత్కార పద్యాలు - 178

ప్రహేళిక

ఉచ్ఛిష్టం శివనిర్మాల్యం
వమనం శవకర్పటమ్ |
కాకవిష్ఠాసముత్పన్నః
పంచైతేऽతిపవిత్రకాః ||

భావం
ఎంగిలి, శివుని నిర్మాల్యం, వాంతి, పీనుగుమీది బట్ట, కాకిరెట్టలో పుట్టినట్టిది - 
ఈ ఐదూ అత్యంత ప్రవిత్రమైనవి. 
 
ఇందలి విశేషార్థాన్ని చెప్పగలరా?

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

చమత్కార పద్యాలు - 177/A

ప్రహేళిక సమాధానం

రామం వానరవాహినీం పురరిపుం రాహుం రవేస్సారథిం
కుంభీగర్భసముద్భవం మురరిపుం మారస్య మౌర్వీరవమ్ |
తన్వీ నూతనపల్లవై ర్విరచితే శయ్యాతలే శాయినీ
సఖ్యా వీజితతాలవృంతపవనా బాలా ముహు ర్నిందతి ||

భావం
క్రొత్త చిగురుటాకులతో చేసిన శయ్యపై పడుకుని, చెలికత్తెచేత విసనకఱ్ఱచేత వీచబడుతున్న లేబ్రాయపు నాయిక ప్రియుని విరహంతో కృశించి, కోకిల జాతిని పెంచే కాకిని (కాకాసురుణ్ణి) చంపకుండా విడిచినందుకు రాముణ్ణి, సేతుబంధనంలో మలయపర్వతాన్ని పెకలించి తీసుకుపోనందుకు వానరసైన్యాన్ని, మన్మథుని ప్రాణావశిష్టుని చేసినందుకు శివుణ్ణి, చంద్రుణ్ణి పూర్తిగా మ్రింగనందుకు రాహువును, సూర్యుణ్ణి పశ్చిమపర్వతానికి చేర్చి రాత్రి రాకకు అవకాశమిచ్చినందుకు సూర్యుని సారథిని, చంద్రుని పుట్టుటకు కారణమైన సముద్రాన్ని త్రాగి విడవడం వల్ల అగస్త్యుణ్ణి, మన్మథుణ్ణి కన్నందుకు విష్ణువును, మరులు రేపుతున్నందుకు మన్మథుని వింటి శబ్దాన్ని మాటిమాటికి నిందించింది. 

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 597 (చెడుగులతో దేశమెల్ల)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
చెడుగులతో దేశమెల్ల శ్రీకర మయ్యెన్
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి 
ధన్యవాదాలు.

19, జనవరి 2012, గురువారం

చమత్కార పద్యాలు - 177

ప్రహేళిక

రామం వానరవాహినీం పురరిపుం రాహుం రవేస్సారథిం
కుంభీగర్భసముద్భవం మురరిపుం మారస్య మౌర్వీరవమ్ |
తన్వీ నూతనపల్లవై ర్విరచితే శయ్యాతలే శాయినీ
సఖ్యా వీజితతాలవృంతపవనా బాలా ముహు ర్నిందతి ||

భావం
క్రొత్త చిగురుటాకులతో చేసిన శయ్యపై పడుకుని, చెలికత్తెచేత విసనకఱ్ఱచేత వీచబడుతున్న లేబ్రాయపు నాయిక ప్రియుని విరహంతో కృశించి రాముణ్ణి, వానరసైన్యాన్ని, శివుణ్ణి, రాహువును, సూర్యుని సారథిని, అగస్త్యుణ్ణి, విష్ణువును, మన్మథుని వింటి శబ్దాన్ని మాటిమాటికి నిందించింది.
ఎందుకో తెల్పండి ...

క్లూ ...
(చమత్కార పద్యాలు - 176/A చూడండి.)

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 596 (మకరశేఖరుండు మమ్ము)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
మకరశేఖరుండు మమ్ము బ్రోచు.
ఈ సమస్యకు స్ఫూర్తి నిచ్చిన లంకా గిరిధర్ గారికి ధన్యవాదాలు.

18, జనవరి 2012, బుధవారం

లక్కాకుల వారి కవిత

నేటి జన్మమున సార్థకత గనుము

మనుజ జన్మము ప్రాప్తించె మనకు సఖుడ !
మరల వచ్చుట కల్ల , యేమైన నేమి
పూర్వ జన్మలు మరల బుట్టు కథలు
తక్కి, నేటి జన్మమున సార్థకత గనుము


చావు తరువాత నేవియున్ లేవు సఖుడ !
నీవు చేసిన మంచియే నిలిచి యుండు
మంచి చెడ్డల మూల్య మిమ్మహిని గాక
చచ్చి స్వర్గాని కేగు ముచ్చటలు విడుము


తేర మాటల బుధుల వాతెరల కన్న
చిన్న సాయమ్ము మిన్నయంచెరుగు మన్న!
సమ సమాజమ్ము కలయయ్యె , సాటి మనిషి
బాధలో నైన తోడ్పాటు బాధ్యత గద !


అరసి జీవిత కాలమ్ము నందు నెంత
మందికి సహాయ మందించి , మంచి జేసి
మించి నీ యాత్మ సాక్ష్య మిప్పించ గలవొ
అనుభవింతువు రెండింత లగు ఫలమ్ము


పిల్చి పేదల కన్నంబు బెట్టు వారు
వస్త్ర దానమ్ము చేయు పావనులు ఘనులు
చదువు చెప్పించు వారు నాపదలు బాపి
బ్రతుకు తెరువులు చూపించు వారు ఘనులు


రోగ గ్రస్తుల కారోగ్య రుధిర మిచ్చి
ప్రాణ దానమ్ము జేసెడు వారు ఘనులు
నీవు చేసిన మంచి రాణించి నీదు
భార్య బిడ్డల బ్రతుకులు బాగు పరచు


రచన
            వెంకట రాజారావు . లక్కాకుల

సమస్యాపూరణం - 595 (పాపులను బ్రోచులే)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు.

