10, జూన్ 2014, మంగళవారం

పద్యరచన - 586

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వడ్డాది ఉదయకుమార్ గారికి ధన్యవాదాలతో...

31 కామెంట్‌లు:


  1. బ్లాగ్దేవీ చిత్ర విచిత్రములు చెప్పనలవి కావు
    చిరుప్రాయమున చీర అంద మంతయు నొప్పార
    చిన్నారి సొగసుల జిలేబి అంతః కరణ వైశాల్యం
    భువి దివి సందీప్త పంచ దశ లోక కవిసామ్రాజ్యాన !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....

    చెప్ప నలవియె బ్లాద్గేవి చిత్రములను
    చిరుతప్రాయమునందున చీరగట్టి
    యంద మొలికించు చిన్నారి యలరుచుండ
    గా జిలేబి మనమ్మున కవిత లెసఁగె.

    రిప్లయితొలగించండి
  3. చీరకట్టున చిన్నారి తారవోలె
    మెరయుచుండె నమస్కృతిన్ మెరుపుతీగ
    పెద్దవేషమ్ము వేయుచు నొద్దికగను
    స్వాగతమ్మిచ్చుచున్నట్లు నాగమించె

    రిప్లయితొలగించండి
  4. ఎందరో పండిత గురువుల
    కందరికీ వందనములు కాలికి మ్రొక్కన్
    తొందరగా నెదిగి నొదిగి
    బంధము లనుపెంచు కొనుచు పద్యము వ్రాయన్

    రిప్లయితొలగించండి
  5. ముద్దు లొలికించు చుండునా ముద్దు గుమ్మ
    చీర కట్టిన విధమును సీత !చూడు
    వందనంబులు సేయుచు నందరికిని
    నెటుల నిలబడి యున్నదో యిప్పుడిచట

    రిప్లయితొలగించండి
  6. చిన్న తల్లి జూడ చెన్నుగా నున్నది
    చీరకట్టు తోడా చెంగ లించె
    భరత మాత కామె ప్రతిరూపమన్నట్లు
    కాను పించు చుండె కరము శోభ

    రిప్లయితొలగించండి
  7. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఎందరొ, ఎదిగి యొదిగి’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    తోడ టైపాటు వల్ల తోడా అయినట్టుంది.

    రిప్లయితొలగించండి
  8. పారావారమునకు మన
    భారత సంస్కృతిని దెలుప ప్రణిపాతముతో
    చీరను గట్టిన చిన్నది
    వారిజ లోచనుల గరిమ బాగుగు దెలిపెన్

    రిప్లయితొలగించండి
  9. తెలుగింటి యాడ పడచుగ
    వెలుగుల నింపగ నిలచిన వెన్నెల కొమ్మా!
    పిలుపుల బిలువగ కదలగ
    తళుకుల జరి చీర గట్టి తరలే వెటకే?

    రిప్లయితొలగించండి
  10. చీరను కట్టి, వందనము చేయుచు ముద్దుల మోముతోడ చి
    న్నారిని చూచినన్ మనమునన్ కడుసంతసమున్ జనించెడిన్
    భారత సంప్రదాయములు బాగుగ వృద్ధిని పొందచూడ నా
    కోరిక తీరునేమొనని కొంచెముగా చిగురించెనాశయున్

    రిప్లయితొలగించండి
  11. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీరు వృత్తరచనలోనూ ప్రావీణ్యం కలవారని నిరూపించారు. మంచి పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. జ్ఞాన దీప్తులు మోము కంజాతమును నిండె
    ....పలుకుల తల్లి యా పసిడి బొమ్మ
    వివిధ శోభల తోడ విలసిల్లు చున్నది
    ....శ్రీమహాలక్ష్మి యా చిట్టితల్లి
    సౌభాగ్యరేఖల చాల వెల్గుచునుండె
    ....శంభు నర్థాంగి యా సన్నుతాంగి
    ముగ్గురమ్మలకును మూలపుటమ్మయౌ
    ....ఆదిపరాశక్తి యా మనోజ్ఞ
    ఆమె సద్గుణగణముల కాటపట్టు
    కట్టు బొట్టుల కామెచే కలిగె ఠీవి
    సాటి వారలలో నామె స్వర్ణభూష
    అచ్చముగ నామె ఆంధ్రుల యాడుబిడ్డ

    రిప్లయితొలగించండి
  14. మనోహరమైన వర్ణనతో మీ పద్యం సర్వోత్తమమై అలరారుతున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి రామారావు గారి పూరణ (మా అన్నయ్య గారికి కంప్యూటర్ ఆపరేట్ చేయుట తెలియక నన్ను బ్లాగ్ లో పోస్ట్ చేయమనినారు. అలా వ్రాయవచ్చునో లేదో తెలియదు )

    క్రూరత కానుపైనపుడు కుక్కల పందుల పాలుచేసి పా
    ల్గారెడు ముద్దు పాపలను కర్కశ చిత్తులు చెత్తకుప్పలన్
    పారగ వైచుచుండిరి కృపామయ! రక్షణ నీవయా! నమ
    స్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్

    భారత నారి యాదిగురువై జగమెల్లను మార్చి దివ్య సం
    స్కారము చారు శీల గుణ సంపద లిచ్చెను నాడు! నేడు చి
    న్నారికి, నారికే యిట మనన్ భయమౌ ప్రియ దైవమా! నమ
    స్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్

    రిప్లయితొలగించండి
  16. సరస కవీంద్రులార! యిదె స్వాగతమంచును బల్కి శంకరా
    భరణము బ్లాగు వేదికకు భద్రగుణాఢ్యుల స్వాగతించుచున్
    చిరునగ వొల్కు ప్రేమమయి! చీరను గట్టిన చిట్టితల్లి! సా
    దరమున గూర్తు దీవెన ముదమ్మున వర్ధిలుమా శతాయువై