17, జనవరి 2012, మంగళవారం

లక్కాకుల వారి కవిత

భక్తి  కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

పరగు విశ్వ మనంతము , భ్రమణ రూప
చలన చాలన సంవృత్త శక్తి మయము
అందుగల కోట్ల గ్రహ తారకాది కములు
తగ నసంఖ్యాక మయ్యును దారి విడవు


‘భార్య బిడ్డలు తాను' యీ పగిది గల్గు
చిన్న సంసార బాధ్యతే చేత గాని
మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని
విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?


తాను నివ సించు విశ్వమే , తనకు సుంత
యైన బోధ పడుట లేదు , తాను శక్తి
మంతు డెట్లగు? విశ్వనియంత కన్న
నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడు


ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,
పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు
బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన
తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?


ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు
దాతనే మరచు కృతఘ్నతా విధాన
భావనలు గల్గు మానవా! పతన మవకు
భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము


రచన
శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు

చమత్కార పద్యాలు - 176/A

ప్రహేళిక సమాధానం

తద్విరహ మసహమానా
నిందతి బాలా దివానిశం శంభుమ్ |
రాహు మపి రామచంద్రం
రామానుజ మపి చ పన్నగారాతిమ్ ||


నీ వియోగమ్ము సైపని నీలవేణి
శివుని, రాహువున్, రాముని, శ్రీసతీశు,
వైనతేయుని దిట్టు రేఁబవళు లన్న
భావ మెఱిఁగినవాఁడె పో పండితుండు!


నీ వియోగాన్ని సహింపలేని ఆ యువతి శివుణ్ణి, రాహువును, రామచంద్రుణ్ణి, బలరామసోదరుడైన శ్రీకృష్ణుణ్ణి, గరుత్మంతుణ్ణి రేయింబవళ్ళు నిందిస్తున్నది.

వివరణ

విరహవేదనను పెంచే మన్మథుణ్ణి, చంద్రుణ్ణి, మలయపర్వతాన్ని, మలయమారుతాన్నీ మిగిల్చినందుకు వారు ఆమె నిందకు గురి అయ్యారు. ఎలాగంటే ... మన్మథుణ్ణి ప్రాణాలతో వదిలినందుకు శివుణ్ణి, చంద్రుణ్ణి మ్రింగక కక్కడం వల్ల రాహువును, సేతుబంధనం సమయంలో సముద్రంలో కొండలను, పర్వతాలను వేసి, మలయపర్వతాన్ని వేయనందుకు రాముణ్ణి, మన్మథుని కన్నందుకు శ్రీకృష్ణుణ్ణి, మలయమారుతాన్ని భక్షించే సర్పాలను తినడంవల్ల గరుత్మంతుణ్ణి ఆమె నిందించింది.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

సమస్యాపూరణం - 594 (దారము రక్షించు సాధుతతిన్)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
దారము రక్షించు సాధుతతి నండ్రు బుధుల్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

16, జనవరి 2012, సోమవారం

చమత్కార పద్యాలు - 176

ప్రహేళిక

తద్విరహ మసహమానా
నిందతి బాలా దివానిశం శంభుమ్ |
రాహు మపి రామచంద్రం
రామానుజ మపి చ పన్నగారాతిమ్ ||


నీ వియోగమ్ము సైపని నీలవేణి
శివుని, రాహువున్, రాముని, శ్రీసతీశు,
వైనతేయుని దిట్టు రేఁబవళు లన్న
భావ మెఱిఁగినవాఁడె పో పండితుండు!


నీ వియోగాన్ని సహింపలేని ఆ యువతి శివుణ్ణి, రాహువును, రామచంద్రుణ్ణి, బలరామసోదరుడైన శ్రీకృష్ణుణ్ణి, గరుత్మంతుణ్ణి రేయింబవళ్ళు నిందిస్తున్నది.
ఎందుకో?
కవిమిత్రులారా, వివరించండి!
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

నేమాని వారి పద్యం

                        పండువు మెట్లు
సీ.
భోగేఛ్ఛలను వీడి భోగి మంటలలోన
           కర్మ వాసనలను కాల్చి వేసి
ఉత్తరాయణము సద్యోగప్రదంబని
           సమ్మతి సంక్రాంతి సరణి నూని
సమదృష్టితో సకలము బ్రహ్మమయమని
           కనుమ ప్రశాంతి సౌఖ్యముల నట్లు
మూడు పండువులును ముక్తిధామమునకు
           సోపానములగును సుకరముగను

ఆ.వె.
హంస వోలె నెపుడు నన్ని సందర్భాల
పాలనే గ్రహించి మేలు దలచి
నీతి మార్గమందు నిత్యసంతోషివై
మనుము భద్రములను గనుము వేడ్క

                                                 రచన         
                    శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు




సమస్యాపూరణం - 593 (పసలేని పశువు కడివెడు)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
కనుమ పండుగ శుభాకాంక్షలు
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
పసలేని పశువు కడివెడు పాల నొసంగెన్.
ఈ సమస్యను పంపిన
‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

15, జనవరి 2012, ఆదివారం

‘జిలేబీ’ గారు చెప్పిన కథ

                                          ‘జిలేబీ’ చెప్పిన  
       ‘బుజ్జి పండు తెలుగు చదువు’ అను ‘శ్రీ శంకర విజయం’ కథ

          బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ, తెలుగు కాంతుల విరజిమ్ముతూ, తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.
          ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు  నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి "పుత్రా, బుజ్జి పండూ! నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన తెలుగు బ్లాగ్ గురువుల చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి" అని ఆ మాత పలుకగా, తనయుడు బుజ్జి పండు "మాతా! నీ వాక్కు నాకు శిలోధాల్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గులువుల వారి వద్ద వాసము చేయవలె' నని అడుగగా, ఆ మాత కడుంగడు ముదావహముతో "పుత్రా, బుజ్జి పండూ! నాకొక్క దినము అవకాశము నిమ్ము. నీకు ఆ గురువుల పేరు తెలిపెదను" అని సంతోషానందభరితు రాలై పుత్రోత్సాహముతో నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్ధురా లాయెను.
          పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగును దృశ్యకావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.
**********
          శంకరార్యుల వారి శంకరాభరణం కొలువు జగజ్జేగీయ మానంగా కవి పండితాదులతో వెలుగొందుతోంది. మహామహులైన పండితులు , నిష్ణాతులు , గ్రాంధికం , గ్రామ్యం కాచి వడబోసిన పెద్దల కొలువు అది.
          ఆర్యులవారు చిరునగవుతో వీక్షించుచూ , తమ సహ పండితులని అష్ట దిగ్గజములై న వారిని ఒక మారు కలయ జూసినారు. కొలువులో పండిత నేమాని వారు, చింతా వారు, శ్యామలీయం గారు, లక్కాకుల వారు, సుబ్బారావు గారు, గోలీవారు, శ్రీపతి గారు, రాజేశ్వరీ అక్కయ్య గారు లాంటి అష్ట దిగ్గజములను గాంచి ఆ పైనను వున్న మీదు మిక్కిలి పండిత లోకమును గాంచి, ఆ నాటి కొలువు విశేషములు వారు మొదలు బెట్ట బూనినారు.
          ఈ శంకరాభరణము కొలువు కు శ్యామలీయం గారు మంజరీ ద్వార పాలకులై ( ఆంగ్లములో గేటు కీపరు అందురు) కొలువుని కడు జాగ్రత్తగా కాపాడుకొంటూ తమ అసామాన్య ప్రతిభా పాటవాలతో ఒక వైపు ఐటీ రంగమును మరొక వైపు కవితా వెల్లువలను సమ పాళ్ళలో 'క్రోడీకరించి'నవారై , ఒక కన్నును ఎప్పుడు మంజరీ ద్వారముపై పెట్టి ఉందురు - ఏల అన ఎవరైనా తుంటరులు అనానిమస్సులై అక్కడ ప్రవేశించి ఏమైనా సభాభంగము గావించిన వారికి వెంటనే వారు ఝాడూ చూపించి తరిమి వేయుదురు.
          అటువంటి గురుతరమైన భారముతో వారు శంకరార్యుల కొలువును గాపాడుచూ, ఒక వైపు గ్రాంధికమా , మరో వైపు గ్రామ్యమా అన్న లక్కాకుల వారికి సమానముగా తమ బ్లాగ్కామెంట్ ఫటిమలో నెగ్గుకుని వస్తూ, మంజరీ ద్వారమున ఒక్క మారు వీక్షించినారు శ్యామలీయం వారు.
(బుజ్జి పండు ప్రవేశం)
శ్యామలీయం మాష్టారు తనలో ‘ఎవరో ఒక బుడతడు ఇటు వస్తున్నాడే ! ఈ సభా ప్రాంగణములో ఈ బుడతడికి పని ఏమి ? ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి?’ అనుకున్న వారై, (ప్రకాశముగా) "ఓరీ బాలకా! ఎవరవు నీవు? ఎచట నుంచి నీ రాక?" అని గంభీరముగా చూసినారు. వారు గంభీరస్వరూపులు. వారి చూపులు నిశితమైనవి.
          బుజ్జి పండు కొంత బెదిరి, "మలీ మలీ అండీ, మలీ అండీ... మలీ అండీ .... "
          "మలీ మలీ ఏమిటి ? స్పష్టముగా చెప్పుము. నీ పేరేమిటోయీ?"
          "మలీ మలీ అండీ, నేను మా మాత పంపగా వచ్చినానండీ!"
          శ్యామలీయం మాష్టారు గారు అబ్బురు పడిపోయారు. ‘ఈ బాలుడు మాత అన్న పదమును ఎంత స్వచ్ఛముగా, స్వేచ్ఛగా పలికినాడు సుమీ ! ఈ మమ్మీ ల కాలములో వీడు మాత అని పలకటం గొప్ప విషయమే!’ వారు ఈ మారు కొంత స్వాంతన స్వరముతో "బాలకా, నీ పేరు ఏమి?" అని నిదానముగా అడిగినారు
          "నా పేలండీ , నా పేలండీ, ..."
          ‘ఓహో, ఈ బాలకునికి సాధురేఫములు పలకడం కష్టమైనట్టున్నది!’ అని భావించి శ్యామలీయం వారు, పోనీ, మనమే వేరు విధముగా అడిగి చూతము అని,
"బాలకా, నీ నామమేమి?" అని రేఫములు లేకుండా అడిగారు ఈ మారు .
          "మీలు పెద్ద వాలండీ, నామమేమి అనకూడదు. నీ నామమెక్కడ అని అడగ వలె ! నా నెత్తిపై వున్నది చూడుడు" అని ఒక చెణుకు మన బుజ్జి పండు వేసి, "స్వామీ, నా నామము బుజ్జి పండు" అని తనను పరిచయము చేసుకున్నాడు.
          ‘హార్నీ, బుజ్జి పండు! ఏమి ఈ తెలుగు పేరు ! ఈ కాలములో పిల్లలకి ఇంత మంచి స్వచ్చమైన పెరెట్టిన తల్లులు వున్నందువల్లే కదా, ఈ శంకరాభరణము వంటి కొలువులు ఇంకనూ వర్దిల్లుచున్నవి’ అని వారు సంతోషపడి, "బుజ్జి పండూ, నీ చెణుకుకి నేను మైమరిచితిని.  నీ విక్కడికి వచ్చిన కారణం బెద్ది?" అని వారు ప్రశ్నించారు.