    రిప్లయితొలగించండి
  17. చంద్రమౌళి రామారావు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోయినా మీ సోదరులు సూర్యనారాయణ గారి ద్వారా మీ పూరణలను, పద్యాలను, వ్యాఖ్యలను పంపవచ్చు.
    “నమస్కారమటంచు నిల్చెనొక చక్కని బాలిక చీరకట్టుతోన్” అంటూ మీరు చెప్పిన రెండు పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    శంకరాభరణ కవులకు స్వాగతమంటూ నిలిచిన చిన్నారిగా భావిస్తూ హృద్యమైన పద్యం చెప్పి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. Chandramouli Suryanarayana గారూ మీ పద్యం బాగుంది.
    ---------------------
    చీరను కట్టి, వందనము చేయుచు ముద్దుల మోముతోడ చి
    న్నారిని చూచినన్ మనమునన్ కడుసంతసమున్ జనించెడిన్

    రిప్లయితొలగించండి
  19. చంద్రమౌళి రామారావు గారి పూరణ చాలా బాగుంది.
    ---------------
    భారత నారి యాదిగురువై జగమెల్లను మార్చి దివ్య సం
    స్కారము చారు శీల గుణ సంపద లిచ్చెను నాడు! నేడు చి

    రిప్లయితొలగించండి
  20. Pandita Nemani గారూ ఆహా! ఎంత చక్కగా చెప్పారు.
    ---------------------
    సరస కవీంద్రులార! యిదె స్వాగతమంచును బల్కి శంకరా
    భరణము బ్లాగు వేదికకు భద్రగుణాఢ్యుల స్వాగతించుచున్
    చిరునగ వొల్కు ప్రేమమయి! చీరను గట్టిన చిట్టితల్లి! సా
    దరమున గూర్తు దీవెన ముదమ్మున వర్ధిలుమా శతాయువై

    రిప్లయితొలగించండి
  21. చీరకట్టులోన చేమోడ్చి పసిపాప
    ముద్దులొలుకుచుండె మురిపెముగను
    బాలలందు గాంచు భారత సంస్కృతి
    వెలుగు భవిత గలదు వీరి లోన

    రిప్లయితొలగించండి
  22. నా పద్యముల గురించి ప్రశంసలను దెలిపిన శ్రీ కంది శంకరయ్య గారికి మరియు శ్రీ లక్కరాజు వారికి శుభాశీస్సులు - సంతోషము.

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని గారి పద్యము బాల త్రిపురసుందరిని తలపింప చేసినది. అందున ఆమె మన తెలుగుతనం తో ముగ్ధ యై యొప్పుచున్నది.

    రిప్లయితొలగించండి
  24. భారత నారిగ మెలగక
    భారంబని చీరె వదలి ' ప్యాంట్లను ' వేసే
    నారీ జనలోకమ చి
    న్నారియె ' శారీ ' ని గట్టె నయముగ గనుడీ !

    రిప్లయితొలగించండి
  25. లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    దయచేసి మీ పూర్తి పేరు తెల్పండి.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    మాజేటి సుమలత గారూ,
    ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వేసే’ అని వ్యావహారికాన్ని వాడారు. ‘ప్యాంట్లు తొడుగు నో/ నారీజన...’ అంటే ఎలా ఉంటుంది?
    ఈమధ్య మీరు ‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్’ అవుతున్నారు ☺

    రిప్లయితొలగించండి
  26. మందస్మిత సుందర ముఖి
    యందముగను చీర గట్టి యానందముతో
    పొందుగ కరములు మోడ్చిన
    కుందన పమ్మాయిని గనుగొనగను ముదమౌ

    రిప్లయితొలగించండి
  27. పెద్దలకెల్ల స్వాగతము పేరిమి నన్ గని మీరలెల్ల యీ
    ముద్దుల మూట సోయగము మోదము గూర్చెడు చీరకట్టులో
    నొద్దిక నంచు పల్కితిరి యుల్లము పొంగెను మీదు బిడ్డలన్
    వద్దన బోక చీరలను వాడగ మద్దతు నిచ్చి మించరే.

    రిప్లయితొలగించండి
  28. నేమాని పండితుల పద్యాలు, చంద్రమౌళి వారి పద్యాలూ మెరుస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  29. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మంచి పద్యాన్ని అందించారు. అభినందనలు.
    ఫేసుబుక్కులో మీరు మెరిపించిన పద్యాన్ని ఇక్కడ కూడా ప్రకటించి మురిపిస్తారనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారి కోరిక ననుసరించి ముఖపుస్తకము లోని నా పద్యము:


    పోకముడిని బట్టి పొల్పు మీరగ జుట్టి
    ......కుచ్చెళ్ళు తగ బెట్టి కోక గట్టి

    జాకెట్టు ధరియించి జారు పైటను దిద్ది
    ......మొలనూలు బిగియించి మురిపెమొదవ

    పైటకొం గెగురంగ పదపడి గాలికి
    ......పై యంచు కనుపింప పట్టి చేత

    వెనుక విలాసమై తనరార వాల్జడ
    ......నంచలు సిగ్గిల నడుగు లిడుచు

    తెలుగు నట్టింట నడయాడు కలికి జూచి
    నింగి వేలుపు లెల్లరు పొంగి పోయి
    సిరుల జల్లుగ కురియరే చెలువు మీర
    చీర కట్టుకు సరియేది చిన్నదాన!

    రిప్లయితొలగించండి
  31. శంకరయ్య గారూ నా పూర్తి పేరు
    లక్కరాజు శివరామక్రిష్ణా రావు

    రిప్లయితొలగించండి