          "మా మాత, జ్యోతిల్మాయీ వాలు, నన్ను మలింత తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు. మా మాత నన్ను అమలికా నుండి ఇక్కడి కి పంపించినాలు. మీ వద్ద అంతల్జాల వాసము చేయమని" అన్నాడు బుజ్జి పండు.
          శ్యామలీయం మాష్టారు ఈ అబ్బాయిని గాంచి ముచ్చట పడి ‘వీడికి ఒక్క రేఫమే కదా సమస్య! ఈ తెలుగు లోకంలో ఎంత మందికి అసలు తెలుగే రాదు. అటువంటి కాలములో వున్న ఎందరికో కన్నా, ఈ బుడతడి ఉత్సుకతకి ఆ రేఫలోపము ( ఇది దుష్ట సమాసమా? అని రేపు ప్రశ్న టపాలో వేయవలెనని గుర్తు పెట్టుకుని ) ఒక్కటే కదా, మన్నించి, శంకరాభరణం కొలువలో ఈ బుడతడికి ప్రవేశము కలిపించి ఈ బుజ్జి పండుకి తెలుగు నేల్పుదము ( ‘హమ్మో, నాకు రేఫలోపము వస్తున్నది సుమీ!, జాగ్రత్త గా వుండవలె’ అని మనస్సులో అనుకున్నవారై) అని తీర్మానించి, "బాలకా, బుజ్జి పండు, వేచి వుండుము, నేను సభా ప్రాంగణములో మా పండితుల వారి అనుమతి గైకొని వచ్చి నిన్ను తోడ్కొని పోవుదును" అని వాక్రుచ్చి, వారు సభా ప్రాంగణంలోనికి వెళ్ళారు.
**********
సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము
          శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.
          "మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ?" అన్న పండిత నేమాని వారి పృచ్ఛతో సభాప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.
          ఈ ప్రశ్నకి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాంచినారు చిరునగవుతో, ‘మీ సమాధానం ఏమిటి జెప్పుడు’ అన్నట్లు! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును!
          లక్కాకుల వారు వెంటనే లేచి, "అయ్యలారా, మనం ఇంతగా సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతోనే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరై ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలోనే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చును " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.
          ఈ మారు శ్యామలీయం వారికి 'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటంతో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్ కాంప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.
          ఇక మిగిలిన మాష్టార్లు, ఓ మోస్తరుగా తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలిలో.
          రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యంతో తన చిలిపిదనం కట్టి బెట్టి కొంత గంభీరంగా ఉండవలసి వచ్చె. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.
          పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి,
"ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువుగా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము" అని ఆర్యులవైపు చూసారు వారు.
          శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తిని కడు రమ్యముగా గావించినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె, "ఆర్యులారా, మనం ఏదైనా సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావించెదము? కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబును బట్టి మనము తీర్మానించ వచ్చును" అని శ్యామలీయం వారి వైపు తిరిగి, "శ్యామలరావు గారు, ఆ బాలకుడు జెప్పినది ఏమి ? తన మాత మాటగా వచ్చితి నని కదా ? " అన్నారు
          "అవును ఆర్యా" అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్ష్మము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.
          "కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటయో జేసెదము!" అని ఆర్యులవారు జెప్పారు.
          అష్టదిగ్గజములు ఎప్పటి వలె దీనికికూడా తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.
          శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖుడే వచ్చాడా అన్నంతగా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది.
**********
          శ్యామలీయమైన నెమిలిపై నుంచి బుజ్జి పండు నిదానముగా దిగాడు. ఆతన్ని జూసి సభా స్థలి అచ్చెరువొందినది. బుడతడి ముఖమున ఏదియో తెలియరాని జ్యోతి (ఆ మాత జ్యోతిర్మయీ మహత్వమేమో ?) ప్రస్ఫుటిస్తోంది. ఇది అని చెప్ప నలవి కానిది. షణ్ముఖుడు పంచకక్షం కట్టినవాడు. ఈ బుడతడు జీన్స్ ప్యాంటు పై టీ షర్టు ధారి యై వున్నాడు. కంటికి హారీ పాటర్ అద్దములు కూడాను. నెత్తి పై నామము. కాలికి నైకే షూస్. షణ్ముఖుడు వేలాధయుడు. ఈ బుడతడు శర్కరీ ధారీ. ఒక చేత శర్కరీ , మరియొక్క చేత అంకోపరుండై వున్నాడు వీడు.
          బుజ్జి పండు సభా స్థలి కి ప్రణమిల్లి ,"సభ యందు విలసిల్లిన పెద్దలన్దలికీ నా నమస్కాలములు ! నా పేలు బుజ్జి పండు , నేను మీ చెంత తెలుగు నేల్చు కొనవలె నని మా మాత ఆదేశానుసాలముగా ఇచ్చటికి వచ్చితిని " అని, రాజేశ్వరీ అక్కయ్య వారి వైపు తిరిగి , " నమో మాతా , నమో నమః ! పెద్దమ్మ వాలికి నమస్సులు " అని 'స్పెషల్' గా నమస్కరించడం తో రాజేశ్వరీ అక్కయ్య వారు తబ్బి మొబ్బిబై "రారార కన్నయ్య , రార వరాల పంట, రారార గారాల పట్టి ,తెలుగు నేర్వంగ " అని మురిసి పోయింది.
           సభాస్థలి బుడతడి వైపు ఒక్క మారు , రాజేశ్వరీ అక్కయ్య వైపు ఒక్కమరూ చూసింది. ఈ మాతలు ఎల్లప్పుడూ నవనీత హృదయులే సుమా అని అచ్చెరువొందిన వారు, వీరు వెన్నపూసై కరిగి పోవడానికి అర నిముషము చాలు సుమా అని తీర్మానించు కున్నారు.
          బుజ్జి పండు ఈ మారు శంకరార్యులవైపు తిరిగి నమస్కరించి,
"అందమగు బ్లాగు నిలిపిలి యందలి
హ్లుదయముల నిలిచి యానందము
పెంపొందిచిన గులువు గాలికి
నమస్సులు కవివల , జేజే"
అని సాదర ప్రణామము గావించాడు.
          ఈ మారు శంకరార్యుల వారికి సందేహం వేసింది, " ఈ బుడతడు, మరీ తన బ్లాగు మొత్తం పరిపూర్ణముగా శోధించి వచ్చి వున్నాడేమో సుమీ " అని సందేహ పడిన వారై చిరునగవు ఒకటి నొసగి పండిత నేమాని వారి వైపు జూసినారు, ‘ఆర్యా, మీరు ప్రశ్నింపుడు బాలకుడిని’ అన్న చందాన.
          పండిత నేమాని వారు, ఔరా , ఈ శంకరార్యుల వారి చాతుర్యమే చాతుర్యం - అన్నిటికీ నన్నే ముందు వుండమనటం అనుకుని, ప్రకాశముగా " బాలకా, నీవు ఇచ్చట తెలుగు నేర్చుకొనుటకు మీ మాత పంపగా వచ్చినావని మా శ్యామలీయం మాష్టారు జెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ వచ్చినవాడివి ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చి నావే" అని ధర్మ సందేహం లేపారు.
          అసలు బాలకా నీవు నిజంగానే నేర్వడానికి వచ్చినావా అని వారు నేరుగా అడిగి ఉండవచ్చు. కాని సూక్ష్మం గా వారు ఈ లా ప్రశ్నించారు. అది వారి చాతుర్యం.
          బుజ్జి పండు తడుము కోకుండా టపీ మని, " అయ్యా పండిత నేమానీ గులువా - హస్తభూషణముగ అంకోపలుండగా పుస్తకం బదేల హస్తమందు?" అని చిరు నగవుతో జెప్పి "అయ్యా, చేత మా మాత నొసంగిన 'శల్కలీ ' సహిత ఇచ్చట వచ్చి వున్నాను ' అన్నాడు.
          ఈ బాలకుడి రేఫమును ఎటుల సరి దిద్ద వలె నని శ్యామలీయం మాష్టారు తీవ్రముగా ఈ మారు చింతించడం మొదలెట్టారు. " ఆర్యా, పండిత నేమాని వారు , ఆ బుడతడు శర్కరీ అన్న పదాన్ని అలా 'శల్కలీ' అన్నాడు. రేఫాలోపము అంతే.  ఒక చిన్న సందేహము నాకు ఇది దుష్ట సమాసమేమో " అన్నారు శ్యామలీయం వారు - నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయిపోతున్నానే సుమీ అని కొంత నివ్వెర పడుతూ.
          ఆ రేఫా లోపమును మీరి ఆ బుడతడు జెప్పిన సమాధానమునకు పండిత నేమాని వారు సంతసించి, " శ్యామలీయం మాస్టారు, మీ సందేహ నివృత్తి వేరుగా చర్చించదెము , ముందు ఈ బుడతడి సమాధానం మాకు బాగుగా నచ్చినది " అని ఆప్యాయముగా తన మనవణ్ణి జూసినంత గా బుజ్జి పండుని గాంచి నారు పండిత నేమాని వారు. మనవళ్ళ వయసులో వున్న పిల్లలని గాంచిన తాత గార్లకు ఎల్లప్పుడూ సంతోషదాయకమవడం ప్రకృతి సహజ మే గదా!
          పండిత నేమానీ వారు ఇంత శీఘ్రం గా కరిగి పోతారని అనుకోని గోలీ వారు దీర్ఘముగా బుడతడు బుజ్జి పండు ని గాంచి, "నాయనా బుజ్జి పండు.. నీ ఇచ్చుకని మేము మేచ్చితిమి. అయినన్ను , మీ మాత మాట మీదుగా ఇచ్చటికి వచ్చి నాడవని అంటున్నావు. మరి మీ మాత గురించి నీకు తెలిసిన ఒక పద్యము జెప్పుము" అని ఒక బాణాన్ని ఎక్కు పెట్టారు సూటిగా. గోలీ వారు వారు పేరు కు తగ్గట్టు గోళీ సూటిగా వేయుదురు -వారు, మధురమైన పద్యము ముందు  "తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు" అని అంతర్జాల పథముగా నొక్కి వక్కాణించినవారు కూడాను!
          ఇలా సూటిగా గోలీ వారు బుజ్జిపండుని బరిలోకి లాగడంతో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జెప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !
          బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు . "గులువులు హనుమచ్చాస్లీ గాలికి నమస్సులు.‘అజాడ్యం వాక్ పటుత్వం చ హనూమత్ స్మలనాత్ భవేత్ " అని మా మాత చెప్పాలు. మీలు వాలి నామధేయులు. కావున మీ స్మలణతో మా మాత గులించి చెబుతాను -
"నడకలు నేల్పెను
నడవడికలు నేల్పెను
నడతను నేల్పెను
బుడి బుడి నడకల
బుజ్జి పండు
బుద్ధుడే అవుగాక ! అని మా మాత నాకు అన్నియు నేల్పెను" అన్నాడు బుజ్జి పండు.
          గోలి వారికి ఈ బుడతడు హనూమంతుడు కన్న రాముడే అయ్యాడు ఆ బుజ్జి పలుకులు విని.
          ఈ మారు చింతా వారు, 'ఈ గోలీ వారూ బోల్తా పడ్డారే సుమీ ' అని బుజ్జి పండు ని వుద్దేశించి, " బుజ్జి పండు - అమెరికా దేశములో తెలుగు నేర్చుకొనుటకు ఎన్నో పుస్తకములు వున్నాయి కదా ? వాటితోనే నీవు నేర్చుకోవచ్చు గదా ? ఇలా శంకరాభరణం కొలువు లో అంతర్జాల వాసం అవరసరమా ? " అని బుజ్జి పండుని 'పరి' శోధించారు!
          దానికి బుడతడు, క్షణ మాత్రములో , "చింతావాలు! మీ వంటి గురువుల మస్తకమును మించునే పుస్తకమ్ము " అని తడుముకోకుండా జవాబు చెప్పాడు.
          బుజ్జి పండు అంత వేగం గా తనకు సమాధానము చెప్పునని చింతా వారు ఎదురు చూడ లేదు ! కొంత కాలం మునుపే ఈ శంకరాభరణం సదస్సు 'మస్తకమ్మును మించునే పుస్తకమ్ము ' అని ఘంటా పధం గా ఘోషించింది కూడాను! కాబట్టి వేరుగా చెప్పనలవి కాదు !
          పండిత నేమాని వారి వైపు సభా సదస్సు చూసింది. శంకరార్యులు కూడా చిరు నవ్వు నవ్వుతూ, 'ఆర్యా! పండిత నేమానీ సన్యాసీ రావు గారు మీ అభిప్రాయం?" అన్నారు.
          పండిత నేమాని వారు సభను ఉద్దేశించి, "మిత్రులారా! భాష, పద్య కవిత్వము ఎవరికి అలవడును అని ఒకపరి పరికించుచో -పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు ఒక పాదము కూడా చెప్ప లేక పోవచ్చును; సామాన్యులైన వారు చక్కని సహజ కవిత్వముతో జనరంజకమైన కవిత్వమును చెప్ప గలుగుచున్నారు. వాగ్దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము మరియు పూర్వ జన్మల సంస్కారము గలిగిన వారికి పద్య కవిత్వము అబ్బును. ఈ మంచి యోగమును ఈ బాలుడు పొందిన వాడిలా వున్నాడు. మనము ఈతనికి చదువులు నేర్పుతూ ఇంకా ప్రోత్సాహముతో ఈ బుడతడి తెలుగు చదువును ముందుకు సాగానిద్దాము " అన్నారు.
          ఈ పలుకులు విని చింతా వారు ఆనందోత్సాహముతో ,
" వరహృదయమ్మునన్ తెలుగు భాషను చక్కగ నభ్యసించి చా
తురి మెరయన్ కవిత్వమున దొడ్డతనమ్మును జూపుచున్ సుధీ
వరుల ప్రశంసలొందు బుజ్జి పండూ" అని ఆశీర్వదించి, నిరతము వృద్ధి చెందుచును నీ కృషి యిచ్చును సత్ఫలమ్ములన్ " అని మెచ్చు కున్నారు కూడాను.
          సురా బ్లాగీయం సుబ్బారావు గారికి బుడతడి నడవడిక, నడత, మాటలు చాలా నచ్చాయి. వారు వెంటనే ఆశువుగా
"తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ? "
అని బుజ్జి పండు మాతని కొనియాడి, బుజ్జి పండుని మనసారా ఆశీర్వదించారు !
          శంకరార్యులవారు, సభనుద్దేశించి, "మన భాషా పండితులు అందరూ కూడా అంకిత భావంతో భాషాభిమానంతో భాషాసేవ చేస్తూ తమను నమ్మి తమదగ్గర విద్యకొఱకు వచ్చే విద్యార్థులకు ధర్మ బద్ధంగా విద్య గరుపుతూ ఆంధ్రవిద్యార్థులకు ఆంధ్ర భాషాభిమానం పెరిగేలా చేయాలన్న కోరికతో ఉన్నవారే ! వారు గురుతరమైన గురువు భాద్యతలను నెరవేర్చి, బుడతడైన బుజ్జి పండుని తమ తమ విధానాల మూలముగా తమ శిష్యునిగా చేసుకోవటం నాకు చాలా సంతోషాన్ని కలుగ జేస్తున్నది. 
తెలుగు వారంత కలసిన వెలుగు బాట ,
మలచి పూయించి వచ్చు మావి తోట !
తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు ,
యెచట నున్నను గెలుపొందు రచటె వారు!
కాబట్టి ఈ బుడతడైన బుజ్జి పండుకి మన సభా ప్రాంగణమున మనము మరింత తెలుగు నేర్చుకొనుటకు, మనము ప్రోత్సాహము ఇచ్చెదము."
          లక్కాకుల వారు మొదట చెప్పారు- మనము నది అయి ప్రవహించాలని. మనము జీవ నదులమై ఈ భువి మండలమున తెలుగు వ్యాప్తికై మన వంతు కర్తవ్యం నెరవేర్పుదాము ! ఈ బుజ్జి పండు రాక మన సభాస్థలికే వన్నె తెచ్చినది." అని చెప్పి బుజ్జి పండు వైపు తిరిగి "శతమానం భవతి బుజ్జి పండు" అని మనసారా దీవించారు.
          ఇందరి గురువుల ఆశీర్వచనములతో బుజ్జి పండు రేఫా లోపమూ మటుమాయమై పోయినది.
          శ్యామలీయం వారు, లక్కాకులవారు చేతిలో చేయి వేసి శభాష్ అని భుజాలు తట్టుకున్నారు
          రాజేశ్వరీ అక్కయ్య గారి గురించి చెప్ప వలెనా ?
"చిన్న నాటను చేయగ చిలిపి పనులు ,
తల్లి చాటున ముద్దుల తనయు డనగ,
ఈ బుజ్జి పండు ఎదుగ వలె జగద్గురు వనంగ" అని మనసారా కోరుకున్నారు వారు.
          సభా స్థలి లో గణ గణ గంట మోగింది. బుజ్జి పండు ఆశువుగా అందుకున్నాడు.
గదిని గోడకున్న గడియారమున గంట,
చర్చి గంట, పాఠశాల గంట,
గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
టంట, టంట, టంట, టంట, టంట. !!!
          శ్రీ పతి వారు సంఘ సూక్తం తో  ముగించారు.
సమానో మంత్రః సమితిహ్ సమాని
సమానం మనః సహ చిత్తమేషామ్
సమానం మంత్ర మభి మంత్ర ఏవః
సమానేన వో హవిషా జుహోమి
సమాని వ ఆకూతిహి
సమానా హృదయానివః
సమానమస్తు ఓ మనో
యథా వః సు సహా సతే !!!
          ఇంతటి తో బుజ్జి పండు తెలుగు చదువు -  శ్రీ శంకర విజయం అను అంకము సమాప్తము.
          బుజ్జి పండు శంకరాభరణ కొలువులో తెలుగు పరి పూర్ణముగా నేర్చుకుని, తిరుగు దారి అమెరికా కి పట్టాడు. మధ్య దారిలో ఆతని విమానము ఫ్లైట్ లే ఓవర్ లో , జర్మెనీ దేశంలో ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం లో  ఆగింది. లే ఓవర్ సమయం లో బుజ్జి పండు కునుకు తీస్తూండగా 'కిడ్' నాప్ కాబడి నాడు. ! దీనికి మూల కారకులు కొందరు భామలు. వారిలో సూత్రధారి అయినవారు మధుర వాణీ గారు -  జర్మనీ వాసులు.

వారు 'ఈ' కిడ్ - నాప్ ఎందుకు చేసారు ? దాని కథా కమామీషు ఏమిటి ? రాబోవు అంకము- బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం కై వేచి చూడుడు.!
http://funzilebi.blogspot.com/2011/12/blog-post.html#links

కవిమిత్రుల సంక్రాంతి కవితలు

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
అశ్వధాటి వృత్తాలు
సప్తాశ్వరూఢుడయి బాలార్కుడీ దినము తా జేరు రాశి మకరం
తృప్తాత్ములవ్వ ఘన కూష్మాండ దానములు విప్రాళి కందు సుదినం
ప్రాప్తించ పుణ్యగతి గాంగేయుడెంచినది స్వచ్ఛంద మారణ దినం
తప్తాధికంబులకు మార్తాండుడున్ ధరయు సామీప్యమైన అయణం

లుప్తంబులై జనవె రోగాలు చేర హుతవాహుండు ప్రాణి జఠరం
దీప్తోద్ధతిన్ మెరయ పౌష్యంపు లక్ష్మి కళ ముంగిళ్ళ ముగ్గు రచనం
క్లుప్తంబులై నిశలు దీర్ఘంబులై పగలు పత్రాలు రాలు శిశిరం
గుప్తంబుగా మసలు పూర్వీకులన్ బిలచు పితౄణ తర్పణ దినం

వ్యాప్తించగా లచిమి ధాన్యంపు రాశులుగ పొంగళ్ళ తీపి పచనం
సుప్తస్థితిన్ పొదలు శీతర్తు బాధితుల మేల్కొల్పు భోగి దహనం
జ్ఞప్తిన్ తలంచుకొని గోజాతి సేవలను గోలక్ష్మి గొల్చు కనుమల్
ఆప్తాళి బంధుతతి సమ్మేళనంబులకు సంక్రాంతి గొప్ప తరుణం
***************


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
శాంతి సౌఖ్యప్రదాయి సంక్రాంతి లక్ష్మి
సకల సంపత్సమృద్ధి నొసంగ కూర్మి
మీ కుటుంబము నిరతము మేలు గాంచి
యలరుత యటంచు నే కూర్తు నాశిషములు.
***************
 

చింతా రామకృష్ణారావు గారు
మకరమునందు భాస్కరుఁడు మాఘమహోజ్వల తేజమొప్పుచున్
సకల శుభంబు లీయగను చక్కగ చేరు శుభంబు గొల్పుచున్.
వికసిత భావనా పటిమ వెల్లునయై మహనీయ సత్క్రియల్
సకల జనాళి చేయగ ప్రశాంతిగ నుండగ జేయు గావుతన్.
***************


 మిస్సన్న గారు
ఉత్తరాయణ పుణ్యకాలోద్భవమున
మకర సంక్రాంతి పురుషుడు సకల జీవ
కోటి కిడుగాక శుభముల కోటి నుర్వి
ననుచు కాంక్షింతు మనసార ననఘులార.

సమస్యాపూరణం - 592 (మకర సంక్రమణము మతిని)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
మకర  సంక్రమణము  మతిని చెఱచు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

14, జనవరి 2012, శనివారం

మకర సంక్రమణ లక్ష్మి!

కదలి రావమ్మ! మకర సంక్రమణ లక్ష్మి!

వచ్చె’ మకర సంక్రాంతి ‘ నీవంతు వచ్చె
చూడ రావమ్మ పుట్టింటి వాడ వాడ
నేల తల్లి నోదార్చి కన్నీరు తుడువ
కదలి రావమ్మ మకర సంక్రమణ లక్ష్మి !


ఋతువు లేమాయె? యే ‘మాయ’ గతులు మార్చె ?
వర్ష ఋతువున వానలు పడుట లేదు
నేలలో నీరు మృగ్యమై చేలు , ప్రాణు
లెండి యగచాట్ల పాల్బడు చుండె గనుము


పల్లె వీడి ప్రజలు బ్రతుకు భారము మ్రోయ
పట్టణాల బాట పట్టిరి, మరి
పల్లె పట్లు వీడి బయలెల్లె సంక్రాంతి
వచ్చి చూడు నీదు వైభవమ్ము


పిలిచి పిలిచి పెట్టు పిండి వంటల యూసు
లేవి? యెటకు బోయె నీవి గుణము ?
ఆకసమ్ము నెక్కె నవనికి నందవు
ధరలు, తమకు లేని ధర్మ మేల ?


పిలుపు లేకనె పెద్దలు, పేరటాండ్రు
అదిగొ వచ్చిరీ యవనికి, ‘ నిదిగొ! మీకు
ఆశ దీరదు, మీబిడ్డ లరువు లంది
కరవు దీర బెట్టంగ లేరరుగు డింక ‘

రచన
 లక్కాకుల వెంకట రాజారావు

చమత్కార పద్యాలు - 175

ప్రహేళిక

వాయు మిత్ర సుత బంధు వాహనా
రాతి భూషణ శిరోవలంబినీ |
తజ్జ వైరి భగినీ పతే స్సఖా
సాతు మాం *(సుజనలోకబాంధవః) ||


* కుండలీకరణంలో ఉన్నది నేను మార్చినది. 
వాస్తవంగా ఉన్న పదాన్ని ఇస్తే ఎవరైనా సమాధానాన్ని వెంటనే చెప్పగలరు.

పవను చెలికాని సుతు బంధు వాహమునకు
శత్రువే నగయైన యా స్వామి తలను
నిలిచినట్టి దాని సుతు వైరి నిజసహోద
రీపతి సఖుండు బ్రోవ నర్థింతు నెపుడు.


భావాన్ని వివరించవలసిందిగా మిత్రులకు మనవి.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 591 (భోగములకు పంట)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు
భోగి పండుగ శుభాకాంక్షలు!

ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
భోగములకు పంట భోగిమంట.
ఈ సమస్యకు స్ఫూరి నిచ్చిన
‘శిరాకదంబం’ రావు గారికి
ధన్యవాదాలు.

13, జనవరి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 590(తమ్ములను నుతింతు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
తమ్ములను నుతింతు నెమ్మనమున
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

12, జనవరి 2012, గురువారం

చమత్కార పద్యాలు - 174

ప్రహేళిక

విలాసినీం కాంచనపట్టికాయాం
పాటీరపంకై ర్విరహీ విలిఖ్య |
తస్యాః కపోలే వ్యలిఖత్ పవర్గం
తవర్గ మోష్ఠే చరణే టవర్గమ్ ||


స్వర్ణపట్టికపైనను చందనద్ర
వమున చిత్రించె విరహి లావణ్యరూపు;
చెంపపైన పవర్గను, చెలియ పెదవి
పై తవర్గ, టవర్గను పదముల నిడె. 

భావం
ఒక కాముకుడు ఒకానొక విలాసవతి రూపాన్ని బంగారుపలకపై శ్రీగంధద్రవంతో చిత్రించి ఆమె చెంపపై ‘ప’వర్గాక్షరాలను, పెదవిపై ‘త’వర్గాక్షరాలను, పాదంపై ‘ట’వర్గాక్షరాలము వ్రాసాడు.

అలా వ్రాయడంద్వారా అత డామెకు పంపిన సందేశం ఏమిటో వివరించండి. 

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

సమస్యాపూరణం - 589 (సంగీతము విన్నవారు)

 అమర సంగీత విద్వాంసురాలు యం. ఎస్. సుబ్బలక్ష్మి గారి 
పాదపద్మాలకు ప్రణామాలు.

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

11, జనవరి 2012, బుధవారం

వ్యాకరణం - 5

                          దుగాగమ సంధి

మిత్రులారా!
          నీ, నా, తన ల తరువాత యొక్కకు బదులుగా దుగాగమ సంధి సూత్రము ప్రకారము "దు" వచ్చును. ఇది మీ, మా, తమలకు మాత్రము వర్తించదు. అందుకు విరుద్ధముగా కొందరు కవులు మీదు, మాదు, తమదు అని ప్రయోగించుటను చూచుచున్నాము. బాల వ్యాకరణములోని ఈ సూత్రమును వ్యాఖ్యను గమనించండి

సమాస పరిచ్చేదము: సూత్రము 11:
యుష్మ దస్మ దాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
నీదు కరుణ-నీ కరుణ; నాదునేరిమి-నా నేరిమి; తనదురూపు-తనరూపు.

వ్యాఖ్య - 
          సంస్కృతమునందలి యుష్మదస్మదాత్మన్ శబ్దములకు తెనుగున పర్యాయ పదములగు "నీ-నా-తన" యను శబ్దములకు సమాసమున వేరొక పదము పరమైనచో "దుక్" ఆగమముగా వచ్చునని సూత్రార్థము. ఈ యుదాహరణములన్నియు షష్ఠి తత్పురుష సమాసములు. సమాసమున విభక్తి ప్రత్యయము లోపించిన పిదప ఉత్తర పద పరత్వముండును గాన పూర్వ పదములగు నీ-నా-తనలకు "దు" వికల్పముగ చేరునని భావము.

                       నీయొక్క + కరుణ అని యుండగా సమాస 25వ సూత్రముచే విభక్తి ప్రత్యయము లోపించి నీ + కరుణ యైన పిదప ప్రకృత సూత్రముచే నీ యనుదానికి దుగాగమము వచ్చి "నీదు కరుణ" యైనది. ఈ దుగాగమము వికల్పముగాన రానపుడు నీకరుణ అనియే యుండును. ఇట్లే మిగిలిన రూపముల నూహించునది.


స్వస్తి!

                                                                  సేకరణ
                         శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు